JezK
Edit File: iBam9.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam9.html Date Name Comments ==== ==== ======== 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <br> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <link rel="shortcut icon" href="../images/favicon.png"/> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet" /> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> <link href="../assets/css/main.css" rel="stylesheet" /> <link href="../assets/css/ibam.css" rel="stylesheet" /> <script> <!-- $(window).scroll(function () { --> <!-- $('audio').each(function () { --> <!-- //if ($(this).is(":in-viewport")) --> <!-- if (IsInViewport($(this))) --> <!-- { --> <!-- $(this)[0].play(); --> <!-- } --> <!-- else --> <!-- { --> <!-- $(this)[0].pause(); --> <!-- } --> <!-- }) --> <!-- }); --> <!-- Check if an element is in the visible viewport --> <!-- @param {jQuery|HTMLElement} el --> <!-- @return boolean --> <!-- var IsInViewport = function (el) { --> <!-- if (typeof jQuery === "function" && el instanceof jQuery) el = el[0]; --> <!-- var rect = el.getBoundingClientRect(); --> <!-- return ( --> <!-- rect.top >= 0 && --> <!-- rect.left >= 0 && --> <!-- rect.bottom <= (window.innerHeight || document.documentElement.clientHeight) && --> <!-- rect.right <= (window.innerWidth || document.documentElement.clientWidth) --> <!-- ); --> <!-- }; --> </script> </head> <body> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"><a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1<span class="sr-only">(current)</span></a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a></li> <li class="nav-item"><a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a></li> <li class="nav-item"><a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a></li> <li class="nav-item"><a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a></li> <li class="nav-item"><a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a></li> <li class="nav-item"><a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a></li> <li class="nav-item"><a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a></li> <li class="nav-item"><a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a></li> <li class="nav-item"><a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a></li> <li class="nav-item"><a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a></li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a></li> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-skype" aria-label="Skype" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-linkedin" aria-label="Linkedin" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-google-plus" aria-label="Google-Plus" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a></li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a></li> </ul> </div> </nav> <!-- <div class="img-responsive aln-top" style="margin-top: 50px; background-color: white; z-index: 99; position: relative;"> <img src="../images/iBam.png" /> </div>--> <div class="container-fluid"> <div id="chap9" > <!-- <br><br> --> <h3 class="title" style="padding-top: 6px;" >నవమ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap9"></div> <div class="col-sm-9"> <!--9-106 భువిఁ దూఱన్... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-106 భువిఁ దూఱన్... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/01.Bhuvi_Duran_Bhuvi_Duru.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భువిఁ దూఱన్ భువిఁ దూఱు; నబ్దిఁ జొర నబ్దిం జొచ్చు; నుద్వేగి యై<br> దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి<br> క్కి వెసన్ గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచున్; గ్రేడింపఁ గ్రేడించు; నొ<br> క్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్ర మై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీహరికి పరమభక్తుడు అంబరీషుడు. విష్ణుప్రీతికై ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి గడియలు దాటకముందు నిష్ఠతో అతిథులకు అన్నంపెట్టి తాను తింటాడు. ఇది అతని వ్రతం. దుర్వాసమహర్షి అతనికి పరీక్ష పెట్టాడు. చిన్ని తప్పునకు, నిజానికి తప్పు కాదు. తాను తప్పనుకొని మహాకోపంతో అంబరీషునిపై కృత్యను ప్రయోగించాడు. శ్రీహరి కరుణించి వెఱ్ఱితపసికి బుద్ధ్ చెప్పమని చక్రానికి చెప్పి పంపించాడు. అది దుర్వాసుని వెంటపడింది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దుర్వాసుడు ప్రాణాలను దక్కించుకోవటానికి భూమిలోనికి దూరాడు. అతని వెంటనే చక్రమూ దూరింది. సముద్రం లోనికి చొరబారాడు. అది కూడా సముద్రంలోనికి దూరింది. గుండె లదరిపోతుండగా గగనంలోనికి గెంతులు వేశాడు. చక్రం కూడా ఆకాశంలో చిత్రచిత్రంగా తిరుగుతూ వెంటబడింది. దిక్కులకు పరువులెత్తాడు. ఏ దిక్కునకు పోతే ఆదిక్కునందే అతనిని తరిమి తరిమి కొడుతున్నది. దొరికిపోయాడనుకొన్నంతలో కొంచెం ముడుచుకొని తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. అది కూడా అలాగే కుంచించుకొని పట్టుకోబోయినది. పరువెత్తలేక నిలబడిపోయాడు. చక్రం కూడా నిలిచిపోయింది. ఒడుపుగా తప్పించుకో బోయాడు. చక్రంకూడా ఒడుపుగా పట్టుకోబోయింది. ఈవిధంగా సుదర్శనచక్రం ఒక్కపెట్టున భక్తునికి బాధ కలిగించిన తాపసుని వెంటబడింది. దాని సత్తాను అడ్డుకొనే శక్తి మరెవ్వరికీ లేదు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భువిన్ = భూమిలో; దూఱన్ = దూరితే; భువిన్ = భూమిలోకి; దూఱున్ = దూరును; అబ్దిన్ = సముద్రములో; చొరన్ = దూరితే; అబ్దిన్ = సముద్రమున; చొచ్చున్ = దూఱును; ఉద్వేగి = కలతచెందినవాడు; ఐ = అయ్యి; దివిన్ = ఆకాశమునకు; ప్రాకన్ = ఎగబ్రాకితే; దివిన్ = ఆకాశమునకు; ప్రాకున్ = ఎగబ్రాకును; దిక్కుల్ = దిశలవైపున; కున్ = కు; పోన్ = పోతే; దిక్ = దిక్కుల; వీథులన్ = దార్లన్నిటికి; పోవున్ = వెళ్ళును; చిక్కి = (ప్రయత్నము) మానివేసి; వెసన్ = విసిగి; క్రుంగినన్ = కుంగిపోతె; కుంగున్ = కుంగును; నిల్వన్ = నిలబడితే; నిలుచున్ = ఆగును; క్రేడింపన్ = పక్కకివెళితే; క్రేడించున్ = పక్కకివెళ్ళును; ఒక్కవడిన్ = ఏకాగ్రముగ; తాపసున్ = ముని; వెంటనంటి = వెనుదగిలి; హరిచక్రంబు = విష్ణుచక్రము; అన్య = ఇతరులచే; దుర్వక్రము = మరలింపరానిది; ఐ = అయ్యి. </div> </div> </div> <!--9-117 చలమున బుద్ధిమంతు... (చంపకమాల)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-117 చలమున బుద్ధిమంతు... (చంపకమాల)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/02.Chalamuna_Budhimanthulagu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> చలమున బుద్ధిమంతు లగు సాధులు నా హృదయంబు లీల దొం<br> గిలి కొనిపోవుచుండుదు రకిల్బిష భక్తిలతాచయంబులం<br> న్నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్;<br> వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతన్ జనుచుందుఁ దాపసా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దుర్వాసుడు అంబరీషునికి అపకారం చేయబోయి శ్రీసుదర్శనచక్రం కలిగించే ఆపదను కొనితెచ్చుకొన్నాడు. బ్రహ్మాదు లను రక్షించవలసినదిగా ప్రార్థిస్తూ కాళ్ళావేళ్ళాపడ్డాడు. వారు శ్రీమహావిష్ణువు తప్ప ఇతరులెవరూ రక్షించేవారు లేరని స్పష్టంగా చెప్పారు. గత్యంతరంలేక గజేంద్రవరదుని కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓయీ! తపోధనా! బుద్ధిపుష్కలంగా ఉన్న సాధుజనులు పట్టుదలతో నా హృదయాన్ని దొంగిలించుకొని పోతారు. ఏ మాలిన్యమూ లేని భక్తి అనే లత వారి దగ్గరనే ఉండిపోయే విధంగా మంచినేర్పుతో మదించిన మహా గజాన్ని లాగా కట్టిపడవేస్తారు. నేను ఏమి చేయగలను? ఆ భక్తజనులమీది వాత్సల్యంతో వారు పన్నిన వలలలో చిక్కి వారు త్రిప్పినట్లు తిరుగుతూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> చలమునన్ = చలాకీగా; బుద్ధిమంతులు = జ్ఞానముగలవారు; అగు = అయిన; సాధులు = మంచివారు; నా = నాయొక్క; హృదయంబున్ = మనసును; లీలన్ = సుళువుగా; దొంగిలికొనిపోవుచన్ = ఎత్తుకుపోతూ; ఉండుదురు = ఉంటారు; అకిల్బిష = నిర్మలమైన; భక్తి = భక్తి యనెడి; లత = తీగల; చయంబులన్ = సమూహములచే; నిలువగన్ = ఆగిపోవునట్లు; పట్టి = పట్టుపట్టి; కట్టుదురున్ = కట్టివేయుదురు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; మద = మదించిన; కుంభి = ఏనుగు {కుంభి - కుంభములుగలది, ఏనుగు}; కైవడిన్ = వలె; వలలన్ = వలలందు; చిక్కి = తగులుకొని; భక్త = భక్తులఎడ; వత్సలతన్ = వాత్సల్యము; కున్ = వలన; చనక = తప్పించుకుపోకుండ; ఉందున్ = ఉండెదను; అధిపా = గొప్పవాడా. </div> </div> </div> <!