JezK
Edit File: iBam6.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam6.html Date Name Comments ==== ==== ======== 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <br> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <link rel="shortcut icon" href="../images/favicon.png"/> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet" /> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> <link href="../assets/css/main.css" rel="stylesheet" /> <link href="../assets/css/ibam.css" rel="stylesheet" /> <script> <!-- $(window).scroll(function () { --> <!-- $('audio').each(function () { --> <!-- //if ($(this).is(":in-viewport")) --> <!-- if (IsInViewport($(this))) --> <!-- { --> <!-- $(this)[0].play(); --> <!-- } --> <!-- else --> <!-- { --> <!-- $(this)[0].pause(); --> <!-- } --> <!-- }) --> <!-- }); --> <!-- Check if an element is in the visible viewport --> <!-- @param {jQuery|HTMLElement} el --> <!-- @return boolean --> <!-- var IsInViewport = function (el) { --> <!-- if (typeof jQuery === "function" && el instanceof jQuery) el = el[0]; --> <!-- var rect = el.getBoundingClientRect(); --> <!-- return ( --> <!-- rect.top >= 0 && --> <!-- rect.left >= 0 && --> <!-- rect.bottom <= (window.innerHeight || document.documentElement.clientHeight) && --> <!-- rect.right <= (window.innerWidth || document.documentElement.clientWidth) --> <!-- ); --> <!-- }; --> </script> </head> <body> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"><a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1<span class="sr-only">(current)</span></a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a></li> <li class="nav-item"><a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a></li> <li class="nav-item"><a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a></li> <li class="nav-item"><a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a></li> <li class="nav-item"><a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a></li> <li class="nav-item"><a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a></li> <li class="nav-item"><a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a></li> <li class="nav-item"><a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a></li> <li class="nav-item"><a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a></li> <li class="nav-item"><a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a></li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a></li> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-skype" aria-label="Skype" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-linkedin" aria-label="Linkedin" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-google-plus" aria-label="Google-Plus" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a></li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a></li> </ul> </div> </nav> <!-- <div class="img-responsive aln-top" style="margin-top: 50px; background-color: white; z-index: 99; position: relative;"> <img src="../images/iBam.png" /> </div>--> <div class="container-fluid"> <div id="chap6" > <!-- <br><br> --> <h3 class="title" style="padding-top: 6px;" >షష్ఠ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap6"></div> <div class="col-sm-9"> <!--6-12 ఎమ్మెలు చెప్పనేల... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-12 ఎమ్మెలు చెప్పనేల... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/01.Yemmelu_Seppanela.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎమ్మెలు సెప్పనేల? జగ మెన్నగ పన్నగరాజశాయికిన్<br> సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని, భక్తిలో<br> నమ్మినవాని, భాగవత నైష్ఠికు డై తగువాని, పేర్మితో<br> బమ్మెర పోతరాజు కవిపట్టపురాజు దలంచి మ్రొక్కెదన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తెలుగు భాగవతంలో ఆరవ స్కంధాన్ని ఏర్చూరి సింగయ రచించాడు. తనకు మార్గదర్శకుడైన బమ్మెరపోతన్న గారిని పరమభక్తితో ఇలా స్తుతిస్తున్నాడు సింగయ. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> వినోదం మాటలు ఎందుకులెండి. ఉన్నమాట ఉన్నట్టు అంటాను అంటారు మా గురువు పోతన్నగారు. అందువలననే ఆదిశేషుని పడగలమీద పవ్వళించే పరమాత్మకు ఆభరణాలు అయ్యే తీరుతో వాక్యాలసంపదలు కొల్లలుగా నివేదించుకున్నారు. దానిని జగమంతా కొనియాడింది. పరమభక్తితో ఆ స్వామినే నమ్ముకొని జీవించారు. భగవంతుని కథలమీదా, భగవంతుని భక్తుల కథలమీదా పరమనిష్ఠగల భాగవతోత్తములు వారు. అట్టి కవిసార్వభౌముడని కొనియాడదగిన బమ్మెర పోతనగారిని స్మరిస్తూ మ్రొక్కులు చెల్లించుకుంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎమ్మెలు = ప్రగల్భములు; చెప్పనేల = చెప్పుట ఎందులకు; జగము = లోకము ఎన్నగన్ = కీర్తించగా; పన్నగరాజశాయికిన్ = ఆదిశేషుడు పాన్పుగా కల నారాయణు నికి; సొమ్ముగా = సొమ్ములుగా; వాక్యసంపదలు = మాటలనెడి సంపదలు; చూఱలు చేసినవాని = కొల్లలుగా సమర్పించిన వానిని; భక్తి = భక్తిగా; లోనమ్మినవాని = మనసు లో నమ్మినవానిని; భాగవత = భాగవతులలో; నైష్ఠికుడై = నిష్ఠ గలవాడై; తగువాని = తగిన వానిని; పేర్మితో = ఆదరముతో; బమ్మెఱ పోతరాజు = బమ్మెఱ పోతన అను; కవి పట్టపురాజున్ = కవులలో మిక్కిలి శ్రేష్ఠుడైన వానిని; తలంచి = సంస్మరించి; మ్రొక్కెదన్ = కొలిచెదను. </div> </div> </div> <!--6-14 ఎయ్యది కర్మబంధముల... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-14 ఎయ్యది కర్మబంధముల... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/02.Yeyyadi_Karma_Bandhamula.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు, విభూతికారణం<br> బెయ్యది, స న్మునీంద్రులకు నెల్ల గవిత్వసమాశ్రయంబు ము<br> న్నెయ్యది, సర్వమంత్రముల నేలిన దెయ్యది, మోక్షలక్ష్మిరూ<br> పెయ్యది, దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఏర్చూరి సింగన బమ్మెర పోతనను భక్తితో ఉపాసించిన ఉత్తమకవి. ఆ ప్రభావంతో ఏర్పడిన సంస్కారబలంతో భాగవతం ఒక పరమమంత్రంగా సంభావించి దానిని పలుకుతానంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన గుణగణాలను ప్రపంచించి చెప్పే ఒక మహామంత్రం. అది కర్మలవలన కలిగే బంధాలన్నింటినీ తొలగించివేస్తుంది. పొందదగిన గొప్పసంపదలన్నింటినీ భక్తులకు సిద్ధింపజేస్తుంది. నిత్యసత్యమైన పరతత్త్వాన్ని మాత్రమే పలకాలనే పట్టుదలగల మహర్షులు వాల్మీకికీ, వ్యాసుల వారికీ అత్యద్భుతమైన కవిత్వభిక్ష పెట్టింది. మంత్రాలన్నింటినీ ఏలిన మహామంత్రం అది. ఒక్కమాటలో చెప్పాలంటే అది అందరూ అందుకోవలసిన మోక్షలక్ష్మియే. భక్తుల హృదయాలలో భద్రంగా నెలకొని ఉండేది ఆ మంత్రమే. కనుక నేను దానినే వాక్కులతో ఉపాసిస్తాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎయ్యది = ఏది ఐతే; కర్మ = కర్మము యొక్క; బంధములన్ = బంధనములను; ఎల్లన్ = సమస్తమును; హరించు = నశింపజేసెడి; విభూతి = వైభవమునకు; కారణంబు = కారణమైనది; ఎయ్యది = ఏదైతే; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రుల్ = ఇంద్రుని వంటివారి; కున్ = కి; ఎల్లన్ = అందరి; కవిత్వ = కవిత్వమునకు; సమాశ్రయంబు = చక్కటి ఆశ్రయమైనది; మున్ను = పూర్వము నుండి యున్నది; ఎయ్యది = ఏదైతే; సర్వ = సమస్తమైన; మంత్రములన్ = మంత్రములను; ఏలినది = పాలించునది; ఎయ్యది = ఏదైతే; మోక్ష = మోక్ష మనెడి; లక్ష్మీ = సంపదల; రూపు = స్వరూపము; ఎయ్యది = ఏదైతే; దానిన్ = దానిని; పల్కెద = చెప్పెదను; సు = మంచి; హృద్యము = మనసులకు నచ్చు నట్టిది; భాగవత = భాగవతము యనెడి; ఆఖ్య = పేరు గల; మంత్రమున్ = మంత్రము యైన దానిని. </div> </div> </div> <!--6-23 భాగవతము తేటపఱుప... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-23 భాగవతము తేటపఱుప... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/03.Bhagavathamu_Thetaparupa.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భాగవతము తేటపఱుప నెవ్వడు సాలు ?<br> శుకుడు దక్కనరుని సకుడు దక్క<br> బుద్ధి దోచినంత, బుధులచే విన్నంత,<br> భక్తి నిగిడినంత, పలుకువాడ<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతం మరొకరూపంలో మనకు దొరకిన వేదం. అది జ్ఞానదీపం. దానిని తెలిసి పలకటం తేలికైన పనికాదు. ఆ గౌరవాన్ని చక్కగా గమనించి పలుకుతున్నాను అంటున్నారు సింగయ్య కవి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> భాగవతం స్పష్టంగా తెలియజెప్పటానికి చాలినవారు ఇద్దరు మాత్రమే. ఒక మహాత్ముడు శుకయోగీంద్రుడు. రెండవవాడు సాక్షాత్తు పరమాత్మయే అయిన శ్రీకృష్ణవాసుదేవుడు. నాబుద్ధిని ప్రేరణచేసి స్వామి ఎంత అందిస్తాడో అంత పలుకుతాను. జ్ఞానసంపన్నులైన పండితులు చెప్పగా చెవులబడినంత పట్టుకొని పలుకుతాను. అన్నింటికంటె ముఖ్యమైనది భక్తి. అది ఎంతదూరం సాగితే అంత చెబుతాను </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భాగవతమున్ = భాగవతమును; తేటపఱుపన్ = తెలియ జెప్పుటకు; ఎవ్వడు = ఎవరు; చాలున్ = సరిపోగలరు; శుకుడు = శుకయోగి; తక్క = తప్పించి; నరునిసఖుడు = కృష్ణుడు {నరునిసఖుడు - నరుడు (అర్జునుడు) యొక్క సఖుడు, కృష్ణుడు}; తక్క = తప్పించి; బుద్ధిన్ = నా బుధ్ధికి; తోచినంత = అందినంతవరకు; బుధుల్ = జ్ఞానుల; చేన్ = చేత; విన్నంత = వినినంత; భక్తి = నాభక్తి; నిగిడినంత = సాగినంతవరకు; పలుకువాడ = చెప్పెదను. </div> </div> </div> <!