JezK
Edit File: iBam4.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam4.html Date Name Comments ==== ==== ======== 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <br> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <link rel="shortcut icon" href="../images/favicon.png"/> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet" /> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> <link href="../assets/css/main.css" rel="stylesheet" /> <link href="../assets/css/ibam.css" rel="stylesheet" /> <script> <!-- $(window).scroll(function () { --> <!-- $('audio').each(function () { --> <!-- //if ($(this).is(":in-viewport")) --> <!-- if (IsInViewport($(this))) --> <!-- { --> <!-- $(this)[0].play(); --> <!-- } --> <!-- else --> <!-- { --> <!-- $(this)[0].pause(); --> <!-- } --> <!-- }) --> <!-- }); --> <!-- Check if an element is in the visible viewport --> <!-- @param {jQuery|HTMLElement} el --> <!-- @return boolean --> <!-- var IsInViewport = function (el) { --> <!-- if (typeof jQuery === "function" && el instanceof jQuery) el = el[0]; --> <!-- var rect = el.getBoundingClientRect(); --> <!-- return ( --> <!-- rect.top >= 0 && --> <!-- rect.left >= 0 && --> <!-- rect.bottom <= (window.innerHeight || document.documentElement.clientHeight) && --> <!-- rect.right <= (window.innerWidth || document.documentElement.clientWidth) --> <!-- ); --> <!-- }; --> </script> </head> <body> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"><a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1<span class="sr-only">(current)</span></a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a></li> <li class="nav-item"><a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a></li> <li class="nav-item"><a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a></li> <li class="nav-item"><a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a></li> <li class="nav-item"><a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a></li> <li class="nav-item"><a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a></li> <li class="nav-item"><a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a></li> <li class="nav-item"><a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a></li> <li class="nav-item"><a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a></li> <li class="nav-item"><a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a></li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a></li> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-skype" aria-label="Skype" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-linkedin" aria-label="Linkedin" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-google-plus" aria-label="Google-Plus" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a></li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a></li> </ul> </div> </nav> <!-- <div class="img-responsive aln-top" style="margin-top: 50px; background-color: white; z-index: 99; position: relative;"> <img src="../images/iBam.png" /> </div>--> <div class="container-fluid"> <div id="chap4" > <!-- <br><br> --> <h3 class="title" style="padding-top: 6px;" >చతుర్ధ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap4"></div> <div class="col-sm-9"> <!--4-91 నెలకొని ధర్మపాలన... (చంపకమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-91 నెలకొని ధర్మపాలన... (చంపకమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/01.Nelakoni_Dharma_Paalana.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు న<br> క్కలుషుని జిహ్వ గోయదగు గా కటుసేయగ నోపడేని తా<br> పొలియుట యొప్పు, రెంటికి ప్రభుత్వము సాలమికర్ణ రంధ్రముల్<br> బలువుగ మూసికొంచు చన పాడి యటందురు ధర్మవర్తనుల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మైత్రేయమహర్షి విదురునకు అనేక పురాణ విషయాలను ఉపదేశించాడు. వరుసలో దక్షప్రజాపతి కథ వచ్చింది. దక్షుడు సరియైన జ్ఞానంలేక పరమశివునితో పగ పెట్టుకున్నాడు. తన బిడ్డను, ఆమె భర్తనూ ఘోరంగా అవమానించాడు. తన తనయ దాక్షాయణి దానిని సహింపలేక తన దేహాన్ని అగ్నిలోవేసి బూడిద చేసుకున్నది. ఆ పనికి ముందు దక్షునకు శివ మహిమను సుదీర్ఘంగా బోధించిన సందర్భంలోనిది ఈ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓయీ దక్షా! ఆ పరమేశ్వరుడు పట్టుదలతో ధర్మాన్ని కాపాడటంలో దిట్ట. అందులో రవంత మాలిన్యం కూడా అంటనివాడు. అధర్మాన్ని చీల్చిచెండాడే శీలం కలవాడు. అట్టి మహాత్ముణ్ణి కాదని కాఱుకూతలు కూసే పాపాత్ముని నాలుకను ముక్కలుముక్కలుగా కోసివేయాలి. ఆ పని చేయలేకపోతే తన్నుతాను రూపుమాపుకోవాలి. అదీ చేతకాకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకొని అక్కడనుండి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మాన్ని భద్రంగా పాటించేవాళ్ళు చేసే ఉపదేశం ఇది </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నెలకొని = స్థిర మైన; ధర్మ పాలన = ధర్మ పరిపాలన చేయు; వినిర్ములున్ = మిక్కిలి నిర్మల మైనవాని; భర్గున్ = శివుని; తిరస్కరించు = తెగడు నట్టి; ఆ = ఆ; కలుషునిన్ = పాపి యొక్క; జిహ్వన్ = నాలుకను; కోయన్ = కోసి వేయుట; తగున్ = సరి యైన పని; కాక = లేకపోతే; అటు = అలా; చేయగన్ = చేయుటకు; ఓపడు = శక్తి లేని వాడు; ఏని = అయితే; తాన్ = తనే; పొలియుట = మరణించుట; ఒప్పు = తగిన పని; రెంటికిన్ = రెండు పనులకు; ప్రభుత్వము = సామర్థ్యము; చాలమిన్ = సరిపోక పోయినచో; కర్ణ = చెవుల; రంధ్రముల్ = కన్నములను; బలువుగన్ = బలముగ; మూసికొంచున్ = మూసికొంటూ; చనన్ = వెళ్ళిపోవుట; పాడి = నీతి; అటన్ = అని; అందురు = అంటారు; ధర్మ = ధర్మము ప్రకారము; వర్తనుల్ = ప్రవర్తించువారు. </div> </div> </div> <!--4-108 అభ్రంలి హాదభ్ర... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-108 అభ్రంలి హాదభ్ర... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/02.Abhramlihaadabra.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ; కృన్నీల దీర్ఘ శరీర మమరఁ<br> బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల; జాజ్వల్యమాన కేశములు మెఱయఁ<br> జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ; సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప<br> వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక; వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ<br> ఘన కపాలాస్థి వనమాలికలును దనర<br> నఖిలలోక భయంకరుఁ డగుచు వీర<br> భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దక్షుడు పదవీగర్వంతో పరమేశ్వరునకు ఘోరమైన అవమానం చేశాడు. సతీదేవి సహించలేక దక్షునిముందే అగ్నిలోపడి బూడిద అయిపోయింది. రుద్రుడు దక్షునిపని చూడమని వీరభద్రుణ్ణి పంపాడు. ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది యీ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆకాశం అంచులుముట్టే ఊపుగల కాదు మేఘమా అనిపించే పొడవైన శరీరం ఒప్పారుతున్నది. భగభగా మండుతున్న అగ్నిజ్వాలలలాగా కేశములు వెలిగిపోతున్నాయి. భయం కలిగించే దిగ్గజాలు చాచిన పొడవైన తొండాలా అన్నట్లున్న వేయిచేతులలో వాడికత్తులు వేడిని క్రక్కుతూ కదలుతున్నాయి. మూడు కన్నులూ మూడు మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలవికాకుండా మండిపోతున్నాయి. చాలా గట్టితనంగల రంపాలలాగా కోరలు పటపటలాడుతున్నాయి. పెద్దపెద్ద పుఱ్ఱెలతో, ఎముకలతో ఏర్పడిన మాలలు మెడనుండి కాళ్ళవరకూ వ్రేలాడుతున్నాయి. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటానికై వీరభద్రుడు ఇలా మహాభయంకరంగా ఉదయించాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అభ్రంలిహ = ఆకాశమును నాకుచున్న; అదభ్ర = మహా విస్తారమై; విభ్రమ = పరిభ్రమిస్తున్న; అభ్ర = మేఘముల వంటి; భ్రమ కృత్ = సుడులు తిరుగు చున్న; నీల = నల్లని; దీర్ఘ = పొడవైన; శరీరము = దేహము; అమరన్ = అమరి యుండగ; ప్రజ్వల = బాగా మండుతున్న; జ్వలన = మంటల; దీప్త = వెలుగుతున్న; జ్వాలికా = మంటల; జాల = సమూహముల వలె; జాజ్వల్యమాన = మండిపో తున్న ట్టున్న; కేశములు = శిరోజములు; మెఱయన్ = మెరు స్తుండగ; చండ = భయంకర మైన; దిగ్వేదండ = దిగ్గజముల యొక్క; శుండా = తొండములు; అభ = వంటి; దోర్దండ = చేతులు; సాహస్ర = వేనవేలు; ధృత = ధరింపబడిన; హేతి = ఆయుధముల; సంఘము = సమూహము; ఒప్ప = ఒప్పు తుండగ; వీక్షణ = కన్నుల; త్రయ = మూడింటి; లోక = లోకములను; వీక్షణ = చూసెడిచూపుల; ద్యుతిన్ = కాంతి; లోక = లోకము లందలి; వీక్షణ = చూసేవారి; తతి = సమూహమునకు; దుర్నిరీక్ష్యముగను = చూడ శక్యము కాకుండగ. క్రకచ = ఱంపము వలె; కఠిన = కరు కైన; కరాళ = వంకర్లు తిరిగిన; దంష్ట్రలు = కోరలు; వెలుంగ = ప్రకాశిస్తుండగ; ఘన = పెద్ద; కపాల = పుర్రెలు; అస్థి = ఎముకలు కూర్చిన; వనమాలికలు = ఆకులు పూల దండలు; తనరన్ = అతిశయించగ; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; భయంకరుడు = భీకరుడు; అగుచున్ = అవుతూ; వీరభద్రుడు = వీరభద్రుడు; ఉదయించెన్ = పుట్టెను; మాఱట = రెండవ; రుద్రుడు = రుద్రుడు; అగుచున్ = అవుతూ. </div> </div> </div> <!--4-134 భాసురలీలగాంచిరి…--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-134 భాసురలీలగాంచిరి…</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/03.Bhaasuraleela_Gaanchiri.