--9-118 నాకు మేలుఁ గోరు... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-118 నాకు మేలుఁ గోరు... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/03.Naaku_Meelugoru.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నాకు మేలు గోరు నాభక్తుఁ డగువాఁడు<br> భక్తజనుల కేన పరమ గతియు;<br> భక్తుఁ డెందు జనినఁ బఱతెంతు వెను వెంట<br> గోవు వెంటఁ దగులు కోడె భంగి<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీహర్ దుర్వాసునితో శ్రీమహావిష్ణుభక్తులకూ, తనకూ ఉన్న సంబంధాన్ని గూర్చి యిలా వివరిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహర్షీ! భక్తితత్త్వాన్ని వివరిస్తున్నాను విను. నాయందు నిర్మలమైన భక్తి ఉన్నవాడు నాకు మేలు కోరుతాడు. అంటే భక్తులను కంటికి రెప్పలాగా కాపాడాను అనే తృప్తి నాకు కలిగించటమే నాకు మేలు. అలాగే భక్తుల విషయంలో నేనే పరమగతి అయినవాడను. నేను వారిని పరిరక్షించగలిగినట్లు ఈ సృష్టిలో మరొకవ్యక్తిగాని శక్తిగాని రక్షింఛలేదు. కాబట్టి నా భక్తుడు ఎక్కడకు పోతే అక్కడకు నేను వెంటబడి పరుగులెత్తుతూ పోతూ ఉంటాను. పాడి ఆవువెంట వదల కుండా పోతూ ఉండే దూడను చూచి ఉంటావు కదా! నేను భక్తుని వెంటపోవటం అలా ఉంటుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నా = నా; కున్ = కు; మేలు = మంచి; కోరున్ = కోరుకొనును; నా = నా యెక్క; భక్తుడు = భక్తుడు; అగువాడు = ఐనవాడు; భక్త = భక్తులు; జనులు = అందరకు; ఏన = నేను; పరమ = అత్యుత్తమమైన; గతియున్ = దిక్కు; భక్తుడు = భక్తుడు; ఎందున్ = ఎక్కడకు; చనినన్ = వెళ్ళినను; పఱతెంతు = వెళ్ళెదను; వెనువెంట = కూడకూడ; గోవు = ఆవు; వెంటన్ = కూడా; తగులు = పడెడు; కోడె = మగ దూడ; భంగి = వలె </div> </div> </div> <!--9-120 తనువు మనువు... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-120 తనువు మనువు... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/04.Thanuvu_Manuvu_Vidichi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తనువు మనువు విడిచి, తనయులఁ చుట్టాల<br> నాలి విడిచి, సంపదాలి విడిచి,<br> నన్నె కాని యన్య మెన్నఁడు నెఱుఁగని<br> వారి విడువ నెట్టివారి నైన<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భక్తులు చాలా మహిమ కలవారయ్యా! వారికి లోకసంబంధమైన బంధాలు ఏమీ ఉండవు. ఒక్క నాయందు మాత్రమే సంబంధం ఉంటుంది వారికి. అట్టివారి విషయంలో నేను ఎలా ఉంటానో గమనించు – అంటున్నాడు శ్రీహరి దుర్వాసునితో... ... </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> వారికి దేహంతో ముడిఉండదు. కన్నకొడుకులను, కట్టుకొన్న భార్యనీ, చుట్టాలనూ, సంపదలను అన్నింటినీ విడిచి వేస్తారు. నన్ను తప్ప మరి దేనినీ వారు కోరరు. అటువంటివారు ఎట్టివారైనాసరే నేను విడిచిపెట్టను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్నుమాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయినప్పటికిని. </div> </div> </div> <!--9-122 సాధుల హృదయము... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-122 సాధుల హృదయము... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/05.Sadhula_Hrudayamu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సాధుల హృదయము నాయది;<br> సాధుల హృదయంబు నేను; జగముల నెల్లన్<br> సాధుల నేనే యెఱుఁగుదు<br> సాధు లెఱుంగుదురు నాదు చరితము విప్రా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అంబరీషోపాఖ్యానంతో దుర్వాసునకు శ్రీమహావిష్ణువు భక్తుని లక్షణాన్నీ భగవంతుని లక్షణాన్నీ ఇలా వివరిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> గొప్ప విద్యాతత్త్వం ఎరిగిన మహర్షీ! పరమపవిత్రమైన జీవితం గడపేవారిని సాధువులంటారు. ఒక్క రహస్యం చెప్పనా! అట్టివారి హృదయం నాదేనయ్యా! కాదు కాదు సాధువుల హృదయమే నేను ఈ ప్రపంచంలో ఉన్న సాధువుల నందరినీ నేను మాత్రమే తెలుసుకోగలను. నా చరిత్రమును సాధువులు మాత్రమే తెలుసుకోగలరు. మరికొంత విప్పిచెప్పనా? నేనే భక్తుడు, భక్తుడే నేను. నా భక్తులకు ద్రోహం చేయటమంటే నాకు ద్రోహం చేయటమే అని గుర్తించాలి </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సాధుల = మంచివారి; హృదయము = హృదయము; నాయది = నాది; సాధుల = మంచివారి; హృదయంబున్ = హృదయమే; నేను = నేను; జగములన్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిలోను; సాధులన్ = మంచివారిని; నేన = నేనే; ఎఱుంగుదున్ = ఎరుగుదును; సాధులు = మంచివారు; ఎఱుంగుదురు = తెలిసికొందురు; నాదు = నాయొక్క; చరితమున్ = చరిత్రను; విప్రా = బ్రాహ్మణుడా. </div> </div> </div> <!--9-131 చీఁకటిఁ వాపుచున్... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-131 చీఁకటిఁ వాపుచున్... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/06.Cheekati_Vapuchun.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> చీఁకటిఁ వాపుచున్ వెలుఁగు సేయుచు సజ్జనకోటి నెల్ల స<br> శ్రీకులఁ జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేత లై నినున్<br> వాకున నిట్టి దట్టి దని వర్ణనసేయ విధాత నేరఁ డ<br> స్తోకము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్య మై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> విష్ణుదేవుని మాటలు వీనులారా విన్నాడు దుర్వాసుడు. మరొక గతి లేక భక్తశిఖామణి అయిన అంబరీషుని పాదాల మీద పడ్డాడు. అంబరీషుడు అది చూచి తట్టుకోలేకపోయాడు. హరిచక్రాన్ని అత్యద్భుతంగా స్తుతించాడు. అందులోని ఒక అమూల్యరత్నం ఈ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓ సుదర్శనచక్రరాజమా! నీవు అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేస్తావు. జ్ఞానమనే వెలుగు సజ్జనుల హృద యాలలో నిండుగా నిలుపుతావు. అట్టి నీవయిన కాంతులు ధర్మంతో నిండినట్టివి. అవి ఉత్తమపురుషుల సముదాయా లను సంపదల వెల్లువలు కలవానినిగా చేస్తాయి. అట్టి నిన్ను మాటలతో కొనియాడటం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు. నీరూపం చాలా గొప్పది. దానికి అంటమంటూ లేదు. అది పరములకు అన్నింటికి పరమమైనది. నీవలెనే సనాతనమైనది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> చీకటిన్ = చీకటిని; పాపుచున్ = పారద్రోలుచు; వెలుగున్ = కాంతిని; చేయుచున్ = పుట్టిస్తూ; సజ్జన = మంచివారి; కోటిన్ = సమూహములు; ఎల్లన్ = అన్నిటిని; సశ్రీకనున్ = సుసంపన్నము; చేయున్ = చేయును; నీ = నీయొక్క; రుచులు = కాంతులు; చెల్వుగ = చక్కగా; ధర్మసమేతలు = ధర్మముగలవారు; ఐ = అయ్యి; నినున్ = నిన్ను; వాకున = నోటితో; ఇట్టిదట్టిది = వివరముగ; అని = పలికి; వర్ణనచేయన్ = కీర్తించుటకు; విధాత = బ్రహ్మదేవుడు; నేరడు = సరిపోడు; అస్తోకము = మహోన్నతము; నీదు = నీయొక్క; రూపున్ = స్వరూపము; కలదు = ఉన్నది; అందున్ = దానిలో; తుది = అంతము; లేదు = లేదు; పరాత్పర = విష్ణుమూర్తితో; ఆద్యము = మొదలైనది; ఐ = అయ్యి. </div> </div> </div> <!--9-134 ఏ నమస్కరింతు... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-134 ఏ నమస్కరింతు... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/07.Ea_Namaskarinthu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఏ నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ<br> కేతువునకు ధర్మసేతువునకు<br> విమల రూపమునకు విశ్వగోపమునకుఁ<br> జక్రమునకు గుప్త శక్రమునకు<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అంబరీషుడు సుదర్శన చక్రస్వామిని స్తుతిస్తూనే ఉన్నాడు. అసలు విషయానికి వచ్చి ఆపదలో పీకలవరకు మునిగి ఉన్న మహర్షిని కాపాడు అని ప్రార్థించి చివరకు ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! చక్రరాజమా! నీవు ఇంద్రుని పగవారికి బ్రదుకులేకుండా చేసే తోకచుక్కవు. ధర్మమునకు జారుపాటు లేకుండా కాపాడే అడ్డుకట్టవు. నీది విమలమైన రూపం. విశ్వాన్నంతటినీ కంటికి రెప్పలా కాపాడే గొప్పశక్తి నీది. వాళ్ళూ వీళ్ళూ అనటం ఎందుకు? సాక్షాత్తు మూడు లోకాలను ఏలే దేవేంద్రుణ్ణి కూడా రక్షించగల శక్తిసంపద కలవాడవు. అటు వంటి సుదర్శనస్వామీ! నీకు నేను నిరంతరమూ నమస్కారం చేస్తాను </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఏన్ = నేను; నమస్కరింతున్ = నమస్కరించుచున్నాను; ఇంద్ర = ఇంద్రును; శాత్రవ = శత్రువులను; ధూమకేతువున్ = దహించివేయుదాని {ధూమకేతువు - ధూమము (పొగ)ను కేతువు (గుర్తుగాగలది), అగ్ని, తోకచుక్క}; కున్ = కి; ధర్మ = ధర్మమును; సేతువున్ = కాపాడునది(సేతువువలె); కున్ = కి; విమల = స్వచ్ఛమైన; రూపమున్ = స్వరూపమున; కున్ = కి; విశ్వ = భువనములకు; దీపమున్ = వెలుగునిచ్చెడిదాని; కున్ = కి; చక్రమున్ = విష్ణుచక్రమున; కున్ = కు; గుప్త = కాపాడబడిన; శక్రమున్ = ఇంద్రుడుకలదాని {శక్రుడు - దుష్టులను శిక్షించుటందు శక్తిగల వాడు, ఇంద్రుడు}; కున్ = కి. </div> </div> </div> <!--9-141 ఒకమా టెవ్వని... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-141 ఒకమా టెవ్వని... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/08.Okamatevvani_Peru.