JezK
Edit File: iBam10.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam10.html Date Name Comments ==== ==== ======== 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <br> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <link rel="shortcut icon" href="../images/favicon.png"/> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet" /> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet" /> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> <link href="../assets/css/main.css" rel="stylesheet" /> <link href="../assets/css/ibam.css" rel="stylesheet" /> <script> <!-- $(window).scroll(function () { --> <!-- $('audio').each(function () { --> <!-- //if ($(this).is(":in-viewport")) --> <!-- if (IsInViewport($(this))) --> <!-- { --> <!-- $(this)[0].play(); --> <!-- } --> <!-- else --> <!-- { --> <!-- $(this)[0].pause(); --> <!-- } --> <!-- }) --> <!-- }); --> <!-- Check if an element is in the visible viewport --> <!-- @param {jQuery|HTMLElement} el --> <!-- @return boolean --> <!-- var IsInViewport = function (el) { --> <!-- if (typeof jQuery === "function" && el instanceof jQuery) el = el[0]; --> <!-- var rect = el.getBoundingClientRect(); --> <!-- return ( --> <!-- rect.top >= 0 && --> <!-- rect.left >= 0 && --> <!-- rect.bottom <= (window.innerHeight || document.documentElement.clientHeight) && --> <!-- rect.right <= (window.innerWidth || document.documentElement.clientWidth) --> <!-- ); --> <!-- }; --> </script> </head> <body> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"><a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1<span class="sr-only">(current)</span></a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a></li> <li class="nav-item"><a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a></li> <li class="nav-item"><a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a></li> <li class="nav-item"><a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a></li> <li class="nav-item"><a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a></li> <li class="nav-item"><a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a></li> <li class="nav-item"><a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a></li> <li class="nav-item"><a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a></li> <li class="nav-item"><a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a></li> <li class="nav-item"><a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a></li> <li class="nav-item"><a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a></li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills "> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a></li> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-skype" aria-label="Skype" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-linkedin" aria-label="Linkedin" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <!-- <li class="nav-item"> <a class="nav-link fab fa-google-plus" aria-label="Google-Plus" href="#" target="_blank" style="font-size: large;"></a></li> --> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a></li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a></li> </ul> </div> </nav> <!-- <div class="img-responsive aln-top" style="margin-top: 50px; background-color: white; z-index: 99; position: relative;"> <img src="../images/iBam.png" /> </div>--> <div class="container-fluid"> <div id="chap10" > <!-- <br><br> --> <h3 class="title" style="padding-top: 6px;" >దశమ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap10"></div> <div class="col-sm-9"> <!--10-1 శ్రీకంఠచాప ఖండన... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1 శ్రీకంఠచాప ఖండన... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/01.Srikantachapakhandana.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> శ్రీకంఠచాప ఖండన!<br> పాకారి ప్రముఖ వినుత భండన! విలసత్<br> కాకుత్స్థవంశమండన!<br> రాకేందు యశోవిశాల! రామనృపాలా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతంలోని దశమస్కంధం నేరుగా శ్రీకృష్ణవాసుదేవుని పరమాత్మతత్త్వాన్ని ప్రపంచించే వాఙ్మయ విరాట్ స్వరూపం. పోతన మహాకవి ఆ స్కంధాన్ని ప్రారంభిస్తూ శ్రీరామచంద్రప్రభువులవారి గుణవిశేషాలను ఆత్మానందంకోసం వక్కాణిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ శ్రీరామచంద్రప్రభూ! నీవు శ్రీకంఠుని వింటిని ముక్కలు చేసిన మహాత్ముడవు. దేవేంద్రుడు మొదలైనవారు కూడా నీ యుద్ధాన్ని నిండు గౌరవంతో కొనియాడుతారు. కకుత్స్థుడు అనే మహాపురుషుని కుదురునందు వెలుగులు నింపడానికి నీవు అందులో అవతరించిన ఆదిదేవుడవు. నీ విశాలమైన కీర్తి పూర్ణచంద్రునిలా సర్వలోకాలను ఆహ్లాద పరుస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> శ్రీకంఠచాపఖండన = శ్రీరామ కఱకంఠుడైన శివుని విల్లును విరిచినవాడు, పాకారిప్రముఖవినుతభండన = పాకాసురుని శత్రువైన ఇంద్రాదులచేత పొగడబడిన యుద్ధము చేసినవాడు, విలసత్కాకుత్స్థవంశమండన = ప్రసిద్ధికెక్కిన కకుత్స్థ మహరాజ వంశమునకు అలంకారమైనవాడు; రాకేందుయశోవిశాల = నిండుపున్నమిచంద్రునివంటి కీర్తి విరివిగా కలవాడు రామ = రాముడు అనే {నిండుపున్నమిచంద్రుని పదహారు కళలు- 1. అమృత 2. మానద 3. పూష 4. తుష్టి 5. పుష్టి 6. రతి 7. ధృతి 8. శశిని 9. చంద్రిక 10. కాంతి 11. జ్యోత్స్న 12. శ్రీ 13. ప్రీతి 14. అంగద 15. పూర్ణ 16. పూర్ణామృతాలు} నృపాల = రాజా! </div> </div> </div> <!--10-183 ఏమి నోముఫలమొ... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-183 ఏమి నోముఫలమొ... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/02.Emi_Nomu_Phalamo.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త<br> వింటి మబలలార! వీను లలర<br> మన యశోద చిన్ని మగవానిఁ గనె నట<br> చూచి వత్త మమ్మ! సుదతులార! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీ వాసుదేవ పరమాత్మ తన మాయతో నందగోకులంలో సుందరశిశువై యశోద ఒడిలోనికి చేరుకున్నాడు. అందరూ ఆ నందనందనుడు యశోద కడుపున పుట్టినట్లే సంభావించారు. వ్రేపల్లెలోని గోపసుందరులందరూ ఇలా అనుకుంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఒయ్యోయి అబలలారా! సుదతులారా! ఈనాడు మనం వెనుకటి పుట్టువులలో చేసుకొన్న పుణ్యమెటువంటిదో కానీ ఒక వార్త వీనులవిందుగా వినబడింది. మన యశోద లేదూ, అదే నందుని ఇల్లాలమ్మా ఒక చిన్ని మగవానిని కన్నదట. వెళ్ళి చూచి వద్దామా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఏమి = ఎట్టి; నోము = వ్రతములునోచిన; ఫలమొ = ఫలితముగానో; ఇంత ప్రొద్దు = ఇప్పటికి; ఒక = ఒకానొక; వార్తన్ = శుభవర్తమానమును; వింటిమి = విన్నాము; అబలలార = ఇంతులార; వీనులు = చెవులు; అలరన్ = ఆనందించగా; మన = మన యొక్క; యశోద = యశోద; చిన్ని = చంటి; మగవాని = మగపిల్లవాడిని; కనెనట = ప్రసవించినదట, చూచి = చూసి; వత్తమమ్మ = వచ్చెదమమ్మ; సుదతులార = సుందరీమణులారా! </div> </div> </div> <!--10-256 బాలుం డెక్కడ... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-256 బాలుం డెక్కడ... (శార్దూలం).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/03.Balundekkada_Bandiyekkada.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడన్<br> గాలం దన్నుట యెక్క? డాటపడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప<br> ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం<br> చాలాపింపుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్. <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పరంధాముడు బాలకృష్ణుడై లీలలెన్నో ప్రదర్శించాడు. అవి లోకంలో మరెక్కడా మరెవ్వరియందూ సంభవించేవి కావు. పసితనంలోనే బండిరూపంలో ఉన్న బండ రక్కసుని కాలితో తన్ని నేలగూల్చివేశాడు. అది విని గోపకులు, గోపికలు ముక్కున వేలు వేసుకొని ఇలా అనుకొంటున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పిల్లవాడెక్కడ? బండి యెక్కడ? మింటిలో విరిగి ముక్కలయ్యే విధంగా కాలితో తన్నటం ఎక్కడ? తోడి చెలికాండ్రు అబద్ధాలాడుతున్నారు. ఇటువంటి తెలివితక్కువమాట ఏ లోకంలో నైనా ఎవరైనా పలుకుతారా? ఇదేమి తీరో! అని పలువిధాలుగా పలుకుతూ గోపగోపికలు చాలా ఆశ్చర్యపడ్డారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బాలుండు = పిల్లవాడు; ఎక్కడ = ఎక్కడ; బండి = బండి; ఎక్కడ = ఎక్కడ; నభోభాగంబు = ఆకాశము; పైన్ = మీదికి; చేడ్పడన్ = వికలమగునట్లుగా; కాలం = కాలితో; తన్నుట = తన్నడము; ఎక్కడన్ = ఎక్కడ; ఆటపడుచుల్ = తోటిపిల్లలు; కల్లలు = అబద్ధములు; ఆడిరి = పలికిరి; ఈ = ఇలాంటి; జడ్డు = తెలివిమాలిన; పల్కు = మాటలు; ఏ = ఏ; లోకంబునన్ = లోకములో; ఐనన్ = అయినప్పటికి; చెప్పబడునే = పలుకుతారా; ఏ = ఎలాంటి; చందమో = హేతువో; కాక = కాని; అంచున్ = అనుచు; ఆలపించుచున్ = మాటలాడుకొనుచు; అంతటన్ = అని వ్రేలువ్రేతలు = గోపగోపికలు; ప్రభూత = పుట్టిన; ఆశ్చర్యలు = ఆశ్చర్యములుగలవారు; ఐరి = అయినారు. </div> </div> </div> <!--10-258 అలసితివి గదన్న... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-258 అలసితివి గదన్న... (ఆటవెలది). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/04.Alasithivigadanna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!<br> మంచి యన్న! యేడ్పు మాను మన్న!<br> చన్నుఁ గుడువు మన్న! సంతసపడు మన్న!<br> యనుచుఁ జన్నుఁ గుడిపె నర్భకునకు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బండిని పగులదన్ని పసిపాపడైన కృష్ణుడు నంగనాచిలా ఏమీ ఎరుగనట్లు ఏడవడం మొదలుపెట్టాడు. తల్లిహృదయం తల్లడిల్లిపోయింది. ఆమె పరుగుపరుగున వచ్చి కన్నయ్యతో ఇలా అంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> కన్నా! అలసిపోయావా తండ్రీ! ఆకలివేస్తున్నదా నాన్నా! మంచివాడవుగదూ! ఏడ్పుమాను నాయనా! ఇదిగో పాలు త్రాగు! సంతోషం పొందు చిన్నా! అంటూ ఆ పసివానికి పడతి యశోద పాలిచ్చింది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అన్న = నాయనా; అలసితివి = అలసిపోయావు; కద = కదా; ఆకొంటివి = ఆకలివేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచియన్న = మంచివాడివి కదా; ఏడ్పున్ = రోదనమును; మానుమన్న = మానివేయి నాన్నా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుమన్న = సంతోషింపుము; అనుచున్ = అంటూ; అర్భకునకున్ = పిల్లవానికి; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించింది. </div> </div> </div> <!