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భాసురలీల గాంచిరి సు పర్వులు భక్తజనైకమానసో<br> ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా<br> వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసికై<br> లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దక్షయజ్ఞం సర్వనాశనం అయిపోయింది. ఆ యజ్ఞంలో పాల్గొన్న దేవతలు కూడా వీరభద్రుని ధాటికి నిలువలేకపోయారు. పరమేశ్వరుని కరుణను పొందాలనుకున్నారు. బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారందరినీ కైలాసానికి తీసుకొనివెళ్ళాడు. ఆ కైలాసం ఎలా ఉన్నదో ఈ పద్యం కమనీయంగా వివరిస్తున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళా లూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలతెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భాసుర = ప్రకాశిస్తున్న; లీలన్ = విధమును; కాంచిరి = చూసిరి; సుపర్వులు = దేవతలు; భక్త = భక్తులైన; జన = జనుల; ఏక = ముఖ్యమైన; మనస్ = మనసునకు; ఉల్లాసమున్ = సంతోషమును కలిగించునది; కిన్నరీ = కిన్నరీ; జన = స్త్రీల; విలాసమున్ = విలాసముల నివాసము; నిత్య = శాశ్వతమైన; విభూతి = వైభవములకు; మంగళ = శుభములకు; ఆవాసము = నివాసము; సిద్ధ = సిద్ధులకు; గుహ్యక = గుహ్యకులకు; నివాసము = నివాసము; రాజత = వెండివంటి కాంతులను; భూ = పుట్టించి; వికాసి = వెలుగొందుచున్నది; కైలాసమున్ = కైలాసమును; కాంతి = కాంతిచేత; నిర్జిత = జయింపబడిన; కులక్షితిభృత్ = కులపర్వతముల యొక్క; సుమహత్ = చాలా గొప్ప; విభాసమున్ = ప్రకాశము గలది. </div> </div> </div> <!--4-137 ఉజ్జ్వలం బై... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-137 ఉజ్జ్వలం బై... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/04.Vujwalambaina.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ;వొగి పంచసప్తతి యోజనముల<br> పఱపును గల్గి యే పట్టున తఱుగని; నీడ శోభిల్ల నిర్ణీతమగుచు<br> పర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య;ముల పోలగలఫలముల తనర్చి<br> కమనీయ సిద్ధయోగ క్రియామయమయి; కమనీయ సిద్ధయోగ క్రియామయమయి<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> భూరి సంసారతాప నివార కంబు<br> నగుచు తరురాజమనగ పెంపగ్గలించి<br> భక్తజనులకు నిచ్చలు ప్రమద మెసగ<br> వలయు సంపదలందు నావటము వటము<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బ్రహ్మ దేవతలనందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. వీరభద్రుని విజృంభణకు దెబ్బతిన్న దేవతలను కాపాడమని కైలాసవాసిని ప్రార్థించాలి. అక్కడ కైలాసంలో స్వామి ఒక మఱ్ఱిచెట్టు మొదట కూర్చున్నాడు. ఏ కొలతలకూ అందని స్వామికి ఆధార భూమి అయిన ఆ మఱ్ఱిచెట్టు ఎంతమహిమ కలదియో ఈ పద్యం వివరిస్తున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామి కూర్చున్న ఆ మఱ్ఱిచెట్టు కాంతులను విరజిమ్ముతున్నది. నూరు ఆమడల పొడవు, డెబ్బది అయిదు యోజనాల వైశాల్యంతో ఒప్పారుతున్నది. ఏవేళనయినా దాని నీడ తఱుగదు. ఆకులు, కొమ్మలు దట్టంగా ఏర్పడి ఉన్నాయి. దాని పండ్లు మాణిక్యాలను తలపింపజేస్తున్నాయి. సొంపైన సిద్ధులు అక్కడ యోగక్రియలను హాయిగా చేసుకుంటారు. ఆవిధంగా ముక్తిని కోరేవారికి అది విడిదిపట్టు. ఘోరమైన సంసారతాపాన్ని అది రూపుమాపుతుంది. ఇన్ని కారణాలుగా అది వృక్షాలకు రాజుగా పేరు పొందింది. భక్తులకు పరమానందాన్ని కలిగిస్తుంది. కోరిన సంపదలను కూర్పగల మహావృక్షం ఆ మఱ్ఱిచెట్టు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఉజ్జ్వలంబు = ప్రకాశి స్తున్నది; అయి = అయ్యి; శత = వంద (100); యోజనంబుల = యోజనముల; పొడవును = పొడవు; పంచసప్తతి = డెబ్బై ఐదు (75); యోజనముల = యోజనముల; పఱపును = వెడల్పును; కల్గి = కలిగి ఉండి; ఏపట్టున = ఎక్కడైన; తిరుగని = వెను తగ్గని; నీడ = నీడ; శోభిల్లన్ = శోభిల్లుట; నిర్ణీతము = నిశ్చయము; అగుచున్ = అవుతూ; పర్ణ = ఆకులతోను; శాఖా = కొమ్మలతోను; సమ = చక్కగా; ఆకీర్ణము = వ్యాపించినది; ఐ = అయ్యి; మాణిక్యములన్ = మణులను; పోలన్ = సరి పోల్చుటకు; కల = తగిన; ఫలములన్ = పండ్లతో; తనర్చి = అతిశయించి; కమనీయ = మనోహరమైన; సిద్ధ = సిద్ధుల; యోగ = యోగమునకు చెందిన; క్రియా = క్రియలతో; మయ = కూడి నట్టిది; అయి = అయ్యి; అనఘ = పుణ్యు లైన; ముముక్షు = మోక్షము కోరెడి; జన = వారికి; ఆశ్రయంబు = ఆస్థాన మైనదియును.<br><br> భూరి = అత్యధిక మైన; సంసార = సంసారమునకు చెందిన; తాప = బాధలను; నివారకంబును = పోగొట్టునది; అగుచున్ = అవుతూ; తరు = వృక్షములలో; రాజము = శ్రేష్ట మైనది, పెద్దది; అనగన్ = అనగా; పెంపగ్గలించి = అతిశయించి; భక్త = భక్తు లైనట్టి; జనుల్ = వారి; కున్ = కి; నిచ్చలున్ = నిత్యము; ప్రమదము = సంతోషము; ఎసగ = అతిశయించుటకు; వలయు = కావలసిన; సంపదలన్ = సౌఖ్యాలు అందు = కలిగి ఉండుటలో, అందించుటకు; ఆవటము = నివాసము; వటము = మఱ్ఱిచెట్టు. </div> </div> </div> <!--4-139 ఇద్ధ సనందాది... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-139 ఇద్ధ సనందాది... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/05.Idha_Sanandaadi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఇద్ధసనందాది సిద్ధసంసేవిత; శాంతవిగ్రహుని వాత్సల్యగుణుని<br> కమనీయలోక మంగళదాయకుని, శివు; విశ్వబంధుని జగద్వినుత యశుని<br> గుహ్యక సాధ్యరక్షోయక్షనాథ కు;బేరసేవితుని దుర్వారబలుని<br> ఉదితవిద్యా తపోయోగయుక్తుని బాల; చంద్ర భూషణుని మునీంద్ర నుతుని<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> తాపసాభీష్టకరు భస్మదండలింగ<br> ఘనజటాజినధరుని, భక్తప్రసన్ను<br> వితతసంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న<br> రక్తవర్ణు, సనాతను బ్రహ్మమయుని!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అటువంటి మఱ్ఱిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్న మహాదేవుణ్ణి దర్శించు కోవటానికి మహాకవి మనకు ఒక పరమసుందరమైన అక్షరచిత్రాన్ని అందిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీ దక్షిణామూర్తి మహాస్వామిని తేజస్సుతో వెలుగొందే సనందుడు మొదలైన సిద్ధులు చక్కగా సేవించుకుంటున్నారు. ఆయన నిలువెల్లా నిండుగా ఉన్న శాంతాకారం కలవాడు. అందరియందూ, అన్నింటియందూ, తల్లికి బిడ్డలయందు ఉండే వాత్సల్యం ఆయనలో కానవస్తున్నది. లోకంలో అందరికీ శుభాలను కలిగించేస్వామి శివుడు. విశ్వానికి బంధువు. లోకాలన్నీ ఆయన కీర్తిని ఎల్లవేళలా కొనియాడుతూ ఉంటాయి. గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు అనే దేవజాతుల వారికందరికీ ఏలిక అయిన కుబేరుడు ఆయనను భక్తితో సేవిస్తున్నాడు. ఆ ప్రభువు బలాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. పైకి పొంగుకొని వస్తున్న విద్యలూ, తపస్సూ, యోగమూ అతని సొమ్ములు. నెలవంక ఆయన తలపై అలంకారంగా విరాజిల్లుతున్నది. మునీంద్రులు నోరారా ఆయనను కొనియాడుతున్నారు. తపస్వు ల కోరికలన్నీ ఆయన వలన తీరుతున్నాయి. భక్తులయెడల ప్రసన్నంగా ఉంటాడు. సంజకెంజాయలను మరపింపజేసే ఎర్రని కాంతులతో చూడముచ్చటగా ఉన్నాడు. సనా తనుడు. సాక్షాత్తూ పరబ్రహ్మమే. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు = శివుని {ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితుడు - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితుడు (చక్కగా సేవించబడు తున్నవాడు), శివుడు}; శాంత విగ్రహుని = శివుని {శాంత విగ్రహుడు – శాంత స్వరూపము కలవాడు, శివుడు}; వాత్సల్య గుణునిఁ = శివుని {వాత్సల్య గుణుడు - వాత్యల్య(సంతానము యెడనుండు స్నేహభావము) పూరిత మైన గుణములు కలవాడప, శివుడు}; కమనీయ లోక మంగళ దాయకుని = శివుని {కమనీయ లోక మంగళ దాయకుడు - కమనీయ (మనోహర మైన) లోక (విశ్వ జనీన) మంగళ (శుభములను) దాయకుడు (ఇచ్చువాడు, శివుని}; శివు = శివుని; విశ్వ బంధుని = శివుని {విశ్వ బంధువు - లోకమునకు మంచి కోరువాడు, శివుడు}; జగ ద్వినుత యశుని = శివుని {జగ ద్వినుత యశుడు - విశ్వమున వినుత (ప్రసిద్ధ మైన) యశస్సు కలవాడు, శివుడు}; గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుని = శివుని {గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుడు –గుహ్యకులచే సాధ్యులచే రాక్షసులచే యక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు}; దుర్వార బలుని = శివుని {దుర్వార బలుడు – వారింప శక్యముకాని బలము కలవాడు, శివుడు}; ఉదిత విద్యా తపో యోగ యుక్తుని = శివుని {ఉదిత విద్యా తపో యోగ యుక్తుడు - ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు}; బాలచంద్ర భూషణుని = శివుని {బాలచంద్ర భూషణుడు - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు}; మునీంద్ర నుతుని = శివుని {మునీంద్ర నుతుడు – మునులలో శ్రేష్ఠులచే నుతింప బడువాడు, శివుడు}; <br><br>తాప సాభీష్ట కరుని = శివుని {తాప సాభీష్ట కరుడు – తస్సులు చేసే వారి కోరికలు తీర్చే వాడు, శివుడు}; భస్మ దండ లింగ ఘనజటాజిన ధరుని = శివుని {భస్మ దండ లింగ ఘనజటాజిన ధరుడు - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప) జటలు అజిన (లేడి చర్మము) ధరించినవాడు, శివుడు}; భక్త ప్రసన్ను = శివుని {భక్త ప్రసన్నుడు - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు}; వితత సంధ్యాభ్ర రుచి విడంబిత వినూత్న రక్త వర్ణు = శివుని {వితత సంధ్యాభ్ర రుచి విడంబిత వినూత్న రక్త వర్ణుడు - వితత (విస్తార మైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్త మైన) రక్త(ఎర్రని) వర్ణుడు (రంగు వాడు), శివుడు}; సనాతను = శివుని {సనాతనుడు - శాశ్వతుడు, శివుడు}; బ్రహ్మ మయుని = శివుని {బ్రహ్మ మయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుడు}. </div> </div> </div> <!--4-140 అంచిత వామపాదాంభోరుహము... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-140 అంచిత వామపాదాంభోరుహము... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/06.Anchitavaama_Paadambhoruhamu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అంచితవామ పాదాంభోరుహము దక్షి;ణోరుతలంబున నొయ్య నునిచి<br> సవ్యజానువుమీద భవ్యబాహువు సాచి; వలపలి ముంజేత సలలితాక్ష<br> మాలిక ధరియించి మహనీయ తర్క ము;ద్రా యుక్తుడగుచు చిత్తంబులోన<br> అవ్యయంబయిన బ్రహ్మానందకలిత స;అవ్యయంబయిన బ్రహ్మానందకలిత స<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> యోగపట్టాభిరాముడై ఉచితవృత్తి<br> రోషసంగతి బాసి కూర్చున్న జముని<br> యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున<br> నున్న మునిముఖ్యు నంచితయోగ నిరతు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన మహాత్ములు శ్రీ దక్షిణామూర్తి అయిన మహాదేవుని ఇలా సందర్శించుకుంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ దక్షిణామూర్తి మహాదేవుడు. తన ఎడమకాలిని కుడి తొడపై చక్కగా పెట్టుకొని ఉన్నాడు. ఎడమ మోకాలిమీదికి చేతిని చాపి ఉంచాడు. కుడి ముంజేతితో మిక్కిలి సుకుమారమైన స్ఫటికమాలను పట్టుకొని ఉన్నాడు. కుడిచేతితో చాలా గొప్పభావాన్ని తలపించే జ్ఞానముద్రను ప్రదర్శిస్తున్నాడు. ఆ జ్ఞానమూర్తిని పరిశీలిస్తుంటే ఆయన హృదయంలో బ్రహ్మానందం తాండవిస్తున్న స్ఫూర్తి కలుగుతుంది. మాత్సర్యం ఏమాత్రమూ లేనివాడు. యమధర్మరాజు రోషాన్నంతటినీ వదలించుకొని యోగపీఠం మీద పట్టాభిషిక్తుడై ఉన్నాడా అనిపిస్తున్నాడు. దర్భలతో అల్లిన ఆసనంమీద కూర్చుండి యోగసంపదను నిరంతరంగా సంపాదించుకుంటున్నాడు. అట్టి దక్షిణామూర్తిని బ్రహ్మాదులు సందర్శించుకున్నారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అంచిత = ఒప్పుతున్న; వామ = ఎడమ; పాద = పాదము అనెడి; అంభోరుహమున్ = పద్మమును {అఁబోరుహము - అంబువు (నీట) ఊరుహము (పుట్టునది), పద్మము}; దక్షిణ = కుడి; ఊరు = తొడ; తలంబునన్ = ప్రదేశము నందు; ఒయ్యన = తీర్పుగ; ఉనిచి = ఉంచి; = సవ్య = ఎడమ; జానువు = మోకాలి; మీద = పైన; భవ్య = శుభ మైన; బాహువు = హస్తమును; సాచి = చాచి; వలపలి = కుడి; ముంజేత = మంజేతి యందు; సలలిత = అంద మైన; అక్ష మాలిక = జపమాల; ధరియించి = ధరించి; మహనీయ = గొప్ప; తర్క ముద్రా = ధ్యానముద్రతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; చిత్తంబు = మనసు; లోనన్ = అందు; అవ్యయంబు = తరుగనిది; ఐన = అయిన; బ్రహ్మానంద = బ్రహ్మానందముతో; సంకలిత = కూడిన; సమాధి = సమాధి; నిష్ఠుడు = నిష్ఠ కలవాడు; వీత = తొలగిన; మత్సరుండు = మాత్సర్యము కలవాడు; <br><br>యోగ = యోగము; పట్టాభిరాముడు = అందు ఒప్పుతున్న వాడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; వృత్తి = విధముగ; రోష = రోషము ఎడల; సంగతిన్ = సంగము నుండి; పాసి = దూరమై; కూర్చున్న = కూర్చుని ఉన్న; జముని = యముని; అనువునను = వలె; దర్భ = దర్భలతో; రచిత = కూర్చిన; బ్రుసి = వ్రతాభ్యాసమున కైన; ఆసనమున = చాపపై; ఉన్న = ఉన్నట్టి; ముని = మునులలో; ముఖ్యు = ప్రముఖుని; అంచిత = పూయనీయ మైన; యోగ = యోగము నందు; నిరతున్ = నిష్ఠ కలవానిని. </div> </div> </div> <!--4-163 మానిత శ్యామాయమాన... (సీసము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-163 మానిత శ్యామాయమాన... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/07.Maanitha_Syaamaaya.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> మానితశ్యామాయమాన శరీర దీ;ధితులు నల్దిక్కుల దీటుకొనగ,<br> కాంచనమేఖలా కాంతులతోడ, కౌ;శేయ చేలద్యుతుల్ చెలిమిసేయ<br> లక్ష్మీసమాయుక్త లలితవక్షంబున ; వైజయంతీ ప్రభల్ వన్నె సూప<br> హాటకరత్న కిరీటకోటిప్రభల్; బాలార్క రుచులతో మేలమాడ<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> లలితనీలాభ్రరుచి కుంతలములు తనర<br> ప్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ<br> భవభవామరముఖ్యు ల ప్రభలు మాప<br> అఖిలలోకైక గురుడు నారాయణుండు. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రజాపతి అయిన దక్షుడు ఒక గొప్పయజ్ఞం చేస్తున్నాడు. దానిని చూచి ఆనందం పొందటానికి దేవతలు, దేవతా సార్వభౌములూ చాలామంది విచ్చేశారు. సర్వలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు కూడా విచ్చేశాడు. ఆ రాకను వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మన్నన పొందటానికి వీలైన నీలదేహం కాంతులు నాలుగు దిక్కులకూ వ్యాపిస్తున్నాయి. బంగారు మొలత్రాటి ప్రభలతో పట్టుపీతాంబరం వెలుగులు చెలిమి చేస్తున్నాయి. లక్ష్మీదేవికి ఆటపట్టయిన వక్షఃస్థలంమీద వైజయంతి కాంతులు వెలిగిపోతున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు కిరీటపుశోభలు ఉదయిస్తున్న సూర్యుని ప్రభలతో ఆడుకుంటున్నాయి. సుకుమారమైన నల్లనిమేఘం వన్నెలతో స్వామి కేశాలు విరాజిల్లు తున్నాయి. మిక్కిలి నిర్మలమైన ఆ ప్రభువు దేహం నుండి వెలువడే దీప్తి బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైనవారి ప్రభలను తక్కువ చేస్తున్నది. ఈ కాంతిపుంజములతో ప్రకాశిస్తున్న సర్వాలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు దక్షయజ్ఞానికి విచ్చేశాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> మానిత = మన్నింప దగు; శ్యామాయమాన = నల్లని దైన; శరీర = దేహ; దీధితులు = కాంతులు; నల్దిక్కులన్ = నాలుగు (4) దిక్కులను {నాలుగు దిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పశ్చిమము 4ఉత్తరము}; దీటుకొనగ = పరచుకొనగ; కాంచన = బంగారపు; మేఖలా = మొలనూలు యొక్క; కాంతుల = ప్రకాశముల; తోడన్ = తోటి; కౌశేయ చేల = పట్టుబట్ట; ద్యుతుల్ = మెరుపులు; = చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాయుక్త = కూడి ఉన్న; లలిత = అంద మైన; వక్షంబున = వక్ష స్థలమున; వైజయంతీ = వైజయంతిమాల; ప్రభల్ = కాంతులు; వన్నెచూప = ప్రకాశిస్తుండగ; హాటక = బంగారపు; రత్న = రత్నములు తాపిన; కిరీట = కిరీటము యొక్క; కోటి = అతిశయిస్తున్న; ప్రభల్ = కాంతులు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; రుచుల = కాంతుల; తోన్ = తో; మేలమాడ = పరిహాసమాడు తుండగా; <br><br>లలిత = అందమైన; నీల = నల్లని; అభ్ర = మేఘముల; రుచిన్ = కాంతులతో; కుంతలములు = ముంగురులు; తనరన్ = అతిశయించగా; ప్రవిమల = మిక్కిలి నిర్మల మైన; ఆత్మీయ = తన; దేహజ = శరీరము నుండి జనించు; ప్రభ = కాంతి; సరోజభవ = బ్రహ్మదేవుడు {సరోజభవ - సరోజము (పద్మము) న భవ (జనించిన వాడు), బ్రహ్మదేవుడు}; భవా = శివుడు మొదలగు; అమర = దేవ; ముఖ్యుల = ప్రముఖుల; ప్రభలు = కాంతులు; మాపన్ = తగ్గింపజేయగ; అఖిల లోకైక గురుడు = విష్ణువు {అఖిల లోకైక గురుడు – సమస్త మైన లోకములకు ఒకడే యైన పెద్ద, హరి}; నారయణుండు = విష్ణువు {నారాయణుడు - నారములు (నీటి) యందు వసించువాడు, హరి}. </div> </div> </div> <!--4-181 దితిసంతాన వినాశసాధన... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-181 దితిసంతాన వినాశసాధన... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/08.Dithi_Santaana_Vinaasha_Saadhana.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> దితిసంతాన వినాశసాధన సముద్దీప్తాష్ట బాహాసమ<br> న్వితమై యోగిమనోనురాగపదమై వెల్గొందునీ దేహమా<br> యతమైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూత ముంగామి శా<br> శ్వతముంగా మదిలో తలంతు హరి! దేవా! దైవచూడామణీ.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దక్షయజ్ఞం దర్శించటానికి విచ్చేసిన శ్రీమన్నారాయణ స్వామిని బ్రహ్మాదులు చాలా గొప్పగా స్తుతించారు. అందులో దేవేంద్రుడు చేసిన స్తుతి ఈ విధంగా ఉన్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! దేవతాసార్వభౌమా! శ్రీమన్నారాయణా! నీ ఈ దేహం ఎనిమిది పెద్ద చేతులతో అలరారుతూ ఉన్నది. ఆచేతులు రక్కసిమూకల నాశనానికి సాధనాలై గొప్ప కాంతులతో వెలిగిపోతున్నాయి. యోగుల హృదయాల అనురాగానికి తావు అయినది నీ దేహం. అతివిశాలమైన ఈ ప్రపంచంలాగా అది అబద్ధమైనది కాదు. అందువలన ఈ నీ దేహం ఎన్నటికీ నిలిచి ఉండేదీ, ఎన్నటికీ నాశనం పొందనిదీ అని నేను భావిస్తున్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> దితి = దితి యొక్క; సంతాన = సంతానమునకు; వినాశ = వినాశనము చేయుటకు; సాధన = సాధనములు, ఆయుధములతో; సమ = చక్కగా; ఉద్దీప్త = ప్రకాశిస్తున్న; అష్ట = ఎనిమిది (8); బాహా = చేతులతో; సమ = చక్కగా; ఆన్వితము = కూడినది; ఐ = అయ్యి; యోగి = యోగుల; మనః = మనసులకు; అనురాగ = కూరిమి; కరము = కలిగించునది; ఐ = అయ్యి; వెల్గొందు = ప్రకాశించెడి; నీ = నీ యొక్క; దేహము = శరీరము; ఆయతము = విస్తారము; ఐనట్టి = అయినట్టి; ప్రపంచమున్ = లోకము; వలెను = వలె; మిథ్యాభూతముం = అసత్య మైనది; కామిన్ = కాపోవుట వలన; శాశ్వతమున్ = శాశ్వత మైనది; కాన్ = అగునట్లు; మది = మనసు; లోన్ = లో; తలంతున్ = భావించెదను; హరి = నారాయణ; దేవా = నారాయణ; దైవ చూడామణీ = నారాయణ {దైవ చూడామణీ - దైవములలో శిరోమణి వంటివాడు, విష్ణువు}. </div> </div> </div> <!--4-193 విశ్వాత్మ నీయందు... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-193 విశ్వాత్మ నీయందు... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/09.Viswatma_Neeyandu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవుల;గన డెవ్వడట వానికంటె ప్రియుడు<br> నీకు లేడు, అయినను నిఖిలవిశ్వోద్భవ ; స్థితి విలయంబులకతన నైన<br> సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశి ; ష్టాత్మీయ మాయచే నజభవాది<br> వివిధభేదము లొందుదువు, స్వస్వరూంపంబు; నందుండుదువు, వినిహతవిమోహి<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> వగుచునందువు గద, నిన్ననన్యభక్తి<br> భృత్యభావంబు తాల్చి సంప్రీతి గొల్చు <br> మమ్ము రక్షింపవే కృపామయ! రమేశ!<br> పుండరీకాక్ష! సంతత! భువనరక్ష.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దక్షయజ్ఞాన్ని చక్కదిద్దటానికి వచ్చిన శ్రీమహావిష్ణువును కనుగొని యోగీశ్వరులీ విధంగా స్తుతించారు.. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! నారాయణా! విశ్వమంతా నీవే! నీకంటె వేరుగా జీవులు ఉన్నారు అనుకోవటం అజ్ఞానం. ఆ అజ్ఞానం లేనివారికంటె నీకు ప్రియమైనవాడు లేడు. అంటే నీకు జ్ఞానులంటే చాలా ఇష్టం. అయినా ఈ విశ్వమంతా ఏర్పడటానికీ, నిలిచి ఉండటానికీ, మళ్ళీ నీలో కలసిపోవటానికీ నీవే వేరువేరుగా రజస్సు, సత్త్వము తమస్సు అనే గుణాలతో కూడిన నీదే అయిన మాయతో బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ఇంకా పెక్కుదేవతలుగా రూపా లను పొందుతూ ఉంటావు. అయినా నీకు నీదయినజ్ఞానం ఏమాత్రమూ జారిపోదు. కనుక నిలువెల్లా కృపయే అయిన దేవా! లక్ష్మీపతీ! పద్మములవంటి కన్నులున్న ప్రభూ! అంతటా వ్యాపించి ఉండు సర్వాత్మకా! లోకాలనన్నింటినీ కాపాడే ఆదిదేవా! నిన్ను మాత్రమే భక్తితో,మిక్కిలి ప్రీతితో సేవకులమై కొలిచే మమ్ములను కాపాడు తండ్రీ! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> విశ్వాత్మ = నారాయణ {విశ్వాత్మ - విశ్వమే ఆత్మ (స్వరూపము) గా కలవాడు, విష్ణువు}; నీ = నీ; అందు = నుండి; వేఱుగా = ఇతరము అగునట్లు; జీవులన్ = సమస్త జీవములను; కనడు = చూడడు; ఎవ్వడు = ఎవడో; అటువాని = అటువంటివాని; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; = నీకున్ = నీకు; లేడు = లేడు; అయినను = అయినప్పటిటకిని; నిఖిల = సమస్త మైన; విశ్వ = భువన; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; లయంబుల = లమముల; కతన = కోసము; దైవ = దైవత్వ; సంగతిన్ = కూడుట చేత; నిర్భిన్న = నశించని; సత్త్తాది గుణ = త్రిగుణములతో {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; విశిష్ట = విశిష్ట మైన; ఆత్మీయ = తన; మాయన్ = మాయ; చేన్ = చేత; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; భేదములన్ = భేదములు కల రూపములను; ఒందుదువు = పొందుతావు; స్వ = నీ యొక్క; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = లోను; ఉండుదువు = ఉంటావు; వినిహత = బాగుగా పోగొట్ట బడిన; విమోహుడు = మోహము కలిగిన వాడవు; <br><br>అగుచున్ = ఔతూ; ఉందువు = ఉంటావు; కదా = కదా; నిన్ను = నిన్ను; అనన్య = అనితర మైన; భక్తిన్ = భక్తితో; భృత్యు = సేవక; భావంబున్ = భావమును; తాల్చి = ధరించి; సంప్రీతిన్ = మిక్కిలి ప్రీతితో; కొల్చు = సేవించు; మమ్మున్ = మమ్ములను; రక్షింపము = కాపాడుము; ఓ = ఓయీ; కృపామయ = దయామయ; రమేశ = నారాయణ {రమేశ - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ (భర్త), విష్ణువు}; పుండరీకాక్ష = నారాయణ {పుండరీకాక్ష - పుండరీకము (పద్మము) ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సంతత భువన రక్ష = నారాయణ {సంతత భువన రక్ష - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్ష (రక్షించువాడు), విష్ణువు}. </div> </div> </div> <!--4-251 హార కిరీట కేయూర... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-251 హార కిరీట కేయూర... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/10.Haara_Kireeta_Keyura.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> హారకిరీట కేయూర కంకణ ఘన ; భూషణుం డాశ్రితపోషణుండు<br> లాలిత కాంచీకలాపశోభిత కటి ; మండలుం డంచిత కుండలుండు<br> మహనీయ కౌస్తుభమణియుక్తమైన గ్రై ; వేయకుండానందదాయకుండు<br> సలలిత ఘనశంఖచక్రగదా పద్మ ; హస్తుండు భువన ప్రశస్తు డజుడు<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> కమ్రసౌరభవనమాలిజా ధరుండు<br> హతవిమోహుండు నవ్యపీతాంబరుండు<br> లలితకాంచన నూపురాలంకృతుండు<br> నిరతిశయసద్గుణుడు దర్శనీయతముడు. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రేమతో తండ్రి ఒడిలో కూర్చోవటానికి ఉబలాటపడిన ధ్రువుణ్ణి సవతితల్లి త్రోసివేసి అవమానించింది. బాలుని గుండె కుతకుతలాడిపోయింది. తల్లి అనుమతితో తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు ధ్రువుడు. భాగ్యవశంచేత అతనికి దారిలో నారదమునీంద్రుడు కనపడి శ్రీమన్నారాయణ’ తత్త్వాన్ని, తపస్సు పద్ధతినీ ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నాయనా! ధ్రువా! నారాయణుడు హారాలు, కిరీటమూ, బాహుపురులూ, వలయాలూ మొదలైన గొప్ప నగలతో అలంకరింపబడినవాడు. తనను ఆశ్రయించినవారిని పోషిస్తూ ఉంటాడు. చక్కని మొలత్రాడు పేటలతో శోభలను వెలువరిస్తున్న నుడుము కలవాడు. కాంతులతో అలరారుతున్న కుండలాలు కలవాడు. వెలకట్టరాని కౌస్తుభమణితో కూడియున్న కంఠంలో వ్రేలాడుతున్న సువర్ణహారం కలవాడు. అందరికీ ఆనందం అందిస్తున్నవాడు. అందచందాలతో ప్రకాశిస్తున్న శంఖము, చక్రము, గద, పద్మము చేతులందు ఉంచుకొన్నవాడు. అందువలననే ఆతనిని లోకులందరూ కొనియాడుతూ ఉంటారు. కమ్మని సువాసనలతో గుబాళిస్తున్న వనమాలను ధరించి ఉంటాడు. ఇన్ని మహావస్తువులు ఉన్నా దేనియందూ వ్యామోహంలేని మహాత్ముడు. ఎప్పటికప్పుడు క్రొత్త పట్టువస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చీలమండ దగ్గర మనోహరమైన అందియలు సొంపును పెంపు చేస్తున్నాయి. అతని సద్గుణాలను మించేవి సృష్టిలో మరెక్కడా ఉండవు. ప్రాణులందరికీ చూడముచ్చట అయినవాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హార = హారములు; కిరీట = కిరీటము; కేయూర = భూజకీర్తులు; కంకణ = కంకణములుచే; ఘన = గొప్పగా; భూషణుండు = అలంకరింప బడిన వాడు; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; పోషణుండు = పాలించు వాడు; లాలిత = అంద మైన; కాంచీ = మొలనూలు; కలాపము = ఆభరణముతో; శోభిత = శోభిల్లు తున్న; కటి = నడుము; మండలుండు = ప్రదేశము కలవాడు; అంచిత = అలంకరింప బడిన; కుండలుండు = కుండలములు కలవాడు; = మహనీయ = గొప్ప; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = మణి యొక్క; ఘృణి = కాంతులు కలవాడు; చారు = అంద మైన; గ్రైవేయకుండు = కంఠహారములు కలవాడు; ఆనంద = ఆనందమును; దాయకుండు = ఇచ్చువాడు; = సలలిత = అందము గల; ఘన = గొప్ప; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మము; హస్తుండు = చేత కలవాడు; భువన = లోకముల; ప్రశస్తుడు = ప్రశంసించ బడు వాడు; అజుడు = జన్మము లేని వాడు; <br><br>కమ్ర = కమ్మని; సౌరభ = సువాసనలు కల; వనమాలికా = వనమాలలు {వనమాల - పూలు పత్రములు కూర్చిన దండ}; ధరుండు = ధరించిన వాడు; హత = పోగొట్ట బడిన; విమోహుండు = మోహముల వాడు; నవ్య = కొత్త; పీతాంబరుండు = పట్టుబట్టలు కలవాడు; లలిత = అంద మైన; కాంచన = బంగారు; నూపుర = అందెలచే; అలంకృతుండు = అలంకరించబడినవాడు; నిరతిశయ = అతిశయము కాని; సత్ = మంచి; గుణుండు = గుణములు కలవాడు; దర్శనీయతముఁడు = అత్యధికమైన చూడదగ్గవాడు {దర్శనీయుడు - దర్శనీయతరుడు - దర్శనీయతముఁడు}. </div> </div> </div> <!--4-253 దూర్వాంకురంబుల... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-253 దూర్వాంకురంబుల... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/11.Dhurvaarankurambula.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము ; జలజంబులను చారుజలజనయను<br> తులసీదళంబుల తులసికా దాముని ; మాల్యంబులను సునైర్మల్యచరితు<br> పత్రంబులను పక్షిపత్రుని, కడువన్య ; మూలంబులను ఆదిమూలఘనుని<br> అంచిత భూర్జత్వగాది నిర్మిత వివి ; ధాంబరంబులను పీతాంబరధరు<br> <br> <B>(తేటగీతి)</B><br> <br> తనరుభక్తిని మృచ్ఛిలాదారు రచిత<br> రూపములయందు గాని నిరూఢమైన<br> సలిల ములయందు గాని సుస్థలములందు<br> గాని పూజింపవలయు నక్కమలనాభు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నారద మునీంద్రుడు కుమారుడైన ధ్రువునకు పరమాత్మ అయిన నారాయణుని ఏవిధంగా పూజించాలో చక్కగా ఉపదేశిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> కుమారా! ధ్రువా! పరమాత్మ మన సౌకర్యంకోసం ఆకారం ధరించి మన ముందు మెలగుతూ ఉంటాడు. ఆ స్వరూపానికి మనం పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలి. ఆ స్వామి లేత గరికవంటి దేహకాంతి కలవాడు. కాబట్టి లేతగరికలు ఆయనకు సమర్పించుకోవాలి. అందమైన పద్మాలవంటి నేత్రాలు ఆయనవి. వానిని భావిస్తూ పద్మాలతో పూజించాలి. ఆయనకు తులసీదళాలమాలను ధరించటం ఇష్టం. కాబట్టి తులసీ దళాలను సమర్పించుకోవాలి. ఆయన అతి నిర్మలమైన నడవడి కలవాడు. మాలలతో అర్చించాలి. స్వామికి వాహనం పక్షి. పూజకు పనికివచ్చే పత్రాలు ఆయనకు ఇచ్చుకోవాలి. సృష్టికీ, దేవతలకూ, సర్వమునకూ ఆయన మూలకారణం. కాబట్టి వనాలలోని మొక్కల వ్రేళ్ళను తెచ్చి పూజలు చేయాలి. ఆయన పచ్చని పట్టుబట్ట ధరిస్తాడు. మేలైన బూరుగుచెట్టు మొదలైనవాని పట్టలతో నేసిన వస్త్రాలు అందించాలి. మట్టితోగానీ, రాతితో గానీ, కొయ్యతో గానీ రూపొందించుకొన్న విగ్రహాన్ని ముందు పెట్టుకొని అర్చనలు చెదరని భక్తితో చేయాలి. లేదా పవిత్రమైన నదీజలములయందు కూడా చేయవచ్చు. అలాగే మహిమగల క్షేత్రాలలో కూడా ఆచరించవచ్చు. ఆయన కమలనాభుడు. ఈ సృష్టినంతా చేస్తున్న బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం బొడ్డునందు ఉన్నవాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> దూర్వార = గఱిక అనెడి గడ్డి; అంకురంబులన్ = లేత చివుళ్ళతో; దూర్వారాంకురశ్యాము = లేత గఱిక వలె నవనవలాడు శ్యాముని; జలజంబులను = పద్మములతో; చారు = అంద మైన; జలజ నయనున్ = పద్మముల వంటి కన్నులు కలవాని; తులసీ దళంబులన్ = తులసి దళములతో; తులసీకా దామునిన్ = తులసిమాల ధరించినవాని; మాల్యంబులన్ = మాలలతో; సు = మంచి; వినిర్మల = నిర్మల మైన; చరిత్రున్ = వర్తన కలవానిని; పత్రంబులన్ = ఆకులతో; పక్షి = గరుత్మంతుని; పత్రుని = రెక్కలకలవానిని; కడు = అనేక మైన; వన్య = అడవి; = మూలంబులను = దుంపలతో; ఆది మూల ఘనుని = సృష్టికి మొదటి దుంప వంటి వానిని; అంచిత = చక్కటి; భూర్జ = బూరుగు దూది; త్వక్ = బట్ట; ఆది = మొదలైన వానిచే; నిర్మిత = చేయ బడిన; వివిధ = రకరకముల; అంబరములను = వస్త్రముల చేత; పీతాంబర = పట్టుబట్టలు; <br><br>ధరునిన్ = ధరించు వానిని; తనరు = అతిశయించిన; భక్తిని = భక్తితో; మృత్ = మట్టి; శిలా = శిల; దారు = కర్ర; రచిత = చేయ బడిన; రూపములన్ = బొమ్మలు; అందు = తో; కాని = కాని; నిరూఢ మైన = ప్రసిద్ధ మైన; సలిలముల = జలముల; అందు = లో; కాని = కాని; సుస్థలముల = మంచి ప్రదేశముల; అందు = లో; కాని = కాని; పూజింప వలయున్ = పూజించవలెను; ఆ = ఆ; కమలనాభున్ = విష్ణుమూర్తిని {కమలనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, విష్ణువు}. </div> </div> </div> <!