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఒక మా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యార మై సోకిఁనన్<br> సకలాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స<br> త్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశు దా<br> రకలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అంబరీషుని అనుగ్రహంవలన సుదర్శనచక్రస్వామి అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోకుండా బయటపడ్డ దుర్వాసమహర్షి అతని భక్తిసంపదను నోరారా కొనియాడుతూ ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ. </div> </div> </div> <!--9-231 హరు మెప్పించి... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-231 హరు మెప్పించి... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/09.Haru_Meppinchi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> హరు మెప్పించి మహా తపో నియతుఁ డై యాకాశగంగానదిన్<br> ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు<br> స్థిరలీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు<br> స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మహాభాగవతంలో పరమాద్భుతమైన భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో భగీరథచక్రవర్తి ఆకాశగంగను అవనికి తెచ్చిన కథ మరింత అద్భుతమైనది. శుకమహర్షి పరీక్షిత్తునకు ఆ గాథను చెప్పి చివరకు ఇలా అన్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహాభాగవతంలో పరమాద్భుతమైన భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో భగీరథచక్రవర్తి ఆకాశగంగను అవనికి తెచ్చిన కథ మరింత అద్భుతమైనది. శుకమహర్షి పరీక్షిత్తునకు ఆ గాథను చెప్పి చివరకు ఇలా అన్నాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హరు = పరమశివుని; మెప్పించి = మెప్పుపొంది; మహా = గొప్ప; తపస్ = తపస్సునందలి; నియతుడు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; ఆకాశగంగానదిని = ఆకాశగంగను; ధర = భూమి; కున్ = కి; తెచ్చి = తీసుకొచ్చి; నితాంత = అఖండమైన; కీర్తి = యశస్సు అనెడి; లతికా = లతకు; స్తంభంబుగాన్ = ఆధారభూతస్తంభములాగ; నవ్య = అభినవ; సుస్థిర = మంచినిలకడైన; లీలన్ = విధముగ; పితృకార్యము = తాతలసేవించుటను; అంతయున్ = పూర్తిగా; ఒనర్చెన్ = నెరవేర్చెను; వారిత = తోలగింపబడిన; అనేక = పలు; దుస్తర = దాటరాని; వంశ = వంశమునకువాటిల్లిన; వ్యధుడు = బాధ కలవాడు; ఆ = గొప్ప; భగీరథుడు = భగీరథుడు; నిత్య = శాశ్వతమైన; శ్రీకరుండు = మంగళప్రదుడు; అల్పుడే = తక్కువవాడా, కాదు. </div> </div> </div> <!--9-254 ఇలమీఁదన్ బ్రదుకేల... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-254 ఇలమీఁదన్ బ్రదుకేల... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/10.Ilamedan_Brathukela.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇలమీఁదం బ్రదు కేల? వేల్పుల వరం బేలా? ధనం బేల? చం<br> చల గంధర్వపురీ విడంబనము లై శ్వర్యంబు లేలా? జగం<br> బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁ బొత్తై తుదిం బాసి ని<br> ర్మల మై వాఙ్మనసామితం బగు పరబ్రహ్మంబు నేఁ జెందెదన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతులలో ఒక ప్రత్యేకత కలవాడు ఖట్వాంగ మహారాజు. సూర్యవంశంలో ఒక జాతిరత్నం. ఒకమారతడు దేవతల కోసం రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపాడు. దేవతలను తన ఆయువు ఎంత అని అడిగాడు. ఎక్కువ లేదు. ఏదైనా వరం వేగంగా కోరుకో అన్నారు. అతడేమీ కోరకుండా ఇంటికి వెళ్ళి వైరాగ్యం పొంది యిలా అనుకొన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఎందుకండీ ఈ భూమి మీద బ్రదుకు? దేవతల వరాలెందుకు? ధనాలెందుకు? ఆకాశంలో మేఘాల కదలికతో ఏర్పడి క్షణంలో మాయమయ్యే గంధర్వనగరాలవంటి ఐశ్వర్యాలెందుకు? ఇవన్నీ క్షణభంగురాలు. కనుక వీనితో నాకు పనిలేదు. ఆ పరమాత్మ ఈ జగత్తులనన్నీ పుట్టించే భావనతో ప్రకృతి అయిన మాయతో సంబధం పెట్టుకొంటారు. తన యిష్టం మేరకు మళ్ళీ పొత్తును వదలివేస్తాడు. అతనిలో ఏదోషమూ ఉండదు. అతనిని వాక్కులతో గానీ మనస్సుతో గానీ పట్టుకోలేము. అతనిలో ఐక్యం అయితే అతనివలె శాశ్వతస్థితిని పొందుతాను. అని భావించి రెండు క్షణాలలో కైవల్యమనే మహాఫలం పొందాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇల = భూలోకము; మీదన్ = పైన; బ్రతుకు = జీవించుట; ఏలన్ = ఎందుకు; వేల్పుల = దేవతల; వరంబు = వరములు; ఏలన్ = ఎందుకు; ధనంబున్ = సంపదలు; ఏలన్ = ఎందుకు; చంచల = చంచలములైన; గంధర్వపురీ = గాలిమేడల, మేఘాలలోనగరాలు పోలిన; విడంబనములు = మోసములు; ఐశ్వర్యంబులు = సంపదలు; ఏలా = ఎందుకు; జగంబులన్ = భువనములను; పుట్టించు = పుట్టించెడి; తలంపునన్ = భావములతో; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తోటి; పొత్తు = కలయికలుకలవాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; పాసి = వదిలివేసి; నిర్మలము = పరిశుద్దము; ఐ = అయ్యి; వాక్ = నోటితోను; మానస = మనస్సుతోను; ఆమితంబు = అందనిది; అగు = ఐన; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; నేన్ = నేను; చెందెదన్ = పొందెదను. </div> </div> </div> <!--9-258 అమరేంద్రాశకుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-258 అమరేంద్రాశకుఁ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/11.Amarendrasaku_Purnachandrudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుం డై నట్లు నారాయణాం<br> శమునం బుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన<br> క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకున్ గౌసల్యకుం సన్నుతా<br> సమ నైర్మల్య కతుల్య కంచిత జనుస్సంసార సాఫల్యకున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఖట్వాంగుని వంశంలోనివాడే దశరథుడు. ఆ సూర్యవంశాన్ని స్థూలంగా పరిచయం చేస్తున్నది భాగవతం. దశరథునికి శ్రీరామచంద్రుడు పుత్త్రుడుగా అవతరించిన ఆనందకర సన్నివేశాన్ని పోతనగారు మనకు అమృతంలాగా అందిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తూర్పుదిక్కు అనే కాంతకు పూర్ణచంద్రుడు ఉదయించిన విధంగా కౌసల్యామహాదేవికి శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఆమె అందరకూ కొనియాడదగిన సాటిలేని నిర్మలత్వం రూపు తాల్చినదా అన్నట్టిది. ఆమెకు ఆమెయే సాటి. ఎన్నో పుట్టుకలతో అనంతంగా సాగుతూపోయే సంసారంలో సఫల్యం పొందినట్టిది. ఆ పుట్టిన మహాత్ముడో! నారాయణుని కళ అయినవాడు. పొగరుతో కన్నులు మూసికొనిపోయిన రావణాసురుని తలలవరుసను తరిగి వేయటంలో గొప్పపాటవం కలిగిన శ్రీరామచంద్రుడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అమరేంద్రాశ = తూర్పుదిక్కున {అమరేంద్రాశ - అమరేంద్రుని (ఇంద్రుని) ఆశ (దిక్కు), తూర్పు}; కున్ = కు; పూర్ణచంద్రుడు = నిండుచంద్రుడు; ఉదితము = ఉదయించినవాడు; ఐన = అయిన; అట్లు = విధముగ; నారాయణ = విష్ణుమూర్తి; అంశమునన్ = అంశతో; పుట్టె = జన్మించెను; మద = గర్వము అనెడి; అంధ = గుడ్డితనము కల; రావణ = రావణుని; శిరస్ = తలలు; సంఘాత = సమూహమునను; ఛేదన = ఖండించెడి; క్రమణ = విధమునందు; ఉద్దాముడు = ఆరితేరినవాడు; రాముడు = శ్రీరాముడు; గరిత = పతివ్రత; కున్ = కు; కౌసల్య = కౌసల్యాదేవి; కున్ = కి; సన్నుత = స్తుతింపబడెడి; అసమత = సాటిలేని; నైర్మల్య = పరిశుద్ధురాలు; కిన్ = కు; అంచిత = పూజనీయమైన; జనుస్ = సంతానముగల; సంసార = సంసారముయందు; సాఫల్య = సాఫల్యమునపొందినామె; కున్ = కి. </div> </div> </div> <!--9-262 భూతలనాథుఁడు రాముఁడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-262 భూతలనాథుఁడు రాముఁడు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/12.Bhuthalanadhudu_Ramudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భూతలనాథుఁడు రాముఁడు <br> ప్రీతుం డై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం<br> ఘాతన్ భాగ్యోపేతన్<br> సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రమణీయమైన రామాయణగాథను రసవత్తరంగా అభివర్ణిస్తున్నాడు భాగవతప్రవక్త భారతవంశకర్త అయిన పరీక్షిత్తునకు. జగత్తులన్నింటికీ కల్యాణాలను కలిగించే సీతారాములు దాంపత్యాన్ని సూచనాప్రాయంగా చెబుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యోగులందరూ ఎవనిని భావించి ఆనందసముద్రంలో మునిగితేలుతూ ఉంటారో అటువంటి శ్రీరామ చంద్రుడు సీతాదేవిని పెండ్లియాడాడు. ఏదో లాంఛనంకోసం కాదు ప్రీతితో. నిజానికి భార్యాభర్తలు కాబోయేవారికి అనురాగం నిండుగా ఉండాలి. అలా ఉండటానికి లోకసామాన్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. వానిని తెలియజేస్తు న్నారు పోతనమహాకవి. ఆ సీతమ్మ తల్లి చాలా గొప్ప గుణాలనే మణులరాశి. ధర్మం తప్పని భోగపదార్థాలన్నీ ఆమెకు అందుబాటులో ఉన్నాయి. మోము వెలుగులు చందమామను వెక్కిరిస్తున్నాయి. అటువంటి జానకిని శ్రీరామచంద్రుడు ప్రీతితో పెండ్లియాడాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భూతలనాథుడు = లోకనాయకుడు; రాముడు = రాముడు; ప్రీతుండు = ఇష్ఠపడినవాడు; ఐ = అయ్యి; పెండ్లియాడెన్ = వివాహముచేసుకొనెను; పృథు = గొప్ప; గుణ = సుగుణములనెడి; మణి = మణుల; సంఘాతన్ = కలిగినామెను; భాగ్య = అదృష్టములు; ఉపేతన్ = కూడుకొన్నామెను; సీతన్ = సీతాదేవిని; ముఖ = మోముయొక్క; కాంతిన్ = ప్రకాశముచేత; విజిత = జయింపబడిన; ఖద్యోతన్ = చంద్రుడుగలామెను {ఖద్యోతుడు - ఆకాశమున వెలుగు కలవాడు, చంద్రుడు}. </div> </div> </div> <!