--6-52 కొందఱు పుణ్యవర్తనులు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-52 కొందఱు పుణ్యవర్తనులు... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/04.Kondaru_Punyavarthanulu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా<br> నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో<br> వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం<br> జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పరీక్షిత్తు శుకయోగీంద్రులను పాపపంకిలం నుండి బయటపడటం ఎలా అని ప్రశ్నచేశాడు. దానికి సమాధానంగా శుకులు ఇలా వివరిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెదవంటిదవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్నభావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కొందఱు = కొంతమంది; పుణ్యవర్తనులు = పుణ్యమార్గనుసారులు; గోపకుమార = కృష్ణమూర్తి {గోపకుమారుడు - (నంద) గోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు}; పద = పాదములు యనెడి; అరవింద = పద్మదళముల; జా = పుట్టిన; ఆనంద = ఆనంద మనెడి; మరంద = తేనెను; పానకలన = తాగుట యందు; ఆరతన్ = ఆతృత గల; షట్పద = తుమ్మెదలవంటి; చిత్తులు = మనసులు గలవారు; ఔచున్ = అగుచూ; గోవింద = గోవిందుని యెడల; పరాయణుల్ = లగ్నమైనవారు; విమల = స్వచ్ఛమైన; వేషులు = వర్తన గలవారు;దోషమున్ = పాపములను; అడంతురు = అణచివేయుదురు; ఆత్మలన్ = తమ ఆత్మలను; చెందిన = పొందిన; భక్తి = భక్తి; చేతన్ = చేత; రవి = సూర్యుడు; చేకొని = పూనుకొని; మంచున్ = మంచుతెరలను; అడంచు = అణచివేయు; కైవడిన్ = వలె. </div> </div> </div> <!--6-53 హరి భక్తి చేతఁ... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-53 హరి భక్తి చేతఁ... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/05.Hari_Bhakthi_Cheta.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> హరిభక్తి చేత కొందఱు<br> పరిమార్తురు మొదలు ముట్ట బాపంబుల ని<br> ష్ఠురతర కరముల సూర్యుం<br> డరుదుగ, బెనుమంచుపించ మణచినభంగిన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> విష్ణుభక్తిని పెంపొందించుకుంటే పరమాత్మను చేరుకొనే దారిలోని అడ్డంకులన్నీ తొలగిపోవటాన్ని శ్రీ శుక యోగీంద్రులు పరీక్షిత్తునకు ఇలా తెలియజేస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మానవుని పట్టిపల్లార్చేవి పాపాలు. వానిని మూలముట్టుగా మట్టుపెట్టటం మానవునకు తప్పని కర్తవ్యం. ఆ పనిచేయకపోతే కలిగేది భ్రష్టతయే. సూర్యభగవానుడు తనతీవ్ర కిరణాలతో బాగా క్రమ్ముకొన్న మంచు పొగరు అణచివేయకపోతే మానవునకు దారి కానరాదు. సూర్యుడు మంచును చీల్చి వెలుగును ప్రసాదించినట్లుగా శ్రీవాసుదేవభక్తి పాపాలను సమూలంగా తొలగించివేస్తుంది. భగవద్దర్శనానికి అడ్డంగా ఉన్నతెర దానితో తొలగిపోతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హరి = విష్ణుమూర్తి పైనభక్తి = భక్తిచేతన్ = వలనకొందఱు = కొంత మందిపరిమార్తురు = నాశనము చేసెదరుమొదలు ముట్ట = మొద లంటపాపంబులన్ = పాపములనునిష్ఠురతర = అతితీవ్రమైన {నిష్ఠుర - నిష్ఠురతర - నిష్ఠురతమ} కరములన్ = కిరణముల చేతసూర్యుండు = సూర్యుడుఅరుదుగా = అపూర్వముగాపెను = పెద్దమంచున్ = మంచుపించ మడచిన = గర్వభంగము చేసినభంగిన్ = విధముగా </div> </div> </div> <!--6-58 సతతముఁ గృష్ణ పాద... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-58 సతతముఁ గృష్ణ పాద... (చంపకమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/06.Sathathamu_Krishna_Padajalajambulayandu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు<br> వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం<br> హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే<br> గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీశుకయోగీంద్రులు పరీక్షిన్మహారాజునకు కృష్ణభక్తి వలన లభించే మహాఫలాన్ని మధురమైన మాటలతో ఇలా వివరిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సతతము = ఎల్లప్పుడుకృష్ణ = కృష్ణునిపాద = పాదములు యనెడిజలజంబులన్ = పద్మములఅందున్ = అందుమనంబున్ = మనసునునిల్పు = నిలిపెడిసు = చక్కటివ్రతులు = దీక్ష గల వారుతదీయ = అతనిశుద్ధ = పరిశుద్ధ మైనగుణ = సుగుణము లందురాగులు = అనురాగము గల వారుకాలుని = యమునియుగ్ర = భయంకర మైనపాశ = పాశములసంహతులన్ = గట్టిగాకొట్టుటనుధరించు = ధరించెడితత్ = అతనిసుభటక = గొప్పభటులవర్గములన్ = సమూహములనుకల = స్వప్నములోనన్ = లోనైననుకానరు = పొందరుఏ = ఏగతులను = విధముగనుదుష్ట = పాపపు, చెడ్డకర్మములు = కర్మలుకైకొని = చేపట్టివారలన్ = వారినిచెందన్ = చేరుటనునేర్చునే = కలుగునా </div> </div> </div> <!--6-72 దూరమున నాడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-72 దూరమున నాడు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/07.Duramuna_Naadu_Baludu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> దూరమున నాడు బాలుడు<br> బోరన దన చిత్తసీమ బొడగట్టిన నో<br> నారాయణ! నారాయణ! నారాయణ!<br> యనుచు నాత్మనందను నొడివెన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అజామీళుడు అనే ఒక పాపడు పాపాలపుట్ట. కన్యాకుబ్జంలో ఉండేవాడు. సంసార లంపటంలో మునిగి తేలుతూ ఎనభై ఎనిమిదేండ్ల జీవితం వ్యర్థం చేసుకున్నాడు. చివరికి పోగాలం దాపురించింది. యమభటులు ఎదురుగా హృదయం అదరిపోయేలా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతనికి తన కడగొట్టు ముద్దులపట్టి నారాయణుడు తలపులో మెదిలాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తాను ముచ్చటపడి అతనితోడిదే బ్రతుకు అన్నట్లు కనిపెంచిన నారాయణ నామం గల కొడుకు దూరాన ఆడుకొంటున్నాడు. ఒకవంక యమభటులు తర్జిస్తూ గర్జిస్తూ ప్రాణాలను గుంజుకొనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అదృష్టవశాన నారాయణుడు గుర్తుకువచ్చాడు. అప్పుడా మహాపాతకశిరోమణి నారాయణా! నారాయణా! నారాయణా! అని మూడుమారులు గొంతెత్తి పిలిచాడు. కొడుకు నారాయణుడు పలికాడో లేదో కానీ పరమాత్మ అయిన నారాయణుడు అనుగ్రహించి పాపాలన్నీ పోగొట్టి అతనిని అక్కున చేర్చుకున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> దూరమునన్ = దూరము నందుఆడు = ఆడుకొనుచున్నబాలుడు = పిల్లవాడుబోరనన్ = శీఘ్రమేతన = తన యొక్కచిత్తసీమ = మనసు పొరలలోపొడగట్టినన్ = కనపడగాఓ = ఓనారాయణ = నారాయణనారాయణ = నారాయణనారాయణ = నారాయణఅనుచున్ = అంటూఆత్మ = తన యొక్కనందనున్ = కొడుకునునొడివెన్ = పలికెను </div> </div> </div> <!--6-113 నెమ్మిఁ దొడలమీఁద... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-113 నెమ్మిఁ దొడలమీఁద... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/08.Nemmi_Thodalameeda.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నెమ్మి తొడలమీద నిద్రించు చెలికాని<br> నమ్మదగినవాడు నయము విడిచి<br> ద్రోహబుద్ధి జంప దొడరునే? యెం దైన<br> బ్రీతి లేక ధర్మదూతలార !<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పాపాలపుట్ట అయిన అజామీళుని విషయంలో ధర్మదూతలకూ, భగవద్దూతలకూ పెద్ద వాగ్వాదం జరిగింది. భగవద్దూతలు ధర్ముని దూతలకు ఒక ధర్మసూక్ష్మాన్ని దృష్టాంత పూర్వకంగా బోధిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ధర్మరాజభటులారా! ఒకడు ప్రేమతో ఒక చెలికానిని నిండుగా నమ్మి అతని తొడలమీద ఆదమరచి నిద్రపోతున్నాడు. రెండవవాడు నీతిమాలి ద్రోహబుద్ధితో ప్రీతితప్పి వానిని చంపటానికి పూనుకుంటాడా ఎక్కడైనా? అన్నారు విష్ణుభటులు. అజామీళుడు పాపాలన్నీ చేసినవాడే. కానీ అంత్యకాలంలో అసంకల్పితంగానయినా భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అదే అతడు నమ్మి నెమ్మితో చెలికాని తొడలమీద నిద్రించటం. అట్టివానికి ద్రోహం చేయరాదని భగవద్దూతల అభిప్రాయం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నెమ్మిన్ = ప్రేమగా; తొడల = తొడల; మీద = పైన; నిద్రించు = నిద్రపోవుచున్న; చెలికాని = స్నేహితుని; నమ్మదగినవాడు = నమ్మకస్తుడు; నయము = న్యాయమును; విడిచి = వదలేసి; ద్రోహ = మోసపు; బుద్ధిన్ = బుద్ధితో; చంపన్ = చంపుటకు; తొడరునె = యత్నించునా; ఎందైనన్ = ఎక్కడైనను; ప్రీతి = ప్రేమ; లేక = లేకుండగ; ధర్మదూతలార = యమదూతలారా. </div> </div> </div> <!--6-117 బ్రహ్మహత్యానేక... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-117 బ్రహ్మహత్యానేక... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/09.Bramha_Hathyaneka.