--4-287 సర్వేశ కల్పాంత... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-287 సర్వేశ కల్పాంత... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/12.Sarvesha_Kalpaantha_Samayambu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సర్వేశ! కల్పాంత సమయంబునందు నీ ; యఖిల ప్రపంచంబు నాహరించి<br> అనయంబు శేషసహాయుండవై శేష ; పర్యంకతలమున పవ్వళించి<br> యోగనిద్రారతినుండి నాభీసింధు ; జస్వర్ణలోకకంజాతగర్భ<br> మందు చతుర్ముఖు నమర పుట్టించుచు ; రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన<br> <br> <B>(తేటగీతి)</B><br> <br> నీకు మ్రొక్కెద అత్యంత నియమ మొప్ప<br> భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!<br> చిరశూభాకార! నిత్యలక్ష్మీవిహార<br> అవ్యయానంద! గోవింద! హరి! ముకుంద.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ధ్రువుని తపస్సు పంట పండింది. స్వామి సాక్షాత్కరించాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన అతని చెక్కిలిపై నారాయణుడు వేదమయమైనది, నాదమయమైనదీ అయిన శంఖాన్ని తాకించినంతనే ధ్రువుని వదనం నుండి కమనీయ స్తుతి వాక్యాలు వెలువడ్డాయి. అందులోనిది యీ పద్యం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> సర్వమునకూ పాలకుడవైన ప్రభూ! గొప్ప చరిత్రగల స్వామీ! పద్మపత్రాలవంటి నేత్రాలుగల సుందరమూర్తీ! నీయందు నిరంతరం శ్రీదేవి విహరిస్తూ ఉంటుంది. సర్వకాలాలలో తరుగువోని ఆనందం నీది. గోవిందా! హరీ! ముక్తిప్రదాతా! నీవు కల్పం ముగిసే సమయంలో ఈ సర్వప్రపంచాన్నీ నీలో కలుపుకుంటావు. ఆదిశేషుడు నీకు సహాయకుడు. ఆ శేషశయ్యమీద పవ్వళించి యోగనిద్రలో ఆనందం పొందుతూ ఉంటావు. నీబొడ్డు అనేది ఒకనది. అందులోని బంగారు భవనంనుండి నాలుగుమోముల దేవుడు బ్రహ్మను పుట్టిస్తూ ఉంటావు. నీవు పరబ్రహ్మవు. అట్టి నీకు గట్టి పట్టుదలతో మ్రొక్కుతూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సర్వేశ = హరి; కల్పాంత = ప్రళయ; సమయంబున్ = కాలము; అందున్ = లో; ఈ = ఈ; అఖిల = సమస్త మైన; ప్రపంచంబున్ = ప్రపంచమును; ఆహరించి = మింగి; అనయంబున్ = అవశ్యము; శేష = శేషుని; సహాయుండవు = సహాయము కలవాడవు; ఐ = అయ్యి; శేష = శేషుడు అనెడి; పర్యంకతలమునన్ = శయ్యా తల్పము పై; పవ్వళించి = పండుకొని; యోగనిద్రా = యోగనిద్ర; రతిన్ = అనుభవించుటలో; ఉండి = ఉండి; నాభీ = బొడ్డు అనెడి; సింధు = సముద్రమును; జ = పుట్టిన; స్వర్ణ = బంగారు; లోక = విశ్వం అనే; కంజాత = పద్మము యొక్క; గర్భము = గర్భము; అందున్ = లో; చతుర్ముఖున్ = చతుర్ముఖ బ్రహ్మను; అమరన్ = చక్కగ; పుట్టించుచున్ = సృష్టిస్తూ; రుచిన్ = ప్రకాశముతో; ఒప్పు = చక్కగ ఉండెడి; బ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; స్వరూపివి = స్వరూపముగ కలవాడవు; ఐన = అయిన; <br><br>నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; అత్యంత = మిక్కిలి; నియమము = నియమము; ఒప్పన్ = ఒప్పునట్లు; భవ్యచారిత్ర = హరి; పంకజ పత్ర నేత్ర = హరి; చిర శుభాకార = హరి; నిత్య లక్ష్మీ విహార = హరి; అవ్య యానంద = హరి; గోవింద = హరి; హరి = హరి; ముకుంద = హరి. </div> </div> </div> <!--4-553 అది గాన పద్మలోచన... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-553 అది గాన పద్మలోచన... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/13.Adi_Gaana_Padmalochana.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అదిగాన, పద్మలోచన<br> సదమలభవదీయఘనయశము వినుటకునై<br> పదివేల చెవులు కృప ని<br> మ్మదియే నాయభిమతంబు నగును ముకుందా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఇది పృథుచక్రవర్తి కథలోని పద్యం. పృథువు చాలా గొప్పమనీషి. ఆయన పేరుతోనే భూమికి పృథివి అనే పేరు ఏర్పడింది. ఆయన మహాత్మకు సంతోషించి శ్రీమన్నారాయణుడు అతనికి దర్శనం అనుగ్రహించాడు. పృథువు విష్ణువును స్తుతిస్తూ ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దేవా! పుండరీకాక్షా! నాకు నీ పాదపద్మాల భక్తియే కావాలి. నీ కీర్తిని సర్వకాలాలలో అన్ని అవస్థలలో పాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఆవంతయినా మచ్చలేనిదయిన నీ గొప్పకీర్తిని వినటానికై దయతో నాకు పదివేల చెవులివ్వు. నీవు ముకుందుడవు. భక్తులకు ముక్తినిచ్చే ప్రాభవం కలవాడవు. నాకు అదే యిష్టమైన వరం. వేరువరం నేను కోరను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అదిగాన = అందుచేత; పద్మలోచన = నారాయణా; సత్ = మిక్కిలి; అమల = స్వచ్చమైన; భవదీయ = నీ యొక్క; ఘన = గొప్ప; యశమున్ = కీర్తిని; వినుట = వినుట; కున్ = కోసము; ఐ = అయ్యి; పదివేల = పదివేలు (10000); చెవులు = చెవులు; కృపన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము; అదియే = అదే; నా = నా యొక్క; అభిమతంబున్ = కోరిక; అగును = ఐ ఉన్నది; ముకుందా = నారాయణా. </div> </div> </div> <!--4-581 నారాయణుండు జగదాధారుం... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-581 నారాయణుండు జగదాధారుం... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/14.Naraynudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నారాయణుండు జగదా<br> ధారుం డగు నీశ్వరుండు; దలఁప నతనికిన్<br> లే రెందు సములు నధికులు<br> ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పృథు చక్రవర్తి యజ్ఞాలూ, తపస్సూ చేసి శ్రీమన్నారాయణుని వలన ప్రశంసలందుకున్నాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు రాజ్యపరిపాలన చేయడానికి తన పట్టణానికి తిరిగివచ్చాడు. ఆ రాజుకు విప్రవరులతో వాసుదేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో చర్చ కలిగింది. అందులో అతడు వారితో ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> విప్రవర్యులారా! వాసుదేవుడు ఉన్నాడు.ఊరకే ఉండడం కాదు. లోకాలన్నింటికీ ఆధారమై ఉన్నాడు. ఇంకా ఈశ్వరుడై పాలిస్తూ ఉన్నాడు. మరొక్క విషయం. అతనితో సమానులు లేరు. అతనిని మించినవారు కూడా లేరు. అతనితో పోల్చి చెప్పతగినవాడు ఒక్కడు కూడా లేని కారణంగా అతడు ధీరుడు ఉత్తముడూ అయ్యి వెలుగొందుతూ ఉన్నాడు. ధీరుడంటే అందరికీ మించిన బుద్ధిశక్తితో ఎక్కడా ఎప్పుడూ ఎదురులేనివాడు. అతనికంటే గొప్పవాడని చెప్పడానికి ఎవరూ లేరు కనుక ఉత్తముడు. అందువలననే ఆయనకు నారాయణుడు అనే ప్రతిష్ఠతో కూడిన పేరు కలిగింది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నారాయణుండు = హరి; జగ దాధారుండున్ = విష్ణుమూర్తి {జగ దాధారుండు - జగత్ (విశ్వనము) నకు ఆధారమైనవాడు, విష్ణువు}; అగు = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తి; తలపన్ = తరచి చూసిన; అతని = ఆయన; కిన్ = కు; లేరు = లేరు; ఎందున్ = ఏవిధముగను; సములు = సమాన మైన వారు; అధికులు = గొప్పవారు; ధీరోత్తముడు = విష్ణుమూర్తి {ధీరోత్తముడు - ధీరులు (ఙ్ఞానులు) లో ఉత్తముడు, విష్ణువు}; అతడు = ఆయన; అద్వితీయుండు = ఇతరము అన్నది లేని వాడు. </div> </div> </div> <!--4-583 కర్మవశంబునన్ జగము... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-583 కర్మవశంబునన్ జగము... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/15.Karmavasambuna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో<br> గర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా<br> కర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ<br> త్కర్మక కార్యకారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పృథు చక్రవర్తి బ్రాహ్మణోత్తములకు నారాయణుడు ఉన్నాడని తర్కపటిమతో చెప్పి ఆ మహావిష్ణువు ఈశ్వరుడు ఎలా అయ్యాడో నిరూపిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> 'అదేమయ్యా! జగత్తులన్నీ కర్మవశం చేత కదా కలుగుతున్నాయి, పెంపొందుతున్నాయి, మళ్ళీ అణిగిపోతున్నాయి. మధ్యలో వీనిని చేసేవాడు నారాయణుడెందుకవుతాడూ?' అంటారేమో. అది సరియైన మాట కాదు. బుద్ధిశక్తినుపయోగించి చూస్తే, తనంత తాను స్వయంగా ప్రవర్తించే స్వతంత్ర పదార్థం కాదు కర్మము. అందువలన అది జడము. రాయీ రప్పా వంటిది. దానిని సృష్టించినవాడు కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి అట్టిదానిని ప్రపంచాన్ని కల్పించే పనిలో ' కర్త ' అని చెప్పే అవకాశం లేదు. అందువలన ఈ జగత్తు అనే పనికి, కారణమైన వాడు, తనకు ఒక కారణం లేనివాడు అయిన స్వతంత్రుడు విష్ణువే. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కర్మ = కర్మ సూత్రము {కర్మ సూత్రము - ప్రతికర్మ (పని) కి కారణము (చేసిన వాడు) ఉండును}; వశంబునన్ = వశ మై, అనుసరించి; జగము = విశ్వము; కల్గును = పుట్టును; హెచ్చున్ = పెరుగును; అడంగును = అణగిపోవును; అన్నచో = అంటే; కర్మమున్ = కర్మమును; బుద్దిన్ = ఆలోచించి; చూడన్ = చూసినచో; జడ = చైతన్యము లేని; కార్యము = కర్మము; కాని = అంతే కాని; ప్రపంచ = ప్రపంచమును; కల్పనా = సృష్టించెడి; కర్మమున్ = పని; అందున్ = లో; కర్త = పనిచేసినది, కారణము; అనగా = ఐ; విలసిల్లగ = ప్రసిద్దమగుటకు; చాలదు = సరిపడదు; ఈ = ఈ; జగత్ = భువనము; కర్మక = సృష్టించెడికర్మ అనెడి; కార్య = కార్యమునకు; కారణము = కర్త, చేసినవాడు; కావునన్ = కనుక; విష్ణుడు = విష్ణుమూర్తి; అరయన్ = తరచి చూసిన. </div> </div> </div> <!--4-608 భువి నెవ్వనియెడ... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-608 భువి నెవ్వనియెడ... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/16.Bhuvinevvani.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> భువి నెవ్వని యెడ విప్రులు<br> భవుఁడును విష్ణుఁడుఁ దదీయ భక్తులును బ్రస<br> న్నవదను లగుదురు వానికి<br> భువిని దివి నసాధ్యకర్మములు లే వనఘా.