--9-267 పుణ్యుఁడు రామచంద్రుఁ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-267 పుణ్యుఁడు రామచంద్రుఁ... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/13.Punyudu_Ramachandrudata.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పుణ్యుఁడు రామచంద్రుఁ డట వోయి ముదంబునఁ గాంచె దండకా<br> రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హ లా<br> వణ్యము గౌతమీ విమల వాః కణ పర్యటనప్రభూత సా<br> ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రులవారికి సీతాదేవితో కల్యాణం అయిన తరువాత పరిస్థితుల ప్రాబల్యంవలన పట్టాభిషేకం భంగమైపోయింది. దశరథుడు తన మూడవ భార్యకు ఇచ్చిన వరాలను బట్టి రాముడు అరణ్యాలకు పోవలసివచ్చింది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు అలా అడవులలోనికి ప్రవేశించాడు. అందులో ఒక ప్రత్యేకప్రదేశం దండ కారణ్యం. అది చాలా గొప్ప తపస్సు చేసిన మునీశ్వరులకు నివాసస్థలం. అక్కడ చక్కగా పెంపొందిన నెమళ్ళు పురులు విప్పుకొని నృత్యం చేస్తున్నాయి. గోదావరి నదిలోని స్వచ్ఛమైన నీటితుంపురుల కదలికలతో ఏర్పడిన గొప్పచల్లదనం నిలువెల్లా నింపుకొన్నట్టిది ఆవనం. పెద్దపెద్ద చెట్లూ, నేలమీది పొదలూ ఆనందపారవశ్యంతో ఊగులాడిపోతున్నాయి. ఈ అన్నింటితో కలసి ఆ అరణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యం అయి ప్రకాశిస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> పుణ్యుడు = పుణ్యాత్ముడు; రామచంద్రుడు = రాముడనెడి చల్లనివాడు; పోయి = వెళ్ళి; ముదంబునన్ = సంతోషముతో; కాంచెన్ = దర్శించెను; దండకారణ్యమున్ = దండకారణ్యమును; తాపస = ఋషులలో; ఉత్తమ = శ్రేష్ఠులకు; శరణ్యమున్ = అండనిచ్చెడిది; ఉద్ధతన్ = జతకట్టిన; బర్హి = ఆడనెమలి; బర్హ = మగనెమలుతో; లావణ్యమును = మనోజ్ఞమైనది; గొతమీ = గోదావరీ; విమల = స్వచ్ఛమైన; వాఃకణ = నీటిబిందుల; పర్యటన = వ్యాప్తులచేత; ప్రభూత = అతిశయించి; సాద్గుణ్యమున్ = సద్గుణసంపత్తిగలది; ఉల్లసత్ = గొప్ప; తరు = చెట్లు; నికుంజ = పొదలచే; వరేణ్యమున్ = ఉత్తమమైనదానిని; అగ్రగణ్యమున్ = గొప్పగ ఎంచదగినదానిని. </div> </div> </div> <!--9-272 లీలన్ రామవిభుం... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-272 లీలన్ రామవిభుం... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/14.Leelan_Ramavibhundu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> లీలన్ రామవిభుం డొక<br> కోలన్ గూలంగ నేసె గురు నయశాలిన్<br> శీలిన్ సేవితశూలిన్<br> మాలిన్ వాలిం దశాస్యమానోన్మూల్మిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో తండ్రిమాటమీద అరణ్యవాసం చేస్తున్నాడు. మాయలమారి రాక్షసుడు రావణుడు మోసంచేసి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. పుట్టెడుదుఃఖంతో పుట్టలూ, గుట్టలూ దాటుకొంటూ తిరుగుతున్నారు రామలక్ష్మణులు. వారికి హనుమంతుడు సుగ్రీవునితో చెలిమి కలిగించాడు. తరువాత, </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీరామచంద్రుడు సుగ్రీవుని అన్న వాలిని, అతదు చేసిన ధర్మద్రోహానికి శిక్షగా, ఒక్కబాణంతో లీలగా కూలనేశాడు. ఆ వాలి తక్కువవాడేమీ కాదు. గొప్పనీతిశాలి. శూలం చేతబట్టిన శివమహాదేవుణ్ణి సేవించే గొప్పశీలం కలవాడు. అతనిమెడలో ఒక మహిమగల పూలమాల ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది. దేవతలకు కూడా దిగులు పుట్టించే బలపరాక్రమాలు గల పదితలల రావణుని మానాన్ని పెల్లగించిపారవేసిన మహాబలుడు ఆవాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> లీలన్ = క్రీడగా; రామవిభుండు = శ్రీరామ ప్రభువు; ఒక = ఒకే ఒక; కోలన్ = బాణముతో; కూలంగన్ = పడిపోవు నట్లు; ఏసెన్ = కొట్టెను; గురు = గొప్ప; నయశాలిన్ = నీతిమంతుని; శీలిన్ = మంచి శీలము కల వానిని; సేవిత = పూజింపడిన; శూలిన్ = పరమశివుడు కల వానిని; మాలిన్ = మాల ధరించిన వానిని {మాలిన్ – ఇంద్రు డొసగిన మాల కంఠమున ధరించిన వాడు, వాలి}; వాలిన్ = వాలిని; దశాస్య = రావణుని; మాన = గర్వమును; ఉన్మూలిన్ = హరించినవానిని. </div> </div> </div> <!--9-273 ఇలమీఁద సీత వెదకఁగ... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-273 ఇలమీఁద సీత వెదకఁగ... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/15.Ila_Meeda_Seetha_Vedakaga.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇలమీఁద సీత వెదకఁగ<br> నలఘుఁడు రాఘవుఁడు వనిచె హనుమంతు నతి<br> చ్ఛలవంతున్, మతిమంతున్<br> బలవంతున్, శౌర్యవంతుఁ, బ్రాభవవంతున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> సుగ్రీవునితో చెలిమి చేసుకొని అతనికి ఘోరమైన అపకారం చేసిన వాలిని చంపివైచి శ్రీరామచంద్రుడు తన ప్రాణమే అయిన జానకి జాడలు తెలుసుకొని రావటానికి సరియైన వ్యక్తి ఎవరా అని పరికిస్తున్నాడు. అతని ఎట్టఎదుటనే చేతులు కట్టుకొని భక్తి పారవశ్యంతో నిలిచి ఉన్నాడు హనుమ. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయనపేరు హనుమంతుడు. వజ్రపుదెబ్బకు ఉబ్బి అందంగా అలరారుతున్న చెక్కిలి కలవాడు. గొప్ప మాట కారితనం నిండుగా ఉన్నవాడు. ఎవ్వరూ ఊహింపజాలని బుద్ధిబలం కలవాడు. ఇంక దేహబలం సంగతి సరేసరి. ఆ విషయంలో అతనికి అతడే సాటి యనదగినవాడు. పరాక్రమం అందామా, పగవానిమీద ఒక్కపెట్టున దూకి చీల్చి చెండాడగల శౌర్యం అతనిసొమ్ము. అన్నింటిన్, అందరిన్ తన అదుపులో ఉంచుకోగల నిర్వహణ సామర్థ్యం కూడ అనంతంగా అమరినవాడు. అట్టి హనుమంతుణ్ణి మహాత్ముడైన శ్రీరాముడు సీతను వెదకటానికి పంపించాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇల = భూమి; మీదన్ = మీద; సీత = సీతజాడ; వెదకగన్ = వెతుకుటకై; అలఘుడు = గొప్పవాడు; రాఘవుడు = శ్రీరాముడు {రాఘవుడు - రఘువంశమున పుట్టినవాడు, రాముడు}; పనిచెన్ = నియోగించెను; హనుమంతున్ = హనుమంతుని; అతి = మిక్కలి; ఛలవంతున్ = చురుకైనవానిని, మహామాయావిని; మతిమంతున్ = బుద్దిమంతుని; బలవంతున్ = బలముగలవానిని; శౌర్యవంతున్ = వీరత్వముగలవానిని; ప్రాభవవంతున్ = మహిమాన్వితుని </div> </div> </div> <!--9-302 బలువింటన్ గుణటంకృతంబు... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-302 బలువింటన్ గుణటంకృతంబు... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/16.Baluvintan_Gunatankruthambu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా<br> బ్రళయోగ్రానల సన్నిభం బగు మహాబాణంబు సంధించి రా<br> జలలాముం డగు రాముఁ డేసె ఖర భాషాశ్రావణున్ దేవతా<br> బల విద్రావణు వైరిదారజన గర్భస్రావణున్ రావణున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> హనుమన్న జానకమ్మ జాడలు గుర్తించి రావణుని గుట్టుమట్టులన్నీ తెలిసికొని లంకను తోకచిచ్చుతో తగుల బెట్టి శ్రీరామచంద్రుని దగ్గరకు తిరిగివచ్చాడు. రామలక్ష్మణులు కపిసేనతో సముద్రాన్ని దాటుకొని లంకకు చేరు కొన్నాడు. రామరావణ మహాసంగ్రామం లోకభయంకరంగా జరిగింది. చిట్టచివరకు శ్రీరామచంద్రుడు - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తనవిల్లు చాలా గొప్పది. దాని అల్లెత్రాటినుండి రాముడు చేస్తున్న అతిఘోరమైన టంకారాలు బ్రహ్మాండ మంతటికీ హడలు పుట్టిస్తున్నాయి. అటువంటి వింటికి ఒక మహాబాణం సంధించాడు. అది ప్రణలకాలంలోని ఉగ్రమైన అగ్నియా అన్నట్లు మంటలు క్రక్కుతున్నది. రాజులందరిలో తలపూవువంటి దాశరథి ఆ బాణాన్ని రావణునిమీదికి మహావేగంతో వదలాడు. ఆ రావణుడు కారుకూతలతో దేవతలను కూడా అతలాకుతలం చేసేవాడు. గుంపులుగుంపు లుగా తనమీదికి దూకుతూవచ్చే దేవతలను తరిమితరిమికొట్టే సాహసం కలవాడు. అతని ధాటికి పగవారిభార్యలు గర్భస్రావాలతో పరుగులు తీస్తూ ఉండేవారు. అటువంటి రావణునిమీద ఇటువంటి గొప్పబాణాన్ని ప్రయోగించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బలు = బలమైన; వింటన్ = ధనుస్సునందు; గుణ = నారి; టంకృతమున్ = మీటినశబ్దములు, ధనుష్టంకారములు; నిగుడన్ = చెలరేగగా; బ్రహ్మాండ = అతిమిక్కలి; భీమంబుగా = భీకరముగా; ప్రళయ = ప్రళయకాలపు; ఉగ్ర = భయంకరమైన; అనల = అగ్ని; సన్నిభంబు = వంటిది; అగు = అయిన; మహా = గొప్ప; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; రాజ = రాజులలో; లలాముండు = శ్రేష్ఠుడు; అగు = ఐన; రాముడు = శ్రీరాముడు; ఏసెన్ = ప్రయోగించెను; ఖర = పరుషమైన; భాషా = మాటలను; శ్రావణున్ = వినిపించువానిని; దేవతా = దేవతల; బల = సైన్యమును; విద్రావణున్ = పారదోలువానిని; వైరి = శత్రురాజుల; దారజన = భార్యల; గర్భస్రావణున్ = గర్భస్రావకారణుని; రావణున్ = రావణుని. </div> </div> </div> <!--9-318 కవగూడి యిరుదెసఁ... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-318 కవగూడి యిరుదెసఁ... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/17.Kavagudi_Irudesa.