--10-296 తనువున నంటిన... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-296 తనువున నంటిన... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/05.Thanuvunanantina.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;<br> ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;<br> ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;<br> కంఠమాలికలలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;<br> బాలులీలఁ బ్రౌఢబాలకుండు<br> శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును<br> వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కొన్ని ఘనకార్యాలు చక్కబెట్టడానికి స్వామి వాసుదేవుడు అవసరమైనప్పుడల్లా అవనికి దిగివస్తూ ఉంటాడు. వినోదంగా ఒక తోడును కూడా తెచ్చుకుంటాడు. ఆ స్వామియే నందగోపబాలుడు కన్నయ్య. తోడై వచ్చిన మహాత్ముడు ఆదిశేషుని అంశమైన బలరాముడు. పసితనపు పరువంలోని గోపబాలుని పరికించి చూచేవారికి పరమశివుని దర్శనం కూడా అవుతున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> కన్నయ్య తన అన్నయ్యతో పాటు ఆడుకొంటున్నాడు. ఒడలంతా దుమ్ము దుమ్మైపోయింది. అది పరమశివుడు పూసుకొన్న విభూతిలాగ వెలిగిపోతున్నది. తలమీద తెలికాంతులు వెదజల్లుతున్న ముత్యాలహారం చంద్రశేఖరుని తలమీది జాబిల్లిని తలపింపచేస్తున్నది. అమ్మ నొసటిమీద ఎఱ్ఱటి తిలకం చక్కగా పెట్టింది. అది కాముణ్ణి కాల్చివేసిన మూడవ కన్నులాగా ప్రకాశిస్తున్నది. యశోదమ్మ మెడచుట్టి వచ్చేట్టుగా ఒక చక్కనిహారం వేసింది. దానిమధ్య ఇంద్రనీలమణి మనోజ్ఞకాంతులతో ఒప్పారుతున్నది. అది శివమహాదేవుని మెడలోని నీలిమను తోపచేస్తున్నది. నిలువెల్లా హారాలే కదలాడుతూ ఉన్నాయి. అవి శివుని దేహంమీద తిరుగాడే పాములా అన్నట్లున్నాయి. ఇలా ఆ గోపబాలుడు, నిజానికి గొప్ప ప్రౌఢుడు, బాలలీలలతో ఫాలలోచనుని వలె భాసిల్లుతున్నాడు. బహుశః, మేమిద్దరము కాదయ్యా! ఆయనే నేను, నేనే ఆయన అని లోకాలకు తెలియజెప్పాలి అనే కోరిక కలిగి ఉంటుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తనువున = ఒంటికి; అంటిన = అంటుకొన్న; ధరణీపరాగంబు = మట్టిమర కలు; పూసిన = రాసుకొన్న; నెఱి = నిండైన; భూతి = విబూది; పూత = పూత; కాగ = అగుచుండగా; ముందర = తలపై; వెలుగొందు = ప్రకాశించెడి; ముక్తాలలామంబు = ముత్యాలచేరు; తొగలసంగడికాని = కలువల స్నేహితుడైన చంద్రుని; తునుక = రేఖ; కాగ = అగుచుండగా; ఫాలభాగంబుపై = నుదుటిమీద; పరగు = దిద్దిన; కావిరిబొట్టు = నల్లని చాదు (బొట్టు); కాముని = మన్మథుని; గెల్చిన = జయించిన; కన్ను = కన్ను (మూడవకన్ను); కాగ = అగుచుండగా; కంఠమాలిక = మెడలోనిహారము; లోని = అందలి; ఘన = బాగాపెద్ద; నీలరత్నంబు = ఇంద్రనీలమణి; కమనీయమగు = అందమైన; మెడకప్పు = కంఠమునందలి నల్లదనం; కాగ = అగుచుండగా; హారవల్లులు = ముత్యాలహారపుపేటలు; ఉరగ = సర్పములనెడి; <br><br>హారవల్లులు = దండలపేర్లు; కాగ = అగుచుండగా; బాల = పసితనపు; లీలన్ = విలాసములతో; ప్రౌఢ = అన్నీతెలిసిన; బాల కుండు = పిల్లవాడు; శివుని = పరమశివుని; పగిదిన్ = వలె; ఒప్పెన్ = కనబడు చుండెను; శివునికిం = పరమశివునికి; తనకును = తనకు; వేఱు = భేదము; లేమిన్ = లేకపోవుటను; వెలయునట్లుగా = విలసిల్లినవిధమును, తెలుపన్ = తెలియజేయుటకు. </div> </div> </div> <!--10-306 బాలురకుఁ బాలు లేవని... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-306 బాలురకుఁ బాలు లేవని... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/06.Baluraku_Palulevani.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బాలురకుఁ బాలు లే వని<br> బాలింతలు మొఱలు వెట్టఁ పకపక నగి నీ<br> బాలుం డాలము సేయుచు<br> నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కన్నయ్య చిన్నప్పుడు చాలా చాలా చిలిపి పనులు చేశాడు. అవన్నీ తాను భగవంతుడనని ప్రకటించడం కోసమే కనుక వానిని మహాకవులూ, మహర్షులూ లీలలుగా భావించి ఆనందసాగరంలో ఈదులాడారు. ఒక గోపిక యశోదమ్మతో బాలుని లీలను ఇలా చెప్పుకొంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> చక్కగా విచ్చుకొన్న పద్మాలలాగా అలరారుతున్న కన్నులు గల ఓ యశోదమ్మా! ఒక పక్క మా పసిపిల్లలకు పాలులేవని బిడ్డలను గన్న అమ్మలు మొత్తుకుంటూ ఉంటే నీ పిల్లగాడు పకపకా నవ్వుతూ పట్టనలవిగాని అల్లరిచేస్తూ దూడలను ఆవులదగ్గరకు వదలి వేశాడమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అంభోజాక్షీ = సుందరీ!; బాలురుకు = పిల్లలకు; పాలు = తాగుటకు పాలు; లేవని = లేవు అని; బాలింతలు = పసిబిడ్డలతల్లులు; మొఱలువెట్ట = మొత్తుకొనగా; పక పక నగి = పకపకమని నవ్వి; ఈ బాలుండు = ఈ పిల్లవాడు; ఆలము = అల్లరి; సేయు చున్ = చేస్తూ; ఆలకు = ఆవులకు; క్రేపులను = దూడలను; విడిచెన్ = వదలి పెట్టెను. </div> </div> </div> <!--10-307 పడఁతీ నీ బిడ్డడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-307 పడఁతీ నీ బిడ్డడు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/07.Padathi_Nee_Biddadu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పడఁతీ! నీ బిడ్డడు మా<br> కడవలలో నున్న మంచి కాఁగిన పా లా<br> బుడుతలకుఁ బోసి చిక్కిన<br> కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గోపికలు యశోదమ్మకు కృష్ణుని దుడుకుపనులు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవటం వారికి అదొక తృప్తి. యశోదమ్మకు ఆనందం. మహాకవి పోతన మనకు కూడా అటు వంటి తృప్తినీ ఆనందాన్నీ అందిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యశోదమ్మా! నీవు కూడా ఒక ఆడదానివే కదమ్మా! చూడు నీ పోరగాడు ఏమి చేశాడో? కడవలలో మేము చక్కగా మీగడ కట్టే విధంగా కాచి దాచుకొన్న పాలను మెల్లగా మా యిళ్ళలో దూరి, దుడుకుతనంతో ఏ మాత్రమూ తీసిపోని చెలికాండ్రకు పీకల దాకా పోశాడమ్మా! కాస్తో కూస్తో మిగిలిన పాలకుండలను పగులగొట్టి పారిపోయాడమ్మా! వానిమీద నీకేమయినా అదుపూ ఆజ్ఞా ఉన్నాయటమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> పడతీ = ఇంతీ; నీ బిడ్డడు = నీ పిల్లవాడు; మా కడవలలో = మా కుండలలో; ఉన్న = ఉన్నట్టి; మంచి = శుభ్రముగ; కాగిన = కాగినట్టి; పాలు = పాలను; బుడుతలకు = పిల్లలకు; పోసి = తాగించి; చిక్కిన = మిగిలిన; కడవలన్ = కుండలను; పోనడిచెన్ = పగులగొట్టెను; ఆజ్ఞ = అడ్డూ అదుపు; కలదో = ఉన్నదో; లేదో = లేదో? </div> </div> </div> <!--10-308 మీ పాపఁడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-308 మీ పాపఁడు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/08.Mee_Paapadu_Maa_Gruhamula.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> మీ పాపఁడు మా గృహముల<br> నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్<br> గోపించి పిన్నపడుచుల<br> వాపోవఁగఁ జిమ్మికొనుచు వచ్చెం దల్లీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> యశోదమ్మకు కన్నయ్యమీద కోపం రావాలి. అతనిని గట్టిగా శిక్షించాలి. అతడు బుంగమూతి పెట్టి కన్నులు నులుపుకుంటూ బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే ఆ అందమే అందం. అందుకోవాలని అంగనలు పితూరీలు చెపుతున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తల్లీ! యశోదమ్మా! ఏమి చెప్పమంటావు. మీ అబ్బాయిగారు మా యింట్లో తృప్తితీరా, కడుపునిండా పాలు త్రాగాలని దూరాడు. పాపం! వాడికి పాలెక్కడా కనపడ లేదు. అప్పుడు ఆయనగారికి గొప్పగా కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న మా పసిపిల్లలు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉండగా వారినందరిని చెదరగొట్టుకుంటూ బయటకు వచ్చాడమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> మీ పాపడు = మీ పిల్లవాడు; మా గృహములన్ = మా ఇండ్లలో; ఆపోవగన్ = సరిపడినంత; పాలు = పాలను; త్రావ = తాగుటకు వచ్చాడు; అగపడకున్నం = కనబడ క పోతే; కోపించి = కోపంతో; పిన్నపడపచుల = పసిబిడ్డలను; వాపోవగన్ = ఏడ్పిం చుచు; జిమ్ముకొనుచు = చెదరగొడుతూ; వచ్చెన్ = వచ్చెను. </div> </div> </div> <!--10-309 ఆడం జని... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-309 ఆడం జని... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/09.Adamjani_Veerala.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఆడం జని వీరల పెరుఁ, <br> గోడక నీ సుతుఁడు త్రావి యొక యించుక తాఁ<br> గోడలి మూఁతిం జరిమినఁ<br> గోడలు మ్రు చ్చనుచు నత్త కొట్టె లతాంగీ! <br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఒక చక్కని లతలాగా ఊగిపోతున్న యశోదమ్మ తల్లీ! మీవాడు వట్టి తంపుల మారివాడమ్మా! అంటున్నది ఒక గోపిక. చూడు ఎంత ఆగడం చేశాడో నీ కొడుకు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> యశోదమ్మా! మీ పిల్లవాడు మెల్లగా ఒక యింటిలో దూరాడు. జంకుగొంకులు ఏ మాత్రమూ లేకుండా ఆ యింటిలోని పెరుగు త్రాగివేశాడు. పాపం ఆ యింటి కోడలు పిల్ల గమనించింది. ఈ మహాపురుషుడు వెంటనే ఆ పెరుగును కొంచెం తీసికొని ఆ కోడలి మూతికి అంటించాడు. ఆమె బిత్తరపోయి చూస్తూ ఉండగా అత్తగారు కోడలిని చూడనే చూచింది. భడవా! దొంగతిండి తింటున్నావా? అని కోడలికి నాలుగు వడ్డించింది </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> లతాంగీ = ఇంతీ!; ఆడన్ = అక్కడకు; చని = వెళ్ళి; వీరల పెరుగున్ = వీరి యింటిలోని పెరుగును; ఓడక = బెదురులేకుండ; నీ సుతుండు = నీ పుత్రుడు; త్రావి = తాగి; ఒక యించుక = కొంచెము; తా కోడలి = వారి కొడుకుభార్య; మూతిం = నోటికి; చరిమినన్ = రాయగా; కోడలు = కోడలు; మ్రుచ్చు = దొంగ; అనుచును = అనుచు; కొట్టెన్ = కొట్టినది. </div> </div> </div> <!--10-310 వారిల్లు చొచ్చి... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-310 వారిల్లు చొచ్చి... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/10.Varillusochi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వా రిల్లు సొచ్చి కడవలఁ<br> దోరంబగు నెయ్యి త్రావి తుది నా కడవల్<br> వీ రింట నీ సుతుం డిడ<br> వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఒక గోపిక కన్నయ్య దుడుకుతనాన్ని యశోదమ్మకు ఇలా వివరించి చెబుతున్నది </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అమ్మా! మహాతల్లీ! మీ పాపడు ఎంత నంగనాచియో చూడు. వాళ్ళింట్లో దూరాడు. కడవలలో కమ్మగా క్రాగిన కమ్మని నేతిని అంతా పొట్టను పెట్టుకున్నాడు. ఆ కడవల నన్నింటినీ తెచ్చి వీరింట్లో పెట్టాడు. ఇంక చూడు! వాళ్ళూ వీళ్ళూ తిట్టుకొన్న తిట్లు అన్నీ ఇన్నీ కావమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సతీ = ఇల్లాలా; నీ సుతుండు = నీ పుత్రుడు; వారిల్లు = వారి నివాసమును; చొచ్చి = దూరి; కడవలన్ = కుండలలోని; తోరంబగు = గట్టిగాపేరుకొన్న; నెయ్యిన్ = నేతిని; త్రావి = తాగి; తుది = చివరకు; ఆ కడవల్ = ఆ కుండలను; వీరింటన్ = వీరి ఇంటిలో; ఇడ = పెట్టగా; వారికి = ఆ యింటివారికి, వీరికిని = ఈ ఇంటివారికి; దొడ్డ = పెద్ద; వాదయ్యె = జగడము అయినది. </div> </div> </div> <!--10-326 కలకంఠి మా వాడ గరితల... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-326 కలకంఠి మా వాడ గరితల... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/11.Kalakanthi_Maavaada.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ పట్టి రాఁగల డని పాలు పెరుగు<br> లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ చూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?<br> తలుపులు ముద్రలు తాళంబులును పెట్టి యున్న చందంబున నున్న వరయ;<br> నొక యింటిలోఁ నాడు నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;<br> <br> <b> (ఆటవెలది) </b><br> <br> నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ<br> పక్షి ఘోషణములు పరఁగఁ జేయు<br> నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో<br> కాన రాఁడు రిత్త కడవ లుండు<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గొల్లభామలు ఇండ్ల తలుపులకు గట్టిగా తాళాలు వేసుకున్నారు. కృష్ణుడు ప్రవేశించటానికి పిసరంత సందు కూడా లేకుండా ఏర్పాట్లు భద్రంగా చేశారు. నిబ్బరంగా ఉండి గమనిస్తున్నారు. కృష్ణుడు ఇళ్ళలోనికి పోనేపోయాడు. వెక్కిరింతలూ వేళాకోళాలూ చేయనే చేశాడు. పాపం గొల్లభామలు యశోదకు ఇలా చెప్పుకుంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నీ కమ్మని కంఠం మా కంఠాలను నొక్కివేస్తుందమ్మా యశోదమ్మా! మా పేట లోని ఆడవాళ్ళందరమూ కలిసి గట్టిపూనికతో ఒక పథకం వేసుకున్నాం. నీ కొడుకు వస్తాడేమో అని పాలూ పెరుగూ ఇండ్ల లోపలి గదులలో భద్రంగా పెట్టి ఎలా వస్తాడో అని ఆయనగారు వచ్చేదారిని చూస్తూ ఉన్నాము. ఇళ్ళకు వేసిన తాళాలూ, తలుపుల ముద్రలూ వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు దూరాడో, ఎలా దూరాడో ఇండ్ల లోపల ఉన్నాడు. ఒక ఇంటిలో ఆడుతున్నాడు. మరొక ఇంటిలో పాడుతున్నాడు. ఒక యింటిలో నవ్వుతున్నాడు. ఒక ఇంటిలో వెక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా వింతగా జంతువులా, పక్షులా కూతలు. ఎలాగైనా పట్టి కట్టిపడవేయాలని ప్రయత్నిస్తే కనపడనే కనపడడు. ఎక్కడకు పోతాడో ఏమో! ఇళ్ళలో మాత్రం ఖాళీ కడవలు కానవస్తాయి </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కలకంఠి = కోకిలవంటి స్వరము కల ఓ పడతీ మా వాడన్ = మా పేటలోని; గరితలము = స్త్రీలము నీ పట్టి = నీ పిల్లవాడు; రాగలడు = వస్తాడు; అని = భావించి; పాలు = పాలను; పెరుగున్ = పెరుగును; ఇండ్ల లోపలన్ = ఇళ్ళలో; ఇడి = పెట్టి; ఏము = మేము; ఎల్లన్ = అందరము; తన = అతని; త్రోవన్ = దారిని; చూచుచోన్ = చూస్తుండగా; ఎప్పుడున్ = ఎప్పుడు; చొచ్చినాడొ = దూరాడో; తలుపుల ముద్రల = తలుపుల గొళ్ళెముల; తాళంబులునున్ = తాళములు; పెట్టి = వేసినవి; ఉన్న చందంబు నన్ = ఉన్నవిధముగానే; ఉన్నవి = ఉన్నాయి; అరయ = తరచిచూసినను; ఒక = ఒకానొక; ఇంటిలోన్ = ఇంటిలో; పాడున్ = పాటలుపాడుతూ; ఒక = ఒకానొక; ఇంటి లోన్ = నివాసములో; ఆడున్ = నాట్యమాడుతూ; ఒక ఇంటిలోన్ = ఒకానొక గృహము లో; నవ్వున్ = నవ్వుతూ; ఒకటన్ = ఒకదానిలో; తిట్టున్ = తిడుతూ;<br><br>ఒకటన్ = ఒక చోట. వెక్కిరించున్ = వెక్కిరించుచూ; ఒక్కొక్కచోన్ = కొన్నిచోట్ల; మృగ = జంతువుల; పక్షి = పక్షుల; ఘోషణములున్ = అరుపులను; పరగన్ = వింతగా; చేయున్ = చేయును; ఇట్లు = ఈ విధముగ; చేసి = చేసిన; వెనుకన్ = తరువాత; ఎక్కడన్ = ఎక్కడకు; పోవునో = వెళ్ళిపోవునో; కానరాడు = కనిపించడు; రిత్త = ఖాళీ; కడవలు = కుండలు; ఉండు = ఉండును </div> </div> </div> <!--10-328 ఓ యమ్మ నీ కుమారుఁడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-328 ఓ యమ్మ నీ కుమారుఁడు... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/12.Oyamma_Nee_Kumarudu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఓ యమ్మ! నీ కుమారుఁడు<br> మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా!<br> పోయెద మెక్కడి కైనను<br> మా యన్నల సురభు లాన మంజులవాణీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గోపికలు యశోదమ్మకు మొరపెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఆగడాలను పేర్కొని ఎక్కడికైనా వెళ్ళిపోతామంటున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఓయమ్మా! మంజులవాణీ! నీ కుమారుడు మా యిండ్లలో పాలూపెరుగూ బ్రతక నివ్వడు తల్లీ! ఎక్కడికైనా వెళ్ళిపోతాము. ఇది యేదో ఆషామాషీగా అంటున్నమాట కాదు తల్లీ!. మా అన్నల ఆవులమీద ఒట్టువేసి అంటున్నమాట. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఓ యమ్మ = ఓ తల్లీ; మంజులవాణీ = కమ్మగా మాట్లాడే సుందరీ!; నీ కుమారుడు = నీ పుత్రుడు; మా ఇండ్లను = మా నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడమ్మా = బతకనీయడు; ఎక్కడికైనను = మరి ఇంకొక చోటునకు; పోయెదము = పోతాము; మా అన్నల = మా తండ్రుల; సురభులు = గోవుల మీద; ఆన = ఒట్టు. </div> </div> </div> <!--10-337 అమ్మా మన్ను దినంగ... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-337 అమ్మా మన్ను దినంగ... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/13.Ammaa_Mannu_Thinangane.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అమ్మా! మన్ను దినంగ నే శిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?<br> నమ్మం జూడకు వీరి మాటలు మది; న్నన్నీవు కొట్టంగ వీ<br> రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీ యాస్య గం<br> ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> గోపవనితలు కృష్ణుని ఆగడాలను యశోదమ్మకు చెప్పుకొని తమదారిని తాము పోయారు. ఈ అయ్యవారు ఏమీ ఎరుగని నంగనాచిలా అమ్మవడిలో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఒకనాడు బలరాముడు మొదలైన గోపబాలురందరూ యశోదకు కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పారు. ఆయమ్మ మన్నెందుకు తింటున్నావని గదమాయించింది. అప్పుడు కన్నయ్య ఇలా అన్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అమ్మా! మన్ను తినటానికి నేనేమైనా పసివాడనా? ఆకలి వేసినవాడనా? వెఱ్ఱి వాడనా? నీవు వీరి మాటలు మనస్సులో నమ్మవద్దు. నీవు నన్ను కొట్టాలని వీళ్ళీమార్గం కల్పించి చెబుతున్నారు. కాదంటే నా నోటివాసన చూచి నా మాటలు తప్పైతే నన్ను దండించమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసిఉన్నానా; వెఱ్ఱినో = వెర్రివాడినా; వీరి మాటలు = వీరి పలుకులను; మదిన్ = మనస్సులో; నమ్మంజూడకు = నమ్మబోకుము; నన్ను = నన్ను; నీవు = నీవు; కొట్టంగన్ = కొట్టడంకోసం; వీరు = వీరు; ఈ + మార్గమున్ = ఇలాంటివి; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుచున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము సేసి = వాసనచూచి; = నా వచనముల్ = నా మాటలు; తప్పైనన్ అబద్దమైతే; దండింపవే = శిక్షించు. </div> </div> </div> <!--10-341 కలయో వైష్ణవ మాయయో... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-341 కలయో వైష్ణవ మాయయో... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/14.Kalayo_Vyshnavamayo.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!<br> తలఁపన్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర<br> స్థలమో! బాలకుఁ డెంత? యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర<br> జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నా నోటివాసన చూచి మన్ను తిన్నానో లేదో తెలుసుకో అని నోరు పెద్దగా తెరచి ఆమెకు చూపాడు. యశోదకు ఆ చిన్నినోటిలో సముద్రాలతో, పర్వతాలతో, అడవులతో, భూగోళాలతో, అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, దిక్పాలకులు మొదలైనవానితో కూడిన బ్రహ్మాండమంతా కానవచ్చింది. ఆ అద్భుత దర్శనానికి ఆమె విస్తుపోయి ఇలా అనుకుంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఏమిటి ఇది కలయా? విష్ణువునకు సంబంధించిన మాయయా? లేక మనస్సు లోని సంకల్పాలకు కల్పనయా? లేక ఇదంతా సత్యమేనా? నా మనస్సు సరిగ్గా పని చేస్తున్నదా? అసలు నేను యశోదనేనా? ఇది మా యిల్లేనా? పరస్థలమా? వ్రేలెడంత లేని యీ బాలుడేమిటీ? ఇతని మోములో బ్రహ్మాండమంతా గొప్ప వెలుగులతో అలరారట మేమిటి? దీనికి కారణం ఏమిటో? ఇది భావించినకొద్దీ పరమాద్భుతంగా ఉన్న విషయం. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కలయో = స్వప్నమా; వైష్ణవ మాయయో = విష్ణుమూర్తి మాయా; ఇతర సంకల్పార్థమో = మనస్సులోని కోరికలకు రూపకల్పనా, సత్యమో = వాస్తవమా; తలప న్నేరక = విచారించలేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదా; పరస్థలమో = ఇతరమైన ప్రదేశమా (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటివాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబై = ముఖము నం దున్నదై; అజాండంబు = విశ్వము; ప్రజ్వలమై = మిక్కలి ప్రకాశిస్తూ; ఉండుటకున్ = ఉండుటకు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; చింతింపగన్ = విచారించగా మహా శ్చర్యంబు = గొప్పవింత. </div> </div> </div> <!--10-346 బాలుఁ డీతం డని... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-346 బాలుఁ డీతం డని... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/16.Baludeethandani_Bhavinthu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> బాలుఁ డీతం డని భావింతు నందునా; యే పెద్దలును నేర రీ క్రమంబు<br> వెఱ వెఱుంగుటకు నై వెఱపింతు నందునా; కలిగి లే కొక్కఁడు గాని లేఁడు<br> వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా; తనుదాన యై బుద్ధిఁ దప్ప కుండు<br> నొం డెఱుంగక యింట నుండెడి నందునా; చొచ్చి చూడని దొకచోటు లేదు<br> <br> <b> (ఆటవెలది) </b><br> <br> తన్ను నెవ్వ రైనఁ దలపోయఁ బాఱెడు<br> నోజ లేదు భీతి యొక టెఱుంగఁ<br> డెలమి నూరకుండఁ డెక్కసక్కెముల నాడుఁ<br> బట్టి శాస్తి జేయు భంగి యెట్లు?