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు<br> గురుతల్ప కల్మషక్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు<br> తపనీయ చౌర్యసంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు<br> మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు<br> <br> <b>(తేటగీతి) </b> <br> <br> మహిత యాగోగ్ర నిత్యసమాధి విధుల<br> నలరు బ్రహ్మాది సురలకు నందరాని<br> భూరి నిర్వాణసామ్రాజ్యభోగభాగ్య<br> ఖేలనంబులు హరినామ కీర్తనములు <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> హరినామ సంకీర్తనం అత్యద్భుతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. కీర్తన చేసేవాని పాపాల చిట్టాలను చూడవలసిన అవసరం దానికి లేదు. అని నిరూపిస్తున్నారు అజామీళుని తీసుకొనిపోవటానికి వచ్చిన యమభటులతో విష్ణుభక్తులు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యమభటులారా! ఈవిషయం మీరు సరిగా తెలుసుకోండి. బ్రహ్మహత్య మొదలైన ఘోరపాపాలనే కారడవులను కాల్చిపారవేసే అగ్మిజ్వాలలు హరినామ కీర్తనలు. తల్లులే అయిన గురుపత్నులను కామదృష్టితో చూచే పాపాత్ములనే విషసర్పాలకు నెమళ్ళు హరినామ కీర్తనములు. బంగారాన్ని దొంగిలించటం అనే కాఱుచీకటికి సూర్య కిరణాలు శ్రీహరి కీర్తనలు. మద్యపానం అనే పాపం ఒక మదించిన ఏనుగులమంద అయితే దానికి సింహాలు అవుతాయి శ్రీహరినామ కీర్తనలు. మహాయోగవిద్యను అతి కఠిన నియమాలతో అలవరచుకొని నిత్యసమాధి విధులతో ఆనందమందే బ్రహ్మ మొదలైన దేవతలు కూడా అందుకోలేని మోక్షసామ్రాజ్య భోగభాగ్యాలతోడి క్రీడలు హరినామ సంకీర్తనలు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బ్రహ్మహత్య = బ్రహ్మహత్య మొదలైన; అనేక = అనేకమైన; పాప = పాపములు యనెడి; అటవులు = అడవుల; కున్ = కి; అగ్నికీలలు = నిప్పుల మంటలు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; గురు = గురువు; తల్ప = భార్యా సంగమ; కల్మష = పాపము యనెడి; క్రూర = క్రూరమైన; సర్పములు = పాములకు; కేకులు = నెమళ్ళు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; తపనీయ = బంగారమును; చౌర్య = దొంగతనము యనెడి; సంతమసంబున్ = చిక్కటి చీకట్ల; కున్ = కు; సూర్య = సూర్యుని; కిరణముల్ = కిరణములవంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; మధుపాన = మధ్యముత్రాగిన; కిల్బిష = పాపము యనెడి; మద = మదించిన; నాగ = ఏనుగుల; సమితి = సమూహమున; కిన్ = కి; కేసరుల్ = సింహముల వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; <br><br>మహిత = గొప్ప; యోగ = యోగములలో; ఉగ్ర = తీవ్రమైనవాని; నిత్య = శాశ్వతమైన; సమాధి = సమాధి; విధులన్ = కర్మము లందు; అలరు = అలరారెడి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; సురలు = దేవతల; కున్ = కు; అందరాని = అందకోలేని; భూరి = అత్యంత గొప్పదైన; నిర్వాణ = మోక్ష; సామ్రాజ్య = సామ్రాజ్యము యొక్క; భోగ = భోగములు; భాగ్య = భాగ్యములతో కూడిన; ఖేలనంబులు = విలాసములు; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు. </div> </div> </div> <!--6-119 కామంబు పుణ్యమార్గ... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-119 కామంబు పుణ్యమార్గ... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/10.Kamambu_Punyamarga.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కామంబు, పుణ్యమార్గ, <br> స్థేమంబు, మునీంద్ర సాంద్ర చేతస్సరసీ<br> ధామంబు, జిష్ణు నిర్మల<br> నామంబు దలంచువాడు నాథుడు గాడే?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నామజపం మహాపుణ్యప్రదం. విష్ణుభక్తులు యమభటులకు దానిని చక్కగా వివరిస్తున్నారు. అజామీళోపాఖ్యానం లోని ఒక అద్భుతమైన పద్యం ఇది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యమభటులారా! శ్రీమహావిష్ణువునకు ‘జిష్ణుడు’ అని కూడా వ్యవహారం ఉన్నది. అంటే సర్వలోకాలలో సర్వదేశాలలో జయించటమే ఆయన శీలం. అట్టి మహాత్ముని మచ్చలేని నామాన్ని జపించటం అందరికీ కోరదగిన విషయం. జపంచేసేవానిని పుణ్యాల మార్గంనుండి జారిపోకుండా నిలుపుతుంది. మహర్షివరేణ్యులందరూ తమ హృదయాలనే సరస్సులను ఆ నామమునకు దేవాలయంగా నిర్మించుకుంటారు. అట్టి నామాన్ని గట్టిగా భావించే పుణ్యాత్ముడు ‘స్వామి’ కాకుండా పోతాడా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కామంబు = కోరదగినది; పుణ్య = పుణ్యవంత మైన; మార్గ = విధానమునకు; స్థేమంబు = స్థిరమైన స్థానములు; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారి; సాంద్ర = చిక్కటి; చేతస్ = మనసు యనెడి; సరసీ = సరస్సుల; ధామంబులు = నివాసములు; జిష్ణు = విష్ణుమూర్తి యొక్క; నిర్మల = స్వచ్ఛమైన; నామంబున్ = నామములను; తలచువాడు = స్మరించెడి వాడు; నాథుడు = మించిన వాడు; కాడే = కాడా ఏమి. </div> </div> </div> <!--6-121 బిడ్డపేరు పెట్టి పిలుచుట... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-121 బిడ్డపేరు పెట్టి పిలుచుట... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/11.Bidda_Peru_Petti_Piluchuta.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బిడ్డపేరు పెట్టి పిలుచుట, విశ్రామ<br> కేళి నైన, మిగుల గేలి నైన,<br> పద్య గద్య గీత భావార్ధముల నైన<br> కమలనయను తలప కలుషహరము<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భగవంతుని నామాన్ని ఏ విధంగా పలికినా పాపాలు పారిపోతాయి అని యమభటులకు విష్ణుభక్తులు వివరిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అయ్యా ! యమభటులారా! కొడుకునకు స్వామి పేరుపెట్టుకొని పిలవటమూ, తీరిక సమయాలలో ఆటలాడుకొంటూ కానీ, వేళాకోళానికి కానీ, పద్యాలలో, గద్యాలలో, పాటలలో, కూనిరాగాలలో కానీ, కమలాక్షుణ్ణి స్మరించటమూ పాపాలను రూపుమాపి వేస్తుంది. కాగా నిష్ఠతో చేసే జపము మొదలైన వాని ఫలం ఏ ఎత్తులో ఉంటుందో ఎవరు చెప్పగలరు ? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బిడ్డ = పుత్రుని; పేరు = పేరు; పెట్టి = తో; పిలుచుట = పిలుచుట; విశ్రామ = కాలక్షేపపు; కేళిన్ = ఆటలకి; ఐనన్ = అయి నప్పటికిని; మిగులన్ = మిక్కిలి; గేలిన్ = పరిహాసమునకు; అయినన్ = అయి నప్పటికిని; పద్య గద్య = కావ్య రూపములు; గీత = కీర్తనల లోని; భావ = గంభీర భావాలు; అర్థములన్ = అర్థాలతో; ఐనన్ = అయి నప్పటికిని; కమలనయను = నారాయణుని {కమల నయనుడు - కమలముల వంటి నయనములు గల వాడు, విష్ణువు}; తలపన్ = స్మరించిన; కలుష = (అవి) పాపములను; హరము = నశింప జేయును. </div> </div> </div> <!--6-123 అతిపాపములకుఁ... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-123 అతిపాపములకుఁ... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/12.Athi_Papamulaku.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అతిపాపములకు ప్రయత్నపూర్వకముగ తనుపాపములకు మితంబుగాగ<br> సన్ముని వరులచే సంప్రోక్తమై యుండు నిర్మలం బగు పాప నిష్కృతములు<br> క్రమరూపమున నుపశమనంబు లగు గాని తత్ క్షణంబున నవి దరువలేవు<br> సర్వకర్మంబుల సంహార మొనరించి చిత్తంబునకు తత్త్వ సిద్ధి నొసగు<br> <br> <b>(తేటగీతి) </b><br> <br> ఒనర నీశుసేవ, యోగి మానస సరో<br> వాసుసేవ హేమవాసుసేవ,<br> వేదవేద్యుసేవ, వేదాంతవిభుసేవ<br> పరమపురుష పాదపద్మసేవ.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> విష్ణుదూతలు యమదూతలకు పాపాల స్వభావాలను, వాని పరిహారాలను, వానికి సంబంధించిన విశేషాలను బోధిస్తున్నారు. పరమపురుష పాదపద్మ సేవవలన కలిగే సిద్ధిని కూడా తెలుపుతున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యమభటులారా! అతిఘోరమైన మహాపాతకాలు బ్రహ్మహత్య మొదలైనవి ఉంటాయి. దానికి ఎంతో ప్రయత్నం చేసి గానీ, ప్రాయశ్చిత్తం చేసుకోలేము. చిన్నిచిన్ని పాపాలకు కొద్దిపాటి ప్రాయశ్చిత్తాలుంటాయి. ఈ అన్నింటినీ మహర్షులు లోకానికి చక్కగా చెప్పి ఉన్నారు. వాని నాచరించి పాపాలను పోగొట్టుకొని మానవులు నిర్మలమానసులు కావాలి. అలా కావటం హఠాత్తుగా జరిగేపనికాదు. క్రమక్రమంగా, కాలం గడచినమీదట ఆ పాపాలు ఉపశమనం పొందుతాయి. కానీ యోగిహృదయపద్మాలే ఆలయం అయిన వాడూ, పట్టుపుట్టాలు కట్టేమహాస్వామీ, వేదాలముఖంగానే తెలియదగిన ఆత్మస్వరూపుడూ, వేదాంతాలకు ప్రవర్తకుడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవుని పాదసేవమాత్రం, అన్ని కర్మలనూ, వాని ఫలాలనూ అప్పటికప్పుడు రూపుమాపి చిత్తానికి తత్త్వసిద్ధిని కలిగిస్తుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అతి = ఘోర మైన; పాపముల = పాపముల; కున్ = కు; ప్రయత్నపూర్వకముగన్ = ప్రయత్నించి చేయగల; తనుపాపముల = చిన్న పాపముల; కు = కు; మితంబు = తగ్గించేవి; కాగ = కాడానికి; సత్ = మంచి; ముని = మునులలో; వరుల = ఉత్తముల; చేన్ = చేత; సంప్రోక్తము = ఉపదేశించ బడినవి; ఐ = అయ్యి; ఉండు = ఉంటాయి; నిర్మలంబు = స్వచ్చ మైనవి; అగు = ఐన; పాప = పాపముల; నిష్కృతములు = ప్రాయశ్చిత్తములు; క్రమరూపమునను = మెల్లిమెల్లిగా; ఉపశమనంబులు = ఉపశమనము నిచ్చునవి; అగున్ = ఔతాయి; కాని = కాని; తత్ = ఆ; పాప = పాపముల; చయములున్ = సమూహములను; తరువ = తరింప, దాటించ; లేవు = లేవు; సర్వ = సమస్త మైన; కర్మంబులన్ = కర్మలను; సంహారము = నాశనము; ఒనరించి = చేసి; చిత్తంబున్ = మనసు; కున్ = కు; తత్త్వ = పరతత్త్వ; సిద్ది = సిద్ధిని; ఒసగు = కలుగ జేయును;<br><br> ఒనరన్ = చక్కగా; ఈశు = భగవంతుని; సేవ = భక్తి; యోగి మానస సరోవాసు = నారాయణుని {యోగి మానస సరోవాసుడు - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు}; సేవ = భక్తి; హేమ వాసు = నారాయణుని {హేమవాసుడు – కనకాంబరములను ధరించు వాడు, విష్ణువు}; సేవ = భక్తి; వేదవేద్యు = నారాయణుని {వేదవేద్యుడు - వేదములచే వేద్యుడు (తెలియ బడు వాడు), విష్ణువు}; సేవ = భక్తి; వేదాంత విభు = నారాయణుని {వేదాంత విభుడు - వేదాంతములు (ఉపనిష త్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు}; సేవ = భక్తి; పరమ పురుష = నారాయణుని {పరమ పురుషుడు - సర్వమునకు పర మైన పురుషుడు, విష్ణువు}; పాద = పాదము లనెడి; పద్మ = పద్మముల; సేవ = భక్తి. </div> </div> </div> <!--6-152 హరిభక్తులతో మాటలు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-152 హరిభక్తులతో మాటలు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/13.Hari_Bhakthulatho_Maatalu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> హరిభక్తులతో మాటలు<br> ధర నెన్నడు జెడని పుణ్యధనముల మూటల్<br> వర ముక్తికాంత తేటలు<br> నరిషడ్వర్గంబు చొరని యరుదగు కోటల్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అజామీళుని యమలోకానికి ఈడ్చుకుపోవటానికి వచ్చిన యమభటులు విష్ణు భక్తుల విమలవిచార వివేక వాక్యాలకు విస్మయం పొంది తమదారిని తాము వెళ్ళి పోయారు. అజామీళుడు వారి సంవాదమంతా విన్నాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో గాఢ మైన పరితాపం పొందాడు. అతని హృదయంలో వైష్ణవ జ్ఞానదీపం చక్కగా వెలుగొందింది. ఇలా అనుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తిగల మహాత్ముల మాటలు పుణ్యధనాల మూటలు. వానికి భూమిలో ఎన్నటికీ చేటు ఉండదు. అవి ఎన్నిజన్మలకోగానీ అందుకోరాని మోక్షలక్ష్మి అనుగ్రహించే ప్రసన్నతలు. మనలోనే దొంగలవలె దూరి మన కొంపే ముంచే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే ఆరుగురు పగవారికి ఆవంతైనా అవకాశం ఇవ్వని అత్యద్భుతమైన కోటలు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హరి = నారాయణుని; భక్తుల = భక్తుల; తో = తోటి; మాటలు = సంభాషణములు; ధరన్ = భూమి పైన; ఎన్నడున్ = ఎప్పటికి; చెడని = నశించని; పుణ్య = పుణ్యము యనెడి; ధనముల = సంపదల; మూటల్ = మూటలు; వర = ఉత్తమ మైన; ముక్తి = ముక్తి యనెడి; కాంత = స్త్రీ యొక్క; తేటలు = స్వచ్చ మైన ప్రసంగములు; అరిషడ్వర్గంబు = కామ, క్రోధ మద, మోహ, లోభ, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు; చొరని = ప్రవేశించ లేని; అరు దగు = అద్భుతమైన; కోటల్ = కోటలు. </div> </div> </div> <!