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కవగూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస; రాజు నొక్కటఁ జామరములు వీవ<br> హనుమంతుఁ డతి ధవళాతపత్రముఁ వట్ట; బాదుకల్ భరతుండు భక్తిఁ దేర<br> శత్రుఘ్ను డమ్ములుఁ చాపంబుఁ గొనిరాఁగ; సౌమిత్రి భృత్యుఁ డై చనువుసూప<br> జలపాత్ర చేఁబట్టి జనకజ గూడిరాఁ; గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి<br> కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి <br> గ్రహము లెల్లఁ గొలువఁ గడునొప్పు సంపూర్ణ<br> చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి పుత్రమిత్రపరివారసమేతంగా పరిమార్చాడు. అగ్నిపరీక్షతో పవిత్ర అయిన జానకిని సగౌరవంగా సమీపానికి చేర్చుకొన్నాడు. దారిలో భక్తశిఖామణి అయిన భరతుణ్ణి ఆనందపరచి అయోధ్యకు మహావైభవంతో పరివారంతో బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఒకవంక వానరులు, మరొకవంక రాక్షసులు, ఇంకొకవంక తపస్సంపన్నులైన మహర్షులు. అదిగో అల్లదిగో దివ్యమైన పుష్పకవిమానం. దానిలో మహోన్నతపీఠంమీద సీతారాములను కూర్చోపెట్టారు. వానరరాజు సుగ్రీవుడూ, దానవరాజు విభీషణుడూ కొంచెం వెనుకవైపుగా జంటగా నిలుచుండి వింజామరలు వీస్తున్నారు. పరమభక్తాగ్రేసర చక్రవర్తి పవమానసుతుడు తెల్లనికాంతులతో విరాజిల్లే వెలిగొడుగును స్వామికి పట్టి నిలుచున్నాడు. నిలువెల్లా భక్తియే అనదగిన భరతుడు స్వామి పాదుకలను పాదాలదగ్గరకు చేరుస్తున్నాడు. చిన్నితమ్ముడు శత్రుఘ్నుడు వింటినీ, అమ్ము లనూ భద్రంగా పట్టుకున్నాడు. సుమిత్ర పెద్దబిడ్డ లక్ష్మణుడు ఎప్పుడు ఏ సేవ స్వామికి అవసరమౌతుందో అని ఏ మాత్రమూ ఏమఱుపాటులేకుండా కాచుకొని ఉన్నాడు. లోకమాత సీతమ్మ పూర్ణకుంభజలం పదిలంగా పట్టుకొని స్వామికి చేరువలో కూర్చున్నది. అంగదుడు బంగారు ఖడ్గాన్ని మోస్తున్నాడు. మండలాకారంతో ఉన్న పసిడిగద్దెను జాంబవంతుడు పట్టుకున్నాడు. ఇలా వీరందరూ ఒక్కొక్కసేవ చేస్తూ ఉండగా పుష్పకం ఎక్కిన శ్రీరామచంద్రుడు గ్రహా లన్నీ చుట్టూ నిలిచి కొలుస్తున్న నిండుజాబిల్లిలాగా ప్రకాశించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కవగూడి = జంటగాకలిసి; ఇరు = రెండు (2); దెసన్ = పక్కలను; కపిరాజు = సుగ్రీవుడు; రాక్షసరాజున్ = విభీషణుడు; ఒక్కటన్ = కూడి; చామరంబులు = చామరములు {చామరము - చమరీమృగముకుచ్చుతో చేయబడి గాలి విసురుటకు ఉపయోగపడెడి సాధనము, తెల్లగా ఉండును కనుక వింజామరము}; వీవన్ = వీచుచుండగ; హనుమంతుడు = హనుమంతుడు; అతి = మిక్కిలి; ధవళ = తెల్లని; అతపత్రమున్ = గొడుగు; పట్ట = పట్టుచుండగ; పాదుకల్ = కాలిజోళ్ళు; భరతుండు = భరతుడు; భక్తిన్ = భక్తితో; తేర = తీసుకురాగ; శత్రుఘ్నుడు = శత్రుఘ్నుడు; అమ్ములు = బాణములు; చాపంబు = విల్లు; కొనిరాగ = తీసుకురాగా; సౌమిత్రి = లక్ష్మణుడు {సౌమిత్రి - సుమిత్రకొడుకు, లక్ష్మణుడు}; భృత్యుడు = సేవకుడు; ఐ = అయ్యి; చనువు = దగ్గరతనము; చూపన్ = చూపించుతుండగ; జల = నీటి; పాత్రన్ = కలశమును; చేబట్టి = చేతిలోపట్టుకోని; జనకజ = జానకీదేవి; కూడిరాన్ = కూడా వస్తుండగ; కాంచన = బంగారపు; ఖడ్గము = కత్తిని; అంగదుడ = అంగదుడు; మోవన్ = మోయుచుండగా;<br><br> పసిడి = బంగారపు; కేడెమున్ = డాలును; అర్థిన్ = కోరి; భల్లూకపతి = జాంబవంతుడు; మోచి = మోయుచు; కొలువన్ = సేవించుచుండగ; పుష్పకంబున్ = పుష్పకవిమానమును; వెలయన్ = ప్రకాశించుచు; ఎక్కి = అధిరోహించి; గ్రహములు = గ్రహములు; ఎల్లన్ = సమస్తము; కొలువన్ = సేవించుచుండగ; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కగానుండెడి; సంపూర్ఱ = నిండు; చంద్రున్ = చంద్రుని; పగిదిన్ = వలె; రామచంద్రుడు = శ్రీరాముడు; ఒప్పెన్ = చక్కగానుండెను. </div> </div> </div> <!--9-320 వీథులు నున్నఁ... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-320 వీథులు నున్నఁ... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/18.Veedhulu_Nunnagavinchi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వీథులు నున్నఁ గావించి తోయంబులు; సల్లి రంభా స్తంభ చయము నిలిపి<br> పట్టుచీరలు సుట్టి బహుతోరణంబులుఁ; గలువడంబులు మేలుకట్లుఁ గట్టి<br> వేదిక లలికించి వివిధ రత్నంబుల; మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి<br> కలయ గోడల రామకథ లెల్ల వ్రాయించి; ప్రాసాదముల దేవభవనములను<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> గోపురంబుల బంగారు కుండ లెత్తి<br> యెల్ల వాకిండ్ల గానుక లేర్పరించి<br> జనులు కై సేసి తూర్యఘోషములతోడ<br> నెదురు నడతెంచి రా రాఘవేంద్రు కడకు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> లోకకల్యాణంకోసం రాక్షససంహారం చేసి శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వితో తిరిగివస్తున్నాడని తెలిసికొన్న అయోధ్యాపురవాసులందరూ ఆనందంతో పొంగిపోతూ స్వాగతసన్నాహాలు చేశారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నగరంలోని బాటలన్నింటిని ఎగుడుదిగుళ్ళు లేకుండా నున్నగా చేసుకొన్నారు. చక్కగా, దుమ్ము లేవకుండా నీళ్ళు చల్లారు. బాటలపొడవునా అరటిస్తంభాలు నిలిపారు. పట్టుచీరలు వానికి చుట్టారు. అందమైన తోరణాలను వీధులలో కమనీయం గా కట్టారు. ఇళ్ళముందరి అరుగులను అలికి పెక్కురత్నాల పొడులతో పెక్కురకాల మ్రుగ్గులు పెట్టారు. ఇండ్లగోడలమీద రామకథ లను వ్రాయించారు. ఎత్తైన మేడలమీదా, దేవాలయాలమీదా, గోపురాలమీదా బంగారుకుండ లెత్తించారు. వీథులలో శ్రీరామ చంద్రులవారికి సమర్పించుకోవటానికి కానుకలు సిద్ధంచేసుకొని ఉంచారు. తాము కూడా చక్కగా చూడముచ్చటగా అలంకరించు కొన్నారు. నాలుగువిధాలైన వాద్యాల కమ్మనినాదాలు వినవస్తూ ఉండగా శ్రీరామచంద్రులవారిని తోడ్కొని రావటానికి ఎదురుగా బయలుదేరారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వీథులున్ = దారులు; చక్కన్ = చక్కగా; కావించి = చేసి; తోయంబులున్ = నీళ్ళు; చల్లి = కళ్ళాపిజల్లి; రంభా = అరటి; స్తంభ = స్తంభముల; చయమున్ = సమూహములను; నిలిపి = నిలబెట్టి; పట్టుజీరలున్ = పట్టుబట్టలు; చుట్టి = కట్టి; బహు = అనేకమైన; తోరణంబులు = తోరణములు; కలువడంబులు = కలువపూలదండలు; మేలుకట్టులున్ = చాందినీలు; కట్టి = కట్టి; వేదికల్ = అరుగులు; అలికించి = అలికించి {అలికి - అలకుట చేసి - మట్టిగచ్చు లను మరల మట్టి పేడలతో (గోడలకు సున్నము వేసినట్లు) మెత్తుట}; వివిధ = రకరకముల; రత్నంబుల = రత్నాల; మ్రుగ్గులున్ = ముగ్గులను; పలు = అనేక; చందంబులుగన్ = విధములైనవి; పెట్టి = వేసి; కలయ = అంతట; గోడల = గోడలపైన; రామ = రాముని; కథలు = కథలు; ఎల్లన్ = సర్వము; వ్రాయించి = వ్రాయించి; ప్రాసాదములన్ = భవనములయొక్క; దేవభవనములను = దేవాలయములయొక్క. </div> </div> </div> <!--9-324 ఇతఁడే రామనరేంద్రుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-324 ఇతఁడే రామనరేంద్రుఁ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/19.Ithade_Ramanarendrudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న<br> ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు<br> త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుం జేతులం జూపుచున్<br> సతు లెల్లం బరికించి చూచిరి పురీ సౌధాగ్ర భాగంబులన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రులవారిని చూచినవెంటనే అయోధ్యాపురకాంతలందరికీ హృదయంలో ఒక ఆనందపు పొంగు వెల్లి విరిసింది. ఆ మహాత్ముని మహిమలను ఒకరికొకరు చెప్పుకొంటూ తక్కినవారిని గుర్తుపడుతూ ఇలా అనుకొంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏమిటీ! ఈయనా శ్రీరామచంద్రమహారాజు! ఈ అమ్మవారికోసమా ఇంద్రశత్రువైన రావణాసురుణ్ణి ముక్కలుగా నరికి ప్రోవులు పెట్టాడు. అడుగడుగో లక్ష్మణస్వామి. అతడే కదయ్యా కోతులరేడు సుగ్రీవుడు! ఆ ప్రక్కన ఉన్నాడే ఆయనయే వాయుపుత్రుడు హనుమన్న. అతనికి కొంచెం ప్రక్కగా ఉన్నవాడే లంకారాజ్యానికి కొత్త ఏలిక విభీషణుడు. అంటూ చేతులతో చూపిస్తూ ఆ మహానగరం భవనాలపై భాగాలలో నిలిచి కాంతలందరూ తదేకంగా శ్రీరామచంద్రపరివారాన్ని చూచి మురిసిపోతున్నారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇతడే = ఇతనే; రామ = రాముడు అనెడి; నరేంద్రుడు = రాజు; ఈ = ఈ; అబల = స్త్రీ; కిన్ = కి; ఆ = ఆ; ఇంద్రారిన్ = రావణుని; ఖండించెన్ = సంహరించెను; అల్ల = అదిగో; అతడె = అతనె; లక్ష్మణుడు = లక్ష్మణుడు; ఆతడే = అతనే; కపివరుండు = సుగ్రీవుడు; ఆ = ఆ; పొంతవాడే = పక్కవాడే; మరుత్సుతుడు = ఆంజనేయుడు {మరుత్సుతుడు - వాయుపుత్రుడు, హనుమంతుడు}; ఆ = ఆ; చెంగటన్ = పక్కన; ఆ = ఆ; విభీషణుడు = విభీషణుడు; అట = అని; అంచున్ = అనుచు; చేతులన్ = చేతులను; చాపి = చాపి; సతులు = స్త్రీలు; ఎల్లన్ = అందరు; పరికించి = పరిశీలనగా; చూచిరి = చూసిరి; పురీ = పట్టణములోని; సౌధ = మేడల; అగ్రభాగంబులన్ = డాబాలపైనుంచి. </div> </div> </div> <!--9-332 కలఁగు టెల్లను... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-332 కలఁగు టెల్లను... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/20.Kalugutellanu_Maane.