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆ కృష్ణయ్య అమ్మను అతలాకుతలం చేసివేస్తున్నాడు. అలా చేస్తున్నకొద్దీ ఆమె హృదయం ఆనందధామమే అవుతున్నది. కానీ పైకి మాత్రం ఆ అల్లరికి అడ్డుకట్టవేయాలని ఆరాటం గానూ ఉన్నది. ఒకనాడు ఉట్టిమీద గట్టిగా పెట్టిన వెన్నను ఒక కోతికి అందిస్తూ దొరకిపోయాడు. ఒక బెత్తం పుచ్చుకొని కన్నయ్య వెంటబడింది యశోద. మనస్సులో ఇలా అనుకొంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> వీనిని పసివాడని అనుకొందామా అంటే యిటువంటి చేష్టలు పెద్దవాళ్ళు కూడా చేయలేరు. వినయాన్ని నేర్పటానికి కొంచెం భయపెడదామా అంటే లేక లేక కలిగిన బాలుడైనాడు. ఎప్పుడైనా ఏదైనా ఉపాయంతో నాలుగు మంచిమాటలతో బుద్ధి చెబుదామా అంటే నేను చెప్పబోయేవేళకు ఏ అల్లరీ ఆగమూ లేకుండా బుద్ధిమంతుడై కూర్చుంటాడు. మరొకదానిని పట్టించుకోకుండా ఇంట్లోనే కూర్చుంటాడా అంటే చూడని చోటు ఒక్కటికూడా ఉండదు. ఎవ్వరైనా తననుగూర్చి భావిస్తే పరుగెత్తుకొని పోతూ ఉంటాడు. ఒక పద్ధతి లేదు. భయమన్నమాట లేదు. పోనీ మాటాడకుండా ఊరకుందామా అంటే వేళాకోళాలు వెక్కిరింతలతో ఉడికిస్తూ ఉంటాడు. ఇట్టి పిల్లవానిని పట్టి శాస్తి చేసే విధం ఏమిటో తెలియటం లేదు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> బాలుడు = పిల్లవాడు; ఈతండు = ఇతను; అని = అని; భావింతునందునా = అనుకొందామంటే; ఏ పెద్దలును = ఎలాంటి పెద్దవారుకూడ; ఈ క్రమంబున్ = ఈ విధముగా; నేరరు = చేయలేరు; వెఱపున్ = భయము; ఎఱుంగుటకు నై = తెలియ చెప్పుటకు; వెఱపింతును = భయపెట్టెదను; అందునా = అనుకొందామంటే; కలిగిలేక = లేకలేక; ఒక్కడు = ఇతడొక్కడే; కాని = తప్పించి; లేడు = మరొకడులేడు; వెఱపుతో = భయపెట్టటంతో; నా బుద్ధి = మంచిబుద్ధిని; వినిపింతున్ = చెప్పెదను; అందునా = అనుకొందామంటే; తనున్ = తనంతట; తానయై = తానే; బుద్ధిన్ = మంచిబుద్ధిని; తప్పకుండున్ = తప్పక ఉండును; ఒండున్ = ఇతరవిషయములేవీ; ఎఱుంగక = తెలిసి కొనకుండ; ఇంటన్ = ఇంట్లోనే; ఉండెడిన్ = ఉండును; అందునా = అనుకొందామంటే; చొచ్చి = దూరి; చూడనిది = చూడనట్టిది; ఒక = ఒక్కటైనా; చోటు = స్థలము; లేదు = లేదు; <br><br>తన్నున్ = అతనిని; ఎవ్వరైనన్ = ఎవరైనాసరే; తలపోయెన్ = తలచుకొనినచో; పాఱెడి = పరిగెట్టిపోయెడి; ఓజ = విధము; లేదు = లేదు; భీతి = భయము; ఒక టెఱుంగడు = అసలులేదు; ఎలమిన్ = చక్కగా; ఊరకుండడు = ఊరుకోడు; ఎక సక్కెములు = వంకరమాటలు; ఆడున్ = పలుకును; పట్టి = పట్టుకొని; శాస్తి = తగిన శిక్ష; చేయన్ = చేయవలసిన; భంగి = విధము; ఎట్లు = ఏమిటి. </div> </div> </div> <!--10-363 నీ పద్యావళు లాలకించు... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-363 నీ పద్యావళు లాలకించు... (శార్దూలం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/15.Nee_Padyavalulalakinchu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్<br> నీ పేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్<br> నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్<br> నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బాలకృష్ణుణ్ణి అమ్మ రోటికి కట్టిపడవెయ్యగా దానితోపాటు పాకుకుంటూ రెండు మద్దిచెట్ల మధ్యనుండి పోగా అవి రెండూ ఫెళ ఫెళ నాదాలతో కూలిపోయాయి. వాని నుండి ఇద్దరు గంధర్వులు నలకూబర మణిగ్రీవులై బాలునకు మోకరిల్లి నిలిచి స్తుతి చేశారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పద్మపత్రనేత్రా! పరంధామా! నీ పద్యాల వరుసలను ఆలకించే చెవులనూ, నిన్ను కొనియాడగలిగే వాక్కులనూ, నీ పేరుతో పనిచేసే చేతులజంటనూ, నీ మూర్తిపై ప్రసరించే చూపులనూ, నీ పాదాల చెంత మ్రొక్కే శిరస్సునూ, నీ సేవ చేసుకొనే చిత్తాలనూ, నీమీది బుద్ధులనూ మాకు దయతో ప్రసాదించు స్వామీ! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నీరేజపత్రేక్షణా = శ్రీకృష్ణా!; నీ = నీ యొక్క; పద్య = పద్యముల; ఆవళుల్ = సమూహములను; ఆలకించు = వినెడి; చెవులన్ = చెవులను; నిన్నున్ = నిన్ను; ఆడు = స్తుతించెడి; వాక్యంబులన్ = మాటలను; నీ పేరన్ = నీ సమర్పణగా; పనిచేయు = పనిచేసెడి; హస్త = చేతుల; యుగముల్ = జంటలు; నీ మూర్తిపై = నీ స్వరూపముమీది; చూపులను = దృష్టిని; నీ = నీ; పాదంబుల = పాదముల; పొంతన్ = దగ్గర; మ్రొక్కు = వాలి నమస్కరించెడి; శిరముల్ = తలలు; నీ = నీ; సేవపై = సేవచేయుటయందే; చిత్తముల్ = లగ్నమైన మనసులు; నీ పై = నీ మీది; బుద్ధులు = బుద్ధులు; మాకున్ = మాకు; కరుణన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము </div> </div> </div> <!--10-601 రా పూర్ణచంద్రిక... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-601 రా పూర్ణచంద్రిక... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/17.Raa_Purnachandrika.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథరాజతనయ!<br> రా సుధాజలరాశి! రా మేఘబాలిక! రమ్ము చింతామణి! రమ్ము సురభి!<br> రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి!<br> రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి!<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> యనుచు మఱియుఁ మఱియుఁ నాఖ్యలు గల గోవు<br> లడవిలోన దూర మందు మేయ<br> ఘన గభీర భాషఁ గడు నొప్పఁ జీరు నా<br> భీరజనులు బొగడఁ బెంపు నెగడ.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> సర్వభూపాలకుడైన పరమాత్మ ఇప్పుడు గోపాలకుడైనాడు. అన్నతో పాటు పసితనం దాటుకుని బాల్యం లోనికి అడుగుపెట్టాడు. ఆటపాటలన్నీ ఆవులతో, గోపాలకులతోనే! అరణ్యప్రదేశాలలో ఆ గోవులను, గోపాలకులను అలరిస్తూ తిరగడమే ఆ అయ్యగారి పని. తాను కాచుకునే ఆవులకు అందమైన పేర్లు పెట్టుకున్నాడు. వీనిని ప్రియమారా పిలుస్తూ ఉంటాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పూర్ణచంద్రికా! గౌతమీగంగా! భాగీరథీ! అమృత సాగరమా! రండమ్మా! మేఘబాలికా! చింతామణీ! సురభీ! మనోహారిణీ! సర్వమంగళా! భారతీదేవీ! భూదేవీ! శ్రీమహాలక్ష్మీ! రండమ్మా రండి! మందమారుతీ! మందాకినీ! శుభాంగీ! గబగబా గంతులు వేసికుంటూ పరుగెత్తి రండి! అంటూ ఇంకా ఎన్నో పేర్లు గల ఆవులు అడవిలో దూరంగా మేస్తూ ఉండగా మేఘగర్జన వంటి కంఠనాదంతో పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులకు ముచ్చటపడి గోపాలకులందరూ మెచ్చుకుంటూ ఉంటారు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రా = రమ్ము; పూర్ణచంద్రిక = పూర్ణచంద్రిక; రా = రమ్ము; గౌతమీగంగ = గౌతమీగంగ; రమ్ము = రమ్ము; భగీరథరాజతనయ = భగీరథరాజతనయ; రా = రమ్ము; సుధాజలరాశి = సుధాజలరాశి; రా = రమ్ము; మేఘమాలిక = మేఘమాలిక; రమ్ము = రమ్ము; చింతామణి = చింతామణి; రమ్ము = రమ్ము; సురభి = సురభి; రా = రమ్ము; మనోహారిణి = మనోహారిణి; రా = రమ్ము; సర్వమంగళ = సర్వమంగళ; రా = రమ్ము; భారతీదేవి = భారతీదేవి; రా = రమ్ము; ధరిత్రి = ధరిత్రి; రా = రమ్ము; శ్రీమహాలక్ష్మి = శ్రీ మహాలక్ష్మి; రా = రమ్ము; మందమారుతి = మందమారుతి; రమ్ము = రమ్ము; మందాకిని = మందాకిని; రా = రమ్ము; శుభాంగి = శుభాంగి; అనుచున్ = అని; మఱియును = ఇంకను; ఆఖ్యలుగల = పేర్లు ఉన్న; గోవులు = పశువులు; అడవిలోన = అడవియందు; దూరమందు = దూరంగా; మేయ = గడ్డితినుచున్న; ఘన = గొప్ప; గభీర = గంభీర మైన; భాషన్ = గొంతుతో; ఆభీరజనులు = యాదవులు పొగడన్ = కీర్తించుచుండగా; పెంపున్ = గొప్పదనముతో; నెగడన్ = అతిశయించగా; కడునొప్ప = మిక్కిలి; చక్కగా; చీరున్ = పిలచును. </div> </div> </div> <!--10-1268 నీ పాదకమల సేవయు... (కందము).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1268 నీ పాదకమల సేవయు... (కందము).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/18.Nee_Padakamala_Sevayu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నీ పాదకమల సేవయు<br> నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం<br> తాపార భూతదయయును<br> దాపసమందార! నాకు దయ సేయఁ గదే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కంసుడు రామకృష్ణులను తన నగరానికి పిలిపించాడు. వారు జంకుగొంకులు లేకుండా మధురానగరంలో విహరిస్తున్నారు. రాచబాటలో వారికి సుదాముడనే మాలా కారుడు కనిపించాడు. మాలికలతో స్వామిని సత్కరించాడు. కృష్ణునికి అతనిపై పరమానుగ్రహం కలిగింది. అతని యింటికి వెళ్ళాడు. కోరిన వరం ఇస్తాను అన్నాడు. అప్పుడు సుదాముడు ఇలా అన్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! నందనందనా! యశోద కుమారా! నాకు నిరంతరము నీ పాదపద్మాల సేవ కావాలి. నిన్ను భక్తితో అర్చించే పుణ్యాత్ములతో చెలిమి కావాలి. తాపసమందారా! ఎడతెగని, అంతులేని భూతదయ కావాలి. నా స్వామీ! నాయీ మూడు కోరికలనూ అనుగ్రహించు తండ్రీ. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> నీ పాద = నీ పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ పాద = నీ పాదములను; అర్చకులతోడి = అర్చించే భక్తులతోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయకలిగి యుండుటను; తాపసమందార = కృష్ణ {తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నాకున్ = నాకు; దయచేయగదే = అనుగ్రహింపుము. </div> </div> </div> <!--10-1679 ఖగనాథుం డమరేంద్రు గెల్చి... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1679 ఖగనాథుం డమరేంద్రు గెల్చి... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/19.Khaganadhumdamarendru_Gelchi.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్<br> జగతీనాథులఁ జైద్యపక్ష చరులన్ సాళ్వాదులం గెల్చి భ<br> ద్రగుఁ డై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా<br> భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బలరామ శ్రీకృష్ణులు పెండ్లి యీడునకు వచ్చారు. బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు రైవతుడు తన బిడ్డ రేవతిని బలరామునకు ధర్మపత్నిగా ఇచ్చాడు అని చెబుతూ శుకయోగీంద్రులు రుక్మిణి కల్యాణ ప్రస్తావనగా ఇలా చెబుతున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పరీక్షిన్మహారాజా! వెనుకటికి పక్షిరాజు గరుత్మంతుడు దేవేంద్రుణ్ణి గెలిచి అమృత భాండాన్ని తెచ్చిన విధంగా సుదర్శనమనే చక్రం ధరించిన శ్రీకృష్ణస్వామి శిశుపాలునిపక్షం వారైన సాళ్వుడు మొదలైన వారినందరినీ గెలిచి భద్రంగా రుక్మిణీదేవిని వరించాడు. ఆమె విదర్భరాజైన భీష్మకుడు కన్నబిడ్డ. పద్మాల సుగంధం ఆమెను అంటిపెట్టుకొని ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో భూమిలో అవతరించిన జగన్మాత. ఆమె మహోదాత్త గుణాలే ఆమెకు మణిభూషణాలు. ఆమె బాలికలలో మణి </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజు లను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షము నందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వాదులన్ = సాళ్వుడు మొదలగు వారిని; గెల్చి = జయించి; భద్రగుడై = శుభమునుపొందువాడై; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; భీష్మకసుతన్ = భీష్మకుని కుమార్తెను; రాజీవగంధిన్ = పద్మములవంటి సువాసన కలాది, రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి - షడ్గుణములచే (1. మహత్వ 2. ధైర్య 3. కీర్తి 4. శ్రీ 5ఙ్ఞాన 6. వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశభవన్ = అంశతో పుట్టినది; మహాగుణమణిన్ = గొప్ప సుగుణములనెడి రత్నములు కలది, {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; బాలామణిన్ = కన్యకలందు శ్రేష్ఠురాలైన; రుక్మిణిన్ = రుక్మిణిని; వరించెన్ = వివాహమాడెను. </div> </div> </div> <!