JezK
Edit File: iBam8.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam8.html Date Name Comments ==== ==== ======== 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <br> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <link rel="shortcut icon" href="../images/favicon.png"/> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet" /> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> <link href="../assets/css/main.css" rel="stylesheet" /> <link href="../assets/css/ibam.css" rel="stylesheet" /> <script> <!-- $(window).scroll(function () { --> <!-- $('audio').each(function () { --> <!-- //if ($(this).is(":in-viewport")) --> <!-- if (IsInViewport($(this))) --> <!-- { --> <!-- $(this)[0].play(); --> <!-- } --> <!-- else --> <!-- { --> <!-- $(this)[0].pause(); --> <!-- } --> <!-- }) --> <!-- }); --> <!-- Check if an element is in the visible viewport --> <!-- @param {jQuery|HTMLElement} el --> <!-- @return boolean --> <!-- var IsInViewport = function (el) { --> <!-- if (typeof jQuery === "function" && el instanceof jQuery) el = el[0]; --> <!-- var rect = el.getBoundingClientRect(); --> <!-- return ( --> <!-- rect.top >= 0 && --> <!-- rect.left >= 0 && --> <!-- rect.bottom <= (window.innerHeight || document.documentElement.clientHeight) && --> <!-- rect.right <= (window.innerWidth || document.documentElement.clientWidth) --> <!-- ); --> <!-- }; --> </script> </head> <body> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"><a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1<span class="sr-only">(current)</span></a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a></li> <li class="nav-item"><a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a></li> <li class="nav-item"><a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a></li> <li class="nav-item"><a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a></li> <li class="nav-item"><a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a></li> <li class="nav-item"><a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a></li> <li class="nav-item"><a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a></li> <li class="nav-item"><a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a></li> <li class="nav-item"><a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a></li> <li class="nav-item"><a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a></li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a></li> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-skype" aria-label="Skype" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-linkedin" aria-label="Linkedin" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-google-plus" aria-label="Google-Plus" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a></li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a></li> </ul> </div> </nav> <!-- <div class="img-responsive aln-top" style="margin-top: 50px; background-color: white; z-index: 99; position: relative;"> <img src="../images/iBam.png" /> </div>--> <div class="container-fluid"> <div id="chap8" > <!-- <br><br> --> <h3 class="title" style="padding-top: 6px;" >అష్టమ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap8"></div> <div class="col-sm-9"> <!--8-19 నీరాట వనాటములకుఁ... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-19 నీరాట వనాటములకుఁ... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/01.Meerata_Vanatamulaku.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నీరాట వనాటములకు<br> పోరాటం బెట్లు గలిగె, పురుషోత్తము చే<br> నారాట మెట్లు మానెను<br> ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అత్యద్భుతమైన గజేంద్ర మోక్షణకథ ప్రపంచ వాఙ్మయంలోనే తలమానికం వంటిది. ఎనిమిదవ స్కంధం భాగవతంలో ఈ కథతోనే మొదలవుతున్నది. పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇలా అడుగుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! ఒకటి నీటిలో తిరుగాడే జంతువు. మరొకటేమో అడవులలో సంచరించే ఏనుగు. పట్టుకొన్నది మొసలి. పట్టుపడినది భద్రగజం. అబ్బో! ఎంత దేహం! ఎంతబలం! అటువంటి ఆ రెండు మహాజంతువులకూ పోరాటం ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? పోనీ కలిగిందే అనుకుందాం. సృష్టిలో ఎన్నో ప్రాణులు కొట్టుకొని చస్తూ ఉంటాయి. కానీ మీరు ఘోరమైన అడవిలో ఆభద్రగజం ఆరాటాన్ని పురుషోత్తముడు పోగొట్టాడంటున్నారు! అది ఎలా జరిగింది? అంతా ఆశ్చర్యంగా ఉన్నది. నాకు వినాలని వేడుక పుట్టింది, వినిపించండి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నీరాట = మొసలి {నీరాటము – నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము –అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకర మైన; అటవి = అడవి; లోని = అందలి; భద్ర కుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు. </div> </div> </div> <!--8-42 అటఁ గాంచెన్... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-42 అటఁ గాంచెన్... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/02.Aata_Ganchengaraneevibhundu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అట గాంచెం గరిణీవిభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్<br> నట దిందిందిర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్<br> వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్<br> చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీశుకులవారు పరీక్షిన్మహారాజునకు గజేంద్ర మోక్షణ కథను వివరిస్తున్నారు. రాజా! త్రికూటం అనే గొప్ప పర్వతం ఉంది. దానినుండి ఒకపెద్ద ఏనుగుల మంద దప్పిక తీర్చుకోవటానికీ, జలవిహారం చేయటానికీ బయలుదేరింది. ఆ మందలరేడు ఒక గొప్ప గజరాజునకు ఒక పెద్దజలాశయం కంటపడింది. అది - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ జలాశయం అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామరపూవులతో కలువపూవులతో కళకళలాడుతున్నది. వానిమీద మదించిన తుమ్మెదలు నాట్యాలు చేస్తున్నాయి. దానినిండా పెద్దపెద్ద తాబేళ్ళూ, చాలా పెద్ద చేపలూ, ఇంకా పెద్దమొసళ్ళూ విహరిస్తున్నాయి. వానితో అది ఎవ్వరికీ ప్రవేశింపనలవి కాకుండా ఉంది. దాని ఒడ్డుల మీద రావిచెట్లూ, ఒకజాతి తాటిచెట్లూ, మామిడిచెట్లూ, మద్దిచెట్లూ, పూల తీగలతో అల్లుకొన్న పొదరిళ్ళూ చూడముచ్చటగా ఉన్నాయి. అటూ ఇటూ గొప్ప ఉత్సాహంతో ఎగురుగున్న హంసలూ, చక్రవాకాలూ, కొంగలూ మొదలైన పక్షులు కన్నులకు విందు చేస్తున్నాయి. అటువంటి పెద్దజలాశయాన్ని ఆ గజరాజు చూచాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అటన్ = అక్కడ; కాంచెన్ = చూచెను; కరణీ = గజ; విభుండు = రాజు; నవ = తాజా; పుల్ల = విచ్చుకొన్న; అంభోజ = కమలములు; కల్హారమున్ = కలువలు; నటత్ = ఆడుతున్న; ఇందిందిర = తుమ్మెదల; వారమున్ = సమూహము కలిగినది; కమఠ = తాబేళ్ళు; మీన = చేపలు; గ్రాహ = మొసళ్ళుతోను; దుర్వారమున్ = నివారింప రానిది; వట = మఱ్ఱి; హింతాల = తాడి; రసాల = తియ్య మామిడి; సాల = మద్ది; సుమనో = పువ్వుల; వల్లీ = లతా; కుటీ = కుంజములు గల; తీరమున్ = గట్లు కలిగిన; చటుల = మిక్కిలి వేగముగా; ఉద్ధూత = ఎగిరెడి; మరాళ = హంసలు; చక్ర = చక్రవాకములు; బక = కొంగల; సంచారంబున్ = విహరించుటలు కలిగినది; కాసారమున్ = మడుగును. </div> </div> </div> <!--8-45 తొండంబులఁ బూరించుచు... (కందము)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-45 తొండంబులఁ బూరించుచు... (కందము)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/03.Thondambula_Purinchuchu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తొండంబులఁ బూరింపుచు<br> గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్<br> మెండుకొన వలుఁదకడుపులు<br> నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏనుగులన్నీ జలక్రీడలు మొదలుపెట్టాయి. నీటిలోనికి ప్రవేశించాయి. ముందుగా కడుపునిండా నీరు త్రాగాయి. ఆ త్రాగటం ఎలా ఉన్నదంటే, </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తొండాలతో నీటిని నింపుకున్నాయి. ఒకదాని చెక్కిలిమీద మరొకటిగా చిమ్మనగ్రోవితో చిమ్మినట్లు జల్లుకొన్నాయి. అప్పటి ఆ ధ్వనులు చెవులకు ఇంపుగా వినవస్తున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయికదా! వాని గళగళధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. కావలసినంత నీరు ఉన్నది. తక్కువేమి మనకు అన్నట్లుగా కడుపులు నిండేవిధంగా ఆ ఏనుగుల మందలు నీరు త్రాగాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తొండంబులన్ = తొండముల లోనికి; పూరించుచున్ = నీళ్ళు పీల్చి నింపుతూ; గండంబులన్ = గండ ఫలకముల పై; చల్లుకొనుచు = చల్లుకుంటు; గళ గళ = గడ గడ మనెడి; రవముల్ = శబ్దములు; మెండుకొనన్ = అతిశయించు తుండగ; వలుద = విశాల మైన; కడుపులు = పొట్టలు; నిండన్ = నిండగ; వేదండ = ఏనుగుల; కోటి = సమూహము; నీటిన్ = నీటిని; త్రావెన్ = తాగినవి. </div> </div> </div> <!--8-47 ఇభలోకేంద్రుఁడు... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-47 ఇభలోకేంద్రుఁడు... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/04.Ibha_Lokendrudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీ రెక్కించి పూరించి చం<br> డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా<br> రభటిన్నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్<br> నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏనుగుల నాయకుడు కడుపునిండా నీరు త్రాగి తరువాత తన నీటి ఆటలను మొదలుపెట్టాడు. ఆ సహజసుందర సన్నివేశాన్ని పోతనామాత్యులవారు మన కన్నులకు కట్టిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏనుగుల మందలకు నాయకుడైన ఆ గజరాజు తొండాల రంధ్రాలలోనికి నీరెక్కించాడు. సందు లేకుండా నింపాడు. తొండాన్ని ఆకాశంవైపునకు బాగా ఎత్తిపట్టాడు. ఊపుకోసం నిక్కినిలుచున్నాడు. లోపలి నీటిని బాగా పుక్కిలిపట్టాడు. ఒక్కపెట్టున పైకి చిమ్మాడు. ఆ దెబ్బకు ఆ జలాశయంలోని మొసళ్ళు, పెద్దచేపలూ, మిగిలిన జలజంతువులూ గగనంలోనికి దూసుకుంటూ పోయాయి. ఆకాశంలో ఉన్న మీనము, కర్కాటకమూ, అనే గ్రహాలను పట్టుకున్నాయి. దేవతలు అది చూచి చేష్టలుదక్కి నిలుచుండిపోయారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇభ లో కేంద్రుడు = గజేంద్రుడు {ఇభ లో కేంద్రుడు - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు}; హస్త = తొండముల; రంధ్రములన్ = కన్నముల లోనికి; నీరు = నీటిని; ఎక్కించి = పీల్చు కొని; పూరించి = నింపుకొని; చండభ మార్గంబున్ = ఆకాశము కేసి {చండభ మార్గము - సూర్యుని మార్గము, ఆకాశము వైపు}; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; నిక్కి = సాచి; వడిన్ = వేగముగ; ఉడ్డాడించి = పుక్కిలించి; పింజింపన్ = చిమ్మగా; ఆరభటిన్ = పెద్ద శబ్దముతో; నీరము = నీటి; లోనన్ = లో నుండి; పెల్లు = పెల్లు మని, తీవ్రముగ; ఎగసి = ఎగిరి; నక్ర = పీతలు; గ్రాహ = మొసళ్ళు; పాఠీనముల్ = చేపలు; నభము = ఆకాశము; అందు = అందు; ఆడెడు = తిరిగెడు; మీన = మీనరాశి; కర్కటములన్ = కర్కాటకరాశులను; పట్టెన్ = పట్టుకొన్నవి; సురల్ = దేవతలు; మ్రాన్పడన్ = నిశ్ఛేష్టులు కాగా. </div> </div> </div> <!--8-49 కరిణీ కరోజ్ఝిత... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-49 కరిణీ కరోజ్ఝిత... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/05.Karanee_Karojiyitha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కరిణీ కరోజ్ఝిత కంకణ చ్ఛట దోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు<br> హస్తినీ హస్తవిన్యస్త పద్మంబుల వేయుగన్నులవాని వెఱపు సూపు <br> కలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు<br> కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు<br> <br> <b>(ఆటవెలది) </b><br> <br> మదకరేణుముక్త మౌక్తిక శక్తుల<br> మిఱుగు మొగిలుతోడ మేలమాడు<br> నెదురులేని గరిమ నిభరాజమల్లంబు<br> వనజగేహకేళి వ్రాలునపుడు<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆ గజేంద్రుని ఆటల ఆర్భాటాలు ఇంకా ఈవిధంగా చూడముచ్చటగా ఉన్నాయి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ ఏనుగులరేనికి ఎదురేలేదు. ఆడినది ఆటగా ఆ పెద్ద చెఱువులో విహరిస్తున్నది. దాని ఆడఏనుగులన్నీ తొండాలతో తుంపురులను దానిమీదకు చిమ్ముతున్నాయి. అప్పుడది సెలయేటిలోని నల్లని కొండలాగా అలరారుతున్నది. అలాగే ఆపెంటి ఏనుగులు చెరువులోని పద్మాలను కుప్పలుతెప్పలుగా దానిమీద వేస్తున్నాయి. అవన్నీ దానిమీద నిలిచి వేయికన్నుల యింద్రుణ్ణి తలపింపజేస్తున్నాయి. గున్నయేనుగులు కలువపూవుల పొడిని దానిమీద చల్లుతున్నాయి. అప్పుడది బంగారుకొండలాగా వెలిగిపోతున్నది. ఆడ ఏనుగులు తామరతూడులను లాగి దానిమీదకు విసరుతున్నాయి. ఆవిధంగా పాములు అలంకారాలుగా భాసిల్లే పరమశివునిలాగా చూపట్టుతున్నది. మదించిన ఏనుగుభామలు పైనిచల్లిన ముత్యాలుగల ముత్యపు చిప్పలతో మెఱుగుతీగలతో విరాజిల్లుతున్న మేఘంలాగా శోభిల్లుతున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కరణీ = ఆడ యేనుగుల; కర = తొండముల చేత; ఉత్+జిత = చిమ్మ బడిన; కం = నీటి; కణ = బిందువుల; ఛటన్ = ధార లందు; తోగి = తడసి పోయి; సెలయేటి = సెలయేళ్ళ తో కూడిన; నీలాద్రి = నీలగిరి; చెలువున్ = వలె; తెగడున్ = పరిహసించును; హస్తినీ = ఆడు ఏనుగుల; హస్త = తొండముల చేత; విన్యస్త = ఉంచబడిన; పద్మంబులన్ = పద్మములతో; వేయిగన్నుల వాని = ఇంద్రుని {వేయి కన్నుల వాడు – వెయ్యి కన్నులు గల వాడు, సహస్రాక్షుడు, ఇంద్రుడు}; వెఱవు = అతిశయమును; చూపున్ = చూపించును; కలభ = గున్న యేనుగులచే; సమ = అధికముగ; ఉత్కీర్ణ = జల్లబడిన; కల్హార రజమునన్ = పద్మముల పుప్పొడితో; కనకా చలేంద్రంబు = మేరు పర్వతము యొక్క {కనకా చలేంద్రము - కనక (బంగారు) ఆచల (కొండలలో) ఇంద్రము (గొప్పది), మేరు పర్వతము}; ఘనతన్ = గొప్ప దనమును; తాల్చున్ = ధరించును; కుంజరీ = ఆడ యేనుగులచే; పరిచిత = సమర్పించబడిన; కుముద = కలువల; కాండంబులన్ = తూళ్ళతో; ఫణి రాజ మండన = పరమ శివుని {ఫణి రాజ మండనుడు - ఫణి (సర్పములలో) రాజ (శ్రేష్ఠములచే) మండన (అలంకరింపబడిన వాడు), శివుడు}; ప్రభన్ = ప్రకాశమును; వహించున్ = ధరించును.