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఒకనాడు పృథు చక్రవర్తి దగ్గరకు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే జ్ఞాన సంపన్నులు విచ్చేశారు. మహాభక్తితో రాజు వారికి పూజలు చేసి తన అదృష్టాన్ని కొనియాడుకుంటూ ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఒకనాడు పృథు చక్రవర్తి దగ్గరకు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే జ్ఞాన సంపన్నులు విచ్చేశారు. మహాభక్తితో రాజు వారికి పూజలు చేసి తన అదృష్టాన్ని కొనియాడుకుంటూ ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> భువిన్ = భూమి పై; ఎవ్వని = ఎవని; ఎడన్ = అందు; విప్రులున్ = బ్రాహ్మణులు; భవుడునున్ = శివుడు; విష్ణుడున్ = నారాయణుడును; తదీయ = అతని; భక్తులును = భక్తులును; ప్రసన్న = ప్రసన్న మైన; వదనులు = ముఖము కలవారు; అగుదురు = అయ్యెదరో; వాని = వాని; కిన్ = కి; = భువిన్ = ప్రపంచము లోను; దివిన్ = స్వర్గము లోను; అసాధ్య = సాధ్యము కాని; కర్మములు = పనులు; లేవు = లేవు; అరయన్ = తరచి చూసిన. </div> </div> </div> <!--4-702 పంకజనాభాయ సంకర్షణాయ... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-702 పంకజనాభాయ సంకర్షణాయ... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/17.Pankajanabhaya.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పంకజనాభాయ, సంకర్షణాయ, శాం;తాయ, విశ్వప్రబోధాయ, భూత<br> సూక్ష్మేంద్రియాత్మనే, సూక్ష్మాయ, వాసుదే;వాయ, పూర్ణాయ, పుణ్యాయ, నిర్వి<br> కారాయ, కర్మవిస్తారకాయ,త్రయీ;పాలాయ, త్రైలోక్యపాలకాయ,<br> సోమరూపాయ, తేజోబలాఢ్యాయ, స్వ;యం జ్యోతిషే, దురంతాయ, కర్మ<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> సాధనాయ, పురాపురుషాయ, యజ్ఞ<br> రేతసే, జీవతృప్తాయ, పృథ్విరూప<br> కాయ, లోకాయ, నభసేం, తకాయ, విశ్వ<br> యోనయే, విష్ణవే, జిష్ణవే, నమోస్తు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రాచీనబర్హి అనే మహారాజునకు సముద్రుని కూతురూ మహా సౌందర్యవతీ అయిన శతధృతి వలన పదిమంది కొడుకులు కలిగారు. వారందరూ, ఒకే పేరూ, ఒకే తీరూ కలవారు. వారిని ప్రచేతసులు అంటారు. వారు గొప్పతపస్సు చేసి రుద్రుని అనుగ్రహం సంపాదించి అతని వలన ' రుద్రగీత ' అనే ఒక మహామంత్రాన్ని ఉపదేశంగా పొందారు. అది శ్రీమన్నారాయణుని మంగళ స్తోత్రం. శ్రీరుద్రదేవుడు వారికి ఉపదేశరూపంగా ఆ స్తుతిని ఇలా ప్రారంభించాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీమన్నారాయణదేవా! దేవదేవా! నీవు బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం నాభిలో ఉన్నవాడవు. నిన్ను సంకర్షణుడని అంటారు. ఎందుకంటే ప్రళయకాలంలో ప్రాణకోటినంతటినీ నీలోనికి లాగివేసుకుంటావు. నీవు శాంతుడవు. విశ్వాలనన్నిటినీ మేల్కొలుపుతావు. పంచభూతాల సూక్ష్మతత్త్వాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి నీ స్వరూపాలే! నీవు ఇంద్రియాలకు గోచరింపవు గనుక సూక్ష్ముడవు. అన్నింటిలో నీవు ఉంటావు, అన్నీ నీలో ఉండి వెలుగొందుతూ ఉంటాయి కనుక వాసుదేవుడవు. నీవు పూర్ణుడవు, పుణ్యుడవు, ఏ వికారాలూ నీకు లేవు. ప్రాణులను కర్మబంధాల నుండి విడుదల చేయించే స్వామివి. వేదాలను పరిరక్షిస్తూ ఉంటావు. అలాగే మూడులోకాలను కాపాడుతూ ఉంటావు. చంద్రుడవు నీవు. గొప్ప తేజోబలం గల సూర్యుడవు కూడా నీవే! అన్నింటినీ నీవు ప్రకాశింపచేస్తావు. కానీ, నిన్ను ప్రకాశింప చేయగల తేజస్సు మరొకటి లేదు. నీకు అంతం లేదు. ప్రాణులందరూ ఆయా కార్యాలనన్నింటినీ నీ వలననే సాధిస్తారు. నీవు సనాతనుడవు. యజ్ఞాలకు బీజం నీవే! భూమి అంతా నీ రూపమే! అన్ని లోకాలూ నీవే. ఆకాశం నీవే. యముడు నీ రూపమే. ఈ విశ్వమంతా నీ నుండియే వెలువడింది. నీవు అంతటా వ్యాపించి ఉంటావు. నీవు జయించటమే శీలం అయిన వాడవు. స్వామీ! నీకు నమస్సు, నమస్సు, నమస్సు! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> పంకజ నాభాయ = హరి {పంకజ నాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; సంకర్షణాయ = హరి {సంకర్షణుడు – చతుర్వ్యూహముల లోని సంకర్షణుడు, అహంకారమునకు అధిష్టాత, విష్ణువు}; శాంతాయ = హరి {శాంతుడు – శాంతము కలవాడు, విష్ణువు}; విశ్వ ప్రభోధాయ = హరి {విశ్వ ప్రభోధాయ - జగతికి చైతన్యము కలిగించు వాడు, విష్ణువు}; భూత సూక్ష్మేంద్రి యాత్మనే = హరి {భూత సూక్ష్మేంద్రి యాత్మ - జీవులకు సూక్ష్మేంద్రియములు (తన్మాత్రలు, ఇంద్రియములు) తానైన వాడు, విష్ణువు}; సూక్ష్మాయ = హరి {సూక్ష్ముడు - సూక్ష్మమే తానైన వాడు, విష్ణువు}; వాసుదేవాయ = హరి {వాసుదేవుడు – చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టాన దేవత, సమస్త మందు వసించెడి దేవుడు, విష్ణువు}; పూర్ణాయ = హరి {పూర్ణుడు - విశ్వమంతా నిండి యున్న వాడు, పరిపూర్ణ మైన వాడు, విష్ణువు}; పుణ్యాయ = హరి {పుణ్యుడు - పుణ్యమే తానైన వాడు, విష్ణువు}; నిర్వికారాయ = హరి {నిర్వికారుడు - వికారములు (మార్పులు) లేని వాడు, విష్ణువు}; కర్మ విస్తారకాయ = హరి {కర్మ విస్తారకాయుడు – వేద కర్మలను విస్తరింప జేయు వాడు, విష్ణువు}; త్రయీ పాలాయ = హరి {త్రయీ పాలుడు – వేద ధర్మాలను రక్షించే వాడు, విష్ణువు}; త్రైలోక్య పాలకాయ = హరి {త్రైలోక్య పాలకుడు - త్రైలోక్య (ముల్లోకములను) పాలకుడు, విష్ణువు}; సోమ రూపాయ = హరి {సోమరూపుడు - యఙ్ఞ రూప మైన వాడు, విష్ణువు}; తేజో బలాఢ్యాయ = హరి {తేజో బలాఢ్యుడు - తేజము బలము మిక్కిలిగా కల వాడు, విష్ణువు}; స్వయం జ్యోతిషే = హరి {స్వయం జ్యోతిషుడు - స్వయముగా ప్రకాశము అగు వాడు, విష్ణువు}; దురంతాయ = హరి {దురంతుడు – అంతము లేని వాడు, విష్ణువు}; కర్మ <br><br>సాధనాయ = హరి {కర్మసాధనుడు - వేదకర్మలకు సాధన మైన వాడు, విష్ణువు}; పురా పురుషాయ = హరి {పురా పురుషుడు – పురాణ పురుషుడు, విష్ణువు}; యఙ్ఞ రేతసే = హరి {యఙ్ఞ రేతస్సుడు - యఙ్ఞమునకు రేతస్సు వంటి వాడు (కారణుడు), విష్ణువు}; జీవ తృప్తాయ = హరి {జీవ తృప్తుడు – జీవ మనెడు తృప్తము (పురోడాశము, యఙ్ఞార్థమైన ఆపూపము) కల వాడు, విష్ణువు}; పృథ్వి రూపకాయ = హరి {పృథ్వి రూపకుడు - భూమికి రూపము యిచ్చినవాడు, విష్ణువు}; లోకాయ = హరి {లోకుడు - లోకము తానైన కలవాడు, విష్ణువు}; నభసే = హరి {నభస్సు - ఆకాశము తానైనవాడు, విష్ణువు}; అంతకాయ = హరి {అంతకుడు – లయ కారకుడు, విష్ణువు}; విశ్వ యోనయే = హరి {విశ్వ యోని - విశ్వమునకు ఉత్పత్తి స్థాన మైన వాడు, విష్ణువు}; విష్ణవే = హరి {విష్ణువు – వ్యాపించెడి వాడు, విష్ణువు}; జిష్ణవే = హరి {జిష్ణవు – జయించెడి వాడు, విష్ణువు}; నమోస్తు = నమస్కారము. </div> </div> </div> <!--4-703 స్వర్గాపవర్గ సుద్వారాయ... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-703 స్వర్గాపవర్గ సుద్వారాయ... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/18.Swargapavarga.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> స్వర్గాపవర్గ సుద్వారాయ, సర్వర;సాత్మనే, పరమహంసాయ, ధర్మ<br> పాలాయ, సద్ధిత ఫలరూపకాయ, కృ;ష్ణాయ, ధర్మాత్మనే, సర్వశక్తి<br> యుక్తాయ, ఘన సాంఖ్య యోగీశ్వరాయ, హి;రణ్య వీర్యాయ, రుద్రాయ, శిష్ట<br> నాథాయ, దుష్ట వినాశాయ, శూన్య ప్ర;వృత్తాయకర్మణే, మృత్యవే<br> <br> <b>(తేటగీతి) </b><br> <br> విరాట్ఛరీరాయ, నిఖిల ధర్మాయ, వాగ్వి<br> భూతయే, నివృత్తాయ, సత్పుణ్య భూరి<br> వర్చసే,ఖిల ధర్మదేహాయ, చాత్మ<br> నే, నిరుద్ధాయ, నిభృతాత్మనే, నమోస్తు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రచేతసుల కోసం శ్రీరుద్రుడు శ్రీమన్నారాయణస్వామిని ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! స్వర్గానికీ, అపవర్గం అనే మోక్షానికీ నీవే ద్వారం. సర్వరసాలూ నీ స్వరూపమే! నీవు యోగసిద్ధి పొందిన పరమహంసవు. ధర్మపాలుడవు. సత్పురుషులకు హితమైన ఫలాన్ని అనుగ్రహించే స్వామివి. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. సర్వశక్తులూ నీయందే నిండుగా ఉన్నాయి. గొప్పదైన సాంఖ్యయోగానికి ప్రభువైన కపిలుడవు నీవే. నీది స్వర్ణమయమైన తేజస్సు. నిన్ను రుద్రుడు అని కూడా అంటారు. అందరి రోదనాలను తొలగించివేస్తావు కదా. మంచి శీలం గలవారికి నాథుడవు నీవే. దుష్టులను రూపుమాపేవాడవు నీవే. కానీ నీకంటూ ఒక ప్రవృత్తి లేదు. కర్మస్వరూపుడవు, మృత్యుస్వరూపుడవు, నీ దేహంలో విశ్వమంతా నెలకొని ఉన్నది. అన్ని ధర్మాలూ నీకు సంబంధించినవే, అన్ని వాక్కులూ నీ విభూతులే. నీకు ఏ తగులములూ లేవు. ఉదాత్తపుణ్యకార్యాల దివ్యకాంతులను నీయందే చూడాలి. నీవు సర్వధర్మ స్వరూపుడవు. పరమాత్మవు. నిన్ను నిలువరింపగలిగేవాడు లేడు. పరిపూర్ణమైన స్వరూపం నీది. దేవా! స్వామీ! ప్రభూ! ఇట్టి నీకు మా మ్రొక్కులు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> స్వ ర్గాపర్గ సుద్వారాయ = హరి {స్వ ర్గాపర్గ సుద్వారము - స్వర్గమునకు అపవర్గము (మోక్షము) నకు మంచి ద్వారము వంటి వాడు, విష్ణువు}; సర్వ రసాత్మనే = హరి {సర్వ రసాత్మ - సమస్త రసములకు అంతర్యామి, విష్ణువు}; పరమ హంసాయ = హరి {పరమ హంస – అత్యున్నత మైన ఆత్మ, పరమాత్మ, విష్ణువు}; ధర్మ పాలాయ = హరి {ధర్మ పాలుడు - ధర్మమును కాపాడెడి వాడు, విష్ణువు}; సద్ధిత ఫల రూపకాయ = హరి {సద్ధిత ఫల రూపకుడు - సత్ (మంచివారి) కి ఫలితమే రూపము యైన వాడు, విష్ణువు}; కృష్ణాయ = హరి {కృష్ణుడు – నల్లని వాడు, విష్ణువు}; ధర్మాత్మనే = హరి {ధర్మాత్మ - సకల ధర్మములు తానైన వాడు, విష్ణువు}; సర్వ శక్తి యుక్తాయ = హరి {సర్వ శక్తి యుక్తుడు – సమస్త మైన శక్తులు కలవాడు, విష్ణువు}; ఘన సాంఖ్య యోగీశ్వరాయ = హరి {ఘన సాంఖ్య యోగీశ్వరుడు - ఘన (గొప్ప) సాంఖ్య యోగులకు ఈశ్వరుడు, విష్ణువు}; హిరణ్య వీర్యాయ = హరి {హిరణ్య వీర్యుడు - హిరణ్యగర్భాండమునకు వీర్యము (కారణ భూతము) యైనవాడు, విష్ణువు}; రుద్రాయ = హరి {రుద్రుడు - రౌద్రము కల వాడు, విష్ణువు}; శిష్ట నాథాయ = హరి {శిష్ట నాథుడు - శిష్టు (ఙ్ఞాను) లకు నాథుడు (రక్షకుడు), విష్ణువు}; దుష్ట వినాశాయ = హరి {దుష్టవినాశుడు - చెడును (పాపులను) నాశనము చేయు వాడు, విష్ణువు}; శూన్య ప్రవృత్తాయ = హరి {శూన్య ప్రవృత్తుడు – శూన్య మైన ప్రవృత్తులు కలవాడు, విష్ణువు}; అకర్మణే = హరి {అకర్మణుడు - కర్మములు అంచరించని వాడు, విష్ణువు}; మృత్యవే = హరి {మృత్యువు – మృత్యు స్వరూపుడు, విష్ణువు};<br><br> విరా ట్చరీరాయ = హరి {విరా ట్చరీరుడు - విరాట్ (విశ్వము సమస్తమును) తాను యైన వాడు, విశ్వ రూపుడు, విష్ణువు}; నిఖిల ధర్మాయ = హరి {నిఖిల ధర్ముడు – సమస్త మైన ధర్మములు తానైనవాడు, విష్ణువు}; వా గ్విభూతయే = హరి {వా గ్విభూతుడు - వాక్కు అనెడి వైభవము యైన వాడు, విష్ణువు}; నివృత్తాయ = హరి {నివృత్తుడు - ప్రవృత్తులు లేని వాడు, విష్ణువు}; సత్పుణ్య భూరి వర్చసే = హరి {సత్పుణ్య భూరి వర్చస్సు – సత్ (సత్య మైన) భూరి గొప్ప వర్చస్ (ప్రకాశము గల వాడు, విష్ణువు}; అఖిల ధర్మ దేహాయ = హరి {అఖి లధర్మ దేహుడు - సమస్త ధర్మముల స్వరూప మైన వాడు, విష్ణువు}; చ = మరియు; ఆత్మనే = హరి {ఆత్మ - పరమాత్మ, విష్ణువు}; అనిరుద్దాయ = హరి {అనిరుద్దుడు – అడ్డుకొనరాని వాడు, చతుర్వ్యూహముల లోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), విష్ణువు}; నిభృతాత్మనే = హరి {నిభృతాత్మ – వృద్ధి క్షయములు లేని స్థిర మైన ఆత్మ, విష్ణువు}; నమోస్తు = నీకు నమస్కారము. </div> </div> </div> <!