--10-1701 ఏ నీ గుణములు... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1701 ఏ నీ గుణములు... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/20.Ye_Nee_Gunamulu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక; దేహతాపంబులు దీఱిపోవు<br> నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; కఖిలార్థలాభంబు గలుగుచుండు<br> నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన; భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు<br> నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; దడవిన బంధసంతతులు వాయు<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> నట్టి నీ యందు నా చిత్త మనవరతము<br> నచ్చి యున్నది నీ యాన నాన లేదు,<br> కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!<br> శ్రీయుతాకార! మానినీచిత్తచోర!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణీదేవి త్రికరణాలలో శ్రీకృష్ణస్వామినే నింపుకొన్నది. కానీ అన్న రుక్మి తనను శిశుపాలునికి ఇస్తానంటున్నాడు. తల్లిదండ్రులు ఎటూ చెప్పలేక కర్తవ్యం తోచక తల్లడిల్లి పోతున్నారు. ఈ స్థితిలో తనను సర్వవిధాలా ఉద్ధరింపగలవాడు వాసుదేవుడే అని నిర్ణయించుకుని ఒక ఉత్తమ విప్రుని ద్వారా తన సందేశం పురుషోత్తమునకు పంపింది. ఆ మహాత్ముడు అది శ్రీకృష్ణునకు వినిపిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> క్రూరాత్ముడైన కంసుని కడతేర్చిన ఓ స్వామీ! పరమనీచులను చీల్చి చెండాడే జగదేకవీరా! శ్రీయుతాకారా! చెలువల చిత్తాన్ని అపహరించే సుందరసుందరా! శ్రీకృష్ణా! నీ గుణాలు చెవులను తాకినంతనే దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ మంగళాకారాన్ని చూచినంతనే కన్నులకు చూడవలసిన లాభాలాన్నీ సిద్ధిస్తాయి. నీ పాదాలకు ఎప్పుడు సేవలు చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి భువనాలన్నింటినీ దాటుకొనిపోయే పరమసిద్ధి కలుగుతుంది. నీ శుభనామాన్ని భక్తితో పాడుకుంటే సంసారబంధాలన్నీ తెగిపోతాయి. అటు వంటి నీయందు నాచిత్తం నిరంతరంగా ఇష్టపడి ఉన్నది. దీనికి నీ ఆజ్ఞ పొందలేదు. నన్ను కరుణతో చూడు మహాత్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కంసారి = శ్రీకృష్ణా! { కంసుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా! {దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా! {సౌందర్యసంపదలతో కూడి యున్నవాడు, కృష్ణుడు}; మానినీచిత్తచోర = శ్రీకృష్ణా {మానినీచిత్తచోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}. ఏ = ఎట్టి; నీ గుణములున్ = నీ గొప్పగుణములు {భగవంతుని గుణములు – 1. సర్వజ్ఞత్వము 2. సర్వేశ్వరత్వము 3. సర్వభోక్తృత్వము 4. సర్వనియంతృత్వము 5. సర్వాంతర్యామిత్వము 6. సర్వసృష్టత్వము 7. సర్వపాలకత్వము 8. సర్వసంహారకత్వము మొద లగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము – 1. ఆధ్యాత్మికము 2. ఆధి దైవికము 3. ఆధిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; ఏ = ఎట్టి; నీ శుభాకారమున్ = నీ శోభనకరమైన స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నులకున్ = కళ్ళకు; అఖిలలార్థ = సమస్తమైన ప్రయోజనములు; లాభంబు = లభిం చుట; కలుగుచుండున్ = కలుగుతాయో ఏ = ఎట్టి; నీ చరణ = నీ పాదములను; సేవన్ = సేవించుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకమునందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; ఏ = ఎట్టి; నీ లసత్ = నీ మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి తోన్ = భక్తితో; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసారబంధముల {సంసారబంధములు - అష్టబంధములు, 1. దయ 2. జుగుప్స 3. మోహము 4. భయము 6. సంశయము 7. కులము 8. శీలము}; సంతతులు = సమూహములన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి; నీ యందున్ = నీ ఎడల; నా చిత్తము = నా మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు; </div> </div> </div> <!--10-1703 శ్రీయుతమూర్తి... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1703 శ్రీయుతమూర్తి... (ఉత్పలమాల).</div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/21.Sreeyuthamurthy_O_Purushasimhama.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో<br> మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ<br> ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ<br> డా యధమాధముం డెఱుంగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణీదేవి సందేశంలో ఉన్న మరొక విషయాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు పురుషోత్తమునకు ఇలా విన్నవిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> శ్రీయుతమూర్తీ! నీవు పురుషులలో సర్వశ్రేష్ఠుడవు. అందువలననే పురుష సింహము అని నిన్ను నేను పిలుచుకుంటున్నాను. సింహపుపాలి సొమ్మును గుంటనక్క కోరినట్లుగా నీపాద పద్మాలను మాత్రమే ధ్యానం చేసే నన్ను కండకావరంతో కన్నులు కానని శిశుపాలుడు, వడివడిగా కొనిపోవాలని ఇక్కడ ఉన్నాడు. అధములందరిలో మరింత అధముడైన ఆ నీచుడు అద్భుతమైన నీ ప్రతాపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> శ్రీయుతమూర్తి = లక్ష్మీదేవితో కూడియున్న స్వరూపుడా!; ఓ పురుషసింహమ పురుషులలో శ్రేష్ఠుడా!; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కలిగర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ పదాంబుజ = నీ పాదములనెడి పద్మములందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును; ఎఱుగడు = ఎరుగడు. </div> </div> </div> <!--10-1708 అంకిలి సెప్పలేదు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1708 అంకిలి సెప్పలేదు... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/22.Ankili_Seppaledu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> అంకిలి సెప్పలేదు; చతురంగ బలంబులతోడ నెల్లి యో!<br> పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా<br> వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే<br> యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణి, శ్రీకృష్ణుడు తనను ప్రమాదాలనుండి ఎలా దాటించాలో, ప్రమోదంతో ఎలా ఉద్ధరించాలో స్వామికి బ్రాహ్మణోత్తముని ద్వారా ఇలా తెలియజేసుకుంటున్నది </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> స్వామీ! కృష్ణా! పంకజనాభా! పురుషోత్తమా! నా గుండెలోని అలజడి ఇట్టిది అట్టిది అని నేను చెప్పగలిగింది కాదు. కాబట్టి అడ్డుచెప్పకు. రేపే రథాలూ, గజాలూ, గుఱ్ఱాలూ, కాల్బంటులూ గల గొప్ప సేనావాహినితో బయలుదేరు. మొట్టమొదటగా శిశుపాలుణ్ణీ, వానికి అండగా నిలిచిన జరాసంధుణ్ణీ జయించు. తరువాత నా దగ్గరకు వచ్చి, నీ పరాక్రమమే కన్యకు ఇచ్చే సొమ్ముగా చేసి రాక్షస వివాహ పద్ధతిలో నన్ను చెట్ట బట్టి తీసుకొనిపో. నేను వస్తాను </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కృష్ణ = కృష్ణ; పురుషోత్తమ = పురుషులలో శ్రేష్ఠుడా; అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగసైన్యము {చతురంగబలము – 1. రథములు 2. ఏనుగులు 3. గుర్రములు 4. పదాతిదళము అనెడి నాలుగు అంగములు కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; ఓ = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభియందు గలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధుడులను; జయించి = గెలిచి; నా వంక = నావైపు, సహాయ పడుటకు; వచ్చి = వచ్చి; రాక్షస వివాహమునన్ = రాక్షసవివాహపద్ధతిలో; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామకిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; చేకొనిపొమ్ము = తీసుకువెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను. </div> </div> </div> <!--10-1711 ప్రాణేశ నీ మంజుభాషలు... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1711 ప్రాణేశ నీ మంజుభాషలు... (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/23.Pranesa_Nee_Manjubhashalu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?<br> పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?<br> భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?<br> దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?<br> <br> <b>(ఆటవెలది)</b><br> <br> నీరజాతనయన! నీ వనమాలికా<br> గంధ మబ్బలేని ఘ్రాణ మేల?<br> ధన్యచరిత! నీకు దాస్యంబు చేయని<br> జన్మ మేల? యెన్ని జన్మములకు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణి విప్రవరుని ద్వారా తన దృఢనిశ్చయాన్ని శ్రీకృష్ణవాసుదేవునకు తెలుపుకొంటున్నది. తన అయిదు జ్ఞానేంద్రియాలు స్వామికి సమర్పణగా చేసికొన్న విషయాన్ని మరొకవిధంగా వెల్లడిస్తున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నీవు నా ప్రాణాలకు ప్రభువువు. నీ మధురమైన మాటలు వినలేకపోతే నాకు చెవులుండటమే ప్రయోజనం లేని విషయం. పురుషోత్తమా! నీకు భోగ్యం కాని నా తనులత అందచందాలు ఎందుకయ్యా! భువనమోహనా! నిన్ను చూడలేని కన్నులు ఉండి ఏమి ఊడి ఏమి? ప్రియా! నీ అధరామృతం ఆనలేని జిహ్వకు ఎంత ఫలరసం అందినా అది వ్యర్థమే. విప్పారిన పద్మాలవంటి కన్నులున్న స్వామీ! నీవు ధరించిన వనమాలిక పరిమళాన్ని అందుకోలేని నాసికకు సార్థకత ఉంటుందా? ధన్యచరితా! నీకు దాస్యం చేయని బ్రతుకు ఎందుకు? ఎన్ని జన్మలైనా వ్యర్థమే. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ప్రాణేశ = నా ప్రాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుషరత్నమ = పురుషులలో శ్రేష్ఠుడా; నీవు = నీవు; భోగింపగా లేని = రమించలేనట్టి; తనులతవలని = దేహమనెడితీగ యందలి; సౌంద ర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువనమోహన = ఎల్లలోకములను మోహింప జేయువాడా; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబున్ = పెదవులతీయదనమును; ఆనగాలేని = ఆస్వాదించ జాలని; జిహ్వకున్ = నాలుకకు; ఫలరస = పండ్లను రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు; నీరజాతనయన = పద్మాక్షుడా, కృష్ణా; నీ = నీ యొక్క; వనమాలికా = పూలచిగుళ్ళమాలయొక్క; గంధము = సువాసన; అబ్బదేని = లభింపజాలని; ఘ్రాణము = ముక్కు; ఏలన్ = ఎందుకు; ధన్యచరిత = కృతార్థమైన నడవడి కల వాడా; నీకు = నీకు; దాస్యంబు = సేవ; చేయని = చేయజాలని; జన్మము = జీవిం చుట; ఏలన్ = ఎందుకు; ఎన్ని = ఎన్ని; జన్మములకు = జన్మలెత్తినను {జన్మలెత్తు - పునర్జన్మలు పొందుట} (వ్యర్థమే). </div> </div> </div> <!