<br><br> మద = మదించిన; కరేణు = ఆడ యేనుగుల చే; ముక్త = వేయబడిన; మౌక్తిక = ముత్యపు; శుక్తులన్ = చిప్పలతో; మెఱుగు = మెరుపుల; మొగిలు = మబ్బుల; తోడన్ = తోటి; మేల మాడున్ = సరసము లాడును; ఎదురు లేని = తిరుగు లేని; గరిమన్ = గొప్ప దనముతో; ఇభ = ఏనుగుల; రాజ = పతులలో; ఇంద్రము = గొప్పది; వనజ గేహ = మడుగు నందు {వనజ గేహము - వనజము (పద్మములకు) గేహము (ఇల్లు), సరోవరము}; కేళిన్ = క్రీడించుటకు; వ్రాలున్ = దిగెడి; అపుడు = సమయములో. </div> </div> </div> <!--8-51 భుగభుగాయిత భూరి... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-51 భుగభుగాయిత భూరి... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/06.Bhugabhugayutha_Bhuri_Budbudha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భుగభుగాయిత భూరి బుద్బుద చ్ఛటలతో, కదలుచు దివికి భంగంబు లెగయ<br> భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహకోటి బెగడ<br> వాలవిక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్త మడర<br> కల్లోల జాల సంఘట్టనంబుల తటీ తరులు మూలములతో ధరణి గూల<br> <br> <b>(తేటగీతి) </b><br> <br> సరసిలో నుండి పొడగని సంభ్రమించి <br> యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి<br> భాను కబళించి పట్టు స్వర్భానుపగిది <br> నొక్కమకరేంద్ర డిభరాజు నొడిసిపట్టె.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కొలను ఆ ఏనుగుల చిలిపి ఆటలకు అతలాకుతలం అయిపోతున్నది. అది గమనించింది అందులో ఉన్న ఒక మకరం. అది ఈ ఏనుగుల రాజు కంటే ఏమీ తక్కువతిన్నది కాదు. పట్టనలవికాని పట్టుదలతో ఆ ఏనుగును ఒడిసిపట్టుకొన్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏనుగులరేడు ఒడను తెలియకుండా ఆడుకుంటున్నది. కొలనులో ఉన్న ఒక పెద్దమొసలి దానిని గమనించింది. ఆ మొసలికి స్థానబలం ఉన్నదికదా! అది తనముందు ఆ ఏనుగుఆటలను సాగనిస్తుందా? విజృంభించింది. భుగభుగ అని పొంగుకొని వస్తున్న బుడగలతో అలలు ఆకాశాన్నంటుతున్నాయి. జనాల గుండెలు అదరిపోయే విధంగా అది చేస్తున్న ఫూత్కారనాదంతో మహాభయంకరమైన మొసళ్ళ గుంపులు కూడా అడలిపోతున్నాయి. తోకను ఈడ్చిఈడ్చి కొడుతున్నది. దానివలన పెల్లురేగిన పెద్దగాలిచేత ఘుమఘుమలాడే సుడి గిరగిరా తిరుగుతున్నది. అలలు ఒకదానికొకటి కొట్టుకొనగా ఒడ్డులనున్న మహావృక్షాలు పెల్లగిల్లిపోతున్నాయి. ఆ మొసలి ఒక్కపెట్టున పట్టు చిక్కించుకొని కిప్పించి హుంకరించి ఏనుగును ఒడిసిపట్టుకొన్నది. అది సూర్యగ్రహాన్ని పట్టుకొన్న రాహుగ్రహంలాగా ఉన్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భుగభు గాయిత = భుగభుగ మనెడి శబ్దముతో; భూరి = అతి పెద్ద; బుద్భుద = నీటి బుడగల; ఛటల్ = సమూహముల; తోన్ = తోటి; కదలుచు = కదులుతు; దివి = ఆకాశమున; కిన్ = కు; భంగంబుల్ = కెరటములు; ఎగయన్ = ఎగురగా; భువన = లోకములకు; భయంకర = భీతి కలిగించెడి; ఫూత్కార = ఫూ యనెడి; రవమునన్ = శబ్దముతో; ఘోర = భయంకర మైన; నక్ర = పీతల, ఎండ్రకాయల; గ్రాహ = మొసళ్ళ; కోటి = సమూహము; బెగడన్ = భయపడగా; వాల = తోకను; విక్షేప = జాడించుట చేత; దుర్వార = నివారింప రాని; ఝంఝానిల = ప్రచండ మైన గాలి; వశమునన్ = వలన; ఘమఘమ = ఘమఘమ ధ్వనుల తో; ఆవర్తము = సుడి గుండాలు; అడరన్ = అతిశయించగా; కల్లోల = అలల; జాల = సమూహముల; సంఘట్టనంబులన్ = తాకిడికి; తటీ = ఒడ్డున గల; తరులు = చెట్లు; మూలంబులు తో= వేళ్ళ తోసహా; ఐ = అయ్యి; ధరణిన్ = నేల పై; కూలన్ = కూలిపోగా. <br><br>సరసి = మడుగు; లోన్ = లోపల; నుండి = నుండి; పొడగని = జాడ కనిపెట్టి; సంభ్రమించి = వేగిర పడి; ఉదరి = కోపముతో చలించి; కుప్పించి = గెంతి; లంఘించి = దుమికి; హుంకరించి = హు మ్మని అరచి; భానున్ = సూర్యుని; కబళించి = మింగి; పట్టు = పట్టుకొనెడి; స్వర్భాను = రాహువు {స్వర్భానువు - స్వర్గమున ప్రకాశించు వాడు, రాహువు}; పగిదిన్ = వలె; ఒక్క = ఒకానొక; మకర = మొసలి; ఇంద్రుడు = ప్రభువు; ఇభ = గజ; రాజున్ = రాజును; ఒడిసి పట్టె = ఒడుపుగా పట్టుకొనెను. </div> </div> </div> <!--8-54 కరిఁ దిగుచు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-54 కరిఁ దిగుచు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/07.Kari_Diguchu_Makari_Sarasiki.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కరి దిగుచు మకరి సరసికి<br> కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్<br> కరికి మకరి మకరికి గరి<br> భర మన ని ట్లతల కుతల భటు లదిరిపడన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పట్టుకొన్న మొసలి, పట్టుచిక్కిన ఏనుగూ పంతం విడనాడకుండా గుంజుకొంటున్నాయి. ఆరెంటి గుంజులాటను కవి కమనీయంగా వర్ణిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మొసలి ఏనుగును కొలనులోనికి గుంజుకొనిపోతున్నది. భగభగమంటున్న పగ అనే నిప్పుతో ఏనుగు మొసలిని నేలమీదకు లాగుతున్నది. ఈగుంజులాటను నేలపై, నింగిపైనున్న వీరాగ్రేసరులందరూ వింతగ చూస్తున్నారు. కరికి మకరి బరువైపోతున్నది. కాదుకాదు మకరికే కరి బరువైపోతున్నది. అనుకొంటూ ఒక నిర్ణయానికి రాలేక ఊగులాడిపోతున్నారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగు లోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = శౌర్యము; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భార మైనది; అనన్ = అన్నట్లు; ఇట్లు = ఇలా; అతల = అతల లోకపు; కుతల = కుతల లోకపు; భటుల్ = వీరులు; అరుదు పడన్ = ఆశ్చర్యపడగా. </div> </div> </div> <!--8-57 ఆటోపమ్మునఁ జిమ్ము... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-57 ఆటోపమ్మునఁ జిమ్ము... (శార్దూలం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/08.Aatovammuna_Jimmu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఆటోవమ్మున జిమ్ము ఱొ మ్మగల వజ్రాభీల దంతమ్ములన్<br> దాటించున్ మెడ జుట్టి పట్టి హరి దోర్దండాభశుండాహతిన్<br> నీటన్ మాటికి మాటికిం దిగువగా నీరాటము న్నీటి పో<br> రాటం దోటమిపాటు జూపుట కరణ్యాటంబు వాచాట మై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏనుగుల ఏలిక మొసలిపట్టునుండి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. పడరాని పాట్లన్నీ పడుతున్నది. దాని విజృంభణను మన కన్నులకు కట్టిస్తున్నాడు కవీంద్రులు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏనుగుల ఏలిక వజ్రాలవంటి అతి కఠినమైన దంతాలతో ఆ మొసలిని రొమ్ము పగిలే విధంగా కొడుతున్నది. శ్రీమహావిష్ణువు భుజదండవంటి తొండంతో మొసలి మెడను బిగించిపట్టుకొంటున్నది. ఆ మొసలి మాటిమాటికీ శక్తినంతా ఉపయోగించి నీటిలోపలికి గుంజివేస్తున్నది. స్థానబలం ఉండటంవలన మొసలికి ఓడిపోతానేమో అని ఏనుగు పెనుఘీంకారాలతో దిక్కులను ముక్కలు చేస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఆటోపంబునన్ = వేగిరిపాటు తో; చిమ్మున్ = ఎగుర గొట్టును; ఱొమ్ము = వక్షస్థలము; అగలన్ = పగిలి పోవు నట్లు; వజ్ర = పిడుగు వలె; ఆభీల = భయంకర మైన; దంతంబులన్ = దంతములతో; తాటించున్ = కొట్టును; మెడన్ = కంఠమును; చుట్టి పట్టి = చుట్టూ పట్టుకొని; హరి = ఇంద్రుని; దోర్దండ = భుజ దండము; అభ = వంటి; శుండా = తొండము యొక్క; హతిన్ = దెబ్బ చేత; నీటన్ = నీటి లోనికి; మాటికి మాటికిన్ = మరల మరల; తిగువగా = లాగు తుండగ; నీరాటమున్ = మొసలిని {నీరాటము – నీటి యందు చరించునది, మొసలి}; నీటి = నీటి లో చేయు; పోరాటన్ = యుద్ధములో; ఓటమి పాటు = ఓడి పోవుటను; చూపుట = చూపించుట; కున్ = కు; అరణ్యాటంబున్ = ఏనుగు {అరణ్యాటము – అరణ్యములో తిరుగునది, ఏనుగు}; వాచాటము = అరుచు చున్నది; ఐ = అయ్యి. </div> </div> </div> <!--8-59 మకరితోడఁ బోరు... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-59 మకరితోడఁ బోరు... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/50.Makarithoda.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ<br> క్కరుని డించిపోవఁ గాళ్ళు రాక<br> కోరి చూచుచుండెఁ గుంజరీయూథంబు<br> మగలు దగులుగారె మగువలకును.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏనుగుల రాజు, మొసళ్ళరేడు పరమ ఘోరంగా పోరాడుతున్నాయి. గజేంద్రుని పతిగా భావించే ఆడ ఏనుగులు లక్షల సంఖ్యలో అక్కడ దీనంగా చూస్తూ నిలబడ్డాయి. ఆ సందర్భంలో కవి దాంపత్య ధర్మానికి సంబంధించిన ఒక మహా విషయాన్ని పశువుల మీద సమన్వయించి లోకానికి ఒక నీతి తెలియ చేస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏనుగుల మందలకు ఏలిక అయి ఇప్పుడు మొసలిరేనితో పరమ ఘోరంగా పోరాడుతున్నాడు గజరాజు. సాధారణంగా మానవజాతిలో అటువంటి సందర్భాలలో సంబంధం కల వ్యక్తులు తమకేమి ఆపద మూడుతుందో అని తమ దారిన తాము పోతూ ఉంటారు. ఆ గజేంద్రుని భర్తగా సంభావించిన లక్షలకొలదిగా ఉన్న ఆడ ఏనుగులకు మాత్రం తమ దారి తాము చూచుకోవటానికి కాళ్ళు రాలేదు. ఏమైతే అదే అవుతుంది అని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి పతితో ఉండే తగులం అటువంటిది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> మకరి = మొసలి; తోడన్ = తోటి; పోరు = పోరాడు చున్న; మాతంగ విభుని = గజేంద్రుని; ఒక్కరునిన్ = ఒక్కడిని; డించి = విడిచి పెట్టి; పోవన్ = వెళ్ళ పోవుటకు; కాళ్ళు రాక = బుద్ది పుట్టక; కోరి = కావాలని; చూచు చుండెన్ = ఊరక చూచు చున్నవి; కుంజరీ = ఆడ యేనుగుల; యూథంబు = సమూహము; మగలు = భర్తలు; తగులు = బంధనములు; కారె = కారా ఏమి, కదా; మగువలకును = భార్యలకు. మకరి = మొసలి; తోడన్ = తోటి; పోరు = పోరాడు చున్న; మాతంగ విభుని = గజేంద్రుని; ఒక్కరునిన్ = ఒక్కడిని; డించి = విడిచి పెట్టి; పోవన్ = వెళ్ళ పోవుటకు; కాళ్ళు రాక = బుద్ది పుట్టక; కోరి = కావాలని; చూచు చుండెన్ = ఊరక చూచు చున్నవి; కుంజరీ = ఆడ యేనుగుల; యూథంబు = సమూహము; మగలు = భర్తలు; తగులు = బంధనములు; కారె = కారా ఏమి, కదా; మగువలకును = భార్యలకు. </div> </div> </div> <!--8-65 పాదద్వంద్వము నేల... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-65 పాదద్వంద్వము నేల... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/09.Paadadwandwamu_Nela_Mopi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియో<br> న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని<br> ప్ఖేద బ్రహ్మపదావలంబన గతిం గ్రీడించు యోగీంద్రు మ<br> ర్యాద న్నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్ర మై<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మొసలి విజృంభణకు ఏనుగు తల్లడిల్లిపోతున్నది. మకరానికి అంతకంతకూ ఉత్సాహం ఉవ్వెత్తున పొంగిపొరలుతున్నది. నీటిలో మునిగితేలటంలో ఆరితేరిన ఆ మొసలి పరాక్రమాన్ని పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రెండుకాళ్ళనూ గట్టిగా నేలకు తన్నిపట్టి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను గొప్పసాధనతో నిలిపి ఉంచాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే అయుదు ఇంద్రియాల పిచ్చితిరుగుళ్ళను మచ్చిక చేసుకొని తన వశంలో పెట్టుకున్నాడు. బుద్ధి అనే లతకు మాఱాకు తొడిగాడు. అణువంత దుఃఖం కూడాలేని బ్రహ్మపదాన్ని చేరుకొనేదారిలో విహరించే పరమయోగి ఇలా ఉంటాడు. ఇక్కడ మొసలి ఆ యోగీంద్రుని తీరుతెన్నులను మనకు స్ఫురింపజేస్తూ ఏనుగు పాదాలపట్టులో ఏమాత్రమూ సడలింపులేనిదై పరాక్రమిస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> పాద = కాళ్ళు; ద్వంద్వమున్ = రెంటిని; నేలన్ = నేల పైన; మోపి = ఆన్చి; పవనున్ = గాలిని; బంధించి = బిగ పట్టి; పంచేంద్రియ = పంచేంద్రియముల {పంచేంద్రియములు - 1కళ్ళు 2ముక్కు 3నాలుక 4చెవులు 5చర్మము}; ఉన్మాదంబున్ = స్వేచ్ఛా విహారమును; పరి మార్చి = అణచి వేసి; బుద్ధి = బుద్ధి యనెడి; లత = తీవె; కున్ = కు; మాఱాకు = తీగ చిగురించుట ఆధారము; హత్తించి = కలిగించి; నిష్ఖేద = విచారము లేని; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; పదా = స్థానమును; అవలంబన = అవలంభించు; గతిన్ = విధముగా; క్రీడించు = విహరించు; యోగి = యోగి; ఇంద్రున్ = శ్రేష్ఠుని; మర్యాదన్ = విధముగా; నక్రము = మొసలి; విక్రమించెన్ = పరాక్రమించినది; కరి = ఏనుగు యొక్క; పాద = పాదములను; ఆక్రాంతిన్ = ఆక్రమించు కొనుటలో; నిర్వక్రము = అడ్డు లేనిది; ఐ = అయ్యి. </div> </div> </div> <!--8-71 ఏ రూపంబున... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-71 ఏ రూపంబున... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/10.Yerupambuna_Deeni_Gelthu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఏ రూపంబున దీని గెల్తు, నిటమీ దే వేల్పు చింతిం తు, నె<br> వ్వారిం జీరుదు? నెవ్వ రడ్డ? మిఁక నివ్వారిప్రచారోత్తమున్<br> వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపారపారాయణుల్<br> లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొ ఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజరాజు మహాశక్తితో ఆ జలగ్రహంతో పెక్కేండ్లు పోరాడినది. దేహశక్తి సన్నగిల్లిపోతున్నది. తన పగవానిబలం పెరిగిపోతున్నది. దీనిని గెలవటం అసాధ్యం అనుకొన్నది. అప్పుడు దానికి పూర్వపుణ్యం వలన దివ్యజ్ఞానం పెల్లుబికి వచ్చింది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నది </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఈ మొసలిని ఏరూపంతో నేను గెలుస్తాను? ఇకపైన ఏ దేవతను తలచుకుంటాను? ఎవ్వరిని ఆశ్రయిస్తాను? ఎవరితో మొరపెట్టుకుంటాను? నాకూ ఈ మొసలికీ అడ్డపడి నన్ను రక్షించేవారెవ్వరు? దీనిని నిలువరించేవారెవ్వరు? ఎటువంటి అలవికాని పనినైనా అలవోకగా చేసి ఆశ్రయించినవారి ఆర్తిని పోగొట్టే దీక్షగల మహాపుణ్యాత్ములు, దిక్కుమాలినవారి మొరలను చెవినిపెట్టే మహాత్ములు లేరా? ఉంటే వారికి మ్రొక్కుతాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఏ = ఏ; రూపంబునన్ = రీతిగా; దీనిన్ = దీనిని; గెల్తున్ = జయించెదను; ఇట మీద = ఇక పైన; ఏ = ఏ; వేల్పున్ = దేవుడిని; చింతింతున్ = ప్రార్థించెదను; ఎవ్వారిన్ = ఎవరిని; చీరుదున్ = పిలిచెదను; ఎవ్వరు = ఎవరు; అడ్డము = శరణము; ఇక = ఇంక; ఈ = ఈ; వారి ప్రచారోత్తమున్ = మొసలిని {వారి ప్రచారోత్తము - వారి (నీటి) యందు ప్రచార (తిరిగెడి) ఉత్తము, మొసలి}; వారింపన్ = అడ్డగించుటకు; తగు = తగినట్టి; వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అఖిల = సమస్త మైన; వ్యాపార = కార్యముల లోను; పారయణుల్ = నేర్పరులు; లేరే = లేరా; మ్రొక్కెదన్ = కొలిచెదను; దిక్కుమాలిన = నిరాశ్రయుడ నై; మొఱ = మొర పెట్టగా; ఆలింపన్ = వినుటకు; ప్ర = విశేష మైన; పుణ్యాత్మకుల్ = పుణ్యవంత మైన ఆత్మ గల వారు. </div> </div> </div> <!--8-72 నానానేకప యూథముల్... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-72 నానానేకప యూథముల్... (శార్దూలం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/11.Nananekapa_Yudhamul.