--4-704 సర్వసత్త్వాయ దేవాయ... (తేటగీతి). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-704 సర్వసత్త్వాయ దేవాయ... (తేటగీతి). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/19.Sarvasathvaya.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సర్వసత్త్వాయ, దేవాయ, సన్నియామ<br> కాయ, బహిరంతరాత్మనే, కారణాత్మ<br> నే, సమస్తార్థ లింగాయ, నిర్గుణాయ,<br> వేధసే, జితాత్మక సాధవే, నమోస్తు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రచేతసుల కొఱకై రుద్రుడు నారాయణ తత్త్వాన్ని స్తుతి రూపంలో ఇలా సంభవిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! ఆదిదేవా! ఏ మాత్రమూ దేనితోనూ కలయిక లేని సత్త్వస్వరూపం నీది. అంతేకాదు సృష్టిలోని సర్వ ప్రాణులూ నీ స్వరూపాలే. అందువలననే నీవు దేవుడవు. అన్నింటినీ, అందరినీ, హద్దులలో నిలుపగల ప్రభుడవు నీవు. ప్రాణులందరికీ వెలుపలా, లోపలా ఉండి ఆడిస్తున్న మహాస్వామివి నీవు. సర్వులకూ, సర్వమునకూ కారణమైనవాడవు నీవు. సర్వ జీవకోటినీ, చైతన్యం లేని పదార్థాలను ఇది ఇది అని గుర్తించడానికి వీలైన ఏర్పాటు చేసిన మహాశిల్పివి నీవు. గుణముల అంటుసొంటులు లేనివాడవు. సృష్టి అంతటికీ కర్తవు నీవు. ఇంద్రియాలమీద పట్టు చిక్కించుకున్న యోగులకు మేలుచేసే స్వామివి నీవు. అట్టి నీకు ఎల్లవేళలా నమస్కరిస్తూ ఉంటాము. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సర్వ సత్తాయ = హరి {సర్వ సత్తుడు – అఖిల మైన సత్తువలు (సామర్థ్యములు) తానైన వాడు, విష్ణువు}; దేవాయ = హరి {దేవుడు – ప్రకాశించు వాడు, విష్ణువు}; స న్నియామకాయ = హరి {స న్నియామకుడు - సత్ (సత్య మైన) నియామకుడు, విష్ణువు}; బహి రంత రాత్మనే = హరి {బహి రంత రాత్మ - పరమాత్మ మరియు అంతరాత్మ అయినవాడు, విష్ణువు}; కారణాత్మనే = హరి {కారణాత్మ – కారణ భూత మైన ఆత్మ, విష్ణువు}; సమ స్తార్థలింగాయ = హరి {సమ స్తార్థ లింగము - సమస్త ప్రయోజనము లకు లింగము (చిహ్నము) యైనవాడు, విష్ణువు}; నిర్గుణాయ = హరి {నిర్గుణుడు - త్రిగుణాతీతుడు, విష్ణువు}; వేధసే = హరి {వేధ - బ్రహ్మదేవుని స్వరూపము యైనవాడు, విష్ణువు}; జితాత్మక సాధవే = హరి {జితాత్మక సాధు – చిత్త మనెడి ఆత్మను జయించిన సాధు స్వరూపుడు, విష్ణువు}; నమోస్తు = నమస్కారము. </div> </div> </div> <!--4-713 ఎనసిన భక్తియోగమున... (చంపకమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-713 ఎనసిన భక్తియోగమున... (చంపకమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/20.Yenasina_Bhakthi_Yogamuna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఎనసిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మూలము<br> న్ననయముఁ బొందువాఁడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య త<br> ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న<br> య్యనుపముఁ డైన కాలుని భయంబును బొందఁడు సుమ్ము కావునన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీ పరమేశ్వరుడు ప్రచేతసులకు రుద్రగీతను ఉపదేశిస్తూ వారికోసం తానే శ్రీమన్నారాయణుని మహిమను కొనియాడుతున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దేవాదిదేవా! ఏ మానవుడు నీదైన పాదపద్మాల మూలాన్ని ఉప్పొంగిన భక్తియోగంతో అందుకుంటాడో, అట్టి మహాభక్తుడు, అతి తీవ్రమైన కోపంతో, భయంకరమైన శక్తిసామర్ధ్యాలను చూపుతూ బెదిరింపులతో అత్యంత వేగంతో అన్ని లోకాలనూ నాశనం చేసే పనిలో అతనికతడే సాటియనదగిన యముని వలన ఎన్నటికీ భయం పొందడు సుమా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఎనసిన = విస్తరించిన, సిద్ధించిన; భక్తియోగమునన్ = భక్తియోగమున; భవదీయ = నీ యొక్క; పదా = పాదములు అనెడి; అబ్జము = పద్మములను; మూలమున్ = మూలము; అనయమున్ = ఎల్లప్పుడు; పొందు వాడు = కోరెడి వాడు; చటుల = భయంకర; ఆగ్రహ = కోపము; భీషణ = భీషణము; వీర్య = శౌర్యము; తర్జనముల్ = భయ పెడుతూ {తర్జనము - చూపుడు వేలుతో బెదిరించుట}; చేన్ = చేత; అనూన = దేనికిని తగ్గని; గతిన్ = విధముగా; సర్వ = అన్ని; జగంబులున్ = లోకములను; సంహరించు = సంహరించెడి; ఆ = ఆ; అనుపముడు = సాటి లేని వాడు; ఐన = అయిన; కాలుని = యముని వలన; భయంబునున్ = భయమును; పొందడు = పొందడు; సుమ్ము = సుమా; కావునన్ = అందుచేత. </div> </div> </div> <!--4-718 సరసిజనాభ సత్పురుషసంగ... (చంపకమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-718 సరసిజనాభ సత్పురుషసంగ... (చంపకమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/21.Sarasijanabha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి<br> స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ<br> స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం<br> సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుద్రదేవుడు మునుపు బ్రహ్మదేవుడు సనకాదులను ఉపదేశించిన రుద్రగీతను ప్రచేతసులకు బోధిస్తూ ఆ స్వామి వాసుదేవుని గూర్చి యిలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయతత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సరసిజ నాభ = విష్ణుమూర్తి {సరసిజ నాభుడు - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు) న కల వాడు, విష్ణువు}; సత్ = మంచి; పురుష = వారి; సంగ = సాంగత్యము వలన; సమంచిత = చక్కగా కలిగిన; భక్తి యోగ = భక్తి యోగము; విస్పురణన్ = విస్తరించుట; అనుగ్రహింప బడి = ఇవ్వబడి; శుద్ధమున్ = శుద్ధి చేయబడుటను; ఒందిన = పొందిన; వాని = వాని యొక్క; చిత్తము = మనసు; అస్థిర = చంచల మైన; బహిరంగమున్ = బయటి ప్రపంచమును; కనదు = చూడదు; చెందదు = చెందదు; భూరి = అత్యధికమైన; తమస్ = తమోగుణ, చీకటి; స్వరూప = రూపము గల; సంసరణ = సంసారము యనెడి; గుహన్ = గుహను; చిరంబున్ = స్థిరముగ; కనజాలున్ = చూడ గలుగును; భవత్ = నీ యొక్క; మహనీయ = గొప్ప; తత్త్వమున్ = తత్త్వమును. </div> </div> </div> <!--4-916 కేశవ సంతత... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-916 కేశవ సంతత... (సీసము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/22.Kesava.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు<br> నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల<br> విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు<br> మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> తవిలి సంసారహారి మేధస్కుఁడవును<br> దేవదేవుఁడవును వాసుదేవుఁడవును<br> సర్వభూతనివాసివి సర్వసాక్షి<br> వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రచేతసులు చేసిన తపస్సు పంటకు వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి వారికి తన దర్శనభాగ్యాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆనంద సముద్రంలో హాయిగా మునకలు వేస్తున్నవారు స్వామితో ఇలా అంటున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము సమస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కేశవ = నారాయణ {కేశవుడు – మంచి వెంట్రుకలు గల వాడు, కేవలము శుభ మైన వాడు, విష్ణువు}; సంతత క్లేశ నాశనుడవు = నారాయణ {సంతత క్లేశనాశనుడు - నిత్యము క్లేశముల (చిక్కుల) ను నాశనము చేయు వాడు, విష్ణువు} {క్లేశములు – చిత్త వృత్తుల నుండి జనించు నవి యైదు 1ప్రమాణము (త్రివిధ ప్రమాణములు అవి 1ఇంద్రియ గోచరము 2అనుమానము 3శబ్ద ప్రమాణము) 2విపర్యయము (ప్రమాణాతీతమైనది) 3మిథ్య (ఉన్న స్థితికి వేరుగ దర్శించుట) 4నిద్ర (గుర్తించెడి సామర్థ్యము లోపించుట) 5స్మృతి (ప్రమాణము లేనప్పటికిని గుర్తించుట)} కోరి మనోవా గగోచరుడవు = నారాయణ {మనోవా గగోచరుడు - మనస్సులకు వాక్కులకు అగోచరుడవు (అందని వాడవు), విష్ణువు}; ఇద్ధ మనోరథ హేతు భూతోదార గుణ నాముడవు = నారాయణ {ఇద్ధ మనోరథ హేతు భూతోదార గుణనాముడు - ఇద్ధ (ప్రసిద్ధ మైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణ మైనది) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు)నాముడు (పేరు బడ్డ వాడు), విష్ణువు}; = సత్త్వ గుణుడవు = నారాయణ {సత్త్వ గుణుడు – సత్త్త్వ గుణము గల వాడు, విష్ణువు}; అఖిల విశ్వోధ్భవ స్థితి విల యార్థ ధారిత విపుల మాయా గుణ విగ్రహుడవు = నారాయణ {అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థ ధారిత విపుల మాయా గుణ విగ్రహుడు – సమస్త మైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధారిత (ధరింపబడిన) విపుల (విస్తార మైన) మాయా (మాయతో కూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముగా కల వాడు, విష్ణువు}; మహి తాఖి లేంద్రియ మార్గ నిరవధి గత మార్గుడవు = నారాయణ {మహి తాఖి లేంద్రియ మార్గ నిరవధి గత మార్గుడు - మహిత (గొప్ప) అఖిల (సర్వ) ఇంద్రియముల (నడవడికకు) నిరవధిక (ఎడతెగని) గత (వెళ్ళిన మార్గమున) (అధిగతుడు), విష్ణువు}; అతి శాంతి మానసుడవు = నారాయణ {అతి శాంతి మానసుడు - మిక్కిల శాంతి స్వభావము గల వాడు, విష్ణువు}; <br><br>తవిలి సంసార హారి మేధస్కుడవును = నారాయణ {తవిలి సంసార హారి మేధస్కుడు - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించు నట్టి) మేధస్కుడు (బుద్ధి బలము గల వాడు), విష్ణువు}; దేవ దేవుడవును = నారాయణ {దేవ దేవుడు - దేవవుళ్ళకే దేవుడు, విష్ణువు}; వాసుదేవుడవును = నారాయణ {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడ}; సర్వ భూత నివాసివి = నారాయణ {సర్వ భూత నివాసి - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడి వాడు, విష్ణువు}; సర్వ సాక్షివిన్ = నారాయణ {సర్వసాక్షి - సమస్తమునకు సాక్షీభూతుడు, విష్ణువు}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కారమున్ = నమస్కారము; అయ్య = తండ్రి; కృష్ణా = కృష్ణుడా. </div> </div> </div> <!