--10-1717 వచ్చెద విదర్భభూమికిఁ... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1717 వచ్చెద విదర్భభూమికిఁ... (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/24.Vacheda_Vidarbhabhoomiki.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వచ్చెద విదర్భభూమికిఁ;<br> జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్<br> దెచ్చెద బాలన్ వ్రేల్మిడి<br> వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> విప్రవరుని ద్వారా విదర్భరాజతనయ సందేశం వీనులారా విన్నాడు శ్రీ కృష్ణస్వామి. ఆ మహాత్ముని చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. ఆనందంతో తనకు ఆమె యందు గల అనురాగాన్ని ముక్తసరిగా మూడు మాటలతో చెబుతూ తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> బ్రాహ్మణప్రవరా! నేను విదర్బ దేశానికి వస్తాను. భీష్మకుని పురం ప్రవేశిస్తాను. చూడముచ్చట అయిన విలాసంతో ఆ బాలను తెచ్చుకుంటాను. పగవారు అడ్డం వస్తే వారినందరినీ క్షణకాలంలో చీల్చి చెండాడుతాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> విదర్భభూమికి = విదర్భ అనెడి దేశమునకు; వచ్చెదన్ = వస్తాను; భీష్మకుని పురము = కుండిననగరమునందు; చొచ్చెదన్ = చొరబడెదను; సురుచిర = మనోహర మైన; లీలన్ = విధముగ; తెచ్చెదన్ = తీసుకొచ్చెదను; బాలన్ = బాలికను; వ్రేల్మిడిన్ = చిటికలో; అడ్డంబున్ = అడ్డగించుటకు; రిపులు = శత్రువులు; వచ్చినన్ = వచ్చినచో; పోరన్ = యుద్ధమునందు; వ్రచ్చెదన్ = సంహరించెదను. </div> </div> </div> <!--10-1727 ఘను డా భూసురు డేగెనో... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1727 ఘను డా భూసురు డేగెనో... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/25.Ghanudaa_Bhusurudegeno.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ఘనుఁ డా భూసురు డేఁగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?<br> విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం<br> డనుకూలింపఁ దలంచునో తలపఁడో? యార్యామహాదేవియున్<br> నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణికి మదిమదిలో లేదు. ముహూర్తం దగ్గరపడుతున్నది. శిశుపాలుడు మొదలైన వారంతా వచ్చి కూర్చున్నారు. కృష్ణుడు వస్తాడో, రాడో! తనను గూర్చి ఏమనుకుంటున్నాడో అని ఆమె హృదయం అదవదలయిపోతున్నది. ఇలా అనుకుంటున్నది </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ మహాత్ముడు బ్రాహ్మణుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళాడో లేదో? మధ్యలో మార్గాయాసంతో ఎక్కడైనా చిక్కబడ్డాడేమో? నా విన్నపం విని శ్రీకృష్ణుడు తప్పుగా తలపోయలేదు కదా? ఒకవేళ ఇక్కడకు వచ్చి ఉన్నాడేమో? పరమేశ్వరుడు నా విషయంలో అనుకూలంగా ఉండాలనుకున్నాడో లేదో? అమ్మలగన్నయమ్మ ఆ ఉమాపరమేశ్వరి నన్ను రక్షించటానికి పూనుకున్నదో లేదో? ఇంతకూ నా భాగ్యం ఎలా ఉన్నదో? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఘనుడు = గొప్పవాడు; ఆ భూసురుడు = ఆ విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గశ్రాంతుడై = ప్రయాణపు బడలికతో; చిక్కెనో = చిక్కుబడి పోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పుగా = తప్పు అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య - శ్రేష్ఠురాలు, పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో. </div> </div> </div> <!--10-1730 చెప్పదు తల్లికిం... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1730 చెప్పదు తల్లికిం... (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/26.Cheppadu_Thallikindalupu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికన్<br> గప్పదు; వక్త్రతామరస గంధ సమాగత భృంగసంఘమున్<br> రొప్పదు; నిద్రఁ గైకొన; దురోజ పరస్పరసక్త హారముల్<br> విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణుని రాక సూచనలు లేక రుక్మిణి మూడు కరణాలూ ముప్పుతిప్పలు పడుతున్నాయి. అనేక ఆలోచనల అలలు హృదయంలో చెలరేగుతున్నాయి. ఎవరికి చెప్పుకొని కొంతకు కొంతైనా ఆరాటాన్ని ఆపుకోవాలో అర్థం కావటం లేదు. ఆ స్థితిలో ఆమె అవస్థ ఎలా ఉన్నదో పోతన మహాకవి ఇలా వక్కాణిస్తున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> తన ఎదలోని ఆరాటాన్ని ఎవరైనా ఆత్మీయులకు చెప్పుకొంటే కొంత శాంతత ఏర్పడుతుంది. బిడ్డకు అమ్మకంటే ఆత్మీయ ఎవరు? అటువంటి కన్నతల్లికి కూడా తన ఆరాటాన్ని చెప్పుకోలేకుండా ఉన్నది రుక్మిణి. చిరునగవు అనే వెన్నెలతో దిక్కులను కూడా క్రప్పటం లేదు. మోము తామర పరిమళానికి పరవశించి మూగుతున్న తుమ్మెదలను తోలాలనే ఊహ కూడా ఆమెకు కలుగలేదు. నిద్ర అసలే లేదు. వక్షఃస్థలం మీది హారాలన్నీ అటూఇటూ పొరలటం వలన ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. వానిని చిక్కు కూడా తీయాలనిపించటం లేదు ఆమెకు. తన మనోహరుడు కృష్ణుడు వచ్చే దారినుండి చూపుల పంక్తులను కొంచెం కూడా త్రిప్పటంలేదు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తలపుచిక్కు = మనసులోని విచారమును; తల్లికిన్ = తల్లికి; చెప్పదు = తెలుపదు; దిశల్ = దిక్కులందు; తలపు = భావన, చిక్కు = చిక్కిపోయినది; దరహాస = చిరునవ్వుల; చంద్రికల్ = వెన్నెలలను; కప్పదు = ఆవరింపజేయదు; వక్త్ర = ముఖము అనెడి; తామరస = పద్మము యొక్క; గంధ = సువాసనచే; సమాగత = చేరిన; భృంగ = తుమ్మెదల; సంఘమున్ = సమూహమును; రొప్పదు = అదిలించదు; నిద్రన్ = నిద్ర పోవుట; కైకొనదు = చేయదు; ఉరోజ = వక్షస్థలమునందు; పరస్పర = ఒకదానితో నొకటి; సక్త = చిక్కుకొన్న; హారముల్ = దండలను; విప్పదు = విడదీసుకొనదు; కృష్ణ = కృష్ణుని; మార్గ = వచ్చుదారి యందు; గత = లగ్నమైన; వీక్షణ = చూపుల; పంక్తులున్ = వరుసలను; ఎప్పుడున్ = క్షణకాలమైన; త్రిప్పదు = మరలింపదు; </div> </div> </div> <!--10-1740 తగు నీ చక్రి... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1740 తగు నీ చక్రి... (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/27.Thagu_Nee_Chakri_Vidarbharaja.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్; దథ్యంబు వైదర్భియుం<br> దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం<br> దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా; దర్పాహతారాతి యై<br> మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> రుక్మిణి తపస్సు ఫలించిందని తిరిగివచ్చిన విప్రప్రవరుడు తెలియజేశాడు. బల రామకృష్ణులకు భీష్మకుడు విడుదులేర్పాటు చేశాడు. క్షణంలో హరిరాక వార్త విదర్భ ప్రజల వీనులకు విందుచేసింది. శ్రీకృష్ణదేవుని సుందరవదనారవిందాన్ని వీక్షించి పౌరజనాలు ఇలా అనుకున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> అదిగో చక్రం చేతిలో ధరించి విలాసంగా విచ్చేస్తున్న శ్రీకృష్ణుడు, మా ఏలిక కన్నబిడ్డకు ఇతడే తగిన భర్త. అంతేకాదు. ఆ చక్రికి కూడా ఈమెయే అన్నివిధాలా యోగ్య అయిన ఇల్లాలు. ఇది ముమ్మాటికీ సత్యం. ఈ దాంపత్యం ఇంత గొప్పదై విరాజిల్లటం చాలా గొప్పసంగతి. ఈ యిద్దరినీ ఒకరికొకరిని ఏర్పాటుచేసిన బ్రహ్మ గొప్పనేర్పుకాడు. మా పుణ్యాలు మూలకారణంగా, యీ చక్రి, పొగరుబోతులైన పగవారి నందరినీ పరిమార్చి మా రాజకుమారికి మగడు అగుగాక </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> తగున్ = సరిపడును; ఈ చక్రి = ఈ కృష్ణుడు; విదర్భ = విదర్భదేశపు; రాజ సుతకున్ = రాకుమారికి; తథ్యంబు = నిజముగా; వైదర్భియున్ = రుక్మిణికూడ; ఈ చక్రికిన్ = ఈ కృష్ణునికి; తగున్ = సరిపోవును; ఇంత మంచిదగునే = చాలామంచిది అగును; దాంపత్యము = ఆలుమగలకూడిక; ఈ = ఈ; ఇద్దఱన్ = ఇద్దరిని; తగులం గట్టిన = కూర్చిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నేర్పరి = మంచి నేర్పు గలవాడు కదా; దర్పాహతా రాతియై = పరాక్రమము చేత ఓడింపబడిన శత్రువులు కలవాడై; చక్రి = కృష్ణుడు; ఈ రమణి = ఈ ఇంతికి; మా పుణ్యమూలంబునన్ = మా పుణ్యముల వలన; మగడు = భర్త; ఔగావుత = అగునుగాక. </div> </div> </div> <!--10-1744 నమ్మితి నా మనంబున.. (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1744 నమ్మితి నా మనంబున.. (ఉత్పలమాల). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/28.Nammithi_Naa_Manambuna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్<br> మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె<br> ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ సేయు మమ్మ! నిన్<br> నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కృష్ణస్వామి వచ్చిన సంగతి తెలుసుకొన్న రుక్మిణి హృదయం తేటపడింది. కులాచారం ప్రకారం గౌరీపూజ నాచరించటానికి అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముచ్చటగా రుక్మిణిచేత విప్రుల యిల్లాండ్రు పూజ చేయించారు. రుక్మిణి మనస్సులో ఇలా అనుకొంటున్నది </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> నేను నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులను నమ్ముకొన్నాను. మీరు పురాణదంపతులు, కనుక పరమేశ్వరీ! నీవు మేటి పెద్దమ్మవు. సముద్రమంత దయ నీది. నాకు శ్రీహరిని పతిగా అనుగ్రహించు తల్లీ! నిన్ను నమ్మినవారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> ఈశ్వరీ = పార్వతీదేవీ; నా మనంబునన్ = నా మనసునందు; సనాతనులైన = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ - అనత్యీత్యమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు – మహాంశ్ఛాసా వీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు}; నమ్మితిన్ = నమ్మినాను; మిమ్ము = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదమ్మ = కదా తల్లీ; మేటి = గొప్ప; పెద్దమ్మ = పెద్దతల్లీ; దయా = దయకు; అంబురాశివి = సముద్రమువంటి ఆమెవు; కదమ్మ = కదా తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; వారికి = వారలకు; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కదమ్మ = కదా తల్లీ </div> </div> </div> <!--10-1750 కనియెన్ రుక్మిణి.. (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1750 కనియెన్ రుక్మిణి.. (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/29.Kaniyen_Rukmini.