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స<br> న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండ నై యుండి మ<br> ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండలే<br> కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లోకదే, ఈశ్వరా! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏనుగునకు తన వెనుకటి వైభవం గుర్తుకువచ్చింది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొని ఇక్కడికి రావటం తన బుద్ధిలేనితనం అనుకుంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నేను ఎంతగొప్పవాడను! మహారణ్యంలో పెక్కుఏనుగుల గుంపులు నన్ను మన్ననతో సేవిస్తూ ఉంటాయి. నాసుఖ భోగాలకు ఇష్టపడి నన్ను ఆనందింపజేస్తున్న ఆడఏనుగులు పదిలక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నాఒడలినుండి వెలువడే మదజలంతో ఏపుగా పెరిగిన, తీగలల్లుకొన్న మంచిగందపు చెట్ల నీడలలో నేను విలాసంగా, వినోదంగా తిరుగుతూ ఉండవచ్చు. కానీ కర్మప్రాబల్యంవల్ల అక్కడ ఉండలేక దప్పిక తీర్చుకోవటానికి ఇక్కడకు ఎందుకు వచ్చిపడ్డాను? ఈశ్వరా! గుండెలో గుబులు కలుగుతున్నదయ్యా </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నానా = అనేక మైన; అనేకప = ఏనుగుల; యూథముల్ = సమూహములు; వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించు చుండగ; దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; ఐ = అయ్యి; ఉండి = ఉండి; మత్ = నా యొక్క; దానా = మద; అంభస్ = జలము చే; పరి పుష్ట = చక్కగా పెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవ లందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లేక = లేక పోయి; ఈ = ఈ; నీర = నీటి పైని; ఆశన్ = ఆశ తో; ఇటు = ఈ వైపునకు; ఏల = ఎందుకు; వచ్చితిన్ = వచ్చితిని; భయంబు = భయ మేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; ఈశ్వరా = భగవంతుడా. </div> </div> </div> <!--8-73 ఎవ్వనిచే జనించు... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-73 ఎవ్వనిచే జనించు... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/12.Yevvaniche_Janinchu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీన మై;<br> యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం<br> బెవ్వఁ; డనాది మధ్య లయుఁ డెవ్వఁడు; సర్వముఁ దాన యైన వాఁ<br> డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రునకు గుండె నిలువటంలేదు. అయినా పూర్వపుణ్యఫలంవలన దివ్యజ్ఞాన సంపద అమృతపు బుగ్గలాగా పొంగుకొనివస్తున్నది. పరమాత్మ చైతన్యం అంతరాంతరాలలో పరవళ్ళు త్రొక్కుతున్నది. దానివలన వెలువడే పలుకులు ఉపనిషత్తులను తలపింపజేస్తున్నాయి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఈ జగత్తు అంతా ఏ పరమాత్మవలన పుట్టినదో, ఎవనిలోపల భద్రంగా వేరుచేయటానికి వీలుకాకుండా ఉంటుందో, చివరకు ఎవనిలో లయమైపోతుందో, ప్రభువులకు కూడా ప్రభువై పాలించే మహాత్ముడు ఎవడో, సర్వమునకు మొట్టమొదటి కారణం ఎవడో, మొదలు, నడుమ, చివర అనే దశలు ఎవనికి ఉండవో, సర్వమూ తానే అయినవాడెవడో అట్టి ఈశ్వరుని, అవసరాన్నిబట్టి తనంతతాను అవతరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన చేసే ఆ పరమాత్మను నాకు రక్షకుడై రావలసినదని ప్రార్థిస్తూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = అందు; ఉండున్ = ఉండునో; లీనము = కలిసి పోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము ఐపొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణ భూతుడు; ఎవ్వడు = ఎవడో; అ నాది మధ్య లయుడు = ఆది మ ధ్యాంతములు లేని వాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నా యొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను. </div> </div> </div> <!--8-74 ఒకపరి జగములు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-74 ఒకపరి జగములు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/13.Okapari_Jagamulu_Velinidi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఒకపరి జగములు వెలినిడి<br> యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దా నై<br> సకలార్థ సాక్షి యగు న<br> య్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రుని హృదయంలో ఉపనిషత్తుల దివ్యజ్ఞానం కదలాడుతున్నది. అతని సుకృతం పండి మొసలిపట్టు అతనికి ఆర్తిని కలిగించింది. దానితో అద్భుత వేదాంత రహస్యాలు అతనినోటినుండి వెలువడుతున్నాయి </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరమాత్మ ఈ జగములనన్నింటినీ ఒకమారు వెలుపలికి తెస్తూ ఉంటాడు. మరొకమారు అల్లిన గూటిని సాలెపురుగులాగా, లోపలికి తీసుకుంటూ ఉంటాడు. ఆవిధంగా వెలుపలికి వచ్చిన ప్రపంచమూ తానూ ఒకటే అయిపోతాడు. ఈ ఆటకు తన బాధ్యత ఏమీలేకుండా కేవలం సాక్షిగా అంటుసొంటులు లేనివాడై అలరారుతూ ఉంటాడు. జీవులందరికీ ఆదికారణం అయిన ఆ పరమాత్మను స్మరిస్తూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఒక పరి = ఒక సారి; జగములు = లోకములను; వెలి నిడి = బయట పెట్టి, సృష్టించి; ఒక పరి = ఒక సారి; లోపలికిన్ = తన లోపలికి; కొనుచున్ = లయము చేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; ఐ = అయ్యి; సకల = సమస్త మైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగ చూచు వాడు; అగున్ = అయి నట్టి; ఆ = ఆ; అకలంకున్ = దోషములు లేని వానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను; </div> </div> </div> <!--8-75 లోకంబులు లోకేశులు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-75 లోకంబులు లోకేశులు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/14.Lokambulu_Lokesulu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> లోకంబులు లోకేశులు<br> లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం<br> జీకటి కవ్వల నెవ్వడు<br> నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అది ఒకగొప్పవెలుగు. అయితే దానిని గుర్తించటం చాలా కష్టం. కానీ గుర్తించి తీరాలి. ఎందుకంటే దానికంటె వేకొకటి లేదు అంటున్నది గజేంద్రం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకానికి కొంత కాలపరిమితికి లోబడి ఒక పాలకుడు ఉంటాడు. అటువంటి లోకేశులు ఎందరు వచ్చి వెళ్ళిపోయారో! ఇంకా ఎందరు రానున్నారో? ఇక ఆ లోకాలలో ఏర్పడి, కొంతకాలం ఉండి, మళ్ళీ అంతరించిపోతున్న జీవకోట్లు ఎన్ని కోట్లకోట్ల సంఖ్యలో ఉన్నారో! ఆ లోకాలూ, ఆ లోకపాలకులూ, ఆ లోకంలోనివారూ పరమత్మలాగా శాశ్వతంగా ఉండరు. లయమై పోతారు. ఆపని అయిన తరువాత ఏమీ ఉండదు. దానినే ‘అలోకం’ అంటారు. ఆ లోకం పెద్దవెలుగు. అలోకం పెనుచీకటి. దానికి ఆవలివైపున ఒక మహావ్యక్తి, ఒక మహాశక్తి, చెక్కుచెదరని ఆకారంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. అలా ఉన్న పరమాత్ముణ్ణి నేను సేవించుకుంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలను పాలించే వారు; లోకస్థులు = లోకములలో నుండు వారు; తెగిన = నశించిన తరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండ మైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; నేన్ = నేను; సేవింతున్ = కొలచెదను. </div> </div> </div> <!--8-76 నర్తకునిభంగిఁ బెక్కగు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-76 నర్తకునిభంగిఁ బెక్కగు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/15.Narthakuni_Bhangi_Pekkagu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నర్తకుని భంగిఁ బెక్కగు<br> మూర్తులతో నెవ్వఁ డాడు? మునులుఁ దివిజులున్<br> గీర్తింప నేర? రెవ్వని<br> వర్తన మొరు లెఱుఁగ? రట్టి వాని నుతింతున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులూ, ఎన్నెన్నో పదార్థాలూ మనకు కానవస్తున్నాయి. తత్త్వదృష్టితో గమనిస్తే ఆ వ్యక్తులందరూ, ఆ పదార్ధాలు అన్నీఆ పరమాత్మయే. నా ఆర్తిని అంతంచేసి నన్ను కాపాడే ఆ స్వామిని నేను కొనియాడతాను. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ పరమాత్మ ఎన్నివేషాలయినా వేసి రక్తి కట్టింపగల మహానర్తకుడు. ఏక్షణాన ఏరూపంతో, ఏవిధంగా ఆడుకుంటాడో, తపస్సంపన్నులయిన మునులూ, పుణ్యాలపంట పండించుకొని దేవలోకంలో సుఖంగా తిరుగుతున్న దేవతలూ కూడా తెలుసుకోలేరు. అతని తీరుతెన్నులు ఈవిధంగా ఉంటాయి అని ఎవరూ కొనియాడలేరు. అట్టి పరమత్ముని నాకు తెలియవచ్చినవిధంగా స్తోత్రం చేస్తాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నర్తకుని = నటుని; భంగిన్ = వలె; పెక్కు = అనేక మైనవి; అగు = అయిన; మూర్తుల్ = రూపముల; తోన్ = తోటి; ఎవ్వడు = ఎవ రైతే; ఆడున్ = నడిపిస్తుంటాడో; మునులు = ఋషులు; దివిజులున్ = దేవతలు; కీర్తింపన్ = స్తుతించుటకు; నేరరు = సరిపోరో; ఎవ్వనిన్ = ఎవని; వర్తనమున్ = ప్రవర్తనలను; ఒఱులు = ఇతరులు; ఎఱుగరు = తెలియరో; అట్టి = అటువంటి; వానిన్ = వానిని; నుతింతున్ = సంస్తుతించెదను. </div> </div> </div> <!--8-86 కలఁ డందురు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-86 కలఁ డందురు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/16.Kalanduru_Deenulayeda.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కలఁ డందురు దీనుల యెడఁ<br> గలఁ డందురు పరమయోగి గణములపాలం<br> గలఁ డందు రన్ని దిశలను<br> గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆర్తిలో నిలువెల్లా మునిగినవానికి అన్నీ అనుమానాలే. ‘ఉన్నాడు’ అనుకొన్నవాడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహం కలిగింది గజేంద్రునికి. దానినే అతడు ఇలా చెప్పుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ పరమాత్మ దిక్కులేని దీనులపట్ల ఉంటాడు అని తత్త్వం తెలిసినవారు విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అలాగే పరమమైన యోగసాధన చేసి ఫలసిద్ధి పొందిన యోగుల సముదాయాల సంరక్షణకోసం ‘ఉన్నాడు’ అంటారు. అన్ని దిక్కులందూ ప్రతి అణువులోనూ ‘ఉన్నాడు’ అంటారు. కానీ అలా ఉన్నాడు, ఉన్నాడు అనే భావనలో తిరుగాడే ఆ స్వామి నిజంగా ఉన్నాడో, లేడో! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమ మైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనె టటువంటి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో. </div> </div> </div> <!--8-87 కలుగఁడే నా పాలి... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-87 కలుగఁడే నా పాలి... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/17.Kalugade_Naapali_Kalimi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ; గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?<br> నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ; బడిన సాధుల కడ్డపడెడు వాఁడు?<br> చూడఁడే నా పాటుఁ చూపులఁ జూడకఁ; జూచువారలఁ గృపఁ జూచువాఁడు?<br> లీలతో నా మొ ఱాలింపఁడే మొఱఁగుల; మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> నఖిల రూపముల్ దనరూప మైనవాఁడు<br> నాది మధ్యాంతములు లేక యడరువాఁడు<br> భక్తజనముల దీనుల పాలివాఁడు<br> వినడె, చూడడె, తలపడె, వేగరాడె!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రునకు మెల్లమెల్లగా తన సంరక్షునియందు నమ్మకం కలుగుతున్నది. కానీ ఆ పరమాత్మ తనను ఆదుకోవటానికి ఎందుకు రావటంలేదు అని ఆరాటం పెరిగిపోతున్నది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ పరమాత్మ నాపట్ల ఉన్నాడా అని సందేహిస్తున్నాను. నిజానికి ఆయనకు ఉండటమూ, లేకుండటమూ లేదు. మరెందుకు వచ్చి నన్ను రక్షింపడు? ఇతరులకు పీడించటమే శీలం అయిన వారి పాలబడిన సజ్జనులకు అడ్డంగా నిలిచి రక్షించేస్వామి నాకు అడ్డపడరాడేమిటి? లోపలిదృష్టితో చూడగలిగిన యోగులను, భక్తులను కృపతో చూచే దయాశీలి నాపాటు చూడడేమి? మోసగాళ్ళ ఆర్తనాదాలు వినికూడా గుట్టుగా ఉండి మంచివారిని మాత్రమే కాపాడే ఆ దేవుడు నామొఱలు ఆలకింపడేమి? సృష్టిలో ఉన్న అన్ని రూపాలూ తన రూపాలే అయినవాడు, ఆదిమధ్యాంతములు లేక వెలుగొందేవాడు. భక్తజనములయెడలా, దీనులయెడలా అండగా నిలిచేవాడు అయిన ఆపరమాత్మ వినడేమి? కనడేమి? నన్నుగూర్చి పట్టించుకోడేమి? వడివడిగా రాడేమి? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కలుగడే = సహాయముగా రా డేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయ పడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయ పడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కి నట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డ పడెడి = సహాయ పడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచు వారలన్ = తననే చూచు వారిని; కృపన్ = దయతో; చూచు వాడు = చూచెడి వాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తనను తానే; మొఱగు = మరచు; వాడు = వాడు. <br><br>అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్త జనములన్ = భక్తు లైన వానిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి. </div> </div> </div> <!--8-90 లావొక్కింతయు లేదు... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-90 లావొక్కింతయు లేదు... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/18.Lavokkinthayu_Ledu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలం బయ్యెఁ; బ్రాణంబులున్<br> ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమం బయ్యెడిన్;<br> నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;<br> రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రుడు పరిపరివిధాలైన భావాలకు లోనవుతున్నాడు. చిట్టచివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. దానిమీద స్థిరంగా నిలిచి తన బాధ వింటున్న ఆ శ్రీమహావిష్ణువుతో ఇలా అంటున్నాడు. - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఈశ్వరా! ఇంక నాలో సత్తువ కొంచెం కూడా లేదు. ధైర్యం చెల్లాచెదరైపోయింది. ప్రాణాలు ఏక్షణానైనా జారిపోయేవిధంగా తమతమ తావులనుండి వెలుపలికి వచ్చాయి. మూర్ఛ వస్తున్నది. శరీరం బడలిపోయింది. అలసట నిలువెల్లా ఆక్రమించింది. నన్ను కాపాడేవాడవు నీవు కాక మరొకరు లేరు. ఇటుగాని అటుగాని ఏదీ నాకు తెలియరాకున్నది, స్వామీ!. దీనుణ్ణి. నన్ను మన్నించిరావయ్యా! రా! నీవు భక్తులు కోరిన వరాలిచ్చేవాడవు గదా! నన్ను కాపాడు. భద్రాత్మకా! నన్ను సంరక్షించు, స్వామీ!. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానముల నుండి; తప్పెన్ = చలించి పోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వచ్చేస్తోంది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసి పోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతః పరంబు = మ రింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగిన వాడను; దీనునిన్ = దీనావస్థ నున్న వాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడి వాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తా నైన వాడ. </div> </div> </div> <!