--4-918 తోయరుహోదరాయ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-918 తోయరుహోదరాయ... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/23.Thoyaruhodaraya.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే<br> శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ<br> స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ<br> ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రచేతసులు శ్రీకృష్ణపరమాత్మను ఇంకా ఇలా సంస్కృతపదజాలంతో ప్రస్తుతిస్తూ నమస్కరిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించే వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు.నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తోయరు హోదరాయ = విష్ణుమూర్తి {తోయరు హోదరాయ - తోయరుహము (పద్మం) ఉదరుడు (గర్భమున గల వాడు), విష్ణువు}; భవ దుఃఖ హరాయ = విష్ణుమూర్తి {భవ దుఃఖ హర - భవ (సంసారము) యొక్క దుఃఖములను హరాయ (హరించెడి వాడు), విష్ణువు}; నమోనమః = నమస్కారము; పరేశాయ = విష్ణుమూర్తి {పరేశుడు - పర (అత్యున్నత మైన) ఈశుడు (దైవము), విష్ణువు}; సరోజ కేస రపిశంగ వినిర్మల దివ్య నవ్య వస్త్రాయ = విష్ణుమూర్తి {సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య భర్మ వస్త్రుడు - సరోజ (పద్మము)ల కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల వినిర్మల (స్వచ్చ మైన) దివ్య (దివ్య మైన) నవ్య (సరికొత్త) వస్త్ర (బట్టలు ధరించిన వాడు), విష్ణువు}; పయోజ సన్నిభ పదాయ = విష్ణుమూర్తి {పయోజ సన్నిభ పదుడు - పయోజ (పద్మము) సన్నిభ (సమాన మైన) పదుడు (పాదములు గలవాడు), విష్ణువు}; సరోరుహ మాలికాయ = విష్ణుమూర్తి {సరోరుహ మాలిక - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించిన వాడు, విష్ణువు}; కృష్ణాయ = విష్ణుమూర్తి {కృష్ణుడు - కృష్ణ (నల్లని వాఢు) అయిన వాడు}; పరాపరాయ = విష్ణుమూర్తి {పరాపరుడు - పరము అపరమూ కూడ అయిన వాడు, పరలోకములకే పర మైన వాడు, విష్ణువు}; సుగుణాయ = విష్ణుమూర్తి {సుగుణ – సుగుణములు గల వాడు, విష్ణువు}; సురారి హరాయ = విష్ణుమూర్తి {సురారి హర - సురారుల (రాక్షసుల) ను హరాయ (హరించు వాడు), విష్ణువు}; వేధసే = విష్ణుమూర్తి {వేధ – సృష్టి కర్తయైన వాడు, విష్ణువు}. </div> </div> </div> <!--4-950 చర్చింప నరుల... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-950 చర్చింప నరుల... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/24.Charchimpa_Narulake.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> చర్చింప నరులకే జన్మకర్మాయుర్మ;నో వచనంబుల దేవదేవుఁ<br> డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు; విలసిల్లు భక్తి సేవింపఁబడును<br> నవియ పో, జన్మ కర్మాయు ర్మనో వచ;నములని ధరణి నెన్నంగఁ దగును<br> వనరుహనాభ సేవా రహితము లైన; జననోపనయన దీక్షాకృతంబు<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?<br> వేద చోదిత యగు కర్మ వితతి యేల?<br> జప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?<br> మహిత నానావధాన సామర్థ్య మేల?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ప్రచేతసులు శ్రీమన్నారాయణుని ఆజ్ఞను శిరసావహించి తమ కుమారుని కడ తమ ధర్మపత్నిని ఉంచి వనవాసానికి వెళ్ళారు. అక్కడ ఆత్మవిజ్ఞానం పొందాలని సంకల్పం చేసికొని ఉండగా వారి కడకు సర్వలోకప్రియుడైన నారదుడు విచ్చేశాడు. వారు అతనికి తగిన విధంగా గౌరవ మర్యాదలు చేసి అతనితో ప్రసంగ చేస్తూ మాకు ఆత్మతత్త్వాన్ని బోధించమని అడిగారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> దేవమహర్షీ! దేవదేవుడు శ్రీమన్నారాయణుడు మానవులకు పుట్టునూ, ప్రత్యేక కర్మములనూ, ఆయువు, మనస్సు, మాట అనేవానినీ అనుగ్రహించాడు. మానవుడు వానితో అతిశయించిన భక్తితో అఖిల విశ్వమూ తనదే అయిన గోవిందుణ్ణి నిరంతరమూ సేవించాలి. అప్పుడే ఆ పుట్టుకా మొదలైనవానికి సార్థకత చేకూరుతుంది. అలా కాక పద్మనాభుని సేవ లేని జన్మమూ, ఉపనయనము మొదలైన సంస్కారములూ పనికిమాలినవైపోతాయి. ఆ జన్మ సార్థకం కానిదవుతుంది. వానికి పెద్దకాలం బ్రతకడం ప్రయోజనకరం కాదు. వాడు చేసే జపము, తపము, వేదాలు వల్లించడం, చిలక పలుకుల వంటి మాటలాడడం మొదలైనవన్నీ వ్యర్థం. పెక్కు విషయాల మీద ధ్యానం ఉంచడం వంటి పనులు కూడా పనికిమాలినవే అయిపోతాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> చర్చింపన్ = చర్చించి చూడగా; నరుల్ = మానవుల; కున్ = కు; ఏ = ఏ యొక్క; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుర్దాయము; మనః = మనసు; వచనంబులన్ = వాక్కులతో; దేవదేవున్ = నారాయణుని; అఖిల = సమస్త మైన; విశ్వ = జగత్తు; ఆత్మకుండు = తాను యైన వాడు; ఐన = అయిన; గోవిందుండున్ = నారాయణుడు; విలసిల్లు = విలసిల్లెడి; భక్తిన్ = భక్తితో; సేవింప బడెడున్ = సేవింప బడును; అవియపో = అవే; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుష్షు; మనః = మనస్సు; వచనములు = వాక్కులు; అని = అని; ధరణిన్ = భూమిపైన; ఎన్నంగన్ = ఎంచుటకు; తగును = తగి యుండును; వనరుహ నాభ = విష్ణు; సేవా = సేవించుటలు; రహితములు = లే నట్టివి; ఐన = అయిన; జనన = పురిటిశుద్ధి; ఉపనయన = వడుగు; దీక్షా = దీక్షలు; కృతంబులు = పట్టుటలు; ఐన = కలిగిన; జన్మంబుల్ = జన్మలు; ఏలన్ = ఎందులకు; దీర్ఘ = పెద్ద దైన; ఆయుర్ = ఆయుర్దాయము; ఏలన్ = ఎందులకు; వేద = వేదముల ప్రకారము; చోదిత = నడప బడెడివి; అగు = అయిన; కర్మ = కర్మల; వితతి = సమూహము; ఏలన్ = ఎందులకు; జపః = జపము; తపః = తపస్సు; శ్రుత = వేద పఠనము; వాగ్విలాపంబులున్ = నోటితో చర్చలు; ఏలన్ = ఎందులకు; మహిత = గొప్ప; నానా = రకరకముల; అవధాన = అవధరించెడి; సామర్థ్యము = నేర్పులు; ఏలన్ = ఎందులకు. </div> </div> </div> <!--4-956 అరయ న్నభ్రతమః ప్రభల్... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">4-956 అరయ న్నభ్రతమః ప్రభల్... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/04/25.Arayannabhratha.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అరయన్నభ్రతమః ప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోచి క్ర<br> మ్మఱ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులున్<br> బరికింపన్ ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబు లై క్రమ్మఱన్<br> విరతిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తమకు ఆత్మతత్త్వం ఉపదేశించవలసినదిగా ప్రార్థించిన ప్రచేతసులతో దివ్యజ్ఞానసంపన్నుడైన నారద మహాముని యిలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నాయనలారా! చూడండి. గగనంలో కారు మేఘాలు కదలాడుతూ ఉంటాయి. వాని వలన క్రిందనున్న వారికి చీకట్లు క్రమ్ముకున్నట్లు ఉంటుంది. కానీ, కొద్ది క్షణాలలోనే ఆ మబ్బులు విచ్చుకునిపోతాయి. స్వచ్చమైన ఆకాశం వెలుగులను నింపుతూ కానవస్తుంది. అలాగే బ్రహ్మమునందు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి సత్త్వము, రజస్సు, తమస్సు అనేవాని ప్రవాహంలో పడి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. మళ్ళీ నామరూపాలు లేకుండా పోతాయి. అలా తోచడానికీ, పోవడానికీ, కారణమైనవాడు శ్రీమహావిష్ణువు. ఆ చీకట్లను హరించేవాడు కనుక హరి అని కూడా ఆయనను అంటారు. అట్టి హరిని సేవిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం వెలిగిపోతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అరయన్ = తరచి చూసిన; అభ్ర = మేఘముల లోని; తమః = చీకట్ల; ప్రభల్ = కాంతులు; మునున్ = ముందు; నభంబున్ = ఆకాశము; అందున్ = లో; ఒప్పగా = చక్కగా; తోచి = తోచి నప్పటికిని; క్రమ్మఱన్ = మరల; వీక్షింపగన్ = చూచినచో; అందె = అక్కడే; లేని = లేక పోవు; గతిన్ = విధముగా; బ్రహ్మంబున్ = పర బ్రహ్మము; అందున్ = లో; ఈ = ఈ; శక్తులున్ = శక్తులను; పరికింపన్ = పరికించి చూసినచో; త్రిగుణ = త్రిగుణముల; ప్రవాహమునన్ = ప్రవహించుట చేత; ఉత్పన్నంబులు = పుట్టినవి; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; విరతిన్ = లయ మగుట; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; కావునన్ = కనుక; హరిన్ = నారాయణుని; విష్ణున్ = విష్ణుని; భజింపన్ = సేవించుట; తగున్ = చేయ తగును. </div> </div> </div> <div> <div style="width:10%;Text-align:center;float:left;"> <div class="button-effect"> <a class="effect effect-4" href="iBam4.html" title="తృతీయ స్కంధం" style="background-color: #f4511e;"><i class="fas fa-arrow-left"></i> తృతీయ స్కంధం</a> </div> </div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam5.html" title="పంచమ స్కంధం" style="background-color: #f4511e;">పంచమ స్కంధం <i class="fas fa-arrow-right"></i></a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>