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం, గంఠీరవేం ద్రావల<br> గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతర వక్షున్, మేఘసంకాశ దే<br> హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిన్, బీతాంబరున్,<br> ఘన భూషాన్వితుఁ, గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరుక్మిణీమహాదేవి స్వయంవర మండపం లోనికి ప్రవేశించింది. మెల్లగా అడుగులు వేస్తూ రాజుల సముదాయాన్ని దాటుకొంటూ ముందునకు సాగుతున్నది. తక్కిన రాజులెవ్వరూ ఆమె కంటికి ఆనటంలేదు. అల్లంతదూరాన తన ప్రాణేశ్వరుడు కన్నులలో కదలాడుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ స్వామి పూర్ణచంద్రునివంటి మోముతో అలరారుతున్నాడు. సింహం నడుము వంటి నడుముతో విరాజిల్లుతున్నాడు. అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి కన్నులతో అందాలు విరజిమ్ముతున్నాడు. దేహమంతా నీలమేఘంలాగా శ్యామలవర్ణంతో ఒప్పారు తున్నది. దేవేంద్రుని ఏనుగు ఐరావతం తొండంవంటి బాహువులు చూపులను ఆకట్టు కొంటున్నాయి. చేతబట్టిన చక్రం కాంతిచక్రాలను కమనీయంగా వెలువరిస్తున్నది. పసిమి వన్నె పట్టుబట్ట వెలుగులు అలరిస్తున్నాయి. నిలువెల్లా విలువకట్టనలవి కాని అలంకారాలు కాంతి వలయాలకు ఆకరాలవుతున్నాయి. అదిగో కమనీయశంఖం వంటి కంఠం అందరినీ ఆకర్షిస్తున్నది. రుక్మిణిని గెలుచుకోవాలి అనే ఉత్కంఠ ముఖంలో స్పష్టంగా తెలియ వస్తున్నది. జగత్తులన్నింటినీ మోహపారవశ్యంలో ముంచుతున్న నందనందన సుందరుడైన శ్రీకృష్ణుణ్ణి శ్రీ రుక్మిణి తిలకించింది </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండలముఖున్ = చంద్రబింబమువంటి ముఖ ము కలవానిని; కంఠీరవేంద్ర = సింహశ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవాని ని; నవాంభోజదళ = సరికొత్త తామరరేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారు తర = మిక్కిలి అందమైన; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘసంకాశ = మేఘము లను పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపువన్నె వస్త్రముకలవానిని; ఘనభూషాన్వితున్ = గొప్ప ఆభరణములతో కూడినవానిని; కంబుకంఠున్ = శంఖము వంటి మెడ కలవానిని; విజయ = జయించుటయందు; ఉత్కంఠున్ = ఉత్కంఠ కల వానిని; జగన్మోహనున్ = లోకములను మోహింపజేయువానిని. కనియెన్ = చూసెను; </div> </div> </div> <!--10-1784 ధ్రువకీర్తిన్ హరి.. (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-1784 ధ్రువకీర్తిన్ హరి.. (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/30.Dhruva_Keerthin_Hari_Pendliyade.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై<br> భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం<br> ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్<br> సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బ్రహ్మండానికంతటికీ బ్రహ్మానందాన్ని సంధానించే రుక్మిణీ వాసుదేవుల దివ్య కల్యాణ వైభవాన్ని భావించటం పరమపుణ్యం. తెలుగుల పుణ్యపేటి పోతనామాత్యులవారు ఆ మహా భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆయన హరి. సర్వప్రాణులనూ తనలోకి హరింపజేసుకొనే మహాత్ముడు. ఆమె రుక్మిణి. తన ఒడలంతా సువర్ణమయమే అయిన ఉత్తమ వనిత. ఆమె తన హృదయాన్ని కొల్లగొట్టింది. అభిమానము, వైభవము, గాంభీర్యమూ అనే మహాలక్షణాలతో విహరిస్తున్నది. అందరకూ, అన్నింటికీ సంపదలను సమకూర్చే సౌభాగ్యంతో విరాజిల్లుతున్నది. సజ్జనులను దగ్గరి చుట్టాలుగా భావించి సత్కరించే సౌజన్యంతో ఒప్పారే దివ్యలక్షణం కలది. పుణ్యకార్యములందు మాత్రమే ప్రవృత్తి కలిగినట్టిది. లేమి అనే దెయ్యాన్ని రూపుమాపే శీలం కలది. జాజ్వల్యమానములైన ఆభరణాలతో, అత్యద్భుతంగా వెలుగులు చిమ్ముతున్న వస్త్రాలతో అలరారుతున్నది. గుణవతులైన వనితల తలమానికమై ప్రకాశిస్తున్నది. అటువంటి ధృవమైన కీర్తి గల రుక్మిణీదేవిని ఆ శ్రీహరి పెండ్లియాడినాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> హరి = కృష్ణుడు; ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయునామెను; సు = మంచి; విభూషాంబర = ఆభరణములను; ధారిణిన్ = ధరించునామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని. పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను; </div> </div> </div> <!-- దశమ స్కంధం ఉత్తరభాగం --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>దశమ స్కంధం ఉత్తరభాగం</h3> </div> <!--10-172 లేమా దనుజుల గెలువఁగ.. (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-172 లేమా దనుజుల గెలువఁగ.. (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/31.Lema_Danjula_Geluvagalema.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> లేమా! దనుజుల గెలువఁగ<br> లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా<br> లే మాను; మాన వేనిన్<br> లే మా విల్లందికొనుము లీలం గేలన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణులవారు నరకాసురుణ్ణి సంహరించటానికి ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు. స్వామితోపాటు సత్రాజిత్తు తనయ సత్యభామ కూడా బయలుదేరింది. జగదేకజయ శీలుడు మురాసురాదులను పరిమార్చాడు. సత్యభామా జగన్నాథులకు నరకుడు ఎదురై నిలిచాడు. హఠాత్తుగా అమ్మవారు వానితో పోరాటానికి సిద్ధమైంది. అది చూచి శ్రీహరి ఇలా అంటున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> లేమా! ఈ రక్కసులను మేము గెలువలేమా! నీవెందుకు పూనుకొని విజృంభిస్తున్నావు. నా దగ్గరకు రా! లే! ఈ ప్రయత్నాన్ని మానుకో! మానుకోను అంటే ఇదిగో లేచి మా వింటిని లీలగా కేలితో అందుకో! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> లేమా = చిన్నదానా {లేమ – లేత వయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ లేమా = జయింప సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కణగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలి వేయుము; మానవేనిన్ = మానని పక్షమున; లే = లే; మా విల్లున్ = మా ధనుస్సు; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో; అందికొనుము = పుచ్చుకొనుము </div> </div> </div> <!--10-177 సౌవర్ణ కంకణ.. (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-177 సౌవర్ణ కంకణ.. (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/32.Savarnakankana_Jhanajhana.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు; శింజినీరవముతోఁ జెలిమి సేయఁ<br> దాటంక మణిగణ ధగధగ దీప్తులు; గండమండల రుచి గప్పికొనఁగ<br> ధవళతరాపాంగ ధళధళ రోచులు; బాణజాలప్రభాపటలి నడఁప<br> శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంథి; సైనిక కలకల స్వనము లుడుప<br> <br> <b></b><br> <br> వీర శృంగార భయ రౌద్ర విస్మయములు<br> గలసి భామిని యయ్యెనో కాక యనఁగ<br> నిషువుఁ దొడుగుట విడుచుట యేయు టెల్ల<br> నెఱుఁగరాకుండ నని చేసె నిందువదన.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> సత్యభామ సర్వేశ్వరుని అనుమతినీ, వింటినీ రెంటినీ అందుకొన్నది. కృష్ణదేవునకు ఆమె సంరంభం ఆనందసాంద్రస్థితిని కలిగిస్తున్నది. పగవానికి మాత్రం పరమరౌద్రంగా భాసిస్తున్నది. ఇది ఒక విచిత్రమైన రస సమ్మేళనం. అప్పటి ఆ తల్లి విజృంభణను పోతన కవీంద్రులు ఇలా అభివర్ణిస్తున్నారు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> సత్యభామ ముంజేతివలయాల ఝణఝణ నాదం అల్లెత్రాటి గంభీరనాదం తో చెలిమి చేస్తున్నది. కర్ణాభరణాలలోని మణుల ధగధగ కాంతులను చెక్కిలి కాంతులు కప్పివేస్తున్నాయి. మిక్కిలి తెల్లని కడకంటి ధళధళలాడే దీప్తులు బాణాల పంక్తుల ప్రభలను అణచివేస్తున్నాయి. దూసుకొనిపోతున్న బాణాల భూత్కారధ్వనులు పగవాని సైనికుల కల కల ధ్వనులను రూపుమాపుతున్నాయి. వీరము, శృంగారము, భయానకము, రౌద్రము, అద్భుతము అనే అయిదురసాలు ఒక్కటిగానై ఈ భామినిగా అయినాయా అన్నట్లు ఆ హరిసుందరి అలరారుతున్నది. బాణం వింటిలో ఎప్పుడు సంధించిందో, ఎప్పుడు విడిచిందో, ఎప్పుడు కొట్టిందో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా ఆ ఇందు వదన యుద్ధక్రీడతో విహరించింది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> సౌవర్ణ = బంగారు; కంకణ = చేతి కడియములు; ఝణఝణ = ఝణ ఝణ అను; నినదంబు = శబ్దము; శింజనీ = అల్లె తాటి; రవముతో = చప్పుళ్ళతో; చెలిమి = స్నేహము; సేయ = చేయగా; తాటంక = చెవి దుద్దుల; మణి = రత్నముల; గణ = సమూహము యొక్క; ధగధగ = ధగ ధగమనెడి; దీప్తులు = కాంతులు; గండమండల = చెక్కిలి ప్రదేశమునందలి; రుచుల్ = మెరుపులు; కప్పికొనగ = కప్పివేయగా; ధవళతర = మిక్కిలి తెల్లనైన అపాంగ = కడకంటి; ధళధళ = తళతళ మనెడి; రోచులు = కాంతులు; బాణజాలప్రభాపటలి = అమ్ముల సమూహముల కాంతుల సమూహమును; అడప = అణచగా; శరపాత = బాణములు పడెడి; ఘమఘమ = ఘమ ఘమ అనెడి; శబ్దంబున్ = ధ్వని; పరిపంథి = శత్రుపక్షపు; సైనిక = సేనల యొక్క; కలకల = కల కల అనెడి; స్వనమున్ = ధ్వని; ఉడుపన్ = అణచగా. వీర = వీరము; శృంగార = శృంగారము; భయ = భయానకము; రౌద్ర = రౌద్రము; విస్మయములున్ = అద్భుత రసములు; కలిసి = కలిసిపోయి; భామిని = స్త్రీ రూపముగా; అయ్యెనో = అయినదో; కాక = ఏమో; అనగన్ = అన్నట్లుగా; ఇషువున్ = బాణమును; తొడుగుట = సంధించుట; విడుచుట = వదలుట; ఏయుట = సంహరించుట; ఎల్లన్ = అంతయు; ఎఱుగ రాకుండన్ = తెలియ రాకుండగా; ఇందువదన = అందగత్తె; {ఇందువదన - చంద్రుని వంటి మోము కల స్త్రీ, సత్యభామ}; అని = యుద్ధము చేసెన్ = చేసెను. </div> </div> </div> <!--10-178 పరుఁ జూచున్.. (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-178 పరుఁ జూచున్.. (మత్తేభం). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/33.Parujuchun_Varujuchu.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా<br> విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్<br> జరగన్; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగన్ జండాస్త్ర సందోహమున్<br> సరసాలోక సమూహమున్ నెఱపుచున్, జంద్రాస్య హేలాగతిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> సత్యభామ చకచకా ఇటు తన ప్రాణనాయకుణ్ణీ, అటు నరకుణ్ణీ మార్చి మార్చి చూస్తూ ఘోరంగా పోరుతున్నది. లిప్తకూడా వ్యవధానం లేని ఆ చూపులలో, ఆ కదలికలలో రెండు విరుద్ధరసాలు వింతగా అనుభవానికి వస్తున్నాయి </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ భామ తీవ్రక్రోధంతో పగవానిని చంపివేయాలని చూస్తున్నది. వెంటనే చూపును ఇటువైపు త్రిప్పి తన పతిదేవుణ్ణి అదే చూపుతో ఆనందింపచేస్తున్నది. అటువైపు రోషం పెల్లుబుకుతున్నది. ఇటువైపు అనురాగం అంబరాన్ని అంటుకొంటున్నది. అటువైపు కనుబొమలు ముడివడుతున్నాయి. ఇటువైపు మందహాసం చిందులు త్రొక్కుతున్నది. అటు వీరరసమూ, ఇటు శృంగారరసమూ ఏకకాలంలో ఒప్పారుతున్నాయి. అటువైపు, కన్నులలో కెంపు, ఇటువైపు సొంపు తాండవిస్తున్నాయి. నిండు చందురుని చల్లని కాంతులు కదలాడుతున్న మోముతో అలరారే ఆ అంగన విలాసంగా, పగవానిమీద భయంకరమైన అస్త్రాలనూ, పతిదేవుని మీద సరసములైన చూపులనూ కుప్పలుతెప్పలుగా కురిపిస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> చంద్రాస్య = ఇందువదన; {చంద్రాస్య - చంద్రుని వంటి మోము కల సత్యభామ}; పరున్ = శత్రువును; ఒంపన్ = నొప్పింపవలెనని; చూచున్ = యత్నించును; వరున్ = పెనిమిటిని; అలరింపన్ = సంతోషపెట్టవలెనని; చూచున్ = యత్నించును; రోష = కోపము; రాగ = అనురాగము యొక్క; ఉదయ = పుట్టుకచేత; అవిరత = అవిశ్రాంత మైన; భృకుటి = బొమముడితోను; మందహాసము లతో = చిరునవ్వులతో; వీరంబున్ = వీరరసము; శృంగారమున్ = శృంగారరసము; జరగన్ = వర్తించగా; కన్నులన్ = కళ్ళయందు; కెంపు = ఎర్రదనము; సొంపు = మనోజ్ఞత; పరగన్ = వ్యాపించగా; చండ = తీక్షణమైన, చురుకైన; అస్త్ర = అస్త్రముల {అస్త్రము – మంత్రముల చేత యంత్రముల చేత ప్రయోగింప బడెడి ఆయుధములు, శస్త్రములు – సామాన్య మైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.)