--6-158 కోరినవారల కెల్లను... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-158 కోరినవారల కెల్లను... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/14.Korinavarala_Kellanu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కోరినవారల కెల్లను<br> జేరువ కైవల్యపదము, సిరివరుని మదిం<br> గోరనివారల కెల్లను<br> దూరము మోక్షాప్తి యెన్నిత్రోవల నైనన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పరమనికృష్టమైన బ్రతుకు బ్రతికి యమభటుల చిత్రహింసలకు గురికాబోయే పాపాత్ముడు అజామీళుడు మాటవరుసకు ‘నారాయణా’ అంటే వివేకవిజ్ఞానాలు కలిగి సద్యోముక్తి పొందాడు. ఇక సహజంగా సద్భక్తితో స్వామిని స్మరిస్తే దానిఫలం ఎట్టిదని చెప్పాలి అంటున్నారు శ్రీ శుక మహర్షి.. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరీక్షిన్మహారాజా! శ్రియఃపతి అయిన శ్రీనివాసుని బుద్ధిపూర్వకంగా సేవించేకోరిక ఉన్నవారికి కైవల్యపదం చేరువలోనే సిద్ధిస్తుంది. చావుపుట్టుకల చక్రంలో సుఖంలేకుండా తిరుగుతూ ఉండటమే సంసారం. దానినుండి భగవదనుగ్రహం వలన బయటపడటమే కైవల్యం. అది కావాలి అనే కాంక్షలేనివారికి ఎన్ని పోకలుపోయినా మోక్షలాభం దూరమే అవుతుంది. అట్టివారికి వద్దనుకొనే దుఃఖం వద్దకు వస్తూనే ఉంటుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కోరిన = కోరెడి; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; చేరువ = దగ్గరగా నుండును; కైవల్య పదము = ముక్తి మార్గము; సిరి వరుని = నారాయణుని; మదిన్ = మనసున; కోరని = వాంఛించని; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; దూరము = అందనిది; మోక్షాప్తి = మోక్ష ప్రాప్తి; ఎన్ని = ఎన్ని; త్రోవ లైనన్ = మార్గాలు పట్టినా. </div> </div> </div> <!--6-171 అభవు నమేయు... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-171 అభవు నమేయు... (చంపకమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/15.Abhavu_Ameyu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అభవు, నమేయు, నవ్యయు, ననంతు, ననారతు పూని మేనిలో<br> నుభయము నై వెలుంగు పురుషోత్తము గానరు చిత్త కర్మ వా<br> గ్విభవ గరిష్టు లై వెదకి వీఱిడి ప్రాణులు; సర్వవస్తువుల్<br> శుభగతి జూడనేర్చి తను జూడగనేరని కంటిపోలికన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యమభటులు అజామీళుని విషయంలో అవమానంపొంది తమ ప్రభువు దగ్గరకు పోయి తమపాట్లు తెలుపుకున్నారు. స్వామీ! ఈ సృష్టిలో నీకంటె మించిన శాసకుడు మరొకడు ఉన్నాడా? అని అడిగారు. అప్పుడు యమధర్మరాజు శ్రీమహావిష్ణువును హృదయంలో నిలుపుకొని ఆయన మహామహిమను తన భటులకు ఇలా హృద్యంగా బోధించాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> భటులారా! శ్రీమహావిష్ణువు పుట్టుకలేనివాడు. ఏ ఊహలకూ అంతనివాడు. దేశ కాలాదులు తెచ్చే ఎట్టిమార్పులకూ లోబడకుండా ఏకమైన ఆకృతితో ఉంటాడు. తుదీ, మొదలూ లేనివాడు. అనారతుడు. అంటే ఎక్కడా, ఎప్పుడూ తెరపిలేనివాడు. ఉండటమే తప్ప మఱియొక స్థితిలేనివాడు. అట్టివాడు మనదేహంలో కర్మఫలాలు అనుభవించే జీవుడుగా, సాక్షిమాత్రంగా నిలిచివుండే దేవుడుగా రెండు విధాలుగానూ ఉన్నాడు. అందు వలననే ఆయనను పురుషోత్తముడంటారు. కానీ జీవులు ఆయనను చూడలేరు. మనస్సుతో, చేష్టతో, మాటతో శక్తిని పుష్కలంగా సంపాదించుకొని వెదకి కూడా విసిగివేసారిపోతారు కానీ తెలుసుకోలేరు. ఇది ఎటువంటిదంటే కన్ను చక్కనిచూపుతో సర్వవస్తువులను చూస్తుంది కానీ తన్నుతాను చూచుకోలేదుగదా </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అభవున్ = నారాయణుని {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; అమేయున్ = నారాయణుని {అమేయుడు - పరిమితులు లేనివాడు, విష్ణువు}; అవ్యయున్ = నారాయణుని {అవ్యయుడు - వ్యయము లేనివాడు, విష్ణువు}; అనంతున్ = నారాయణుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అనారతున్ = నారాయణుని {అనారతడు - అనవరతము యుండెడివాడు, విష్ణువు}; పూని = పూని; మేని లోను = దేహము లోపల {పరమాత్మ త్రైవిధ్యము - దేహము (మొదటి వాడు) దేహి (జీవుడు, రెండవవాడు), దేహములో (సర్వాంతర్యామి, మూడవవాడు) తానై యుండుట}; ఉభయమును = దృశ్యము ద్రష్ట రెండును; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించెడి; పురుషోత్తమున్ = నారాయణుని; కానరు = గుర్తించ లేరు; చిత్త = జ్ఞానము నందు; కర్మ = వైదికకర్మ లందు; వాక్ = ప్రవచనములు చేయుట యందు; విభవ = వైభవము గలిగుండుట లో; గరిష్ఠులు = గొప్పవారు; ఐ = అయ్యి; వెదకి = వెదకి; వీఱిడి = వెర్రివారు; ప్రాణులు = జీవులు; సర్వ = సమస్త మైన; వస్తువుల్ = వస్తువులు; శుభ గతిన్ = చక్కగా; చూడన్ = చూడ; నేర్చి = గలిగినను; తనున్ = తనను తాను; చూడగన్ = చూచుటను; నేరని = సమర్థత లేని; కంటి = కన్ను; పోలికన్ = వలె. </div> </div> </div> <!--6-177 వర మహాద్భుత... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-177 వర మహాద్భుత... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/16.Vara_Mahadbhuthamyna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వర మహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు తిరముగా నెవ్వరు తెలియగలరు?<br> దేవాదిదేవుండు త్రిపురసంహరు డొందె, కమలసంభవు డొండె, కార్తి కేయ<br> కపిల నారదు లొండె, గంగాత్మజుం డొండె, మను వొండె, బలి యొండె, జనకు డొండె<br> ప్రహ్లాదు డొండె, నేర్పాటుగా శుకు డొండె, భాసురతరమతి వ్యాసు డొండె<br> <br> <b>(తేటగీతి) </b><br> <br> కాక యన్యులతరమె? యీలోకమందు<br> నీ సుబోధంబు సద్బోధ మీ పదార్ధ<br> మీ సదానంద చిన్మయ మీయగమ్య<br> మీవిశుద్ధంబు గుహ్యంబు నీశుభంబు <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యమధర్మరాజు తన దూతలకు శ్రీమహావిష్ణుతత్త్వం తెలుసుకోవటం సులభంకాదనీ మహాజ్ఞాన సంపన్నులైన కొందరు మాత్రమే ఆ యెఱుక కలవారనీ బోధిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అది చాలా గొప్పది. అద్భుతమైనది. అటువంటి విష్ణుసంబంధమైన జ్ఞానాన్ని చెదరిపోకుండా హృదయంలో నిలుపుకోగలవారు కొందఱు మాత్రమే ఉన్నారు. అందులో మొట్టమొదటగా చెప్పుకోవలసినవాడు దేవతలకు కూడా ఆదిదేవుడైన పరమేశ్వరుడు. ఆయన త్రిపురాసురులను సంహరించినవాడు. అటు పిమ్మట చెప్పుకోదగినవాడు విష్ణువు నాభిలో వెలుగొందుతున్న కమలంనుండి పుట్టిన నాలుగుమోముల దేవర. ఆ తరువాత చెప్పుకోదగినవాడు కుమార స్వామి. ఆయన ఆరుమొగాల అద్భుతదైవం. అటు పిమ్మట వచ్చేవారు కపిలమహర్షి, నారద మహర్షి, ఇంక భూమికి దిగివస్తే గంగ కొడుకు భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శుకుడూ, వ్యాసులవారూ. ఈ పన్నెండుగురకు తప్ప విష్ణు సంబంధమైన జ్ఞానం ఇతరులకు తెలియదు. ఇది చక్కని తెలివి. చక్కని ఉపదేశం. మంచి వస్తువు. ఇది సదానందం. జ్ఞాన మయమైనది. ఒకపట్టాన పొందనలవి కానిది. పరమశుద్ధమైనది. గొప్పరహస్యం. మంగళకరం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వర = ఉత్తమ మైన; మహా = గొప్ప; అద్భుతము = ఆశ్చర్య కరము; ఐన = అయిన; వైష్ణవ = విష్ణువు గురించిన; జ్ఞానంబు = జ్ఞానము; తిరముగా = సంపూర్తిగ; ఎవ్వరు = ఎవరు; తెలియ గలరు = తెలిసికొన గలరు; దేవాదిదేవుండు = దేవతలకే ముఖ్య దేవుడు; త్రిపుర సంహరుడు = పరమ శివుడు {త్రిపుర సంహరుడు - త్రిపురములను నాశనము చేసిన వాడు, శివుడు}; ఒండె = ఒకరు; కమల సంభవుడు = బ్రహ్మ దేవుడు {కమల సంభవుడు – కమలము లందు సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మ}; ఒండె = ఒకరు; కార్తికేయ = కార్తికేయుడు; కపిల = కపిలుడు; నారదులు = నారదుడులు; ఒండె = ఒకరు; గంగాత్మజుండు = భీష్ముడు; ఒండె = ఒకరు; మనువు = మనువు; ఒండె = ఒకరు; బలియున్ = బలిచక్రవర్తి; ఒండె = ఒకరు; జనకుడు = జనకమహారాజు; ఒండె = ఒకరు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; ఒండె = ఒకరు; ఏర్పాటుగా = ప్రత్యేకముగా; శుకుడు = శుక మహాముని; ఒండె = ఒకరు; భాసుర = మిక్కలి ప్రకాశిస్తున్న; మతి = మనసు గలవాడు; వ్యాసుడు = వ్యాస భగవానుడు; ఒండె = ఒకరు;<br><br> కాక = కాకుండగ; అన్యుల = ఇతరుల; తరమె = సాధ్యమే; ఈ = ఈ; లోకము = లోకము; అందు = లో; ఈ = ఈ; సుబోధంబు = ఉత్తమ జ్ఞనము; సద్భోధము = విశేష జ్ఞానము; ఈ = ఈ; పదార్థము = ప్రయోజనము; ఈ = ఈ; సదానంద = శాశ్వతమైన ఆనందపు; చిత్ = మనసు; మయము = పూరము; ఈ = ఈ; విశుద్ధంబు = పరిశుద్దము; గుహ్యంబు = రహస్యమైవది; ఈ = ఈ; శుభంబు = శుభములు. </div> </div> </div> <!--6-178 ఈ పన్నిద్దఱు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-178 ఈ పన్నిద్దఱు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/17.Ee_Panniddaru.