--8-92 ఓ కమలాప్త... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-92 ఓ కమలాప్త... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/19.O_!_Kamalaptha_O_!_Varada.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్ష విపక్షదూర! కు<br> య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో! శరణాగ తామరా<br> నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విపులప్రభావ! రా<br> వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గావవే!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రుడు ఎలుగెత్తి ఆక్రోశిస్తున్నాడు. స్వామి మహాగుణాలను సంభావిస్తూ పిలుస్తున్నాడు. తననే రక్షకునిగా సంభావిస్తున్న సంగతిని ఆయనకు నివేదించుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! కమలాపతీ! అందరికీ కోరిన వరాలిచ్చే కరుణాశాలివి. పగవారిని కూడా పగవారుగా భావింపని దయామయా! గొప్పమేధాబలంగల యోగులు కూడా నిన్ను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. నీ గుణాలన్నీ సద్గుణాలే. వానివలన నీవు పురుషోత్తముడవయ్యావు కదయ్యా! శరణు కోరివచ్చిన వారికి నీవు కల్పవృక్షానివి. మునిశ్రేష్ఠుల మనస్సులను హరించేవాడవు. నీ ప్రభావానికి ఎటువంటి ఎల్లలూ లేవు. రా తండ్రీ! నన్ను కరుణించు. ఒక్కసారి నన్ను ‘వీడు నావాడు’ అనుకో. రక్షణ కోరి నిన్నాశ్రయించిన నన్ను కాపాడు,స్వామీ! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఓ = ఓ; కమ లాప్త = నారాయణ {కమ లాప్తుడు - కమల (లక్ష్మీదేవికి) ఆప్తు డైన వాడు, విష్ణువు}; ఓ = ఓ; వరద = నారాయణ {వరదుడు - వరములను ఇచ్చు వాడు, విష్ణువు}; ఓ = ఓ; ప్రతిపక్ష విపక్ష దూర = నారాయణ {ప్రతిపక్ష విపక్ష దూరుడు - ప్రతిపక్ష (శత్రు పక్షము) యందును విపక్ష (వైరము) విదూరుడు (లేని వాడు), విష్ణువు}; కుయ్యో = అమ్మో; కవి యోగి వంద్య = నారాయణ {కవి యోగి వంద్యుడు – కవుల చేతను యోగుల చేతను వంద్యుడు (కీర్తింప బడు వాడు), విష్ణువు}; సుగుణోత్తమ = నారాయణ {సుగుణోత్తముడు – సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు}; ఓ = ఓ; శరణాగ తామ రానోకహ = నారాయణ {శరణాగ తామ రానోకహ - శరణాగత (శరణు వేడిన వారికి) అమర (దేవ, కల్ప) అనోకహ (వృక్షము వంటి వాడు), విష్ణువు}; ఓ = ఓ; మునీశ్వర మనోహర = నారాయణ {మునీశ్వర మనోహరుడు - మునీశ్వరుల మనసులను హర (దొంగిలించిన వాడు), విష్ణువు}; ఓ = ఓ; విమల ప్రభావ = నారాయణ {విమల ప్రభావుడు - విమల (స్వచ్ఛ మైన) ప్రభావుడు (మహిమ గల వాడు), విష్ణువు}; రావే = రమ్ము; కరుణింపవే = దయ చూపుము; తలపవే = భావించుము; శరణార్థిని = శరణు కోరెడి వాడను; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము. </div> </div> </div> <!--8-94 విశ్వమయత లేమి... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-94 విశ్వమయత లేమి... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/20.Viswamaytha_Lemi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> విశ్వమయత లేమి వినియు నూరక యుండి<br> రంబుజాసనాదు లడ్డపడక<br> విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు<br> భక్తియుతున కడ్డపడఁ దలంచి.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గజేంద్రుడు ఆర్తభక్తుడు, సుకృతి. తనగోడు తన స్వామికి అరమరికలు లేకుండా విన్నవించుకుంటున్నాడు. అతని మొర అచ్యుతునికి వినిపించింది. అచ్యుతుడు మాత్రమే పట్టించుకున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరమాత్మ అయిన విష్ణువొక్కడే విశ్వమయుడు. అంటే విశ్వమంతా తానే అయి ఉన్నవాడు. అటువంటిస్థితి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనవారికి లేదు. అందువలన ఆ గజేంద్రుని ఆర్తనాదం విని కూడా వారు అతనికి అడ్డపడక ఊరక ఉండిపోయారు. విశ్వమయుడైన విష్ణువు మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ, ఏరూపం కావాలంటే ఆ రూపంతో ఏర్పడగలవాడు కనుక, ఎల్లవేళలా జయమే పొందగలవాడు కనుక తనయందు అచంచలమైన భక్తిగల ఆ గజేంద్రుణ్ణి కాపాడదలచుకున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> విశ్వ = జగత్తు యంతయును; మయత = నిండి యుండుట; లేమిన్ = లేకపోవుట చేత; వినియున్ = వి న్నప్పటికిని; ఊరక = స్పందించ కుండగ; ఉండిరి = ఉన్నారు; అంబు జాసన = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగు వారు; అడ్డ పడక = సాయ పడకుండ; విశ్వ మయుడు = నారాయణుడు {విశ్వ మయుడు – జగ త్తంతను నిండి యున్న వాడు, హరి}; విభుడు = నారాయణుడు {విభుడు – వైభవము గల వాడు, హరి}; విష్ణుండు = నారాయణుడు {విష్ణువు – విశ్వమున వ్యాపించిన వాడు, హరి}; జిష్ణుండు = నారాయణుడు {జిష్ణుడు – జయించు శీలము గల వాడు, హరి}; భక్తి యుతున్ = భక్తి గల వాని; కిన్ = కి; అడ్డ పడ = సాయ పడవలె నని; తలచి = భావించి. </div> </div> </div> <!--8-95 అల వైకుంఠపురంబులో... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-95 అల వైకుంఠపురంబులో... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/21.Ala_Vaikuntha_Purambulo.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా<br> పల మందార వనాంత రామృతసరఃప్రాం తేందుకాం తోప లో<br> త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి<br> హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గు య్యాలించి సంరంభి యై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఇప్పుడు మీరు ఆస్వాదించబోయే ఆణిముత్యంలాంటి ఈ పద్యం శ్రీమహాభాగవతం లోని "గజేంద్రమోక్షణం" లోనిది. గజరాజు మొసలి కోరలలో చిక్కుకుని తన శక్తియుక్తులన్నీ వినియోగించి దానిని విదళించి, విసిరికొట్టి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ధైర్యం చెదరిపోయి, ప్రాణాలు గూళ్ళనుండి జారిపోతున్న సమయంలో అతనికి పరమాత్మ గుర్తుకు వచ్చారు. పూర్వజన్మ సంస్కారంతో స్వామిని తనివితీరా స్తుతించాడు. "శరణార్ధినయ్యా, నన్ను కాపాడు" అని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆర్తనాదం చేశాడు. అప్పుడు - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామి ఎక్కడో వైకుంఠపురం లో ఉన్నారు. అందులోనూ అందరికీ అందుబాటులో ఉండని అంతఃపురంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఉండే భవనం చాలా లోపలగా ఉంటుంది. దానికి ఎడమ వైపుగా ఒక మందారాల పూల తోట, ఆ లోపల ఒక అమృతపు కొలను, దానికి ఆనుకుని చంద్రకాంత మణుల అరుగు, దాని నిండా నల్లకలువలు పరచుకుని ఉన్నాయి. అదిగో, అక్కడ దానిమీద స్వామి తన ప్రాణప్రియ రమాదేవితో వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఆపదలలో చిక్కుకుని దిక్కులేక అలమటిస్తున్న భక్తులయందు ప్రసన్న భావంతోనే ఉంటారు కదా! అలవికాని దుఃఖంతో, అదుపు తప్పిన అవయవాలలో తల్లడిల్లి పోతున్న ఆ గజరాజు 'కుయ్యి' ఆలకించి ఇక దేనినీ పట్టించుకోని తొందరతనంతో బయలుదేరారు శ్రీమహావిష్ణువు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పురము; లోన్ = అందు; నగరి = రాజభవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత; ఉపల = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పు పై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించుచున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో ఉన్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెందినట్టి {విహ్వలము – భయాదుల చేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అనుచు; కుయ్యాలించి = మొర విని; సంరంభి = వేగిర పడుతున్న వాడు; ఐ = అయ్యి. </div> </div> </div> <!--8-96 సిరికిం జెప్పఁడు... (మత్తేభం)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-96 సిరికిం జెప్పఁడు... (మత్తేభం)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/22.Sirikinjeppadu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే<br> పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం<br> తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోద్ధతశ్రీకుచో<br> పరి చేలాంచల మైన వీడడు గజ ప్రాణావనోత్సాహి యై<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> స్వామి సద్భక్తుణ్ణి సంరక్షించటానికి బయలుదేరాడు. ఆపదలో చిక్కుకొన్న అర్భకుణ్ణి కాపాడి అక్కున చేర్చుకోవటానికి ఆరాటపడే అమ్మలా బయలుదేరాడు. అక్కడ దేనితో ఏమి పనిపడుతుందో అనే ఆలోచన కూడా ఆయనకు కలుగలేదు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తన ప్రియకాంత శ్రీదేవికి చెప్పలేదు. అక్కడ అవసరమవుతాయేమో అని రెండు చేతులలో శంఖాన్నీ, చక్రాన్నీ కూర్చుకోలేదు. ఎవ్వనితో ఏమి పనిపడుతుందో అనుకొని సేవకుల నెవ్వరినీ రండయ్యా! నాతో రండి అని పిలువలేదు. ఎంతదూరమో ఎలా పోవాలో అని తన వాహనమైన గరుత్మంతుణ్ణి సిద్ధం చేసికోలేదు. చెవి కమ్మలమీద చీకాకు కలిగిస్తూ చెదరిపడుతున్న కేశపాశాన్ని ముడివేసుకోలేదు. ఆర్తునిపొలికేక వినకముందు అమ్మవారితో ఆడుకుంటూ వినోదపు కలహంలో చేత చిక్కించుకొన్న ఆమె వక్షస్థలం మీది వస్త్రం అంచును కూడా వదలిపెట్టలేదు. గజరాజుప్రాణాలను కాపాడాలి అనే ఉత్సాహం ఒక్కటే సర్వమూ అయిన ఆ స్వామి పరుగులు తీస్తున్నాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుట లేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవి దుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమిల్లమున్ = జుట్టు ముడిని; చక్క నొత్తడు = చక్కదిద్ధు కొనుట లేదు; వివాద = ప్రణయ కలహము నందు; ప్రోద్దత = పట్టు కొన్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీర కొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; ఆవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కల వాడు; ఐ = అయ్యి. </div> </div> </div> <!--8-98 తనవెంటన్ సిరి... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-98 తనవెంటన్ సిరి... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/23.Thanaventan_Siri.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె<br> న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ<br> క్ర నికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు దా వచ్చి రొ<br> య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆర్తుని రక్షణయే ధ్యేయంగా పరుగులు తీస్తున్న స్వామి చెప్పకపోతే ఏమి? కావలసిన కార్యమంతా చక్కగా జరిగిపోతుంది. స్వామిచిత్తం ఎరిగిన అందరూ, అన్నీ ఆయనవెంట అప్రయత్నంగా అంగలు వేసుకుంటూ బయలుదేరటాన్ని పోతనగారు అతి రమణీయంగా మనకు తెలియజేస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామి అలా బయలుదేరాడో లేదో ఎప్పుడూ విడచి ఉండని లక్షీదేవి వెంటబడింది. ఆమె వెనుక అంతఃపురంలోని అంగనామణులందరూ బయలుదేరారు. వారిని చూచి పక్షిరాజు గరుత్మంతుడు దూకుకుంటూ వస్తున్నాడు. అతనిననుసరించి శాఙ్గమనే విల్లూ, కౌమోదకి అనే గదా, పాంచజన్యమనే శంఖమూ, సుదర్శనమనే చక్రమూ మొదలైనవన్నీ వరుసలో నిలిచి ఉరకలు వేస్తున్నాయి. నిరంతరమూ నారాయణ స్మరణతో ఆనందం పొంగులెత్తే అంతరంగం గల నారదుడు వచ్చి చేరాడు. సేనాపతి విష్వక్సేనులవారు చేరుకున్నారు. ఇంక చెప్పేదేముంది? వీరందరినీ చూచి వైకుంఠపురంలో ఉన్న పసిపిల్లలు మొదలుకొని గోవులను కాచుకొనే గోపాలుర వరకూ అందరూ గజేంద్రుడున్న తావునకు తరలివచ్చారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తన = అతని; వెంటన్ = వెనుక; సిరి = లక్ష్మీదేవి; లచ్చి = లక్ష్మీదేని; వెంటన్ = వెనుక; అవరోధ = అంతఃపుర స్త్రీ; వ్రాతమున్ = సమూహమును; దాని = వాని; వెన్కనున్ = వెనుక; పక్షీంద్రుడు = గరుత్మంతుడు {పక్షీంద్రుడు - పక్షులకు ఇంద్రుడు (ప్రభువు), గరుడుడు}; వాని = అతని; పొంతను = పక్కనే; ధనుస్ = విల్లు {విష్ణుమూర్తి - ఆయుధములు 1ధనుస్సు శార్ఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము}; కౌమోదకీ = కౌమోదకి యనెడి గద; శంఖ = శంఖము; చక్ర = చక్రముల; నికాయంబునున్ = సమూహము; నారదుండు = నారదుడు; ధ్వజినీ కాంతుండు = విష్వక్సేనుడు {ధ్వజినీకాంతుండు - (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు}; తాన్ = వారు; వచ్చిరి = వచ్చిరి; ఒయ్యన = శ్రీఘ్రముగ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబునన్ = పట్టణము నందు; కలుగు = ఉండెడి; వారు = వారు; ఆబాలగోపాలమున్ = సర్వులును. </div> </div> </div> <!--8-100 తన వేంచేయు... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-100 తన వేంచేయు... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/24.Thana_Vencheyu_Padambu_Perkona.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తన వేంచేయు పదంబు పేర్కొన, డనాథ స్త్రీ జనాలాపముల్<br> వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?<br> దనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో? భక్తులం<br> గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బయలుదేరిందికానీ అమ్మవారి అంతరంగంలో అనేకమైన ఆలోచనలు. ఎక్కడికి, ఏ పనిమీద, ఎంత దూరం పోవాలి? అనే భావపరంపర ఆమెను నిలువనీయటం లేదు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నా స్వామి తాను ఎక్కడికిపోతున్నాడో చెప్పలేదు. దిక్కులేని అబలల ఆర్తనాదాలు చెవిని పడ్డాయేమో! నిలువెల్లా విషమే అయిన నీచులు దొంగలై వేదరాశులను దొంగిలించారేమో! రక్కసిమూకలు దేవతల రాజగృహాలమీద దండెత్తినవేమో! పాడుబుద్ధిగల వివేకహీనులు భక్తులను చూచి, చక్రం చేతబట్టి ఏదో అద్భుతాలు చేస్తాడంటున్నారే ఆ బోడిచక్రాయుధుడు ఎక్కడ ఉన్నాడో చూపండిరా అని ధిక్కరించి పలుకుతున్నారేమో! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తన = తను; వేం చేయు = వెళ్ళు తున్న; పదంబున్ = చోటును; పేర్కొనడు = చెప్పుట లేదు; అనాథ = దిక్కు లేని; స్త్రీ = మహిళ లైన; జన = వారి; ఆలాపముల్ = మొరలను; వినెనో = విన్నాడేమో; మ్రుచ్చులు = దొంగలు; మ్రుచ్చలించిరో = దొంగతనముచేసి రేమో; ఖలుల్ = నీచులు; వేద = వేదములు; ప్రపంచంబులన్ = సమస్తమును; దనుజ = రాక్షస; అనీకము = మూకలు; దేవతా నగరి = అమరావతి {దేవతా నగరి - దేవతల రాజధాని, అమరావతి}; పైన్ = మీదికి; దండెత్తెనో = యుద్దమునకు వెళ్ళా రేమో; భక్తులన్ = భక్తులను; కని = చూసి; చక్రాయుధుడు = విష్ణుమూర్తి {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}; ఏడీ = ఎక్కడ ఉన్నాడు; చూపుడు = చూపించండి; అని = అని; ధిక్కరించిరో = దబాయించి రేమో; దుర్జనులు = దుష్టులు. </div> </div> </div> <!--8-103 అడిగెద నని... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-103 అడిగెద నని... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/25.Adigedanani_Kaduvadi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అడిగెద నని కడువడిఁ జను<br> నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్<br> వెడ వెడ సిడిముడి తడఁబడ<br> నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీమహాలక్ష్మికి చిత్తం చెదరిపోతున్నది. స్వామి సంరంభం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ తనతో అయ్యే పనిఏదైనా ఉంటే చేయటానికి నడుముకట్టాలి కదా! అందుకని తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నది. ఆ ఆరాటాన్ని అద్భుతమైన అక్షరాల చిత్రంతో మనకందిస్తున్నారు పోతనామాత్యులవారు. . </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయననే అడిగివేస్తాను అని ఆయనకంటె కొంచెం వడినిపెంచి ముందుకు పోతున్నది. ఇంతలోనే యీ మహానుభావుడు తనవైపు తిరిగి సావధానంగా చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతున్నది. మనస్సంతా గందరగోళంగా ఉన్నది. అడుగులు తడబడుతున్నాయి. అడుగువేయాలి అని అనుకోవటమే కానీ అడుగు ముందుకుపడటంలేదు. కాళ్ళల్లో కదలిక లేని స్థితి ఏర్పడుతున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అడిగెదన్ = అడిగేస్తాను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగి నప్పటికిని; తను = అతను; మగుడ = మారు పలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడ వెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగులు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగులు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో. </div> </div> </div> <!--8-104 నిటలాలకము లంటి... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-104 నిటలాలకము లంటి... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/26.Nitalaalakamulanti.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నిటలాలకము లంటి నివుర జుం జుమ్మని; ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;<br> నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన జేరి; యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;<br> శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;దాకినీ పాఠీనలోక మెగుచు;<br> మీనపంక్తుల దాఁట మొయిదీఁగతో రాయ; శంపాలతలు మింట సరణిఁ గట్టు;<br> <br> <b>(ఆటవెలది) </b><br> <br> శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ<br> కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వు చూపు;<br> మెలఁత మొగులు పిఱిఁది మెఱుఁగుఁ దీగెయుఁ బోలె<br> జలదవర్ణు వెనుకఁ జరుగు నపుడు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> లోకమాత లక్షీదేవి స్వామి వెన్నంటిపోతూ అష్టకష్టాలు పడుతున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> విష్ణుదేవుని వెన్నంటి భక్తరక్షణకోసం పరువులు తీస్తున్న అమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే – నుదుటి మీద ముంగురులు క్రమ్ముకొంటున్నాయి. వానినంటుకొని మోముదామరమీద జుంజుం అంటూ మధురనాదం చేస్తూ తుమ్మెదలు ముసరుకొంటున్నాయి. వానిని పూనికతో తోలే ప్రయత్నంలో ఉండగా రామచిలుకలు మెల్లమెల్లగా చేరి క్రిందిపెదవి కాంతులను ఒడిసిపట్టుకుంటున్నాయి. చిలుకలను తరిమివేసిన వెంటనే కన్నులనే ఒంపుసొంపుల చేపలను మిన్నేటిలోని పెద్దచేపలు తరుముకొని వస్తున్నాయి. ఆచేపల వరుసలను దాటుకోగా మేను అనే తీగతో మెఱుపుతీగలు మింటిలో రాసుకుంటున్నాయి. మెఱుపుతీగలను ప్రక్కకు తొలగింపగా చక్రవాకాలు పాలిండ్లపై వ్రాలి క్రొవ్వుచూపుతున్నాయి. మబ్బువెనుక మసలే మెఱుపుతీగలాగా నీలమేఘశ్యాముని వెంటనంటిన లక్ష్మీదేవి స్థితి ఇలా ఉన్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నిటల = నుదుట; అలకులు = ముంగురులు; అంటి = అంటుకొని; నివురన్ = చక్కదిద్ద బోతే; జుం జుమ్ము = జుంజుం; అని = అనెడి ఝంకారములతో; ముఖ = ముఖము యనెడి; సరోజము = పద్మము; నిండ = అంతటను; ముసురున్ = కప్పును; తేంట్లు = తుమ్మెదలు; అళులన్ = తుమ్మెదలను; జోపగన్ = తోలగా; చిల్కలు = చిలుకలు; అల్ల నల్లన = మెల్లగా; చేరి = సమీపించి; ఓష్ఠ = పెదవి యనెడి; బింబ = దొండ పండు; ద్యుతులు = కాంతులను; ఒడియన్ = ఒడిసి పట్టుకొన; ఉఱుకున్ = దూకును; శుకములన్ = చిలుకలను; తోలన్ = తోలగా; చక్షుర్ = కన్నులు యనెడి; మీనముల్ = చేపల; కున్ = కు; మందాకినీ = ఆకాశగంగ లోని; పాఠీన = చేపల; లోకమున్ = సమూహము; ఎగచు = విజృంభించును; మీన = చేపల; పంక్తులన్ = సమూహములను; దాటన్ = దాటగా; మొయి = దేహము యనెడి; తీగ = తీవ; తోన్ = తోటి; రాయన్ = రాసుకు పోవుటకు; శంపా = మెఱుపు; లతలున్ = తీగలు; మింటన్ = ఆకాశములో; సరణి = వరుసలు; కట్టున్ = కట్టును; <br><br>శంపలను = మెఱుపులను; జయింపన్ = జయించుటకు; చక్రవాకంబులున్ = చక్రవాక పక్షులు; కుచ = స్తనముల; యుగంబున్ = జంటను; తాకి = ఎదుర్కొని; క్రొవ్వు = బలమును; చూపున్ = చూపు తున్నవి; మెలత = స్త్రీ; మొగిలు = మేఘము; పిఱిది = వెనుక నుండు; మెఱుగు = మెరుపు; తీగెయున్ = తీగను; పోలెన్ = వలె; జలద వర్ణున్ = మేఘము వంటి రంగు వాని; వెనుకన్ = వెంట; చనెడు = వెళ్ళెడి; అపుడు = సమయము నందు. </div> </div> </div> <!--8-105 వినువీథిన్ జనుదేరఁ... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-105 వినువీథిన్ జనుదేరఁ... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/27.Vinuveedin_Janudera.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ<br> వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణా వర్ధిష్ణుఁ యోగీంద్ర హృ<br> ద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృందప్రాభ వాలంకరి<br> ష్ణు, నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీమహావిష్ణువు ఆకాశవీధిలో పయనిస్తూ ఏనుగును రక్షించటానికి వస్తున్నాడు. ఆ దర్శనం కవివరేణ్యుని హృదయంలో కమనీయ రసభావాలను ఉప్పొంగజేస్తున్నది. ఆ పొంగును పాఠకుని హృదయంలో పరవళ్ళు త్రొక్కించటానికి పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> గగనమార్గంలో వస్తూ ఉండగా దేవతలు పారవశ్యంతో పరమాత్మను దర్శించుకున్నారు. ఆ మహాత్మునిలో దేవతల పగవారైన రక్కసుల బ్రతుకుపంట బండలపాలు కావటం కానవస్తున్నది. భక్తులయెడల దయను ఆ స్వామి మరింతగా పెంపొందిస్తున్నాడు. యోగంలో మిన్నులుముట్టినవారి హృదయాలనే వనాలలో విహరిస్తున్నాడు. భక్తులకోసం ఎంతలేసి కష్టాలనైనా సహించేశీలం అతనిది. భక్తజనుల గుంపుల సంపదలే ఆయన అలంకారాలుగా చేసుకుంటాడు. ఎల్లవేళలా క్రొత్తపెండ్లి కూతురే అయిన ఇందిర పరిచర్యలను ప్రేమతో, లాలనతో అందుకుంటూ ఉంటాడు. జయమందుకోవటమే ఆయన శీలం. అతని దేహపు వెలుగులు ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వినువీథిన్ = ఆకాశ మార్గము నందు; చనుదేరన్ = వెళ్ళు తుండగా; కాంచిరి = దర్శించిరి; అమరుల్ = దేవతలు; విష్ణున్ = హరిని {విష్ణువు - విశ్వమున వ్యాపించి యుండు వాడు, నారాయణుడు}; సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ = హరిని {సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణుడు - సుర (దేవతల) ఆరాతి (శత్రువుల యొక్క) జీవన సంపత్తి (బ్రతుకు దెరువు)ను నిరాకరిష్ణుడు (నిరాకరించెడి వాడు), విష్ణువు}; కరుణా వర్ధిష్ణున్ = హరిని {కరుణా వర్ధిష్ణుడు - కారుణ్యము వృద్ధి యగు స్వభావము గల వాడు, విష్ణువు}; యోగీంద్ర హృద్వన వర్తిష్ణున్ = హరిని {యోగీంద్ర హృ ద్వన వర్తిష్ణుడు - యోగీంద్రుల హృదయము లనెడి వన (తోటలలో) వర్తిష్ణుడు (మెలగెడు వాడు), విష్ణువు}; సహిష్ణున్ = హరిని {సహిష్ణుడు - సహన స్వభావము గల వాడు, విష్ణువు}; భక్తజన బృంద ప్రాభ వాలంకరిష్ణున్ = హరిని {భక్త జన బృంద ప్రాభ వాలంకరిష్ణుడు – భక్త జనుల బృంద (సమూహములను) ప్రాభవ (గొప్పదనము) తో అలంకరిష్ణుడు (అలంకరించెడి వాడు), విష్ణువు}; నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణున్ = హరిని {నవో ఢోల్లస దిందిరా పరిచరిష్ణుడు - నవోఢ (కొత్తపెళ్ళికూతురు) వలె ఉల్లసత్ (ఉల్లాసము గల) ఇందిరా (లక్ష్మీదేవికి) పరిచరిష్ణుడు (సమీపమున మెలగెడు వాడు), విష్ణువు}; జిష్ణున్ = హరిని {జిష్ణువు - జయించు స్వభావము గల వాడు, విష్ణువు}; రోచిష్ణునిన్ = హరిని {రోచిష్ణుడు - ప్రకాశించెడి స్వభావము గల వాడు, విష్ణువు}. </div> </div> </div> <!--8-107 చనుదెంచెన్ ఘనుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-107 చనుదెంచెన్ ఘనుఁ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/28.Chanudenchan_Ghanudella.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> చనుదెంచెన్ ఘనుఁ డల్ల వాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం<br> ఖనినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర<br> న్నన నేతెంచె నటంచు వేల్పులు "నమో నారాయణా యేతి" ని<br> స్వను లై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భక్తరక్షణ కళాసంరంభంతో భూమికి దిగివస్తున్న శ్రీహరినిగూర్చి పారవశ్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ స్వామికి మ్రొక్కులు చెల్లించుకుంటున్నారు దేవతలు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ‘చూచారా! అదిగో హరి మహానుభావుడు విచ్చేశాడు. అదిగో ఆ ప్రక్కనే లోకమాత లక్ష్మీదేవి నిలిచిఉన్నది. శంఖంనాదం అదిగో. అదిగదిగో చక్రం. అతడే కదయ్యా సర్పాలను సర్వనాశనం చేసే గరుత్మంతుడు. ‘వడివడిగా వచ్చాడు’ అని ఆనందంతో దర్శించుకుంటూ ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ ఏనుగు దురవస్థను రూపుమాపటానికి వస్తున్న చక్రధరునికి మ్రొక్కుతున్నారు దేవతలు. వారి గుంపులతో, ఘోషలతో గగనమంతా నిండిపోయింది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> చనుదెంచెన్ = వచ్చినాడు; ఘనుడు = గొప్పవాడు; అల్ల = అక్కడి; వాడె = అతడే; హరి = విష్ణువు; పజ్జన్ = పక్కనే; కంటిరే = చూసితిరా; లక్ష్మిన్ = లక్ష్మీదేవిని; శంఖ నినాదంబు = పాంచజన్య శంఖ ధ్వని; అదె = అక్కడ నున్నదే; చక్రము = సుదర్శన చక్రము; అల్లదె = అక్క డున్నదే; భుజంగ ధ్వంసియున్ = గరుత్మంతుడు; వాడె = అతడే; క్రన్ననన్ = వరుసగా; ఏతెంచెన్ = వచ్చిరి; అట = అని; అంచున్ = అనుచు; వేల్పులు = దేవతలు; నమో = నమస్కారము; నారాయణ = నారయణునికి; ఇతి = ఇది యనెడి; నిస్వనులు = పలికెడి వారు; ఐ = అయ్యి; మ్రొక్కిరి = నమస్కరించిరి; మింటన్ = ఆకాశమునందు; హస్తి దురవస్థా వక్రికిన్ = హరికి {హస్తి దురవస్థా వక్రి - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడి వాడు), విష్ణువు}; చక్రికిన్ = హరికి {చక్రి - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}. </div> </div> </div> <!--8-122 అవనీనాథ గజేంద్రుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-122 అవనీనాథ గజేంద్రుఁ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/29.Avaneenadhaa.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అవనీనాథ! గజేంద్రు డా మకరితో నాలంబు గావించె, మున్<br> ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై<br> ష్ణవముఖ్యుండు గృహీత మౌననియతిన్ సర్వాత్ము నారాయణున్<br> సవిశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> స్వామి మకరేంద్రుణ్ణి మట్టుపెట్టాడు. గజేంద్రుణ్ణి గట్టెక్కించాడు. అందరికీ ఆనందాన్ని అందించాడు. కాగా తరువాతి కథలో ఆ ఏనుగు వెనుకటి జన్మలో ఎవరో తెలియజేస్తున్నారు శుకమహర్షుల వారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరీక్షిన్మహారాజా! మొసలితో పెద్దకాలం పోరాడిన ఆ గజేంద్రుడు వెనుకటి జన్మలో ద్రవిడదేశానికి ఏలిక. గొప్పపుణ్యం మూటకట్టుకొన్న మనీషి. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. విష్ణుభక్తులలో పేరుప్ర ఖ్యాతులు సంపాదించినవాడు. మౌనవ్రతాన్ని అవలంబించి సర్వాత్ముడైన శ్రీమన్నారాయణుని శ్రద్ధాభక్తులతో గొప్ప కొండకొమ్ముమీద కూర్చుండి ఆరాధించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అవనీనాథ = రాజా; గజేంద్రుడు = గజేంద్రుడు; ఆ = ఆ; మకరి = మొసలి; తోన్ = తోటి; ఆలంబున్ = యుద్దమును; కావించె = చేసెనో; మున్ = పూర్వము; ద్రవిళ = ద్రవిడ దేశపు; అధీశుడు = ప్రభువు; అతండు = అతడు; పుణ్య తముడు = అత్యధిక మైన పుణ్యుడు; ఇంద్రద్యుమ్న = ఇంద్రద్యుమ్నుడు యనెడి; నాముండు = పేరు గల వాడు; వైష్ణవ = విష్ణు భక్తులలో; ముఖ్యుండు = ముఖ్యమైన వాడు; గృహీత = స్వీకరించిన; మౌన = మౌన వ్రత; నియతిన్ = నియమముతో; సర్వాత్మున్ = హరిని {సర్వాత్ముడు - సర్వము తన రూపమే యైన వాడు, విష్ణువు}; నారాయణున్ = హరిని {నారాయణుడు – సారూప్య ముక్తికి స్థాన మైన వాడు, విష్ణువు}; సవిశేషంబుగన్ = విశిష్టతలతో కూడినట్లుగ; పూజ = పూజలు; చేసెను = చేసెను; మహా = గొప్ప; శైల = పర్వతము; అగ్ర = పై; భాగంబునన్ = ప్రదేశము నందు. </div> </div> </div> <!--8-123 ఒకనాఁ డా నృపుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-123 ఒకనాఁ డా నృపుఁ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/30.Oakanaadu_Aanrupudachyuthun.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఒకనాఁ డా నృపుఁ డచ్యుతున్ మనములో నూహింపుచున్ మౌని యై<br> యకలంకస్థితి నున్నచోఁ గలశజుం డచ్చోటికిన్ వచ్చి లే<br> వక పూజింపక యున్న రాజు గని నవ్యక్రోధు డై మూఢ! లు<br> బ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మని శాపం బిచ్చె భూవల్లభా! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆ ఇంద్రద్యుమ్నుడు మహాభక్తుడే కాదు, మహోదాత్తవ్యక్తి కూడా! . కానీ ధ్యాననిష్ఠలో ఉండగా ఒక అపచారం జరిగిపోయింది. దానివలన ఏనుగైపుట్టాడు. ఆ వివరం చెబుతున్నాను విను అంటున్నారు శుకయోగీంద్రులు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహారాజా! ఒకనాడు ఆ ఇంద్రద్యుమ్నుడుమనస్సులో అచ్యుతుని నిలుపుకొన్నాడు. మనస్సును చెదరకుండా నిగ్రహించుకున్నాడు. శ్రీమహావిష్ణువునే భావిస్తున్నాడు. చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నదో తెలిసికొనే స్థితిలో కూడా లేడు. మాటలాడటం మానివేశాడు. అతని ధ్యానంలో రవంత కళంకం కూడా లేదు. అదిగో ఆ స్థితిలో అక్కడకు అగస్త్యమహాముని ఏతెంచాడు. ఆయన అన్నివిధాలా పూజింపదగిన తపస్సంపన్నుడు. ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉన్న కారణంగా లేవలేదు. పూజింపలేదు. అటువంటి రాజును చూచిన మునివర్యునకు పట్టనలవికాని కోపం చెలరేగింది. మూఢా! లుబ్ధా! ఏనుగు కడుపులో పుట్టు – అని శపించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఒక = ఒక; నాడున్ = దినమున; ఆ = ఆ; నృపుడు = రాజు {నృపుడు - నృ (నరులను) పతి, రాజు}; అచ్యుతున్ = నారాయణుని {అచ్యుతుడు - తన పదవినుండి భ్రంశము పొందని వాడు, విష్ణువు}; మనసు = మనస్సు; లోన్ = అందు; ఊహించుచున్ = భావించు కొనుచు; మౌని = మౌనము ధరించిన వాడు; ఐ = అయ్యి; అకలంక = ఏకాగ్రచిత్తము గల; స్థితిన్ = స్థితిలో; ఉన్నచోన్ = ఉన్నసమయమునందు; కలశజుండు = అగస్త్యముని {కలశజుడు – కలశము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు}; ఆ = ఆ; చోటి = ప్రదేశమున; కిన్ = కు; వచ్చి = వచ్చి; లేవక = లేవ కుండగ; పూజింపకన్ = గౌరవించ కుండగ; ఉన్న = ఉన్నట్టి; రాజున్ = రాజుని; కని = చూసి; నవ్య = వెంటనే పుట్టిన; క్రోధుడు = కోపము గల వాడు; ఐ = అయ్యి; మూఢ = మూర్ఖుడా; లుబ్ద = లోభి, అనాగరికుడ; కరీంద్రము = మదగజములలో; ఉత్తమ = పెద్దదాని; యోనిన్ = గర్భమున; పుట్టుము = జన్మించుము; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; భూవల్లభా = రాజా {భూవల్లభుడు - భూ (భూమికి) వల్లభుడు (పతి), రాజు}. </div> </div> </div> <!