}; సందోహమున్ = సమూహము; సరస = రసవంతములైన; ఆలోక = చూపుల; సమూహమున్ = సమూహము; నెఱపుచున్ = ప్రసరించుచు; హేలా = విలాస మయమైన; గతిన్ = విధముగా. </div> </div> </div> <!--10-183 రాకేందుబింబ మై.. (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-183 రాకేందుబింబ మై.. (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/34.Rakendu_Bimbamai.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> రాకేందుబింబమై రవిబింబమై యొప్పు; నీరజాతేక్షణ నెమ్మొగంబు;<br> కందర్పకేతువై ఘన ధూమకేతువై; యలరుఁ బూఁబోఁణి చేలాంచలంబు;<br> భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై; మెఱయు నాకృష్ట మై మెలఁత చాప;<br> మమృత ప్రవాహమై యనల సందోహమై; తనరారు నింతి సందర్శనంబు;<br> <br> <b> (తేటగీతి) </b><br> <br> హర్ష దాయి యై మహారోష దాయి యై<br> పరఁగు ముద్దరాలి బాణవృష్టి;<br> హరికి నరికిఁ జూడ నందంద శృంగార<br> వీరరసము లోలి విస్తరిల్ల.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీహరిని చెట్టపట్టిన శృంగార రసాధిదేవత సత్యభామ ఇప్పుడు క్రొత్తగా నరకుని నరికి పోగులు పెట్టటానికి వీరరసాధిదేవత అయ్యి పోరుతున్నది. ఇటు శృంగారలక్ష్మీ, అటు వీరలక్ష్మీ అయిన ఆయమ్మను అత్యద్భుతంగా మన మనఃపటం మీద అక్షరశిల్పం చేస్తున్నారు మహాకవి పోతనామాత్యులు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> పద్మాలవంటి కన్నులతో విరాజిల్లుతున్న ఆ సత్యభామ నిండుమోము కృష్ణదేవునకు పూర్ణిమనాటి చంద్రబింబమై ఒప్పారుతున్నది. అటు నరకునకు భగభగమండే రవి బింబమై ఉడికిస్తున్నది. ఆమె చీరకొంగు కృష్ణునకు మన్మథుని పతాకయై భాసిస్తున్నది. నరకునకు అదే ఒక ప్రాణాంతకమైన తోకచుక్కగా తోస్తున్నది. చెవులదాకా లాగిన అల్లె త్రాటితో అలరారు ఆమె చేతిలోని విల్లు కృష్ణునకు మన్మథుని గుడి అయి ఆనంద మందిరం అయింది. అదే నరకునకు ప్రళయకాలంనాటి భాస్కరునికి ఏర్పడిన మండలంగా కన్పట్టింది. ఆ వనితను తేరిపారజూడటం హరికి అమృతప్రవాహం అయింది. నరకునకు అగ్నికుంపటిలా అయిపోయింది. ఆ ముద్దరాలి బాణాల జడివాన హరికి హర్షాన్నీ, అరికి మహారోషాన్ని అందజేస్తున్నది. ఇలా శృంగారవీరరసాలు వింతగా ఒక క్రమంలో విస్తరిల్లుతున్నాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> రాకేందు = పున్నమి చంద్రుని; బింబమై = బింబమై; రవిబింబమై = సూర్య బింబమై; ఒప్పు = చక్కగా ఉన్నది; నీరజాతేక్షణ = కమలము వంటి కన్నులి కల సత్యభామ నె మ్మొగంబు = అందమైన ముఖము; కందర్ప = మన్మథుని; కేతువై = కేతనమై; ఘన = గొప్ప; ధూమకేతువై = తోకచుక్కగా(అరిష్ట సూచకం); అలరున్ = ఒప్పును; పూబోణి = సుకుమారి {పూబోడి - పూవు వంటి సుకుమారి}; చేలాంచలంబు = చీర కొంగుగా, భావజు = మన్మథుని; పరిధియై = మండలమై, ప్రళయార్కు = ప్రళయ కాలపు = సూర్యుని; పరిధియై = మండలమై; మెఱయున్ = ప్రకాశించును; మెలత = వనిత, సత్యభామ; చాపము = విల్లు; ఆకృష్టమై = లాగబడినదై; అమృత = అమృతపు; ప్రవాహమై = వెల్లువై; అనల = అగ్నుల; సందోహమై = సమూహమై; తనరారున్ = ఒప్పును; ఇంతి = యువతి; సందర్శనంబు = దర్శనము; హర్షదాయియై = సంతోష మును ఇచ్చునదై; మహా = మిక్కిలి; రోషదాయియై = కోపమును చూపునదై; పరగున్ = ప్రసిద్ధమగును; ముద్దరాలి = అందగత్తె యొక్క; బాణవృష్టి = బాణముల వానగా; హరికి = కృష్ణునికి; అరికి = శత్రువునకు; చూడన్ = చూడగా; అందంద = అక్కడి కక్కడే; శృంగార = శృంగార రసము; వీర రసములు = వీర రసములు; ఓలిన్ = క్రమముగా; విస్తరిల్లన్ = వ్యాపిస్తున్నాయి </div> </div> </div> <!--10-187 కొమ్మా దానవనాథుని.. (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-187 కొమ్మా దానవనాథుని.. (కందము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/35.Komma_Danavanadhuni.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> కొమ్మా! దానవ నాథుని<br> కొమ్మాహవమునకుఁ దొలఁగె; గురువిజయముఁ గై<br> కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ<br> గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> సత్యభామ సరభసంగా సాహసంతో పోరాడి రక్కసి మూకలను దిమ్మతిరిగేట్టు కొట్టింది. వారందరూ తోక ముడిచారు. అది చూచి హరి ఆ హరిణలోచనతో సరసంగా ఇలా పలికాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> భామా! దానవుల నాథుడు అనాథుడయ్యాడు. ఆతని పరివారమంతా నీ ధాటికి నిలువలేక పలాయనం చిత్తగించారు. నీకు చాలా గొప్పవిజయం సిద్ధించింది. గ్రహించు. అంతే కాదు నేను కూడా మెచ్చాను. కోరిన అలంకారాలన్నింటినీ నీకు కానుకగా ఇస్తాను. తీసుకో. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> కొమ్మా = చిన్నదానా; దానవనాథుని = నరకాసురుని {దానవ నాథుడు - రాక్షస రాజు, నరకుడు}; కొమ్ము = పక్షము; ఆహవమునకున్ = యుద్ధక్షేత్రము నుండి; తొలగె = పారిపోయెను; గురు = గొప్ప; విజయమున్ = గెలుపును; కైకొమ్మా = చేపట్టుము; మెచ్చితిన్ = మెచ్చుకొంటిని; కొమ్మా = తీసుకొనుము; ఆభరణములున్ = భూషణ ములు; నీవు = నీవు; కోరినవి = కోరుకొన్నవి; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చెదన్ = ఇస్తాను. </div> </div> </div> <!--10-212 వనజాక్షి నేఁగన్క.. (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"><div class="padyamhead card-img-top">10-212 వనజాక్షి నేఁగన్క.. (సీసము). </div></div> <div class="col-sm-3"><div class="padyamsubhead">iBAA పద్య గానం</div></div> <div class="col-sm-3"> <audio controls preload="none"> <source src="songs/10/36.Vanajakshi_Nekanaka_Vyjayanthikanyna.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead">iBAP పద్యము</div> <div class="padyam"> వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన; గదిసి వ్రేలుదు గదా కంఠమందు;<br> బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన; మెఱసి యుండుదు గదా మేనునిండఁ;<br> గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన; నొప్పు చూపుదుఁ గదా యురమునందు;<br> బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన; మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;<br> <br> <b></b><br> <br> పద్మగంధి! నేను బర్హ దామమ నైనఁ<br> చిత్రరుచుల నుందు శిరమునందు<br> ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు<br> గములు గట్టి గరుడగమనుఁ జూచి.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణవాసుదేవుడు నరకాసురుని సంహరించి అతని పురం ప్రవేశించి అక్కడ అతడు ఎక్కడెక్కడినుంచి తెచ్చియో బంధించి ఉంచిన పదనారువేల రాచకన్నియలను చెరనుంచి విడిపించాడు. వారందరూ శ్రీకృష్ణునిపై మోహం పెంచుకున్నారు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> ఆ నరకుని చెరనుండి విడుదలపొందిన పదునారువేల కన్నియలు నల్లనయ్య అందచందాలను చూచి పరవశించిపోయారు. ఇలా అనుకుంటున్నారు. వనజాక్షీ! నేనే వైజయంతీమాలనైతే ఆ స్వామి కంఠసీమలో మాలనై వ్రేలాడేదానను కదా! బింబోష్ఠీ! నేను పట్టుపుట్టాన్నైతే ఆ స్వామి మేనంతా ఆవరించి మెరసిపోయేదానను కదా! ఓ కన్నెపిల్లా! నేనే కనుక కౌస్తుభమణినై ఉంటే ఆ స్వామి ఉరఃస్థలంపై ఒప్పారి ఉండేదానను కదా! బాలికా! నేను పాంచజన్యాన్నయి ఉంటే ఆ దేవదేవుని మోవిని ఆస్వాదిస్తూ పారవశ్యం పొందేదానను కదా! పద్మగంధీ! నేను నెమలిపింఛమునై ఉంటే ఆ మహాత్ముని శిరస్సు మీద చిత్రకాంతులతో చెన్నారి ఉండే దానను. – అని పెక్కువిధాలుగా గుంపులు గుంపులుగా కూడుకొని గరుడగమనుని చూచి ఆడుకున్నారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead">iBAPP ప్రతిపదార్ధము</div> <div class="pratipadardham"> వనజాక్షి = పద్మాక్షీ {వన జాక్షి - వనజము (పద్మము) వంటి కన్నులు కలది} ; నేన్ = నేను; కన్కన్ = కనుక; వైజయంతికనైన = వైజయంతికమాలను అయినచో; కంఠ మందు = మెడలో; కదిసి = చేరి; వ్రేలుదున్ కదా = వ్రేలాడుచుందును కదా; బింబోష్ఠి = పడతి {బింబోష్ఠి - దొండపండు వంటి పెదవి కలది}; నేన్ = నేను; కన్కన్ = కనుక; పీతాంబరమనైన = పచ్చని పట్టువస్త్రమును అయినచో; మేనునిండ = దేహమంతటా; మెఱసి = ప్రకాశించి; ఉండుదుకదా = ఉండేదాన్ని కదా; కన్నియ = కన్య; నేన్ = నేను; కన్కన్ = కనుక; కౌస్తుభమణినైన = కౌస్తుభమణిని అయినచో {కౌస్తుభమణి - విష్ణుమూర్తి వక్ష స్థలమున ఉండెడి మణి}; ఉరమునందు = వక్షస్థలము మీద; ఒప్పు = మనోజ్ఞతను; చూపుదున్ = కనబరచే దానిని; కదా = కదా; బాలిక = చిన్నదాన; నేన్ = నేను; కన్కన్ = కనుక; పాంచజన్యమునైన = పాంచజన్యమను శంఖమును అయినచో; మోవిన్ = అధరామృతమును; క్రోలి = ఆస్వాదించి, తాగి; మొనసి = అతిశయించి; చొక్కుదుగదా = పరవశించెదను కదా; పద్మగంధి = ఇంతి {పద్మగంధి - పద్మముల వంటి దేహ పరిమళము కలది}; నేనున్ = నేను; బర్హ = నెమలి పింఛముల; దామమున్ = దండను; ఐనన్ = అయినచో; శిరమునందు = తల పైన; చిత్ర = పలువన్నెల; రుచులన్ = కాంతు లతో; ఉందున్ = ఉండెదను; అనుచున్ = అని; కన్యలు = యువతులు; గములు = గుంపులు; కట్టి = కట్టి; గరుడగమనున్ = కృష్ణుని {గరుడగమనుడు – గరుడ వాహన ముపై తిరుగువాడు, కృష్ణుడు}; చూచి = చూసి; పెక్కుగతులన్ = బహు విధములుగా; ఆడిరి = చెప్పుకొనిరి; </div> </div> </div> <div> <div style="width:10%;Text-align:center;float:left;"> <div class="button-effect"> <a class="effect effect-4" href="iBam9.html" title="నవమ స్కంధం" style="background-color: #f4511e;"><i class="fas fa-arrow-left"></i> నవమ స్కంధం</a> </div> </div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam11.html" title="నవమ స్కంధం" style="background-color: #f4511e;">ఏకాదశ స్కంధం <i class="fas fa-arrow-right"></i></a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>