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఈ పన్నిద్దఱు తక్కగ<br> నోపరు త క్కొరులు తెలియ నుపనిష దుచిత<br> శ్రీ పతినామ మహాద్భుత<br> దీపిత భాగవతధర్మ దివ్యక్రమమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భావం దృఢంగా కుదురుకోవటానికి యమధర్మరాజు ఆ విషయాన్నే మళ్ళీ బోధిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఇది పరమాత్మజ్ఞానాన్ని ప్రసన్నంగా మూలముట్టుగా బోధించే ఉపనిషత్తులలో నెలకొన్న తత్త్వం. లక్ష్మీనాధుని నామజపానికి సంబంధించిన మహాద్భుతమైనదీ, ప్రకాశించేదీ అయిన భాగవత ధర్మపు దివ్యక్రమం. దీనిని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు అనే పన్నెండుగురు తప్ప ఇతరులు తెలియజాలరు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఈ = ఈ; పన్నిద్దఱున్ = పన్నిండుమంది (12); తక్కగ = తప్పించి; ఓపరు = సమర్థులుగారు; త క్కొరులు = వీరు కాక ఇతరులు; తెలియను = తెలిసికొనుటకు; ఉపనిషత్ = ఉపనిషత్తులలో; ఉచిత = చెప్పబడిన, ఉచ్చరింపబడిన; శ్రీపతి = నారాయణుని {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి పతి (ప్రభువు), విష్ణువు}; నామ = నామము యొక్క; మహా = గొప్ప; అద్భుత = అద్భుతమైన; దీపిత = ప్రకాశవంత మైన; భాగవత = భాగవత; ధర్మ = ధర్మము యొక్క; దివ్య = దివ్య మైన; క్రమమున్ = విధమును. </div> </div> </div> <!--6-179 ఏది జపియింప... (తేటగీతి).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-179 ఏది జపియింప... (తేటగీతి).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/18.Yedi_Japiyimpa.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఏది జపియింప నమృత మై యెసగుచుండు<br> నేది సద్ధర్మపథ మని యెఱుగ దగిన<br> దదియె సద్భక్తి యోగంబు నలవరించు<br> మూర్తిమంతంబు దా హరికీర్తనంబు <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యముడు తన దూతలకు హరికీర్తనమును గురించి యింకా ఇలా తెలియ జేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> హరినామాన్ని జపిస్తే అది అమృతమై విరాజిల్లుతుంది. పరమాత్ముని ధర్మమార్గం ఇదే అని తెలియదగినది హరికీర్తనయే. అదే సద్భక్తి యోగాన్ని అలవాటు చేస్తుంది. అది భక్తియోగానికి ఏర్పడిన ఆకారం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఏది = ఏదైతే; జపియింపన్ = నామజపము చేయిస్తే; అమృతము = అమృతము; ఐ = అయ్యి; ఎసగుచుండున్ = ప్రసిద్ది చెందు తుండును; ఏది = ఏదైతే; సద్దర్మ = ఉత్తమ ధర్మము యొక్క; పథము = మార్గము; అని = అని; ఎఱుగ = తెలిసికొన; తగినది = తగి నట్టిది; అదియె = అదే; సద్భక్తి = శ్రేష్టమైన భక్తి; యోగంబున = యోగము వలన; ఆవహించు = కలుగుట; మూర్తి మంతంబు = మూర్తీభవించినది; తాన్ = అది; హరి = నారాయణుని; కీర్తనంబు = కీర్తించుటలు. </div> </div> </div> <!--6-186 శ్రుత్యంత విశ్రాంత... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-186 శ్రుత్యంత విశ్రాంత... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/19.Sruthyantha_Visrantha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> శ్రుత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతుల్ భాగవతులు<br> సనకాదిముని యోగిజన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు<br> కృష్ణపద ధ్యాన కేవలామృతపాన పరిణామ యుతులు శ్రీభాగవతులు<br> బహుపాత కానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్ర మూర్తులు భాగవతులు<br> <br> <b>(తేటగీతి) </b> <br> <br> భావతత్త్వార్థవేదులు భాగవతులు<br> బ్రహ్మవాదానువాదులు భాగవతులు<br> సిరులు దనరంగ నెన్నడు చేటులేని<br> పదవి నొప్పారువారు వో భాగవతులు <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యమధర్మరాజు తన భటులకు భగవంతునియందు నిండుగా భక్తి ఉన్నవారి గొప్పతనాన్ని చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఉపనిషత్తులు భగవత్తత్త్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. భాగవతుల ప్రసంగాలు ఉపనిషద్ జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే వెలుగొందుతూ ఉంటాయి. జ్ఞానమూర్తులైన సనకుడు మొదలైన మునులూ, యోగిజనులూ పొందే సదానంద పరమ భాగ్యమై ఒప్పారే మహాత్ములు భాగవతులు. శ్రీకృష్ణుని పాదాల ధ్యానం అనే సాటిలేని అమృతాన్ని త్రావటంచేత పాకానికివచ్చిన అంతరంగం కలవారు భాగవతులు. పెక్కు విధాలైన పాతకాల సేనలకు పరాభవం చేయటంలో అతికఠినమైన ఆకృతులు కలవారు భాగవతులు. పరమాత్మతత్త్వాన్ని బాగుగా తెలిసినవారు భాగవతులు. బ్రహ్మమును గూర్చిన పలుకులను అనుసరించి పలికేవారు భాగవతులు. ఐశ్వర్యం అంబరమంటి, ఎప్పుడూ చేటులేని స్థానాలలో ప్రకాశించేవారు భాగవతులు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> శ్రుత్యంత = వేదాంతము లందు; విశ్రాంత = విశ్రమించిన; మతి = బుద్దిని; అనుక్రమణీయ = అనుసరించి పోవు నట్టి; భగవత్ = నారాయణుని; ప్రసంగతుల్ = ప్రసంగములు చేయు వారు; భాగవతులు = భాగవత తత్త్వజ్ఞులు; సనక = సనకుడు; ఆది = మొదలైన; ముని = మునులు; యోగి = యోగులు; జన = ఐన వారి; సదానంద = శాశ్వత మైన ఆనందము; ఏక = మొదలైన; పరమ = అత్యుత్తమ మైన; భాగ్య = భాగ్యములను; ఉదయుల్ = కలిగించెడి వారు; భాగవతులు = బాగవతులు; కృష్ణ = కృష్ణుని; పద = పాదములను; ధ్యాన = సంస్మరించెడి; కేవల = కేవల మైన; అమృత = అమృతమును; పాన = అస్వాదించెడి; పరిణామ = క్రమము; యుతులు = కూడిన వారు; శ్రీ = శుభకర లైన; భాగవతులు = భాగవతులు; బహు = మిక్కిలి; పాతక = పెద్ద పాపముల; అనీక = సమూహములను; పరిభవ = పరాభవము చేసెడి; ప్రక్రియా = నేర్పులు గల; పరుష = కఠిన మైన; ఉగ్ర = ఉగ్ర మైన; మూర్తులు = స్వరూపములు గల వారు; భాగవతులు = భాగవతులు; <br><br>భావ = భవమునకు చెందిన; తత్త్వార్థ = తత్త్వ లక్షణములను; వేదులు = బాగుగా తెలిసి కొన్న వారు; భాగవతులు = భాగవతులు; బ్రహ్మవాద = పరబ్రహ్మతత్వమును; అనువాద = వివరించుటలో నేర్పరులు; భాగవతులు = భాగవతులు; సిరులు = సంపదలు; తనరంగ = అతిశయించగ; ఎన్నడును = ఎల్లప్పుడును; చేటు లేని = చెడిపోవుట లేని; పదవిన్ = మహోన్నత స్థానమున; ఒప్పారు వారు = చక్కగ నుండువారు; పో = తప్పక; భాగవతులు = భాగవతులు. </div> </div> </div> <!--6-188 ఎకసక్కెమున కైన... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-188 ఎకసక్కెమున కైన... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/20.Yekasekkamunakaina.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎకసక్కెమునకైన నిందిరారమణుని బలుకంగలేని దుర్భాషితులను<br> కలలోన నైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సూడని కర్మరతుల<br> నవ్వుచునైన కృష్ణప్రశంసకు చెవి దార్పనేరని దుష్కథా ప్రవణుల<br> యాత్రోత్సవంబుల నైన నీశుని గుడిత్రోవ ద్రొక్కగలేని దుష్పదులను<br> <br> <b>(ఆటవెలది) </b><br> <br> పరమభాగవతుల పాదధూళి సమస్త<br> తీర్థసారమనుచు తెలియలేని<br> వారి వారివారి వారిజేరినవారి<br> తొలుత గట్టి తెండు దూతలార<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యమదూతలకు యమధర్మరాజు విష్ణుభక్తిలేని వారిని తీసుకొనిరావలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాడు. అజామీళుని అద్భుతగాథలోని పద్యం ఇది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యమదూతలారా! వేళాకోళానికైనా ఇందిరారమణుని పేరు పలుకలేని పాడుకూతలవారినీ, కలలోనైనా శ్రీపతి శ్రీపాదకమలాలను చూడని దుష్టచేష్టల వారినీ, నవ్వులాటలోనైనా శ్రీకృష్ణుని ప్రశంసకు చెవులొగ్గని పాడుకథల పాండిత్యం కలవారినీ, యాత్రలో జరిగే పండుగలలోనైనా పరమేశ్వరుని ఆలయం దారి త్రొక్కలేని పాడుపాదాలవారినీ, భగవంతుని మహాభక్తుల పాదధూళి మహాతీర్థాలన్నింటిసారం అని తెలిసికోలేని పాడుతెలివి కలవారినీ, వారివారినీ, వారిని చేరినవారినీ మొట్టమొదటగా కట్టి నాదగ్గరకు తీసుకొనిరండి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎకసెక్కెమున = ఎగతాళి చేయుట; కైనన్ = కోస మైన; ఇందిరా రమణునిన్ = నారాయణుని {ఇందిరా రమణుడు - ఇందిర (లక్ష్మీదేవి) కి రమణుడు (మనోహరుడు), విష్ణువు}; పలుకంగ = కీర్తించ; లేని = లేని; దుర్భాషితులను = చెడుమాట లాడు వారు; కల = స్వప్నము; లోనన్ = లోపల; ఐనన్ = అయినను; శ్రీకాంతుని = నారాయణుని {శ్రీకాంతుడు - శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు}; సత్ = మంచి; పాద = పాదములు యనెడి; కమలముల్ = పద్మములను; చూడని = చూడ నట్టి; కర్మ = కర్మ లందు; రతులన్ = తగులైన వారు; నవ్వుచున్ = నవ్వులాటలకు; ఐనన్ = అయినప్పటికి; కృష్ణ = కృష్ణుని; ప్రశంస = కీర్తించుట; కున్ = కు; చెవి దార్ప = వినిపించు కొన; నేరని = లేని; దుష్కథా = చెడ్డ కథ లందు; ప్రవణులన్ = ఆసక్తులు; యాత్ర = తీర్థయాత్ర; ఉత్సవంబులన్ = ఉత్సవములలో; ఐనన్ = అయినప్పటికి; ఈశుని = నారాయణుని; గుడి = ఆలయపు; త్రోవ = దారి; త్రొక్కగ లేని = తొక్క లేనట్టి; దుష్పదులను = చెడు నడత వారిని; <br><br>పరమ = మిక్కిలి పవిత్ర మైన; భాగవతుల = భాగవతుల యొక్క; పాద = పాదముల; ధూళి = దుమ్ము; సమస్త = నిఖిల; తీర్థ = తీర్థముల యొక్క; సారము = సారము; అని = అని; తెలియ = తెలుసుకొన; లేని = లేని; వారిన్ = వారిని; వారివారిన్ = వారి యొక్క వారిని; వారిన్ = వారిని; చేరిన వారి = అనుసరించు వారిని; తొలుతన్ = ముందుగ; కట్టి = కట్టివేసి; తెండు = తీసుకు రండి; దూతలార = సేవకులూ, యమదూతలూ. </div> </div> </div> <!--6-190 అరయఁదనదు జిహ్వ... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-190 అరయఁదనదు జిహ్వ... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/21.Araya_Thanadu_Jihva.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అరయ దనదు జిహ్వ హరిపేరు నుడువదు<br> చిత్త మతని పాదచింత జనదు<br> తలప దమకు ముక్తి తంగేటి జున్నొకో?<br> సకల విష్ణుభక్తులకును బోలె. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భగవద్భక్తులు కాని వారి దౌర్భాగ్యజీవితాన్ని యమధర్మరాజు వెక్కిరింతగా కక్కసించు కుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తన నాలుక ఒక్కమారైనా హరిపేరును పలుకదు. చిత్తం శ్రీపతి పాదాలను పొరపాటున కూడా భావించదు. కానీ నిరంతరం నామజపం, హరిధ్యానం చేసేవారికి లాగా ముక్తి అనే తంగేటిజున్ను కావాలి అంటాడు బుద్ధిహీనుడు. ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? ఏమాత్రమూ వివేకంలేనివాని తీరు ఇలా ఉంటుంది! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అరయన్ = తరచి చూసిన; తనదు = తన యొక్క; జిహ్వ = నాలుక; హరి = నారాయణుని; పేరు = నామమును; నుడువదు = పలుకదు; చిత్తము = మనసు; అతని = అతని యొక్క; పాద = పాదముల; చింతన్ = ఆలోచన లందు; చనదు = వెళ్ళదు; తలప = తరచి చూసిన; తమ = తమ; కున్ = కు; ముక్తి = మోక్ష ప్రాప్తి; తంగేటిజున్నొకో = అంతసుళువైనదా ఏమి {తంగేటిజున్ను - తంగేడు చెట్టు యందున్న తేనె పట్టు యొక్క జున్ను (తేనె)}; సకల = అందరు; విష్ణుభక్తులు = విష్ణుభక్తుల; కును = కు; పోలెన్ = వలె. </div> </div> </div> <!--6-191 పద్మనయను మీఁది... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-191 పద్మనయను మీఁది... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/22.Padma_Nayanumeedi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పద్మనయను మీది భక్తి యోగం బెల్ల<br> ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు<br> వారి, వారివారి, వారి జేరినవారి<br> త్రోవ బోవవలదు దూతలార! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భటులారా! మీకొక హెచ్చరిక. శ్రద్ధగా వినండి అంటున్నాడు ధర్మమూర్తీ సమవర్తీ అయిన యమధర్మరాజు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> జీవులు మరణించే సమయంలో మన లోకాలకు రావలసినవారెవరో, రాగూడని వారెవరో వివేకంతో గమనించండి. ఆ పద్మపత్రాలవంటి అందాలు చిందించే అద్భుతమైన కన్నులుగల శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తి ఉండటమే ముక్తియోగం. ఆ జ్ఞానం ఉన్నవారూ, వారివారూ, వారిని చేరినవారూ పోయిన దారిలో కూడా మీరు పోరాదు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> పద్మనయను = నారాయణుని; మీది = పైగల; భక్తియోగంబు = భక్తియోగము; ఎల్లన్ = సమస్తమును; ముక్తి యోగము = ముక్తి ప్రదమైన యోగము; అనుచు = అనుచు; మొదలు = ముందుగనే; ఎఱుంగు = తెలిసిన; వారిన్ = వారి; వారివారిన్ = వారి యొక్క వారిని; వారిన్ = వారి; చేరిన వారిన్ = అనుసరించెడి వారి; త్రోవన్ = వైపుకు; పోవవలదు = పో వద్దు; దూతలార = సేవకులు, యమదూతలారా. </div> </div> </div> <!--6-193 స్వాయంభువ మనువేళల... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-193 స్వాయంభువ మనువేళల... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/23.Swayambhuvamanuvela.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> స్వాయంభువ మనువేళల<br> నో యయ్య! సురాసు రాండ జోరగ నర వ<br> ర్గాయత సర్గము దెలిపితి<br> పాయక యది విస్తరించి పలుకం గదవే!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అజామీళుని కథ వింటున్న పరీక్షిన్మహారాజునకు హృదయం పరవశించిపోతున్నది. మెల్లగా తేరుకొని శ్రీశుకమహర్షుల వారిని మరొక విషయం అడుగుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! జ్ఞానమూర్తీ! శుకమహర్షీ! ఇంతకు పూర్వం నీవు స్వాయంభువ మన్వంతరంలో ఉన్న దేవతలను, రాక్షసులను, పక్షులను, పాములను, నరులను, ఇంకా తక్కినజాతులను, వారికి సంబంధించిన సృష్టినీ గురించి చెప్పావు. దానిని మఱికొంత విస్తరించి చెప్పు మహాత్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> స్వాయంభువ = స్వాయంభువ యనెడి; మనువు వేళలన్ = మన్వంతరములోని; ఓ = ఓ; అయ్య = తండ్రి; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; అండజ = గ్రుడ్డు నుండి పుట్టునవి; ఉరగ = పాములు {ఉరగము - ఉర (రొమ్ము) చే గము (గమనము గలవి), పాము}; నర = మానవుల; వర్గ = జాతుల; ఆయత = విస్తార మైన; సర్గమున్ = సృష్టిని; తెలిపితి = తెలియ జేసితివి; పాయక = తప్పక; అది = దానిని; విస్తరించి = మరింకా వివరముగ; పలుకంగదవే = చెప్పుము. </div> </div> </div> <!--6-200 తప్పక యర్భకావళికిఁ... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-200 తప్పక యర్భకావళికిఁ... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/24.Thappaka_Arbhakavaliki.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తప్పక యర్భకావళికి తల్లియు దండ్రియు, నేత్రపంక్తికిన్<br> ఱెప్పలు, నాతికిం బతి, నరేంద్రుడు లోకుల కెల్ల, నర్థికి<br> న్నొప్ప గృహస్థు, మూఢులకు నుత్తము లెన్నగ వీరు బంధువుల్<br> ముప్పున గావలేని కడుమూర్ఖులు గారు నిజాల బంధువుల్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఒకప్పుడు ప్రచేతసుని కుమారులు ప్రాచీనబర్హి మొదలైన పదిమంది సముద్రం నుండి భూమిమీదకు వచ్చారు. భూమి అంతా చెట్లతో నిండి ఉన్నది. అది చూచినవారికి ఒళ్ళుమండింది. ముఖాలనుండి గొప్ప గాలితో కూడిన అగ్నిని పుట్టించి చెట్లను కాల్చి వేస్తున్నారు. అప్పుడు చంద్రుడు అది గమనించి యిలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పుణ్యాత్ములారా! పసిపిల్లలకు అమ్మానాన్నలు, కన్నులకు రెప్పలు, నాతికి పతి, లోకులందరికీ రాజూ, అడుగుకొనేవారికి గృహస్వామీ, మూఢులకు ఉత్తములూ నిజమైన చుట్టాలు కానీ, మనకు కీడు మూడినపుడు రక్షింపలేని మూర్ఖులు మాత్రం నిజమైన చుట్టాలు కాదయ్యా!. ఈ చెట్లు నిజమైన బంధువులు. ఎవరైనా ప్రేమనిండారిన తమవారిని తగులబెట్టుకోవాలనుకుంటారా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తప్పక = తప్పకుండ; అర్భక = పిల్లల; ఆవళిన్ = సమూహమునకు; తల్లియున్ = తల్లి; తండ్రియున్ = దండ్రి; నేత్ర = కన్నుల; పంక్తి = వరుస; కిన్ = కి; ఱెప్పలు = కనురెప్పలు; నాతి = స్త్రీ; కిన్ = కి; పతియు = భర్త; నరేంద్రుడు = రాజు; లోకుల = జనుల; కున్ = కి; ఎల్లన్ = అందరికి; అర్థి = యాచించెడి వాని; కిన్ = కి; ఇంపొప్ప = చక్కగా; గృహస్థు = గృహస్థుడు; మూఢుల్ = తెలివి తక్కువ వారల; కును = కి; ఉత్తములు = ఉత్తములు; ఎన్నన్ = ఎంచి చూసిన; వీరు = వీరు; బాంధవుల్ = బంధువులు; ముప్పునన్ = ప్రమాద పరిస్థితు లలో; కావ లేని = కాపాడ లేని; కడు = మిక్కిలి; మూర్ఖులు = మూర్ఖులు; కారు = కారు; నిజాల = నిజ మైన; చుట్టముల్ = బంధువులు. </div> </div> </div> <!--6-300 గరుడుని మూఁపుపై... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-300 గరుడుని మూఁపుపై... (చంపకమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/25.Garuduni_Mupupai.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర చ<br> ర్మ రుచిరశార్జ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో<br> త్కర నికరంబు లాత్మకరకంజములం ధరియించి భూతిసం<br> భరిత మహాష్టబాహుడు కృపామతితో నను గాచు గావుతన్. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీమహాభాగవతంలో భక్తులను పదిలంగా కాపాడే మహామంత్రాలవంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శ్రీమన్నారాయణ కవచం. జనమేజయునికి శ్రీశుకయోగీంద్రులు పరమాదరంతో బోధించిన ఆ కవచంలోని ఒక అంశం ఇది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీమహావిష్ణుదేవుడు వేదాత్మకుడైన గరుత్మంతుని మూపుమీద పాదాలు రెండూ చక్కగా నెలకొల్పి ఆసీనుడైయున్నాడు. అప్పటి ఆస్వామి హస్తాలు ఎనిమిది. వానిలో శంఖము, చక్రము, డాలు, వెలుగులు విప్పారజేసే శార్జ్గమనే విల్లు, నందకమనేఖడ్గము, బాణాలు, పాశము, గద మొదలైన సాధనాలు అమరి ఉన్నాయి. అవి మహాబాహువులు కనుక ఎన్నింటికైనా ఏవిధంగానైనా పట్టుకోగలవు. అదే వాని వైభవం. అటువంటి శ్రీమహావిష్ణువు దయార్ద్రహృదయుడై నన్నుకాపాడుగాక! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> గరుడుని = గరుత్మంతుని; మూపు = వీపు; పైన్ = మీద; పద = పాదముల; యుగంబున్ = రెంటిని; ఘటిల్లగ = ఉండగ; శంఖ = శంఖము; చక్ర = చక్రము; చర్మ = చర్మము; రుచిర = ప్రకాశవంతమైన; శార్ఙ్ఘ = విల్లు; ఖడ్గ = కత్తి; శర = బాణము; రాజిత = విలసిల్లెడి; పాశ = పాశము; గద = గద; ఆది = మొదలగు; సాధన = ఆయుధ; ఉత్కర = సంపత్తుల; నికరంబులు = సమూహములు; ఆత్మ = తనయొక్క; కర = చేతు లనెడి; కంజములన్ = పద్మము లందు; ధరియించి = ధరించి; భూతి = అష్టైశ్వర్యములు; సంభరిత = చక్కగా భరించెడి; మహా = గొప్ప; అష్ట = ఎనిమిది (8); బాహుడు = భుజములు గల వాడు; కృపామతి = దయగల మనసు; తోన్ = తోటి; నను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక. </div> </div> </div> <!--6-301 ప్రకట మకర... (ఆటవెలది).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-301 ప్రకట మకర... (ఆటవెలది).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/26.Prakatamakara.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ప్రకట మకర వరుణ పాశంబులందుల<br> జలములందు నెందు బొలియకుండ<br> గాచుగాక నన్ను ఘను డొక్కడైనట్టి<br> మత్స్యమూర్తి విద్యమానకీర్తి <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీమన్నారాయణ కవచంలోనిదే మరొక ప్రార్థన. జనుడు ఎప్పుడూ ఒక్కచోటనే ఉండడుకదా! ఎక్కడెక్కడో, ఏవేవో పనులమీద తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అతడు జలాలలో విహరిస్తూ ఉంటే కాపాడవలసివస్తే ఎలా ప్రార్ధన చేయాలో తెలుపుతున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ దేవాదిదేవుడు అన్నివిధాలైన జీవులనూ కంటికి రెప్ప అయి కాపాడటానికి అనేక అవతారాలు ఎత్తాడు. అందులో మత్స్యావతారం ఒకటి. అది మహోదాత్త మహా కార్యాలు చేసి మహాకీర్తితో వెలుగొందుతున్నది. ఆ అవతారం పొందిన ఆ స్వామి మొసళ్లు, మహాభయంకరమైన వరుణపాశాలూ గల కల జలాలలో ఎక్కడా ఏ ప్రమాదానికీ లోనుకాకుండా నన్ను రక్షించుగాక. రక్షిస్తాడు ఎందుకంటే ఆయన అందరికంటె, అన్నింటి కంటె ఘనమైనవాడు. ఇంకెవరినీ ప్రార్థించి ప్రయోజనంలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వరక్షకుడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ప్రకట = ప్రసిద్దమైన; మకర = మొసలి; వరుణ = వర్షపు; పాశంబులు = బంధనములు; అందు = అందు; జలములు = నీటి; అందు = అందును; ఎందున్ = దేనిలోను; పొలియకుండన్ = నాశము పొందకుండగ; కాచు గాక = కాపాడు గాక; నన్ను = నన్ను; ఘనుడు = గొప్పవాడు; ఒక్కడు = ఒకడే; ఐనట్టి = అయి నట్టి; మత్యమూర్తి = మత్యావతారము; విద్యమాన = ప్రవర్తిస్తున్న; కీర్తి = యశస్సుగలవాడు. </div> </div> </div> <!