--8-135 నరనాథ నీకును... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-135 నరనాథ నీకును... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/31.Naranaadha_Neekunu_Naa_Chetha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నరనాథ! నీకును నాచేత వివరింప బడిన యీ కృష్ణానుభావ మైన<br> గజరాజ మోక్షణ కథ వినువారికి; యశము లిచ్చును గల్మషాపహంబు;<br> దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ; బ్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి<br> నిత్యంబు పఠియించు నిర్మలా త్మకు లైన విప్రులకును బహువిభవ మమరు<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> సంపదలు గల్గు; పీడలు శాంతిబొందు;<br> సుఖము సిద్ధించు; వర్ధిల్లుశోభనములు; <br> మోక్ష మఱచేతి దై యుండు; ముదము చేరు<br> ననుచు విష్ణుండు ప్రీతుఁ డై యానతిచ్చె.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ‘గజేంద్రమోక్షం’ అనేది భాగవతంలో ఒక విలక్షణమైన కథ. జీవుడు సంసారం అనే మొసలి కోరలలో చిక్కుకొని భగవంతుని అనుగ్రహంతో విడుదలపొందటం ఇందులో ప్రతీకాత్మకంగా తెలియజెప్పారు. కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించి నరుడు సంసారంనుండి విముక్తిని పొందాలి. దానిని స్ఫురింపజేస్తూ ఫలశ్రుతిని వివరిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజా! పరీక్షిత్తూ! నేను నీకు వివరించిన ఈ గజేంద్రమోక్షణ కథ శ్రీమహావిష్ణుని మహిమను చక్కగా వివరిస్తుంది. ఈకథ వినేవారికి కీర్తిని కలిగిస్తుంది. పాపాలను పోగొడుతుంది. పాడుకలలను నశింపజేస్తుంది. పాడుకలలంటే పాడుబ్రదుకులే. దుఃఖాన్ని తొలగించివేస్తుంది. సూర్యోదయం కాకముందే నిద్రనుండి మేల్కొని పవిత్రమైన నడవడితో ప్రతిదినమూ ఈ కథను పఠించే నిర్మలమైన అంతరంగం గల విద్యావంతులకు అనేక విధాలైన సంపదలు కలుగుతాయి. పీడలు శాంతిస్తాయి. మంగళములు వృద్ధి పొందుతాయి. మోక్షం అరచేతిలో ఉన్న వస్తువులాగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది అని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే చెప్పాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నరనాథ = రాజా {నర నాథుడు - నరులకు పతి, రాజు}; నీ = నీ; కునున్ = కు; నా = నా; చేతన్ = వలన; వివరింపబడిన = వివరముగా తెలుపబడిన; ఈ = ఈ; కృష్ణా = శ్రీకృష్ణుని యొక్క; అనుభావమున్ = ప్రభావముతెలుపునది; ఐన = అయిన; గజరాజ = గజేంద్రుని; మోక్షణ = మోక్షము యనెడి; కథ = కథను; విను = వినెడి; వారి = వారి; కిన్ = కి; యశములున్ = కీర్తులను; ఇచ్చునున్ = ఇచ్చును; కల్మష = పాపములను; అపహంబున్ = పరిహరించునది; దుస్వప్న = చెడ్డ కలలను; నాశంబున్ = తొలగించునది; దుఃఖ = దుఃఖమును; సంహారంబున్ = నాశనము చేయునది; ప్రొద్దుల = ఉదయమే; మేల్కాంచి = నిద్ర లేచి; పూత = పవిత్ర మైన; వృత్తిన్ = విధముగ; నిత్యంబున్ = ప్రతి దినము; పఠియించు = చదివెడి; నిర్మల = నిర్మల మైన; ఆత్మకులు = మనసులు గల వారు; ఐన = అయిన; విప్రుల్ = బ్రాహ్మణుల; కునున్ = కు; బహు = అనేక మైన; విభవము = వైభవములు; అమరున్ = సమకూర్చును. సంపదలున్ = సంపదలు కూడ; కల్గున్ = కలుగును; పీడలు = ఆపదలు; శాంతిన్ = సమసి పోవుట; పొందున్ = కలుగును; సుఖమున్ = సౌఖ్యములును; సిద్ధించున్ = కలుగును; వర్ధిల్లున్ = వృద్ధి చెందును; శోభనములు = శుభములు; మోక్షమున్ = ముక్తి కూడ; అఱచేతిది = మిక్కిలి సులు వైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ముదము = సంతోషము; చేరున్ = సమకూరును; అనుచున్ = అని; విష్ణుండు = హరి; ప్రీతుండు = సంతుష్టుండు; ఐ = అయ్యి; ఆనతిచ్చెన్ = సెలవిచ్చెను. </div> </div> </div> <!--8-437 బలి నంభోరుహనేత్రుఁ... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-437 బలి నంభోరుహనేత్రుఁ... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/32.Balinabhoruhanethru.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బలి నంభోరుహనేత్రు డేమి కొఱకై పాదత్రయిన్ వేడె; ని<br> శ్చలుడుం బూర్ణుడు లబ్ధకాముడు రమాసంపన్నుడై తా పర<br> స్థలికిన్ దీనునిమాడ్కినేల చనియెన్; ద ప్పేమియున్ లేక ని<br> ష్కలుషున్ బంధన మేల చేసెను; వినం గౌతూహలం బయ్యెడిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతమహాకావ్యంలో వామనచరిత్ర ఒక ఆనందలహరి. ఆ కథకు అంకురార్పణవంటిది పరీక్షిత్తు అడుగుతున్న ఈ ప్రశ్న. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! శుకయోగీంద్రా! బలిచక్రవర్తిని పద్మాలవంటి విశాలసుందరాలైన కన్నులున్న హరి మూడడుగుల నేలను దేనికోసం అడిగాడు? ఆయన జీవులకులాగా చంచలమైనచిత్తం కలవాడు కాదు. ఏ లోపమూ లేనివాడు. అన్ని కోరికలూ నిండుగా తీరినవాడు. అంటే ఏమీ అక్కరలేనివాడు. అట్టి పురుషోత్తముడు దీనునిలాగా పరులతావునకు వెళ్ళాడు. అంతేకాదు ఏ తప్పూలేని మహాత్ముడు, పుణ్యాత్ముడు అయిన బలిని బంధించాడు. ఇది వింత అయిన విషయం. దీనిని వివరంగా తెలుసుకోవాలని గుండెనిండా కోరిక ఉన్నదయ్యా! నాకోరిక తీర్చు మహానుభావా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బలిని = బలిని; అంభోరుహ నేత్రుడు = విష్ణువు; ఏమిటి = ఎందుల; కిన్ = కు; పాద = అడుగుల; త్రయిన = మూటిని; వేడెన్ = కోరెను; నిశ్చలుడున్ = నిర్వికారుడు; పూర్ణుడున్ = పూర్ణ పురుషుడు; లబ్ద కాముడు = పరిపూర్ణ కాముడు; రమా సంపన్నుడున్ = లక్ష్మీదేవి యనేడి సంపద గల వాడు; ఐ = అయిన; తాన్ = అతను; పర = ఇతరుల; స్థలి = చోటున; కిన్ = కు; దీనుని = దీనుడి; మాడ్కిన్ = వలె; ఏలన్ = ఎందులకు; చనియెన్ = వెళ్ళెను; తప్పు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండగ; నిష్కలుషున్ = పాప హీనుని; బంధనము = బంధించుట; ఏలన్ = ఎందుకని; చేసెను = చేసెను; వినన్ = వినుటకు; కౌతూహలము = కుతూహలము; అయ్యెడిన్ = కలుచున్నది. </div> </div> </div> <!--8-514 నన్నుఁ గన్నతండ్రి... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-514 నన్నుఁ గన్నతండ్రి... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/33.Nanuganna_Thandri.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నన్ను గన్నతండ్రి! నాపాలి దైవమ!<br> నా తపః ఫలంబ! నా కుమార!<br> నాదు చిన్నివడుగ! నా కులదీపిక!<br> రాగదయ్యా! భాగ్యరాశి వగుచు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీమహావిష్ణువు అవతారప్రయోజనం సాధించటంకోసం తల్లిదండ్రులనుగా అదితికశ్యపులను ఎన్నుకున్నాడు. తన నిజస్వరూపాన్ని మగురుపరచి కపట వటువు వేషం తాల్చి అమ్మ ముందర ఆటలాడుకుంటున్నాడు. తల్లి అదితి అతనిని చూచి ఆనందపారవశ్యంతో ఇలా అంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నా చిన్నికుమారా! నీవు నన్నుగన్నతండ్రివి. నాపాలి దైవానివి. నేను చేసుకొన్న తపస్సులపంటవు. నాచిన్నివడుగ! నాకులానికి చిన్నిదీపం అయినవాడా! నా భాగ్యాలరాశివై రా నాయనా!<br><br>నిలువెల్లా వాత్సల్యం అనే అమృతంతో నిండిన ఏతల్లి అయినా కన్నకొడుకును ఇలాగే పిలుస్తూ ఉంటుంది. కానీ లోకుల విషయంలో అవన్నీ కల్పనలు. ఇక్కడమాత్రం పరమసత్యాలు. ఎందుకంటే ఇక్కడి పసికూన పరమాత్మ కదా! కనుక అందరికిలాగానే అమ్మకు కూడా తండ్రియే. దైవమే. తపస్సుల ఫలమే. కులమంటే లోకాల సముదాయం. దానికి వెలుగును ప్రసాదించే దీపమే. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సు యొక్క; ఫలంబ = ఫలితముగ కలిగిన వాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింప జేయు వాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు. </div> </div> </div> <!--8-526 హరిహరి సిరియురమునఁగల... (కందము)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-526 హరిహరి సిరియురమునఁగల... (కందము)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/34.Harihari_Siriyuramunagala.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> హరిహరి సిరియురమునగల, <br> హరి హరిహయు కొఱకు దనుజునడుగన్ జనియెన్<br> బరహిత రతమతియుతు లగు,<br> దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్ <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మహావిష్ణువు సర్వసంపదలకు నిలయమైన మహాలక్ష్మికి భర్త. కానీ ఇప్పుడు చిల్లిగవ్వలేని భిక్షుకుడై ఇంద్రునికోసం రాక్షసేంద్రుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. దానిని శుకయోగీంద్రులు ఇలా సమర్థిస్తున్నారు. . </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> హరిహరీ! లక్ష్మీదేవిని వక్షఃస్థలంమీద నిలుపుకొన్న శ్రీహరి హరిహయుడైన ఇంద్రునికోసం ఒక రాక్షసుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. ఇది ఎంత వింత! కాదులే. ఇతరులకు మేలు చేయటమే ఎల్లప్పుడు కోరిక అయిన దొరలకు ఇలా బిచ్చమెత్తటాలు దేహానికి అలంకారాలు అవుతాయి. దానిని ఒకలీలగా సంభావించి సంతోషించండి. భగవంతుడు ఏమిచేసినా అందులో ఆయన గొప్పతనమే తెలియవస్తుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలు దేరెను; పర = ఇతరులకు; హిత = మేలు చేయుట యందు; రత = ప్రీతి కల; మతి = బుద్ధి; యుతుల = కల వారు; అగు = అయిన; దొరల్ = దొడ్డ బుద్ధి గల వారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుట కూడ; ఒడలి = దేహ; తోడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు. </div> </div> </div> <!--8-545 స్వస్తి జగత్త్రయీ... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-545 స్వస్తి జగత్త్రయీ... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/35.Swasthi_Jagathrayee.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి<br> ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం<br> ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు, నిర్జరీ గళ<br> న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి ఒక గొప్పయజ్ఞం చేస్తున్నాడు. హరి వామనుడై అవతరించి ఆ యజ్ఞశాలకు చేరుకున్నాడు. అతడిబుడిబుడి నడకలు చూచేవారిని ఆనందసాగరంలో ముంచెత్తుతున్నాయి. చక్రవర్తిని చూచి పవిత్రము, అక్షతలు గల కుడిచేతిని ఎత్తి ఇలా ఆశీర్వదిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మూడులోకాలకూ ఏలిక అయినవానికి, నవ్వినంత మాత్రాన దేవేంద్రుడంతవానిని కూడా రూపుమాపగల శక్తినిండుగా ఉన్నవానికి, ఉదారుడు అనే పదంతో వ్యవహరింపదగినవానికి, మునివర్యుల స్తుతులతో కూడిన శుభప్రదమైన యజ్ఞవిధులలో ఎల్లవేళలా విహరించేవానికి, దేవకాంతల మెడలలోని మంగళసూత్రాలను తొలగించి వేసే పరాక్రమశాలికీ, రాక్షసలోకానికి పాలకుడైనవానికీ బలిమహాప్రభువునకు స్వస్తి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> స్వస్తి = శుభ మగు గాక; జగత్రయీ = ముల్లోకములలోని; భువన = ప్రపంచములను; శాసన = పరిపాలించెడి; కర్త = అధికారి; కున్ = కి; హాస మాత్ర = అవలీలగా {హాస మాత్రము – నవ్వు ఒక్క దానితో, అవలీలగా}; విద్వస్త = వెలవెల పోగొట్ట బడిన; నిలింప భర్త = దేవేంద్రుడు కల వాని; కున్ = కి; ఉదార = ఉన్నత మైన; పద = పదవులలో; వ్యవహర్త = మెలగెడు వాని; కున్ = కి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; స్తుత = కీర్తింప బడిన; మంగళ = శుభకర మైన; అధ్వర = యజ్ఞముల; విధాన = కార్య క్రమములలో; విహర్త = మెలగునాని; కున్ = కి; నిర్జర = దేవతల; గళ = మెడలో; న్యస్త = ఉన్నట్టి; సువర్ణ = బంగారు; సూత్ర = మంగళ సూత్రముల; పరిహర్త = తొలగించెడి వాని; కున్ = కి; దానవ = రాక్షసులు; లోక = అందరికి; భర్త = రాజు; కున్ = కి. </div> </div> </div> <!--8-549 వడుగా యెవ్వరివాఁడ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-549 వడుగా యెవ్వరివాఁడ... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/36.Vaduga_Yevvarivaadavu_Yevvadavu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వడుగా! ఎవ్వరివా౦డ వెవ్వడవు? సంవాసస్థలంబెయ్యది<br> య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్;<br> గడు ధన్యాత్ముఁడ నైతి; నీ మఖము యోగ్యం బయ్యె; నా కోరికల్<br> గడతేఱెన్; సుహుతంబు లయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి గొప్పదానశీలుడు. ఇప్పుడు తనదగ్గరకు వచ్చినవాడు ముద్దులు మూటగడుతున్న మోహన బ్రహ్మచారి. అతడు తన గొప్పతనాన్ని గొప్పమాటలతో పేర్కొని స్వస్తి వాచనం చేశాడు. దానికి ఆనందపడి ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓ బ్రహ్మచారీ! నీ తల్లిదండ్రులెవ్వరు? నీవు ఎవడవు? నీవు ఉండే ఊరేది? ఇప్పుడు నీవు ఇక్కడకు రావటంవలన నా వంశమూ, నా పుట్టువూ పొందవలసిన ప్రయోజనాన్ని పొందాయి. నాయనా! నేను చాలా ధన్యాత్ముడనయ్యాను. నాయీ యజ్ఞం యోగ్యమై ఒప్పారుతున్నది. నా కోరికలన్నీ తీరినవి. నా అగ్నిహోత్రాలు విశిష్టమైన హోమద్రవ్యాలతో, ఏ జారుపాటూలేని మంత్రతంత్రాలతో వెలుగొందుతున్నాయి. నేను కోరుకొనే శుభాలను అనుగ్రహించే మంచికాలం ఇది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వడుగా = బ్రహ్మచారి; ఎవ్వరి వాడవు = ఎవరి పిల్ల వాడవు; ఎవరవు = ఎవరివి నీవు; సంవాస = ఉండెడి; స్థలంబు = చోటు; ఎయ్యది = ఏది; ఇయ్యెడకున్ = ఇక్కడకు; నీవు = నీవు; అరుదెంచుటన్ = వచ్చుట చేత; సఫలము = సార్థకము; అయ్యెన్ = అయినది; వంశమున్ = (నా) వంశము; జన్మమున్ = పుట్టుక; కడు = మిక్కలి; ధన్యాత్ముడను = పుణ్యాత్ముడను; ఐతిన్ = అయ్యాను; ఈ = ఈ యొక్క; మఖమున్ = యాగము; యోగ్యంబు = పవిత్ర మైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కోరికల్ = మనోవాంఛితములు; కడతేరెన్ = తీరిపోయినవి; సుహుతంబులు = చక్కగా కాలు తున్నవి; అయ్యెన్ = అయినవి; శిఖులున్ = అగ్నులు; కల్యాణము = మిక్కలి శుభ దాయకము; ఈ = ఈ; కాలమున్ = సమయము. </div> </div> </div> <!--8-550 వరచేలంబులొ మాడలో... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-550 వరచేలంబులొ మాడలో... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/37.Varachelambulo_Maadalo.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యం బులో, గోవులో,<br> హరులో, రత్మములో, రథంబులొ, విమృష్టాన్నంబులో, కన్యలో,<br> కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో<br> ధరణీఖండమొ, కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తన ధన్యతను మేలైన ఉదాత్త వాక్యాలలో ప్రకటించి ఆ బ్రహ్మచారి తననుండి ఏదైనా దక్షిణగా గ్రహించి మరింత ధన్యుణ్ణి చేయాలనే కోరికతో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> బ్రాహ్మణవరేణ్యా! నీవు కోరినది సమర్పించుకొని నేను యాగఫలం పొందుతాను. అడుగు. మేలుజాతి వస్త్రాలు కావాలా? బంగారు నాణేలు ఇత్తునా? రుచికరములైన పండ్లు ఇవ్వమంటావా? అడవులలో లభించే పుట్టతేనె వంటివి కోరుకుంటావా? ఆవులను అడుగుతావా? గుఱ్ఱాలా? ? రత్నాలా? రథాలా? పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? గొప్ప భవనాలా? అగ్రహారాలా? భూములా? లేక నేను పరిపాలించే రాజ్యంలో భాగమా? ఇంకా నేను పేర్కొనని ఏది అయినా అడుగు. నేను ఆనందంతో ఇస్తాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> </div> </div> </div> <!