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కలఁగు టెల్లను మానెఁ గంధు లేడింటికి; జలనంబు మానె భూచక్రమునకు;<br> జాగరూకత మానె జలజలోచనునకు; దీనభావము మానె దిక్పతులకు;<br> మాసి యుండుట మానె మార్తాండ విధులకుఁ; గావిరి మానె దిక్తటములకును;<br> నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల; కణఁగుట మానె ద్రేతాగ్నులకును;<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ<br> కమఠములకుఁ బ్రజల కలఁక మానె;<br> రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు<br> ధరణి భరణరేఖఁ దాల్చు నపుడు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు అయోధ్యలో ప్రవేశించి అమ్మలకు, అయ్యవారలకు, పూజ్యులకు నమస్కరించి వారి కోరిక మేరకు పట్టాభిషేకం చేసుకొన్నాడు. జగములన్నీ ప్రమోదం పొందే విధంగా పాలన చేస్తున్నాడు. ఆ మహాత్ముని పాలన లో విశ్వం ఎలా ఉన్నదో అభివర్ణిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీరామచంద్ర అనే మహారాజు భూభారాన్ని వహించటంతోనే ఏడుసముద్రాలూ సంక్షోభం లేనివయ్యాయి. భూమికి కంపం లేకుండాపోయింది. ఎప్పుడు ఏ దుష్టుడు ఏ ప్రళయం తెచ్చిపెడతాడో అని మేలుకొనియే ఉండే శ్రీమహావిష్ణువు శాంత చిత్తుడై ఒక కునుకు తీయటానికి సిద్ధపడుతున్నాడు. ఇంతవరకు రావణుని భయంవలన బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న దిక్పతులు దీనతలేనివారయ్యారు. సూర్యుడు చంద్రుడు మాసిపోవటంలేదు. దిక్కుల అంచులను కావిరికమ్ముకొనటంలేదు. పెద్ద పెద్ద చెట్లు క్రుంగిపోవటం లేదు. ఆవహనీయము, దక్షిణము, గార్హపత్యము అనే మూడు అగ్నులు అణగిపోకుండా ఉన్నాయి. భూమిని నిరంతరం మోసే ఎనిమిది దిగ్గజాలు, ఏడు కులపర్వతాలు, ఆదివరాహము, ఆదిశేషుడు, ఆదికూర్మము బరువు దించు కొని ఊరటపొందాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కలగుట = సంక్షోభములు; ఎల్లను = సర్వమును; మానెన్ = లేకుండపోయినవి; జలధులు = సముద్రములు {సప్తసముద్రములు - 1లవణ 2ఇక్షు 3సురా 4ఘృత 5దధి 6క్షీర 7జల సముద్రములు}; ఏడింటికి = ఏడింటికి (7); చలనంబు = కంపించుటలు; మానెన్ = లేకుండపోయినవి; భూచక్రమున్ = భూమండలమున; కున్ = కు; జాగరూకత = జాగ్రత్తపడుట; మానెన్ = అవసరములేకపోయెను; జలజలోచనున్ = విష్ణుమూర్తి; కున్ = కి; దీనభావము = దైన్యము; మానెన్ = లేకుండపోయినది; దిక్పతుల్ = దిక్పాలకుల; కున్ = కు; మాసి = వెలవెలపోయి; ఉండుట = ఉండుట; మానెన్ = పోయినది; మార్తాండ = సూర్యునికి; విధులకున్ = చంద్రునికి; కావిరి = నలుపురంగు; మానెన్ = పోయినది; దిక్ = దిక్కులు; గగనముల్ = ఆకాశముల; కున్ = కు; ఉడిగిపోవుట = ఎడిపోవుట; మానెన్ = పోయినది; ఉర్వీరుహంబుల = చెట్ల {ఉర్వీరుహము - ఉర్వి (భూమి)యందు పుట్టునది, చెట్టు}; కున్ = కు; అడగుట = అణగిపోవుట; మనెన్ = పోయినది; త్రేతాగ్నుల్ = త్రేతాగ్నుల {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2దక్షిణాగ్ని 3ఆహవనీయము అనెడి మూడగ్నులు}; కునున్ = కు; కడిది = ఎక్కువ; వ్రేగు = భారము<br><br>మానెన్ = పోయినది; కరి = దిగ్గజములకు; గిరి = కులపర్వతములకు; కిటి = వరాహమూర్తికి; నాగ = ఆదిశేషునకు; కమఠముల = కూర్మమూర్తుల; కున్ = కు; ప్రజల్ = లోకుల; కున్ = కు; అలక = కలత; మానెన్ = పోయినది; రామచంద్రవిభుడు = శ్రీరామప్రభువు; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్ఠులలో; రత్నంబు = ఉత్తముడు; ధరణిభరణరేఖలన్ = భూభారమును; తాల్చున్ = వహించెడి; అపుడున్ = అప్పుడు. </div> </div> </div> <!--9-337 సిగ్గుపడుట గల్గి... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-337 సిగ్గుపడుట గల్గి... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/21.Sigguvaduta_Kalgi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి<br> భక్తి గల్గి చాల భయముఁ గల్గి<br> నయముఁ బ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు<br> సీత దనకు వశము చేసికొనియె.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భారతీయ దాంపత్యంలో చాల ప్రముఖమైన అంశం ఇల్లాలు ఇంటి ఆయనను సర్వసమర్పణభావనతో గౌరవించటం. స్త్రీ లోకానికి అన్ని విషయాలలో ఆదర్శప్రాయ అయిన సీతాదేవి రాముని హృదయాన్ని ఆకట్టుకొన్న తీరును చక్కగా అభివర్ణిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అనుభవజ్ఞులు లజ్జ ఉంటే కులటా, లేకుంటే కులకాంతా చెడిపోతారు అంటారు. సిగ్గుపడటం ఒక ఉదాత్త మైన ప్రవర్తనకు చిహ్నం. సీతాదేవి ఆగుణంతో రాముని హృదయాన్ని ఆకట్టుకొన్నది. అలాగే సహజసౌందర్యాన్ని పెంపొందించే అలంకారాలను ధరిస్తూ ఉండేది. తనభర్తయందు అచంచలమైన భక్తి ఆమెకు అనుక్షణమూ ఉండేది. అటువంటి ఉత్తమగుణాలు ఏ చాపల్యంవలననైనా జారిపోతాయేమో అనే భయం ఉండేది. ఈ గుణాలతో సీతాదేవి తన భర్త చిత్తాన్ని తనవశం చేసికొన్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సిగ్గుపడుట = సిగ్గుపడుట; కల్గి = ఉండి; సింగారమును = శృంగారము; కల్గి = ఉండి; భక్తి = శ్రద్ద; కల్గి = ఉండి; చాల = మిక్కలి; భయమున్ = భయము; కల్గి = ఉండి; నయము = మృదుత్వము; ప్రియమున్ = ప్రీతి; కల్గి = ఉండి; నరనాథున్ = రాజుయొక్క; చిత్తంబున్ = మనసును; సీత = సీతాదేవి; తన = తన; కున్ = కు; వశము = అనుకూలముగ; చేసికొనియె = చేసుకొనెను. </div> </div> </div> <!--9-358 ఆది దేవుఁ డైన... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-358 ఆది దేవుఁ డైన... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/22.Adi_Devudaina_Aa_Ramachandruni.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఆది దేవుఁ డైన యా రామచంద్రుని<br> కబ్ది గట్టు టెంత? యసురకోటి<br> జంపు టెంత? కపుల సాహాయ్య మది యెంత?<br> సురల కొఱకుఁ గ్రీడ చూపెఁ గాక.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన అనేక మహాకార్యాలు అలవోకగా చేశాడు. పదునొకండు వేల యేండ్లు భూమిని పాలించి తన మొదటి తావునకు వెళ్ళిపోయాడు. ఆయనను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలో కవి తెలుపుతున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు. ఎంత అసాధ్యమైన మహాకార్యాలైనా ఆయనకు ఆటలే. ఇది మనం గమనిం చాలి. సాగరానికి వారధి కట్టటం మనకు అసాధ్యమేమో కానీ ఆయనకు అదెంత పని? దేవతలను దిక్పాలకులను గడ గడలాడించిన పేరుప్రఖ్యాతులు గల రాక్షసులను చంపివేయటం ఆ మహాత్మునకు ఒక బరువా? కోతిసేనల సాయం పొందటం చెప్పుకోదగిన సంగతా? ఇదంతా దేవతలకోసం ఆయన ఆడిన నాటకం. అంతే. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఆదిదేవుడు = మూలాధారదేవుడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; రామచంద్రుని = రామచంద్రుని; కిన్ = కి; అబ్ది = సముద్రమునకు; కట్టుట = సేతువుకట్టుట; ఎంత = ఎంతపాటిపని; అసుర = రాక్షస; కోటి = సమూహమును; చంపుట = సంహరించుట; ఎంత = అది ఎంతపని; కపుల = వానరుల; సాహాయ్యము = తోడు; అది = అది; ఎంత = ఎంతటిది; సురల = దేవతల; కొఱకున్ = కోసము; క్రీడ = లీలలు; చూపెన్ = చూపించెను; కాక = తప్పించి. </div> </div> </div> <!--9-359 వశుఁడుగ మ్రొక్కెదన్... (చంపకమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-359 వశుఁడుగ మ్రొక్కెదన్... (చంపకమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/23.Vasuduga_Mrokkedan.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్<br> దశ దిగధీశ మౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్<br> దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధు పోషికిన్<br> దశరథరాజు పట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నిజానికి భాగవతం చెప్పదలచిన రామకథ అయిపోయింది. కానీ కవికి పరితృప్తి కలుగలేదు. మఱికొన్ని మాటలలో శ్రీరామచంద్రుని గుణగణాలను స్మరిస్తూ తానానిందించి మనలను ఆనందసముద్రంలో ముంచి యెత్తు తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ మహితాత్ముడు మహాసముద్రం ఎగిరిపాటులను అణగగొట్టినవాడు. పదిమంది దిక్పాలకుల కిరీటాల మణులనే అద్దాలకు అందచందాలను కూర్చిన దివ్యమైన కీర్తి కలవాడు. వేయిమంది భాస్కరుల వెలుగులకు వెలుగు నిచ్చేవాడు. అమృతం రుచిని మరపించే పలుకులు గలవాడు. సాధువులను ఆదరిఇంఛి ఆదుకొనే దయామూర్తి. దశరథ మహారాజు ముద్దులపట్టి – అతిక్రూరచిత్తం గల రావణుడనే రాక్షసరాజు ప్రాణాలు తీసిన మహామల్లుడు. అట్టి <br><br>శ్రీరామచంద్రునకు నేను నన్ను సమర్పణ చేసికొని మ్రొక్కుతాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వశుడుగన్ = వినమ్రుడనుగా; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; లవణవార్ధి = ఉప్పుసముద్రముయొక్క; విజృంభణా = అహంకారమును; నివర్తి = అణచినవాని; కిన్ = కి; దశ = పది {దశదిశలు - దిక్కులు 4 (తూర్పు దక్షణము పడమర ఉత్తరము) మూలలు 4 (ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఈశాన్యము) పైన 1 మరియు కింద 1 మొత్తం 10}; దిక్ = దిక్కుల; అధీశ = ప్రభువుల; మౌళి = కిరీటములందలి; మణి = మణులు అనెడి; దర్పణ = దర్పణములలో; మండిత = ప్రకాశించుతున్న; దివ్య = గొప్ప; కీర్తి = యశస్సుగలవాని; కిన్ = కి; దశశత = వెయ్యి (1000); బాను = సూర్యులతో సమానమైన; మూర్తి = ప్రకాశముగల స్వరూపి; కిన్ = కి; సుధా = అమృతమువలె; రుచి = తియ్యగా; భాషి = మాట్లాడెడివాని; కిన్ = కి; సాధు = సాధుపురుషులను; పోషి = పోషించువాని; కిన్ = కి; దశరథ = దశరథుడు అనెడి; రాజు = రాజుయొక్క; పట్టి = కుమారుని; కిని = కి; దైత్యపతిన్ = రావణాసురుని {దైత్యపతి - రాక్షసరాజు, రావణాసురుడు}; పొరిగొన్న = సంహరించిన; జెట్టి = వీరుని; కిన్ = కి. </div> </div> </div> <!