--6-302 నటుఁడు సమాశ్రిత... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-302 నటుఁడు సమాశ్రిత... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/27.Natudu_Samasritha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నటుడు సమాశ్రిత మాయా<br> నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనో<br> ద్భటుడు త్రివిక్రమదేవుడు<br> చటుల స్థలమందు నన్ను సంరక్షించున్ <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> జీవుడు నేల మీద తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కాపాడవలసినది ఆ దేవదేవుడే. అది తెలిసికొని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచంలోని యీ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామి గొప్ప నటుడు. లోకరక్షకుడు ఏ వేషం అవసరమయితే ఆ వేషం వేసుకొని ఆ విధమైన మహిమను ప్రదర్శింపగలవాడు. ప్రపంచాన్నంతా త్రిప్పుతున్న మహామాయ ఆయనను చక్కగా ఆశ్రయించుకొని తన పని తాను చేస్తున్నది. బలిచక్రవర్తి గొప్పబలానికి చాలా అందమైన విధంగా ప్రతిక్రియ చేసిన మహాశక్తిసంపన్నుడు. మొదట వామనుడై అలా అలా బ్రహ్మాండాంతందాకా పెరిగిన త్రివిక్రమదేవుడు. అట్టి ముప్పోకలపోయిన ముకుందుడు నన్ను నేలనెలవులమీద చక్కగా కాపాడుగాక! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వటుడు = బ్రహ్మచారి; సమాశ్రిత = చక్కగా ఆశ్రయించిన; మాయా = మాయా; నటుడు = నటనలు చేసెడి వాడు; బలి = బలిచక్రవర్తి; ప్రబల = అత్యధిక మైన; శోభన = తేజస్సును; ప్రతిఘటన = ప్రతిఘటించుట యందు; ఉద్బటుడు = బహు గట్టి వాడు; త్రివిక్రమదేవుడు = వామనుడు {త్రివిక్రమ దేవుడు - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు}; చటుల = భయంకర మైన; స్థలము = ప్రదేశముల; అందు = లో; నన్ను = నన్ను; సంరక్షించున్ = కాపాడుగాక. </div> </div> </div> <!--6-303 అడవుల సంకటస్థలుల... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-303 అడవుల సంకటస్థలుల... (చంపకమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/28.Adavula_Sankatasthalula.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అడవుల, సంకటస్థలుల, నాజిముఖంబుల, నగ్నికీలలం<br> దెడరుల నెల్ల నాకు నుతి కెక్కగ దిక్కగుగాక శ్రీనృసిం<br> హుడు కనకాక్ష రాక్షస వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ<br> క్త్రుడు ఘన దంష్ట్రపావక విధూత దిగంతరు డప్రమేయు డై<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రాణికి ప్రాణభయం కలిగే తావులన్నింటిలో ఆ మహాస్వామి శ్రీనృసింహమూర్తియై కాపాడుగాక! అని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అడవులలో, ఆపదలు మూడిన ఘోరప్రదేశాలలో, యుద్ధరంగాలలో, అగ్నికీలలలో, ఇంకా విపత్తులు చుట్టుముట్టిన సమయాలలో నాకు ఆ స్వామి దిక్కయి నిలుచుగాక. ఆయన నరసింహస్వామి. హిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుని వధించిన ఉగ్రమూర్తి. దిక్కులదరిపోయే అట్టహాస ధ్వనులను వెలువరించే వదనం కలవాడు. చాలా గొప్పవైన కోరలనే అగ్నిజ్వాలలతో దిక్కుల మధ్య భాగాలను కూడా దూరదూరతీరాలకు చెదరగొట్టిన మహానుభావుడు. ఎవ్వరికీ, ఏ కొలతలకూ అందని అప్రమేయుడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అడవుల = అడవు లందు; సంకట = ఆపదలు కలిగెడి; స్థలులన్ = స్థలము లందు; ఆజి = యుద్ధపు; ముఖంబునన్ = ఎదురై నప్పుడు; అగ్నికీలలన్ = నిప్పుమంటలలో; ఎడరులన్ = ఏడారు లందు; ఎల్లన్ = అన్ని చోట్లను; నా = నా; కు = కు; నుతికి = ప్రసిద్దము; ఎక్కగన్ = అగు నట్లు; దిక్కు = రక్షగా; అగుగాక = ఉండుగాక; శ్రీనృసింహుఁడు = నరసింహస్వామి; కనకాక్ష = హిరణ్యాక్షుడు అనే; రాక్షస = దానవుని; వధ = సంహరించెడి; ఉగ్రుడు = భయంకరుడు; విస్పురిత = వెలి గ్రక్కు చున్న; అట్టహాస = వికృతహాసము గల; వక్త్రుడు = నోరు గల వాడు; ఘన = పెద్ద; దంష్ట్ర = దంతముల నుండి జనించిన; పావక = అగ్నిహోత్రునిచే; విధూత = ఎగురకొట్టబడిన; దిగంతరుండు = దిగంతములు గల వాడు; అప్రమేయుండు = పరిమితుల కందని వాడు; ఐ = అయ్యి. </div> </div> </div> <!--6-304 అరయఁగ నెల్ల లోకములు... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-304 అరయఁగ నెల్ల లోకములు... (చంపకమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/29.Arayaga_Yella_Lokamula.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అరయగ నెల్లలోకములు నంకిలి నొంద మహార్ణవంబులో<br> నొరగి నిమగ్మమైన ధర నుద్ధతి గొమ్మున నెత్తినట్టి యా<br> కిరిపతి, యజ్ఞకల్పు, డురుఖేలుడు నూర్జిత మేదినీమనో<br> హరుడు, కృపావిధేయుడు సదాధ్వముల న్నను గాచు గావుతన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మానవుడు బ్రతుకుబాటలో ఎన్నో దారులలో పయనించవలసివస్తున్నది. అనుక్షణం అచ్యుతుని అండదండలుంటే కాని అడుగైనా ముందుకు పడదు. అందువలన ఆ అచ్యుతుడు ఆదివరాహరూపంలో అడుగడుగునా కాపాడుగాక అని ప్రార్ధించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. భూదేవి రక్కసుని ఉక్కుకోరలలో చిక్కుకుని మహాసముద్రంలో ఒరిగి మునిగిపోయింది. శ్రీమహావిష్ణువు ఒక్కపెట్టున ఆదివరాహమూర్తియై యజ్ఞస్వరూపం కల్పించుకుని, గొప్ప ఆటగా తన కొమ్ముతో ఆమెను ఉద్ధరించాడు. భూదేవి హృదయాన్ని కొల్లగొట్టాడు. సర్వలోకవాసులందరియందూ జాలువారే కరుణతో అలరారేవాడు. అట్టి స్వామి నేను పోయే దారులన్నింటిలోనూ నన్ను కాపాడుగాక! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అరయగన్ = చూడగా; ఎల్ల = సమస్త మైన; లోకములున్ = లోకములు; అంకిలి = కలత, ఆపద; ఒందన్ = బారగా, పొందగా; మహార్ణవంబు = మహా సముద్రము; లోన్ = లోపల; ఒరిగి = ఒరి గిపోయి; నిమగ్నము = మునిగినది; ఐన = అయిన; ధరన్ = భూమిని; ఉద్దతిన్ = ఉద్దరించుటకు; కొమ్మునన్ = కోరల పై; ఎత్తిన = ధరించిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; కిరిపతి = యజ్ఞ వరాహుడు {కిరిపతి - కిరి (వరాహము) పతి (ప్రభువు), వరాహావతారుడు}; యజ్ఞకల్పుడు = యజ్ఞ స్వరూపుడు; ఉరు = గొప్పగ; ఖేలుడు = క్రీడించు వాడు; ఊర్జిత = రూపు దాల్చిన; మేదినీ = భూదేవికి; మనోహరుడు = ప్రియుడు; కృప = దయకు; విధేయుడు = లొంగి పోవు వాడు; సదా = ఎల్లప్పుడు; అధ్వములన్ = దారుల యందు; నన్ను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక. </div> </div> </div> <!--6-305 రాముఁడు రాజకులైక... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-305 రాముఁడు రాజకులైక... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/30.Ramudu_Rajakulaika.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రాముడు, రాజకులైక వి<br> రాముడు, భృగు సత్కులాభిరాముడు, సుగుణ<br> స్తోముడు, నను రక్షించును<br> శ్రీమహితోన్నతుడు నద్రిశిఖరములందున్. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నేను ఏ కొండకొమ్ములందో తిరుగవలసివస్తుంది. కొండకొమ్ములంటే ఘోరమైన ఆపదలు. అక్కడ నాకు సంభవించే ఆపదలనుండి నన్ను కాపాడే స్వామి ఆ భార్గవరాముడే. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయన రాముడు. యోగులందరికీ ఆనందమందించే మనోహరుడు. లోకకంటకులైన నీచక్షత్రియులను వెదకి వెదకి ఇరవై యొక్కమారులు సంహరించిన దుష్టశిక్షకుడు. భృగుమహర్షి వంశానికి ఆనందం కలిగించిన మహాత్ముడు. గొప్పగుణాలన్నీ ఆయనను ఆశ్రయించి ప్రమోదం పొందాయి. శౌర్యలక్షికి ఆటపట్టయి ఉన్నత శిఖరాలందుకొన్న ఆ పరశురాముడు పర్వతశిఖరాలమీద నన్ను పరిరక్షించాలి </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రాముడు = పరశురాముడు; రాజ కులైక విరాముఁడు = పరశురాముడు {రాజ కులైక విరాముఁడు - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు(ఖండించు వాడు), పరశురాముడు}; భృగు సత్కు లాభిరాముఁడు = పరశురాముడు {భృగు సత్కు లాభిరాముఁడు - భృగు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (ప్రసిద్దమైన వాడు), పరశురాముడు}; సుగుణ స్తోముఁడు = పరశురాముడు {సుగుణ స్తోముడు - సుగుణముల సమూహము గల వాడు, పరశురాముడు}; నను = నన్ను; రక్షించును = కాపాడుగాక; శ్రీమహి తోన్నతుఁడు = పరశురాముడు {శ్రీమహి తోన్నతుడు - శ్రీ (శుభకర మైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నత మైన వాడు), పరశురాముడు}; అద్రి = కొండ; శిఖరముల = శిఖరముల; అందున్ = అందు. </div> </div> </div> <!--6-306 తాటక మర్దించి... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-306 తాటక మర్దించి... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/31.Thataka_Mardhinchi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తాటక మర్దించి తపసి జన్నము గాచి హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి<br> ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర ఖరదూషణాది రాక్షసుల దునిమి<br> వానరవిభు నేలి వాలి గూలగ నేసి జలరాశి గర్వంబు జక్కజేసి<br> సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి ద్రుంచి<br> <br> <b>(తేటగీతి) </b><br> <br> అలవిభీషణు లంకకు నధిపుజేసి<br> భూమిసుత గూడి సాకేతపురమునందు<br> రాజ్యసుఖములు గైకొన్న రామవిభుడు<br> వరుస నను బ్రోచుచుండు ప్రవాసగతుల<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణకోసం, ధర్మస్థాపనకోసం తన మహావైభవాన్నంతా తగ్గించుకొని మానవుడై అవతరించి మహాద్భుతకార్యాలు ఆచరించిన దశరథ మహారాజు తనయుణ్ణి ప్రార్థించి పరదేశాలలో సంభవించే పాటులనుండి కాపాడుకోమంటున్నది శ్రీ మన్నారాయణ కవచం </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీరామచంద్రుడు పసితనంలోనే కరకు రక్కసి తాటకను సంహరించాడు. తాపసి అయిన విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించాడు. శివుని విల్లు ఫెళ్లున విరిచి సీతమ్మను చేపట్టాడు. ధైర్యంతో విజృంభించి మహాబలవంతులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను రాచి రంపాన పెట్టాడు. కోతుల ఏలిక అయిన సుగ్రీవుణ్ణి ఏలుకున్నాడు. వాలినొక్క కోలతో కూలనేశాడు. లంకకు చేరుకోవటానికి దారి ఇవ్వకపోతే సముద్రాన్నే గడగడలాడించాడు. సాగరానికి సేతువుకట్టాడు. లంకకు చేరుకొని రావణుడు, కుంభకర్ణుడు మొదలైన క్రూరాత్ములను క్రుళ్ళబొడిచి చంపివేశాడు. రాక్షసుడైనా ఉత్తమ గుణాలు గల విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. భూదేవి ముద్దుబిడ్డ అయిన జానకితో కూడుకొని సాకేతపురంలో జనరంజకంగా రాజ్యమేలాడు. అటువంటి రామభద్రుడు నన్ను పరసీమలలో పరిరక్షించుగాక! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తాటక = తాటకిని; మర్ధించి = సంహరించి; తపసి = ఋషి యొక్క; జన్నము = యజ్ఞమును; కాచి = కాపాడి; హరు = శివుని; విల్లు = విల్లును; విఱిచి = విరిచి; ధైర్యమునన్ = ధైర్యముతో; మెఱసి = ప్రకాశించుతూ; ప్రబలులు = మిక్కలి బలమైన వారు; ఐనట్టి = అయి నటువంటి; విరాధ = విరధుడు; కబంధ = కబంధుడు; ఉగ్ర = ఉగ్రుడు; ఖర = ఖరుడు; దూషణ = దూషణుడు; ఆది = మొదలగు; రాక్షసులన్ = రాక్షసుల; దునిమి = సంహరించి; వానర విభున్ = సుగ్రీవుని; ఏలి = పాలించి; వాలిన్ = వాలిని; కూలగ = సంహరించుటకు; ఏసి = బాణము వేసి; జలరాశి = సముద్రుని యొక్క; గర్వమున్ = గర్వమును; చక్కజేసి = అణచివేసి; సేతువు = వంతెన; బంధించి = కట్టి; చేరి = పూని; రావణ = రావణుడు; కుంభకర్ణ = కుంభకర్ణుడు; ఆది = మొదలగు; వీరులన్ = వీరులను; కడిమిన్ = పరాక్రమముతో; త్రుంచి = సంహరించి; అల = ఆయొక్క; విభీషణున్ = విభీషణుని; లంక = లంకా రాజ్యమున; కున్ = కు; అధిపున్ = రాజును; చేసి = చేసి; భూమి సుతన్ = సీతాదేవితో {భూమిసుత - భూదేవి యొక్క పుత్రిక, సీత}; కూడి = కలిసి; సాకేత = సాకేతము యనెడి; పురము = పట్టణము; అందు = లో; రాజ్యసుఖములు = రాజభోగములను; కైకొన్న = స్వీకరించిన; రామవిభుడు = శ్రీరామచంద్రుడు; వరుస = క్రమముగా; నను = నన్ను; ప్రోచు చుండు = కాపాడు తుండును; ప్రవాస = దూరప్రాంతములకు; గతులన్ = పోవు నపుడు. </div> </div> </div> <!--6-636 దండంబు యోగీంద్ర... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-636 దండంబు యోగీంద్ర... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/32.Dandambu_Yogeendramandala.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> దండంబు యోగీంద్రమండల నుతునకు దండంబు శార్జ్గకోదండునకును<br> దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు<br> దండంబు మత్తవేదండ రక్షకునకు దండంబు రాక్షసఖండనునకు<br> దండంబు పూర్ణేందుమండల ముఖునకు దండంబు తేజః ప్రచండునకును<br> <br> <B>(తేటగీతి) </B><br> <br> దండ మద్భుత పుణ్యప్రధానునకును<br> దండ ముత్తమ వైకుంఠధామునకును<br> దండ మాశ్రితరక్షణ తత్పరునకు<br> దండ మురుభోగినాయక తల్పునకును <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> వృత్రాసురుడు దేవతల పాలిట తోకచుక్క అయి వారిని కాల్చుకుతింటున్నాడు. అతని బాధలకు తాళలేని ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీ మహావిష్ణువునకు మొరపెట్టుకున్నారు. ఆయన అనుగ్రహబుద్ధితో వారికి దర్శనం అనుగ్రహించాడు. వారు ఆయనను ఇలా స్తుతిచేస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహాయోగుల మండలమంతా గొంతెత్తి నీగుణగణాలను నుతిస్తూనే ఉంటుంది. అట్టి నీకు దండం. ‘శార్ఙ్గం’ అనే గొప్ప కోదండంతో దుష్టులను దండించే దండిమగనికి నీకు దండం. అత్యద్భుత ప్రభలను వెదజల్లే కుండలాలజంటతో అలరారే స్వామికి దండం. అతిఘోరమైన పోరులలో ఆరితేరిన అయ్యకు దండం. గజేంద్రుణ్ణి కాపాడిన కరుణామయునికి దండం. రాక్షసులను ముక్కలుముక్కలుగా నరికిపోగులుపెట్టే స్వామికి దండం. నిండుజాబిలి వంటి నెమ్మోముతో విరాజిల్లే సుందరమూర్తికి దండం. ఎట్టివారికైనా తట్టుకోరాని తేజస్సుతో అతితీవ్రంగా ప్రకాశించే అద్భుతమూర్తికి దండం. అద్భుతమైన పుణ్యం ప్రధానమై భాసిల్లే స్వామికి దండం. ఉత్తమమైన వైకుంఠమే మందిరమైన మాధవునకు దండం. ఆశ్రయించిన వారిని రక్షించటానికి ఆరాటపడే దయామూర్తికి దండం. వేయిపడగలలో విరాజిల్లే ఆదిశేషునిపై పవ్వళించే పరమాత్మకు దండం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> దండంబు = నమస్కారము; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింప బడెడి వాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్ఘ = శార్ఙ్ఘము అనెడి; కోదండున్ = విల్లు గల వాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత = అలంకరింప బడిన; కుండల = చెవి కుండలముల; ద్వయున్ = జంట గల వాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర = అతి కఠిన మైన; భండనున్ = యుద్దము చేయు వాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున్ = కాపాడిన వాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించిన వాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలము వంటి; ముఖున్ = ముఖము గల వాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతి తీవ్రమైనది గల వాని; కున్ = కి; <br><br>దండము = నమస్కారము; అద్భుత = అద్భుత మైన; పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడి వాని; కును = కి; దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠ మైన; వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగా గల వాని; కును = కి; దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; రక్షణ = కాపాడుట యందు; తత్పరున్ = లగ్న మగు వాని; కు = కి; దండము = నమస్కారము; ఉరు = గొప్ప; భోగినాయక = ఆదిశేషుని {భోగినాయకుడు - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు}; తల్పున్ = పాన్పు గా గల వాని; కును = కి. </div> </div> </div> <!--6-339 అకట దిక్కుల కెల్ల... (తేటగీతి). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-339 అకట దిక్కుల కెల్ల... (తేటగీతి).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/33.Akata_Dikkulakella.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు<br> నొక్క దిక్కును లేదు కా లూన నైన<br> దిక్కుగావయ్య! నేడు మా దిక్కు జూచి<br> దిక్కులేకున్నవారల దిక్కు నీవ<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> వృత్రాసురుడు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేని దేవతలు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టు కుంటున్నారు. కాపాడవలసినదిగా శ్రీవాసుదేవునకు విన్నవించుకుంటున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దేవా! మేము దిక్కులన్నింటికీ పాలకులం. కానీ స్వామీ మేము కాలుపెట్టటానికైనా దిక్కులేనివారమైనాము. నేడు మా దిక్కు చూచి మమ్ములను కాపాడు. దిక్కులేనివారలకు దిక్కు నీవేకదా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అకట = అయ్యో; దిక్కుల్ = దిక్కుల; ఎల్లన్ = అన్నిటికిని; దిక్కైన = అధినాయకుల మైన; మా = మా; కున్ = కు; ఒక్క = ఏ యొక్క; దిక్కు = మూలను కూడ; లేదు = లేదు; కాలూనన్ = నిలబడెడి యాధారము; ఐనన్ = అయి నప్పటికిని; దిక్కు = శరణిచ్చు వాడవు; కావు = అగుము; అయ్య = తండ్రి; నేడు = ఇప్పుడు; మా = మా; దిక్కు = వైపునకు; చూచి = చూసి; దిక్కు = ఆధారము; లేకున్న = లే నట్టి; వారల = వారికి; దిక్కు = రక్షకుడవు; నీవ = నీవే. </div> </div> </div> <!--6-340 నీ దిక్కు గానివారికి... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">6-340 నీ దిక్కు గానివారికి... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/06/34.Nee_Dikkuganivariki.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నీ దిక్కు గానివారికి<br> నే దిక్కును వెదక నుండ దిహపరములకున్<br> మోదింప దలచువారికి<br> నీదిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> వైకుంఠవాసునకు దిక్పాలకులైన దేవతలు ఇలా మొరపెట్టుకుంటున్నారు. వృత్రాసురుని చిత్రహింసల నుండి సంరక్షించే బాధ్యత నీదే అంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పద్మనాభా! నీవైపు చూపుపెట్టనివారికి ఎంత వెదికినా ఎక్కడ వెదికినా ఈ లోకంలో నయినా, పరలోకంలోనయినా ఏదిక్కూ ఉండదు. ప్రమోదం పొందాలనుకునేవారికి నీదిక్కే దిక్కుసుమా! కనుక మమ్ములనందరినీ ఆదుకొనే ఆదిదేవా! అసురమర్దనా! కాపాడు. కాపాడు. కాపాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నీ = నీ; దిక్కు = వైపు; కాని = కా నట్టి; వారి = వారి; కిన్ = కి; ఏ = ఏ విధ మైన; దిక్కును = రక్షణయు; లేదు = లేదు; వెదకన్ = ఎంత వెదికిననూ; ఇహపరముల్ = ఈ లోకపై లోక ప్రయోజనముల; కున్ = కు; మోదింపన్ = సంతోషింప; తలచు = కోరెడి; వారి = వారల; కిన్ = కి; నీ = నీ యొక్క; దిక్కే = రక్షణమా త్రమే; దిక్కు = శరణ్యము; సుమ్ము = సుమా; నీరజనాభా = విష్ణుమూర్తి {నీరజ నాభుడు - నీరజము (పద్మము) నాధుడు (బొడ్డున గల వాడు), విష్ణువు}. </div> </div> </div> <div> <div style="width:10%;Text-align:center;float:left;"> <div class="button-effect"> <a class="effect effect-4" href="iBam5.html" title="పంచమ స్కంధం" style="background-color: #f4511e;"><i class="fas fa-arrow-left"></i> పంచమ స్కంధం</a> </div> </div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam7.html" title="సప్తమ స్కంధం" style="background-color: #f4511e;">సప్తమ స్కంధం <i class="fas fa-arrow-right"></i></a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>