--8-552 ఇది నాకు నెలవని... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-552 ఇది నాకు నెలవని... (సీసము)....</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/38.Idi_Naaku_Nelavani.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇది నాకు నెలవని యేరీతి బలుకుదు ఒకచోటనక ఎందునుండనేర్తు<br> ఎవ్వనివాడ నంచేమని పలకుదు నా యంతవాడనై నడవనేర్తు<br> ఈ నడవడి యని యెట్లు వక్కాణింతు పూని ముప్పోకల పోవనేర్తు<br> అదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ నేరుపు లన్నియు నేన నేర్తు<br> <br> <b>(ఆటవెలది).</b><br> <br> ఒరులు గారు నాకు నొరులకు నేనౌదు; <br> నొంటివాడ; చుట్టమొకడు లేడు<br> సిరియు తొల్లి గలదు; చెప్పెద నాటెంకి; <br> సుజనులందు తఱచు చొచ్చియుందు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి మాటలన్నీ విన్నాడు మాయాబ్రహ్మచారి. పైకి దిక్కుమాలినవాడనే భావన కలిగేవిధంగానూ, లోపల దేవదేవుడైన పరమాత్మ అనే అర్థం స్ఫురించేవిధంగానూ ఇలా తన తత్త్వాన్ని తెలియజేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓ చక్రవర్తీ! ఇది నేనుండే చోటు అని ఎలా చెప్పగలనయ్యా! ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా ఉండగలుగుతాను. ఎవ్వరివాడవు అని అడిగావు. దానికి బదులుపలకటం సాధ్యంకాదు. ఎందుకంటే నేను సర్వతంత్ర స్వతంత్రుడను. నీనడవడి ఎటువంటిది అంటే ఏమి చెప్పను? నా సంకల్పంతో నేను మూడు పోకలతోపోతూ ఉంటాను. అవి నేలమీదా, నింగిలోనూ, నీటిపైనా కావచ్చు. ఏవిద్యలు నేర్చుకున్నావు అంటావనుకో అన్ని విద్యలూ నాలో అద్భుతంగా అలరారుతున్నాయి. నాకెవరూ ఏమీకారు. కానీ నేనందరికీ అన్నీ అవుతాను. నేను ఏకాకిని. చుట్టం ఒక్కడు కూడా లేడు. సంపద వెనుక ఉండేదిలే! అడిగావు కనుక నానెలవు చెబుతాను. సాధారణంగా మంచివారిలో కలసిమెలసి ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇది = దీనిని; నా = నా; కున్ = కు; నెలవు = నివాసము; అని = అని; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పలుకుదు = చెప్పెగలను; ఒక = ప్రత్యేకముగ ఒక; చోటు = ప్రదేశము; అనకన్ = అనకుండ; ఎందున్ = ఎక్కడైనను; ఉండనేర్తున్ = ఉండగలను; ఎవ్వని = ఎవరికిచెందిన; వాడన్ = వాడిని; అంచున్ = అనుచు; ఏమి = ఏమి; అని = అని; నుడువుదున్ = చెప్పెగలను; నా = నా; అంతవాడను = అంతవాడినినేనే; ఐ = అయ్యి; నడవనేర్తు = స్వేచ్చగావర్తించెదను; ఈ = ఇలాంటి; నడవడి = వర్తన కలవాడను; అని = అని; ఎట్లు = ఎలా; వక్కాణింతున్ = చెప్పగలను; పూని = ధృతితో; ముప్పోకలన్ = మూడు పోకడలు, పెక్కు త్రోవలను {ముప్పోకలు - మూడుపోకడలు, 1సత్త్వగుణము 2రజగుణము 3తమోగుణములుకల మూడువిధములు, 1శ్రవణ 2అధ్యయన 3ఉపన్యాస అనెడి మూడు విద్యలు, 1ముందుకు 2వెనుకుక 3పక్కలకు అనెడి మూడు గమనములు}; పోవనేర్తు = వెళ్ళగలను; అది = అది; నేర్తున్ = తెలుసును; ఇది = ఇది; నేర్తున్ = తెలుసును; అని = అని; ఏల = ఎందుకు; చెప్పంగన్ = చెప్పడము; నేరుపులు = విద్యలు; అన్నియున్ = అన్ని; నేన = నేను; నేర్తున్ = తెలుసుకున్నాను; ఒరులు = ఇతరులు; కారు = ఏమీకారు.<br><br>నా = నా; కున్ = కు; ఒరుల = ఇతరుల; కున్ = కు; నేన్ = నేను; ఔదు = ఉపయోగపడెదను; ఒంటి = ఒంటరి, అనితరమైన; వాడన్ = వాడిని; చుట్టము = బంధువు; ఒకడు = ఒక్కడుకూడ; లేడు = లేడు; సిరియున్ = లక్ష్మీదేవి, సంపద; తొల్లి = ఇంతకుముందు; కలదు = ఉన్నది; చెప్పెదన్ = తెలియచెప్పెదను; నా = నా యొక్క; టెంకి = నివాసము; సుజనులు = మంచివారి, పుణ్యాత్ముల; అందున్ = లో, ఎడల; తఱచు = ఎక్కువగా, ఎక్కువమార్లు; చొచ్చి = కూడి, చొరవకలిగి; ఉందున్ = ఉంటాను. </div> </div> </div> <!--8-556 ఒంటివాడ; నాకు... (ఆటవెలది)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-556 ఒంటివాడ; నాకు... (ఆటవెలది)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/39.Ontivaada_Naakunokati.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఒంటివాడ; నాకు నొకటి రెం డడుగుల<br> మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల<br> కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద<br> దానకుతుకసాంద్ర! దానవేంద్ర!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నీవు ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు బలిచక్రవర్తి. వచ్చినవాడు ఏకోరికలూ లేని పూర్ణకాముడని తెలియదు. ఆయనకు తగినట్లుగానే బదులు పలుకుతున్నాడు పరమాత్ముడైన వామనమూర్తి </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దానాలు చేయాలనే ఉబలాటం గుండెనిండా ఉన్న ఓ రాక్షసరాజా! నేను ఒంటరివాడను. ఒకటి, రెండడుగుల నేల నాకు చాలు. ఇవ్వు. సొమ్ములూ, కొమ్మలూ నాకు అక్కరలేదు. ఆ మూడడుగుల కోరిక తీరిందనుకో. దానితో బ్రహ్మదేవుని జుట్టు ముడిని ముట్టినంతగా సంబరపడిపోతాను.<br><br>భగవంతుడు ఒక్కడే. భగవంతుళ్ళు లేరు. ఆయన అనంతుడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఉద్ధరించటానికి మూడడుగుల నేల కావాలి. బ్రహ్మకూకటిని త్రివిక్రమమూర్తియై ఎలాగూ తాకుతాడు. అని పరమాత్మ లక్షణాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఒంటివాడన్ = ఒక్కడను; నా = నా; కున్ = కు; ఒకటి రెండు = మూడు (3); అడుగుల = అడుగుల; మేర = కొలత కల భూమి; ఇమ్ము = ఇమ్ము; సొమ్ము = సంపదలు; మేర = ఎల్లను; ఒల్ల = అంగీకరించను; కోర్కిన్ = కోరిక; తీరన్ = తీరినచో; బ్రహ్మ కూకటి ముట్టెదన్ = మిక్కిలి సంతోషించెదను {బ్రహ్మ కూకటి ముట్టెదను - బ్రహ్మయొక్క జుట్టును అందు కొనెదను, మహానంద పడెదను}; దాన = దానము చేసెడి; కుతుక = కుతూహలము; సాంద్ర = అధికముగా కలవాడ; దానవేంద్ర = రాక్షసరాజా. </div> </div> </div> <!--8-569 వసుధాఖండము వేడితో... మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-569 వసుధాఖండము వేడితో... మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/40.Vasudha_Khandamu_Veditho.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వసుధాఖండము వేడితో, గజములన్ వాంఛించితో, వాజులన్<br> వెస నూహించితొ, కోరితో యువతులన్, వీక్షించి కాంక్షించితో<br> పసిబాలుండవు, నేర వీ వడుగ, నీ భాగ్యంబు లీపాటిగా<br> నసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీనేర్చునే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తికి వామనుని పలుకులు వింతగా తోచాయి. ఇలా అన్నాడు. మహానుభావా! నీవన్న మాటలన్నీ నిజాలే. కానీ ఇంతకొంచెమా అడగటం!?. దాత పెంపునైనా తలపవద్దా, ఇదిగో చూడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓ బ్రహ్మచారీ! నేనేలే భూభాగంలో కొంతభాగమైనా కోరరాదా?. ఏనుగులనూ, గుఱ్ఱాలనూ అడుగవచ్చు కదా! అందచందాలతో మంచి వయస్సులో ఉన్న కాంతలను ఇమ్మంటే ఇవ్వనా? పాపం పసివాడవు. ఏమి కోరుకోవాలో నీకు తెలియదు. నీ భాగ్యాలు ఈమాత్రానివి అయినంత మాత్రాన మూడడుగుల నేలను ఇవ్వటానికి రాక్షస చక్రవర్తికి మనస్సు ఒప్పుతుందా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుట కాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుట కాని; వాజులన్ = గుర్రములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = అనుకొనుట కాని; కోరితో = కావాలనుట కాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరుట కాని; పసి = బాగా చిన్న; బాలుండవు = పిల్ల వాడవు; నేరవు = తెలియని వాడవు; అడుగ = అడుగుట; నీ = నీ యొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈ మాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షస చక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగె నని; ఈ = ఇంత; అల్పంబున్ = కొంచమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయ కలడా. </div> </div> </div> <!--8-571 గొడుగో జన్నిదమో... (మత్తేభం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-571 గొడుగో జన్నిదమో... (మత్తేభం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/41.Godugo_Jannidamo.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో,<br> వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్ వామాక్షులశ్వంబు లె<br> క్కడ? నిత్యోచితకర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూ<br> డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటయ బ్రహ్మాండంబు నాపాలికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి తన దానసామర్థ్యానికి తగినట్లు ఇవ్వగలవానికి సంబంధించిన పట్టికను ఏకరువుపెట్టాడు. కానీ పొట్టివడుగు సుకుమారంగా తనకు ఏది కావాలో ఆ పట్టికను మాత్రమే ఆయన విప్పుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహారాజా! నేను కోరదగినవి చాలా చిన్నవస్తువులు అయినటువంటిగొడుగో, జన్నిదమో, కమండలమో, దర్భల మొలత్రాడో, మోదుగ దండమో వంటివి మాత్రమే. బ్రహ్మచారినైన నాకు భూములతో, ఏనుగులతో, సుందరాంగులతో, గుఱ్ఱాలతో పని ఏమున్నదయ్యా! నేను ప్రతిదినము శ్రద్ధతో చేసుకొనే సంధ్యావందనం మొదలైన పనులకు నీవు చెప్పినవి ఏవీ ఉపయోగపడవుకదా! కాబట్టి నా కోరికకు లోబడి ఉన్న మూడడుగుల నేలను కాదనకుండా ఇవ్వటమే నాపాలిట బ్రహ్మాండం ఇచ్చినట్లు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> గొడుగొ = గొడుగు కాని; జన్నిదమో = జంధ్యము కాని; కమండులువో = కమండలము కాని; నా = నా; కున్ = కు; ముంజియో = మొలత్రాడు కాని; దండమో = యోగదండము కాని; వడుగున్ = బ్రహ్మచారిని; ఏన్ = నేను; ఎక్కడ = ఎక్కడ; భూములు = భూభాగములు; ఎక్కడ = ఎక్కడ; కరుల్ = ఏనుగులు; వామాక్షులు = జవరాండ్రు; అశ్వంబులున్ = గుర్రములు; ఎక్కడ = ఎక్కడ; నిత్యోచిత కర్మము = నిత్య కృత్యములు; ఎక్కడ = ఎక్కడ; మత్ = నా చేత; కాంక్షితంబు = కోరబడినది; ఐన = అయిన; మూడు = మూడు (3); అడుగుల్ = అడుగుల; మేరయ = పాటిది; త్రోవకన్ = కాదనక; ఇచ్చుట = దానము చేయుట; అది = అదే; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; నా = నా; పాలికిన్ = పాలిటికి, మట్టుకు. </div> </div> </div> <!--8-574 ఆశాపాశంబు దాఁ... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-574 ఆశాపాశంబు దాఁ... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/42.Aasapasamu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఆశాపాశము దా గడు న్నిడుపు; లే దంతంబు రాజేంద్ర!; వా<br> రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం<br> గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా<br> మాశన్ బాయగనేర్చిరే మును; నిజాశాంతంబులం జూచిరే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఇంకా వామనుడు ఇలా అంటున్నాడు - ఇవ్వగలిగినవాడు ఇస్తున్నకొద్దీ పుచ్చుకొనేవానికి ఆశ పెరుగుతూ ఉంటుంది. ఆ మాయ రోగానికి మందు ఉందా అనిపిస్తుంది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజా! ఆశ అనేది ఒక మహాపాశం. అది చాలాచాలా పొడవైనది. దానికి అంతంలేదు. సముద్రాలు చుట్టుకొన్న భూవలయ సామ్రాజ్యం చేతికి చిక్కినా పృథువు, గయుడు మొదలైన రాజులు ఆశను చంపుకోలేక తామే నాశనమయ్యారు కానీ అర్థకామాలమీది ఆశను వదలగలిగారా? ఆశకు అంతం చూడగలిగారా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఆశా = ఆశ యనెడి; పాశంబు = తాడు; తాన్ = అది; కడున్ = మిక్కిలి; నిడుపు = పొడ వైనది; లేదు = లేదు; అంతంబు = అంతు; రాజేంద్రా = చక్రవర్తి; వారాశి = సముద్రముచే {వారాశి – నీటికి కుప్ప, కడలి}; ప్రావృత = చుట్టబడిన; మేదినీ = భూ; వలయ = మండల; సామ్రాజ్యంబున్ = సామ్రాజ్యములు; చేకుడియున్ = సమకూరి నప్పటికి; కాసిన్ = శ్రమను; పొందిరి = పడిరి; కాక = కావచ్చు కాని; వైన్య = పృథుడు; గయ = గయుడు యనెడి; భూకాంతులున్ = చక్రవర్తులు కూడ; అర్థ = సంపదల పైన; కామ = కామముల పైన; ఆశన్ = ఆశను; పాయగన్ = వదలుట; నేర్చిరే = చేయ గలిగిరా, లేదు; మును = ఇంతకుముందు; నిజ = తమ; ఆశ = ఆశలకు; అంతంబున్ = అంతును; చూచిరే = కనుగొనగలిగిరా, లేదు. </div> </div> </div> <!--8-577 దనుజేంద్ర యీతఁడు... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-577 దనుజేంద్ర యీతఁడు... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/43.Danujendra_Eethadu_Dharaneesurudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> దనుజేంద్ర! యీతడు ధరణీసురుడు గాడు; దేవకార్యంబు సాధించుకొఱకు<br> హరి విష్ణు డవ్యయుం డదితిగర్భంబున గశ్యపసూను డై గలిగె; నకట<br> యెఱుగ వీతనికోర్కె; నిచ్చెద నంటివి; దైత్యసంతతి కుపద్రవము వచ్చు;<br> నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చును వాసవునకు;<br> <br> <b>(ఆటవెలది) </b><br> <br> మొనసి జగములెల్ల మూడుపాదంబుల<br> నఖిలకాయు డగుచు నాక్రమించు<br> సర్వధనము విష్ణుసంతర్పణము చేసె<br> బడుగుపగిది యెట్లు బ్రదికె దీవు<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బాలుడు తన ప్రలోభాలకు ఏమాత్రం తలఒగ్గే తీరులో లేడు. మహాదానం ఇవ్వలేకపోతున్నాననే దిగులు బలిచక్రవర్తికి మనస్సులో ఉన్నా అడిగినది ఇచ్చి తృప్తి పడదామనుకొని దానమివ్వటానికి పూనుకున్నాడు. అప్పుడు గురువర్యులు శుక్రాచార్యులవారు ఇలా అంటున్నారు - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాక్షస చక్రవర్తీ! ఈ వచ్చినవాడు బ్రాహ్మణ బాలకుడు కాడు. దేవతలపని చక్కబెట్టటానికి వచ్చిన విష్ణువు. అవ్యయుడు. ఎట్టి మార్పులూ ఎగుడు దిగుళ్ళూ లేనివాడైనా తన పూనికతో అదితి కడుపులో కశ్యప ప్రజాపతి కుమారుడై అవతరించిన మహాత్ముడు. అతని మహిమ తెలియక కోరిక తీరుస్తానంటున్నావు. నీ నిర్ణయంవలన మన రాక్షస కులమంతా నాశనం అయిపోతుంది. నీ సంపదను, నీ తేజస్సును, నీ స్థానాన్నీ, నీ ప్రభుత్వ మహిమను కపటమార్గంలో కొల్లగొట్టి యింద్రునికి ధారపోస్తాడు. మూడు అడుగులతో లోకాలనన్నింటిని హద్దూపద్దూలేని దేహంతో ఆక్రమిస్తాడు. నీకున్న ధనం మొత్తంగా విష్ణువునకు సంతర్పణ చేసి పరమ దరిద్రుడవై ఎలా బ్రతుకుతావయ్యా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> దనుజేంద్ర = రాక్షస చక్రవర్తి; ఈతడు = ఇతగాడు; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; కాడు = కాడు; దేవ = దేవతల; కార్యంబు = పని; సాధించు = సాధించుట; కొఱకు = కోసము; హరి = నారాయణుడు; విష్ణుడు = నారాయణుడు; అవ్యయుండు = నారాయణుడు; అదితి = అదితి యొక్క; గర్భంబునన్ = కడుపులో; కశ్యప = కశ్యపుని యొక్క; సూనుడు = పుత్రుడు; ఐ = అయ్యి; కలిగెన్ = పుట్టెను; అకట = అయ్యో; ఎఱుగవు = నీకు తెలియదు; ఈతని = ఇతని యొక్క; కోర్కిన్ = కోరికను; ఇచ్చెదన్ = ఇస్తాను; అంటివి = అన్నావు; దైత్య = రాక్షస; సంతతి = కులమున; కున్ = కు; ఉపద్రవము = పెను ముప్పు; వచ్చున్ = వచ్చును; నీ = నీ యొక్క; లక్ష్మిన్ = సంపదలను; తేజంబున్ = తేజస్సును; నెలవున్ = స్థానమును; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; వంచించి = దొంగిలించి; ఇచ్చున్ = ఇచ్చును; తాన్ = అతడు; వాసవున్ = ఇంద్రుని; కు = కి. <br><br>మొనసి = వ్యూహము పన్ని; జగములు = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; మూడు = మూడు (3); పాదంబులన్ = అడుగుల తోటి; అఖిల కాయుడు = విశ్వ రూపుడు; అగుచున్ = అగుచు; ఆక్రమించున్ = అలము కొనును; సర్వ = సమస్త మైన; ధనమున్ = సంపదలను; విష్ణు = నారాయణునికి; సంతర్పణము = అప్పజెప్పుట; చేసి = చేసి; బడుగు = బీద వాని; పగిదిన్ = వలె; ఎట్లు = ఎలా; బ్రతికెదవు = జీవించ గలవు; ఈవు = నీవు. </div> </div> </div> <!