--9-360 నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-360 నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/24.Nallanivadu_Padmanayanabulavaadu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులన్<br> విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ<br> జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం<br> జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డీవుత మా కభీష్టముల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కవికి తనివితీరటం లేదు. శ్రీరామదర్శనం నుండి బయటపడలేకపోతున్నాడు. శ్రీరామచంద్రుని నుండి తనకూ, తనద్వారా మనకూ ఏమి కావాలో కోరుకొంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయన నల్లనివాడు. ఆకాశంలాగా అంబుధిలాగా అనంతమైనవాడు. పద్మములవంటి విశాలములైన కనులతో మనలను చల్లగా చూస్తూ ఉంటాడు. ఎక్కడా, ఎప్పుడూ వ్యర్థంకాని మహాబాణాలూ, విల్లూ ధరించి ఉండేవాడు. అతివిశాలమైన వక్షఃస్థలంతో విరాజిల్లుతూ భక్తులారా! మీరెందరైనా, ఎక్కడివారైనా రండి ఇక్కడ మీకు చోటు ఉన్నది అని ప్రకటించేవాడు. అందరికీ శుభాన్ని, మేఘం వర్షంలాగా, కురిపించేవాడు. ఎగుబుజములవాడు. తనకీర్తిని అన్నిదిక్కులలో చల్లిన మహానుభావుడు. అటువంటి రఘువంశతిలకుడైన శ్రీరాముడు మాకోరిన కోర్కలను తీర్చుగాక! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నల్లనివాడు = నల్లగా ఉండువాడు; పద్మ = పద్మములవంటి; నయనంబులవాడు = కన్నులుగలవాడు; మహా = గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్ = బాణాసనమును; తాల్చువాడు = ధరించెడివాడు; కడు = మిక్కిలి; విప్పు = విశాలమైన; వక్షమువాడు = రొమ్ముగలవాడు; మేలున్ = శుభములు; పైన్ = మీద; జల్లెడువాడు = కురిపించువాడు; నిక్కిన = ఎగు; భుజంబులవాడు = భుజములుకలవాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్ = దిక్కులకడవరకు; జల్లెడువాడు = వ్యాపించినవాడు; ఐన = అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా = మా; కున్ = కు; అభీష్టముల్ = కోరికలు. </div> </div> </div> <!--9-361 రామచంద్రుఁ గూడి... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-361 రామచంద్రుఁ గూడి... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/25.Ramachandru_Gudi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ<br> గదిసి తిరుగువారుఁ గన్నవారు<br> నంటికొన్నవారు నా కోసలప్రజ<br> లరిగి రాదియోగు లరుగు గతికి.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే. దుష్టశిక్షణకోసం మానవుడుగా భూమిలో అవతరించాడు. ఆ మహాత్మునితో కలసిమెలసి ఉండగలగటం ఒక మహాపుణ్యం. దాని ఫలాన్ని ఈపద్యంలో వర్ణిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయన శ్రీరామచంద్రుడు. చంద్రుడంటే అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు. అయోధ్యలో ఎందరో పుణ్యవంతులు అతనికి చెలికాండ్రై కలసిమెలసి ఉన్నారు. విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు అతనిని ఆశ్రయించి కొన్ని ఘనకార్యాలు చేయించుకొన్నారు. అరణ్యవాసంలో జానపదులు ఎందరో ఆయనను దర్శించుకొన్నారు. సుగ్రీవుడు మొదలైన వానరాదులు, విభీషణుడు మొదలైన రాక్షసులు అతని చెలిమితో పవిత్రులైనవారే. మరల అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత కోసలదేశం ప్రజలు ఆయన చెలిమి కలిమిని అనుభవించినవారే. అలా ఆయనతోపాటు రాకపోకలతో కలిసి – అంటిపెట్టుకొని – తిరిగిన వారూ, కనుగొన్నవారూ, ఆయనను తాకినపుణ్యం పొందినవారూ అయిన కోసల ప్రజలు ఆదియుగంనాటి యోగులు పొందిన పుణ్యలోకాలము చేరుకొన్నారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రామచంద్రున్ = శ్రీరాముని; కూడి = కలిసి; రాకలపోకలన్ = మెలయుటయందు; కదిసి = చేరి; తిరుగు = నడచెడి; వారున్ = వారు; కన్న = చూచిన; వారున్ = వారు; అంటికొన్న = తాకిన; వారున్ = వారు; ఆ = ఆ; కోసల = కోసలదేశపు; ప్రజలున్ = ప్రజలు; అరిగిరి = వెళ్ళిరి; ఆదియోగులు = ఆదియోగులు; అరుగు = వెళ్ళెడి; గతి = సద్గతి; కి = కి. </div> </div> </div> <!--9-362 మంతనములు సద్గతులకు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-362 మంతనములు సద్గతులకు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/26.Manthanamulu_Sadgathulaku.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> మంతనములు సద్గతులకుఁ<br> పొంతనములు ఘనము లైన పుణ్యముల కిదా<br> నీంతన పూర్వమహాఘ ని<br> కృంతనములు రామనామ కృతిచింతనముల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రునికి సంబంధించిన భావనలు చాలా గొప్పవి అని నిరూపిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రామునిపేరును తలపోయటం, ఆయన చేసిన మహాకార్యములను మనస్సులో సంభావించటం అనే రెండూ ఉత్తమ లోకాలకు చేరుకోవటానికి దారిచూపే ఆలోచనలు. గొప్ప గొప్ప పుణ్యాలను చక్కగా సమకూర్చే మంచియోగాలు. అవి ఈ కాలము నకు, వెనుకటి జన్మములకు సంబంధించిన మహాపాతకాలను నామరూపాలు లేకుండా చీల్చిపారవేసే శక్తిసంపద కలవి. అట్టి మహాఫలాలను ప్రసాదించే రామనామాన్ని తనివితీరా జపించండి. ఆయన ఆ అవతారంలో చేసిన ఘనకార్యాలను సంభావిం చండి - అంటున్నది శ్రీమహాభాగవతం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> మంతనములున్ = ఏకాంతమార్గములు; సద్గతుల్ = మోక్షముల; కున్ = కు; పొంతనములు = పొందిపజేయునవి {పొంతనము - మైత్రి కలిగించునది, గ్రహమైత్రి}; ఘనములు = గొప్పవి; ఐన = అయినట్టి; పుణ్యముల్ = పుణ్యఫలముల; కిన్ = కి; తాన్ = తను; ఇంతన = ఇప్పుడు; పూర్వ = పూర్వముచేసిన; మహా = గొప్ప; అఘ = పాపములను; నికృంతనములు = త్రెంచునవి; రామ = శ్రీరాముని; నామ = పేరుతో; కృత = చేసెడి; చింతనముల్ = సంస్మరణలు. </div> </div> </div> <!--9-462 క్షమ గలిగిన... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-462 క్షమ గలిగిన... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/27.Kshama_Galigina_Siri_Gaalugunu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> క్షమ గలిగిన సిరి గలుగును <br> క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్<br> క్షమ గలుగఁ దోన కలుగును <br> క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పది అవతారాలలో పరశురామావతారం ఒకటి. ఆయన మహర్షి జమదగ్ని కొడుకులలో ఒకరు. కార్తవీర్యార్జునుడు అనే మహాచక్రవర్తి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి పెద్దపరివారంతో వచ్చాడు. మహర్షి అందరికీ ఆతిథ్యం ఇచ్చి గొప్పవిందుభోజనం పెట్టాడు. అది అతని హోమధేనువు మహిమ. రాజుననే పొగరుతో అర్జునుడు బలవంతంగా దానిని తీసికొనిపోయాడు. పరశు రాముడు ఇది తెలిసికొని పట్టరాని కోపంతో మాహిష్మతీపురానికి వెళ్ళి రాజునూ, ఆరితేరిన సైనికులనూ అతిక్రూరంగా చంపి దూడతోపాటు ఆవును తెచ్చి తండ్రికి సమర్పించాడు. తాను ప్రళయరుద్రుడై చేసిన సంహారకాండను కూడా వివరించాడు. శాంత మూర్తి అయిన జమదగ్ని నొచ్చుకొన్నాడు. కొడుకును మందలిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నాన్నా! సహనం చాలా గొప్పదయ్యా! అది ఉంటే అన్నీ ఉన్నట్లే. సహించటం తెలిసినవారికి సంపదలు కొల్లలుగా కలుగుతాయి. ఓర్పు కలవానికి మంచిమాటలు సిద్ధిస్తాయి. సౌఖ్యాలన్నీ సహనశీలుణ్ణి వెనువెంటనే చేరుకొంటాయి. బాబూ! దయామయుడైన శ్రీమహావిష్ణువు ఓరిమిని పండించుకొన్నవానిని మెచ్చుకొంటాడయ్యా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> క్షమ = ఓరిమి; కలిగిన = ఉన్నచో; సిరి = సంపదలు; కలుగును = కలుగుతాయి; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; వాణి = విద్య; కలుగున్ = అబ్బును; సౌర = సూర్యుడంతటి; ప్రభయున్ = ప్రకాశము; క్షమ = తాలిమి; కలుగన్ = ఉన్నచో; తోనన్ = దానితోపాడు; కలుగును = కలుగును; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; మెచ్చు = సంతోషించును; శౌరి = విష్ణువు {శౌరి - శూరుని యొక్క మనుమడు, విష్ణువు}; సదయుండు = దయామయుడు; తండ్రి = నాయనా . </div> </div> </div> <!--9-507 రాజ్యంబు పాపమూలము... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-507 రాజ్యంబు పాపమూలము... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/28.Rajyambu_Papamulamu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రాజ్యంబు పాపమూలము<br> రాజ్యముతో నొడ లెఱుంగ రాదు సుమతియున్<br> రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగడు<br> రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> వెనుకటి కాలంలో నహుషచక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు ఇంద్రపదవిని పొందగలిగిన పుణ్యశాలి. అతనికి యతి మొదలైన ఆరుగురు పుత్రులు కలిగారు. నహుషుడు పెద్దకొడుకు యతికి రాజ్యం ఇచ్చాడు. కానీ ఆ మహానుభావుడు వైరాగ్యాన్ని పండించుకొన్నవాడు కనుక ఇలా అనుకొన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజ్యం అనేది అన్ని పాపాలకూ మూలకారణం. ఒకమారు రాజ్యం దక్కింది అంటే వానికిక ఒళ్ళు తెలియదు. ఎంత మంచిబుద్ధి ఉన్నవాడయినా రాజ్యం పొందిన తరువాత గౌరవింపదగినవానిని తెలిసికోలేడు. పూజ్యులను అవమా నిస్తాడు. ఘోరమైన ఆపదలను కొనితెచ్చుకొంటాడు. కాబట్టి మోక్షసామ్రాజ్యం మీద ప్రీతి ఉన్నవారికి ఈ రాజ్యమూ గీజ్యమూ ఎందుకు? – అని రాజ్యాన్ని పూచికపుల్లలా వదలివేసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రాజ్యంబున్ = రాజ్యము; పాప = పాపం సంభవించుటకు; మూలము = మూల కారణము; రాజ్యము = రాజ్యము; తోన్ = తోటి; ఒడ లెఱుంగ రాదు = మదము పెరుగును {ఒడ లెఱుగ రాదు - గర్వము వలన ఒళ్ళు తెలియదు}; సుమతియున్ = మంచి బుద్ధి కల వా డైనను; రాజ్యమునన్ = రాజ్యము వలన; పూజ్యున్ = పూజింప దగిన వానిని; ఎఱుగడు = తెలియ లేడు; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; ముక్తి = మోక్షము; రతుల = కోరువారి; కున్ = కి; ఏలా = ఎందుకు . </div> </div> </div> <!