--8-584 వారిజాక్షులందు... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-584 వారిజాక్షులందు... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/44.Vaarijakshulandu_Vyvaahikamulandu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వారిజాక్షులందు, వై వాహికములందు,<br> ప్రాణ విత్త మాన భంగమందు,<br> చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు<br> బొంకవచ్చు; నఘము పొంద దధిప!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శుక్రాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు - ఇస్తాను అనిమాట ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వను అనటం బొంకు అవదూ! పలికి బొంకేవాడు పాపాత్ముడంటున్నాయి ధర్మశాస్త్రాలు. ఆ పాపం మూట ఎలాకట్టుకోను అంటావేమో, విను - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజేంద్రా! స్త్రీల విషయంలోనూ, వివాహ వ్యవహారాలలోను, ప్రాణభంగం, విత్తభంగం, మానభంగం సంభవించినప్పుడూ, భయపడిన ఆలమందలను, బ్రాహ్మణులను రక్షించవలసిన సందర్భాలలోను బొంకవచ్చు. దానివలన పాపం కలుగదు అని రాక్షస గురువైన శుక్రాచార్యులవారు, రాక్షసరాజైన బలిచక్రవర్తికి బోధించారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వారిజాక్షుల = ఆడవారివిషయము {వారి జాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కల వారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికి సంబంధించిన వాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడి సందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంక వచ్చు = అబద్ద మాడ వచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా. </div> </div> </div> <!--8-589 కారే రాజులు... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-589 కారే రాజులు... (శార్దూలం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/45.Kare_Rajulu_Rajyamulu_Kalugave.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే<br> వా రేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై<br> పే రై నం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాము లై<br> యీరే కోర్కులు; వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శుక్రాచార్యులవారు శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తిని కాపాడాలని హితం చెప్పినా బలికి మాత్రం లౌకికమైన హితంమీద చూపులేదు. అతడు కోరుకొనేది పారమార్థిక హితం. గురువుమీది గౌరవానికి భంగంలేకుండా తన అభిప్రాయాన్ని గట్టిగా తెలియజేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరమపవిత్రమైన భృగువంశంలో పుట్టిన పూజ్యగురుదేవా! మనకు ముందు ఎందరు రాజులు కాలేదు. ఎన్ని రాజ్యాలు లేవు? మేము సార్వభౌములము అని పొగరు సోపానాల చివరిదాకా వారు పోలేదా? వారేరీ? కీర్తిసంపద తప్ప వారు సంపాదించిన ధనాన్ని మూటగట్టుకొని పోగలిగారా? భూమిమీద పేరైనా నిలుపుకోగలిగారా?. ఆర్తిని అందలం ఎక్కించే ఐశ్వర్యాన్ని అణుమాత్రమైనా అభిలషించని శిబి మొదలైన మహాత్ములు, ఏమికోరినా, ఎంతకోరినా ఎంతో ఇష్టంతో ఇచ్చారు. చిరంజీవులై వెలుగొందుతున్నారు. ఎన్నియుగాలు గడచినా వారిని మానవులు మఱచిపోయారా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; కలుగవే = పొంద లేదా ఏమి; గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను; పొందరే = చెంద లేదా ఏమి; వారు = వా ళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరిని = సంపదలను; మూట గట్టుకొని = కూడ గొట్టుకొని; పోవం జాలిరే = తీసుకెళ్ళ గలిగిరా, లేదు; భూమిపై = నేల పైన; పే రైనన్ = కనీసము పే రైన; కలదే = ఉన్నదా, లేదు; శిబి = శిబి చక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగు వారు; ప్రీతిన్ = కోరి; యశః = కీర్తి; కాములు = కోరు వారు; ఐ = అయ్యి; ఈరే = ఇవ్వ లేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; ఈ = ఇప్పటి; కాలమున్ = కాలము నందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు పుత్రుడు, శుక్రుడు}. </div> </div> </div> <!--8-591 ఆదిన్ శ్రీసతి... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-591 ఆదిన్ శ్రీసతి... (శార్దూలం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/46.Aadin_Sreesathikoppupai.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంసోత్తరీయంబుపై<br> పాదాబ్జంబులపై, గపోలతటిపై, పాలిండ్లపై నూత్న మ<br> ర్యాదం జెందు కరంబు క్రిం దగుట, మీ దై నా కరం బుంట మే<br> ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఇంకా బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు - మహానుభావా! అడుగుతున్నవాడు అచ్యుతుడు. అన్ని లోకాలకూ ఆవలిభాగంలో అనంతంగా అలరారే ఆస్వామి పొట్టివాడై కోరి నా దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నాడు. నావంటివాడు ఇవ్వకపోవటం ధర్మం కాదే! అయినా నా భాగ్యం ఎంత గొప్పదో గమనించండి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ శ్రీమహావిష్ణువు చేయి మొట్టమొదట మహాలక్ష్మీదేవి కొప్పుమీద వివాహ సమయంలో జీలకర్రా బెల్లం పెట్టినప్పుడు నిలిచి ఉన్నది. తరువాత ఆమె సువర్ణమయ దేహాన్నంతటినీ సుకుమారంగా స్పృశించింది. కొన్ని సందర్భాలలో భుజంమీది ఉత్తరీయం అంచులను సవరించింది. మఱికొన్ని వేళలలో పద్మాలవంటి పాదాలను పరామర్శించింది. చెక్కిళ్ళపై చిందులాడింది. పాలిండ్ల మీద పారవశ్యంతో ప్రేమ వెల్లువతో కదలాడింది. ఆ మర్యాదలన్నీ ఎప్పటికప్పుడు క్రొత్తక్రొత్త అనుభూతులను స్వామికి కలిగించినట్టివి. అటువంటి భాగ్యసంపదగల ఆస్వామిచేయి క్రిందుగా ఉండటమూ, నాచేయి పైన ఉండటమూనా ఆహా! ఎంత మహాభాగ్యమయ్యా! ఈ రాజ్యమూ గీజ్యమూ ఏ క్షణంలో ఉంటుందో, ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. దేనిని నమ్ముకొని మనం ఏదో బాముకుందామనుకుంటున్నామో ఆ ఈ దేహం కూడ అనుక్షణం అపాయంతో అలమటించేదే కదయ్యా! ఈ దౌర్భాగ్యంకోసం అంతటి మహాభాగ్యాన్ని చేజార్చుకొనే అవివేకి ఎవడైనా ఉంటాడా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; తనువు = వంటి; పైన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములు యనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సర కొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా, కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా, కాదు. </div> </div> </div> <!--8-595 ఎన్నడుం బరు... (మత్తేభం)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-595 ఎన్నడుం బరు... (మత్తేభం)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/47.Yennadum_Paru_Vedabodata.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎన్నడుం పరు వేడబోడట; యేకలం బట; కన్నవా<br> రన్నదమ్ములు నై న లేరట; యన్నివిద్యల మూలగో<br> ష్ఠి న్నెఱింగిన ప్రోడగు జ్జట చేతు లొగ్గి వసింప నీ<br> చిన్ని పాపని ద్రోసిపుచ్చగ చిత్త మొల్లదు సత్తమా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యులవారితో ఇలా అంటున్నాడు- గురుదేవా! మరొక్కమనవి చేసుకుంటాను. బిచ్చమెత్తటానికిఎందరో వచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ గుజ్జు వడుగును చూడు అతడడిగినది యివ్వక పంపివేయటం నాకు సాధ్యమయ్యే పనికాదు – ఎందుకంటే - </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏ సమయంలోనూ ఇతరులను వేడుకోవటానికి పోయినవాడు కాడట! తోడూనీడా ఎవరూ లేనివాడట! కన్నతల్లిదండ్రులు గానీ తోడబుట్టువులు గానీ ఎవ్వరూ లేరట! పరమాత్మను తెలిపే సర్వవిద్యల మూలరహస్యాలను నిండుగా తెలిసిన ప్రౌఢబాలుడట! భిక్షాందేహి అని చేతులు జోడించి ఎదురుగా నిలిచిఉన్నాడు. ఇట్టి చిన్నిపాపని త్రోసివేయటానికి మనస్సు అంగీకరించటం లేదు, గురుదేవా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలంబు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్న వారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యల యొక్క; మూలగోష్ఠి = ముఖ్య సారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహు నేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్ని పాపనిన్ = పసి వానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుట లేదు; సత్తమా = సమర్థుడా. </div> </div> </div> <!--8-620 ఇంతితం తై... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-620 ఇంతితం తై... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/48.Inthinthai_Vatudinthai.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇంతిం తై వటు డింత యై మఱియు దా నింతై నభోవీథిపై<br> నంతై తోయద మండలాగ్రమున కల్లం తై ప్రభారాశిపై<br> నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై<br> నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి గురుదేవుని ఒప్పించి మూడడుగుల నేలను ధారాపూర్వకంగా దానం ఇచ్చివేశాడు. వచ్చిన పనిని చక్కబెట్టటానికి వామనదేవుడు పెరిగిపోతున్నాడు. ఆ పెంపును పోతనగారి అక్షరచిత్రంలో దర్శించి ఆనందిద్దాం </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మొదట ఇంతగా ఉన్న ఆ బ్రహ్మచారి మరింతగా పెరిగాడు. ఇంకా పెంపొందాడు. నేలబారు జీవులు తలలు బాగాపైకి ఎత్తుకొని చూడవలసినంతగా ఆకాశమార్గంలోనికి చొచ్చుకొనిపోతున్నాడు. మేఘమండలం దాటిపోయాడు. కాంతిగోళాలైన నక్షత్రాలపైకి పెరిగిపోయాడు. చంద్రమండలాన్ని కూడా దాటుకొని పైకిపోతున్నాడు. ధ్రువనక్షత్రం పైభాగం తాకుతున్నాడు, భూమినుండి నాలుగవది అయిన మహర్లోకాన్ని కూడా క్రిందుగా ఉంచుకొని పెరుగుతున్నాడు. అన్నింటికంటె చిట్టచివరిదైన సత్యలోకాన్ని కూడా క్రిందుచేస్తూ పైకిపోతున్నాడు. బ్రహ్మాండం ఆవలి అంచులను దాటుకొని విక్రమిస్తున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇం తింత = కొంచము మరికొంచము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరి కొంచము; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచము; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అ ల్లంత = ఆవత లంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగుల రాశి, పాలపుంత; పైన్ = కంటె ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడి కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహ ర్వాటిన్ = మహర్లోకము కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకము కంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కల వాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండా పెరిగిన వాడు; ఐ = అయ్యి. </div> </div> </div> <!--8-621 రవిబింబం బుపమింపఁ... (మత్తేభం)--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">8-621 రవిబింబం బుపమింపఁ... (మత్తేభం)</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/08/49.Ravi_Bimbambupamimpa.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రవిబింబం బుపమింప పాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై,<br> శ్రవణాలంకృత మై, గళాభరణ మై, సౌవర్ణ కేయూర మై,<br> ఛవిమత్కంకణ మై, కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై, నూపుర<br> ప్రవరం బై, పదపీఠ మై, వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలిచక్రవర్తి దానధారను మంత్రపూర్వకంగా వదలిన వెంటనే వామనస్వామి త్రివిక్రముడయ్యాడు. ఆ పెరుగుదల క్రమంలో సూర్యబింబం గతి ఏవిధంగా ఉన్నదో తెలియజేస్తున్నాడు తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> క్రింద వామనుడు. పైన ఎక్కడో ఆకాశం అంచులలో సూర్యబింబం. అది మొదట ఆ మహాస్వామికి పట్టిన గొడుగులాగా ఉన్నది. పెరుగటంలోని రెండవదశలో ఆ భానుబింబమే స్వామికి తలమానికంలాగా కనుపట్టింది. మూడవదశలో చెవికి పెట్టుకొన్న వజ్రాల ఆభరణం అయింది. తరువాత మెడలో ధరించిన హారంలోని నాయకమణియై అలరారినది. అటుపై భుజానికి అలంకరించుకొన్న బంగారుకేయూరమై ప్రకాశించింది. ఆవెనుక కాంతులతో వెలిగిపోతున్న ముంజేతికంకణమై ప్రకాశించింది. అటుపిమ్మట నడుము దగ్గర వింతవింత కాంతులతో విరాజిల్లుతున్న పీతాంబరమై అలరారింది. మరికొంతసేపటికి మడమభాగంలో అలంకరించుకొన్న అందెఅయి అందాలు చిందించింది. చివరకు ఆయన విలాసంగా పాదాలుపెట్టుకొనే పీఠం అయిపోయింది. ఈవిధంగా శ్రీమహావిష్ణువు ఏ కొలతలకూ అందనితనాన్ని మన అనుభవంలోనికి తెస్తున్నది ఈ పద్యం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రవిబింబంబున్ = సూర్య బింబము; ఉపమింపన్ = సరి పోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలె నయ్యి; శిరో రత్నము = శిరసు పైని ఆభరణము; ఐ = వలె నయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలె నయ్యి; గళ = కంఠము నందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలె నయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలె నయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతి కంకణము; ఐ = వలె నయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; వస్త్రము = బట్ట; ఐ = వలె నయ్యి; నూపుర = కాలి అందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలె నయ్యి; పద పీఠంబు = పాద పీఠము; ఐ = వలె అయ్యెను వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంత వ్యాపించు నప్పుడు. </div> </div> </div> <div> <div style="width:10%;Text-align:center;float:left;"> <div class="button-effect"> <a class="effect effect-4" href="iBam7.html" title="సప్తమ స్కంధం" style="background-color: #f4511e;"><i class="fas fa-arrow-left"></i> సప్తమ స్కంధం</a> </div> </div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam9.html" title="నవమ స్కంధం" style="background-color: #f4511e;">నవమ స్కంధం <i class="fas fa-arrow-right"></i></a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>