--9-581 కామోపభోగ సుఖములు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-581 కామోపభోగ సుఖములు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/29.Kamopabhoga_Sukhamulu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కామోపభోగ సుఖములు<br> వేమాఱును బురుషుఁ డనుభవింపుచు నున్నం<br> గామంబు శాంతిఁ బొందదు<br> ధూమధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు వడునే?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నహుషుని రెండవకొడుకు యయాతి రాజయ్యాడు. శుక్రాచార్యుని బిడ్డ దేవయాని అతనికి భార్య అయింది. ఒక నాడతనికి ఆత్మజ్ఞానం కలిగింది. స్త్రీకారణంగా మోసపోయాననుకొన్నాడు. వైరాగ్యం హృదయంలో కదలాడుతూ ఉండగా కామవికారం ఎంతఘోరమైనదో ఆమెకు తెలియజేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దేవయానీ! మానవుడు కామసుఖాలను వేలకొలదిగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ కామం ఒక పెద్ద అగ్నివంటిది. పెద్దపెద్ద పాత్రల నిండుగా నేతిని తెచ్చి అగ్నిలో పోస్తున్నా అగ్ని ఇంక చాలు అంటుందా? అటువంటిదే ఈ కామాగ్ని. దాని అను భవాలు పెరిగిపోతున్నకొద్దీ కామం మరింతగా విజృంభిస్తుందే కానీ అణగారదు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కామోపభోగ = విషయ భోగపు; సుఖములున్ = సుఖములను; వేమాఱు = అనేక సార్లు; పురుషుడు = మానవుడు; అనుభవింపు చున్నన్ = అనుభవిస్తూ ఉన్నా; కామంబు = తృష్ణ, కోరిక; శాంతి బొందదు = చల్లారదు; ధూమధ్వజుడు = అగ్నిదేవుడు; ఆజ్య = నేతి; వృష్టిన్ = ధారలతో; త్రుంగుడు = అణగారుట; పడునే = జరుగదు కా </div> </div> </div> <!--9-725 ఎప్పుడు ధర్మక్షయ మగు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-725 ఎప్పుడు ధర్మక్షయ మగు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/30.Yeppudu_Dharmakshayamagu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎప్పుడు ధర్మక్షయ మగు<br> నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో<br> నప్పుడు విశ్వేశుఁడు హరి<br> దప్పక విభఁ డయ్యుఁ దన్నుఁ దా సృజియించున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు భగవంతుని అవతారాలనూ, భాగవతుల చరిత్రనూ భాగవతరూపంలో చెబుతు న్నాడు. యాదవవంశ చరిత్రను చెబుతూ శ్రీకృష్ణవాసుదేవుని అవతారకారణాన్ని వివరిస్తున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరీక్షిన్మహారాజా! ఈ సృష్టి అంతా ఒక విచిత్రమైన చక్రం తిరుగుళ్ళవంటిది. ఒక్కొక్క కాలంలో ధర్మం క్షీణించిపోతుంది. పాపం పండిపోతుంది. అదిలోకం అంతటికీ చేటుకాలం. గమనిస్తాడు విశ్వానికంతటికీ ప్రభువైన విష్ణువు. అధర్మమైన పాపాన్ని అంతం చేసి ధర్మాన్ని మళ్ళీ సుస్థితికి తేవటం కర్తవ్యంగా పెట్టుకొని తన్ను తాను సృజించుకొంటాడు. అతడే దేవకి ఎనిమిదవ గర్భంగా అవతరించిన శ్రీకృష్ణవాసుదేవుడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎప్పుడు = ఎప్పు డైతే; ధర్మ = ధర్మము; క్షయము = క్షీణించినది; అగున్ = అగునో; ఎప్పుడు = ఎప్పు డైతే; పాపంబున్ = పాపములు; పొడమున్ = అతిశయించునో; ఈ = ఈ; లోకము = లోకము; లోన్ = అందు; అప్పుడున్ = ఆ కాలము నందు; విశ్వేశుడు = విష్ణుమూర్తి {వి శ్వేశుడు - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి}; హరి = విష్ణుమూర్తి; తప్పక = తప్పకుండగ; విభుడు = భగవంతుడు (విభుడు = సర్వవైభవోపేతుడు); అయ్యున్ = అయిన ప్పటికిని; తన్ను = తనను; తాను = తనే; సృజియించున్ = సృష్టించును . </div> </div> </div> <!--9-730 మంగళ హరికీర్తి... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-730 మంగళ హరికీర్తి... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/31.Mangala_Hari_Keerthi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> మంగళ హరికీర్తి మహా<br> గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్<br> సంగతము సేసి ద్రావఁ దొ<br> లంగును గర్మంబు లావిలం బగుచు నృపా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణవాసుదేవుని అవతార పరిసమాప్తిని సూచనామాత్రంగా వినిపిస్తున్నాడు శుకయోగీంద్రుడు పరీక్షిన్మహా రాజునకు. అట్టి శ్రీహర్ అమృతచరిత్రను విన్నవారికి కలిగే పుణ్యఫలం ఎట్టిదో తెలుపుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజా! పరీక్షిత్తూ! కృష్ణుడై అవతరించి దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడి ధర్మస్థాపన చేసిన శ్రీహరికీర్తి సకలశుభా లనూ సమకూర్చుతుందయ్యా! ఆకీర్తి మహాగంగ. అదియొక అమృతవాహిని. దానిని ఏ కొంచెమైనా చెవిదొప్పలతో హృదయం లోనికి చేర్చుకొంటే కర్మములన్నీ కాలిపోతాయి. అంటే పుట్టటం చావటం అనే చట్రంలో తిరుగుతూ ఉండే ఘోరమైన ఆపద తొలగిపోతుంద్. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> మంగళ = శుభకర మైన; హరి = నారాయణుని; కీర్తి = కీర్తి; మహా = గొప్ప; గంగా = గంగా; అమృత = అమృత మయ జలములు; ఇంచుక = కొంచము; ఐనన్ = అయినప్పటికి; కర్ణ = చెవులు అనెడి; అంజలులన్ = దోసిళ్లతో; సంగతమున్ = చేదుకొనుట; చేసి = చేసికొని; త్రావన్ = తాగినచో; తొలంగును = తొలగి పోవును; కర్మంబులు = కర్మలు; ఆవిలంబులు = నశించినవి; అగుచున్ = అగుచు; నృపా = రాజా. </div> </div> </div> <!--9-732 నగుమొగమున్... (చంపకమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">9-732 నగుమొగమున్... (చంపకమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/09/32.Nagumogamun_Sumadhyamunu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటప<br> ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదే<br> భగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డి<br> మ్ముగఁ బొడసూపుఁ గాత గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శుకయోగీంద్రులు శ్రీకృష్ణవాసుదేవుని మనోహరరూపాన్ని తన జ్ఞాననేత్రంముందు కదలాడనని కోరుకొంటున్నారు. మనకు కూడా అట్టి భాగ్యాన్ని కలిగిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ మహాత్ముడు నిరంతరమూ నవ్వుమొగంతోనే కానవస్తాడు. అంటే అచ్చమైన ఆనందం ఆయన స్వరూపమన్నమాట. సన్నని నడుమును గమనిస్తే అందులోనే పదునాలుగులోకాలు భద్రంగా ఉన్న స్ఫూర్తి కలుగుతుంది. ఆయన అనంతుడు అని తెలపటానికై ఆకాశంవంటి నీలమైన దేహకాంతితో అలరారుతున్నాడు. ఆవిశాలమైన వక్షఃస్థలం శ్రీమహాలక్ష్మికి ఆటపట్టు. ఎంత అలవికాని పనినైనా అలవోకగా చేస్తాయి అనిపించే పొడవైన గొప్పహస్తాలతో వెలుగొందుతున్నాడు స్వామి. కర్ణముల కుండలాలు కమనీయంగా కాంతులను విరజిమ్ముతూ కదలాడుతున్నాయి. అడుగుతీసి అడుగువేస్తుంటే ఒక మదించిన గజరాజు ఆ మహాత్ము ని నుండియే నడకను అభ్యసించిందా అనిపిస్తుంది. తలమీది కేశపాశం నల్లనివన్నెతో నిగనిగలాడిపోతున్నది. కన్నులలో అపార మైన కృపారసం తొణికిసలాడుతూ ఉంటుంది. అటువంటి గొప్పలక్షణాలు గల కన్నయ్య కన్నులు మూసినా తెరచినా నాకు కన పడుతూ ఉండాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నగు మొగమున్ = నగుమోము; సు = చక్కటి; మధ్యమును = నడుము; నల్లని = నల్లటి; దేహము = శరీరము; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసము; అగు = ఐన; ఉరమున్ = వక్షస్థలము; మహా = గొప్ప; భుజముల్ = భుజములు; అంచిత = అలంకరింప బడిన; కుండల = చెవి కుండలములు గల; కర్ణముల్ = చెవులు; మత్ = మదించిన; ఇభ = ఏనుగు వంటి; గతియున్ = నడకలు; నీల = నల్లని; వేణియున్ = శిరోజములు; కృపారస = దయారసము ఒలికెడి; దృష్టియున్ = చూపులు; కల్గు = ఉన్నట్టి; వెన్నుడు = విష్ణువు; ఇమ్ముగన్ = కనుల నిండుగా; పొడ సూపు గాత = కనిపించి గాక; కను = కళ్ళు; మూసిన = మూసెడి; అప్పుడున్ = సమయము నందు; విచ్చున్ = తెరచు; అప్పుడున్ = సమయము నందు . </div> </div> </div> <div> <div style="width:10%;Text-align:center;float:left;"> <div class="button-effect"> <a class="effect effect-4" href="iBam8.html" title="అష్టమ స్కంధం" style="background-color: #f4511e;"><i class="fas fa-arrow-left"></i> అష్టమ స్కంధం</a> </div> </div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam10.html" title="దశమ స్కంధం" style="background-color: #f4511e;">దశమ స్కంధం <i class="fas fa-arrow-right"></i></a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>