JezK
Edit File: iBam1.html
<!DOCTYPE html> <html lang="en"> <!-- Project :- iBhagavatam Animutyalu Version :- 3.4 File Name :- iBam1.html Date Name Comments ==== ==== ======== 10APR2021 Sarmada Multicare 1. Developed on top of previous Version. 28MAY2021 Sarmada Multicare 1. Modified code to decrease the time. 07JUL2023 Sarmada Multicare 1. Modified code to decrease the time and content appropriately. 03JULY2023 Sarmada Multicare 1. Re factored the code --> <head> <title>iBam భాగవతం ఆణిముత్యాలు</title> <meta charset="utf-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1, user-scalable=no"> <link href="../assets/css/bootstrap.min.css" rel="stylesheet"> <link href="../assets/css/fontmontsarratcss.css" rel="stylesheet"> <link href="../assets/css/fontslatocss.css" rel="stylesheet"> <link href="../assets/css/main.css" rel="stylesheet"> <link href="../assets/css/ibam.css" rel="stylesheet"> <link href="../images/favicon.png" rel="shortcut icon"> <script src="../assets/js/jquery.min.js"></script> <script src="../assets/js/bootstrap.min.js"></script> <script src="../assets/js/jquery.poptrox.min.js"></script> <script src="../assets/js/browser.min.js"></script> <script src="../assets/js/breakpoints.min.js"></script> <script src="../assets/js/util.js"></script> <script src="../assets/js/main.js"></script> </head> <body> <div class="overlay"></div> <div class="popup"> <span class="close">X</span> <h5 style="text-align: center">కొత్త పద్యాలు కోసం దయచేసి <b>"New"</b> పై క్లిక్ చేయండి.</h5> </div> <nav class="navbar navbar-expand-lg navbar-default navbar-dark fixed-top"> <a class="navbar-brand" href="../index.html">iBam</a> <button type="button" class="navbar-toggler" data-toggle="collapse" data-target="#myNavbar" aria-controls="myNavbar" aria-expanded="false" aria-label="Toggle navigation"> <span class="navbar-toggler-icon"></span> </button> <div class="collapse navbar-collapse justify-content-end" id="myNavbar"> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills"> <li class="nav-item"> <a class="nav-link" title="ప్రథమ స్కంధం " href="iBam1.html">1 <span class="sr-only">(current)</span></a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="ద్వితీయ స్కంధం " href="iBam2.html">2</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="తృతీయ స్కంధం " href="iBam3.html">3</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="చతుర్ధ స్కంధం " href="iBam4.html">4</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="పంచమ స్కంధం " href="iBam5.html">5</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="షష్ఠ స్కంధం " href="iBam6.html">6</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="సప్తమ స్కంధం " href="iBam7.html">7</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="అష్టమ స్కంధం " href="iBam8.html">8</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="నవమ స్కంధం " href="iBam9.html">9</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="దశమ స్కంధం" href="iBam10.html">10</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="ఏకాదశ స్కంధం" href="iBam11.html">11</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="ద్వాదశ స్కంధం" href="iBam12.html">12</a> </li> <li class="nav-item"> <a class="nav-link" title="కొత్త పద్యాలు" href="new.html#skandham01">New</a> </li> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills"> <!-- <li class="nav-item"><a class="nav-link fas fa-download" href="documents/IBam.pdf" target="_blank"><b>Download IBam PDF</b></a></li> --> </ul> <ul class="navbar-nav mr-auto mt-2 mt-lg-0 nav-pills"> <li class="nav-item"> <a class="nav-link fab fa-twitter" aria-label="Twitter" title="ట్విట్టర్" href="https://twitter.com/BhagavatamAnimu?s=20" target="_blank" style="font-size: large;"></a> </li> <li class="nav-item"> <a class="nav-link fab fa-youtube" aria-label="Youtube" title="యూట్యూబ్" href="https://youtube.com/playlist?list=PLbxmm_6FFhkHjCuJYQv05p0ASX7svEysn" target="_blank" style="font-size: large;"></a> </li> <li class="nav-item"> <a class="nav-link fab fa-facebook" aria-label="facebook" title="ఫేస్బుక్" href="https://www.facebook.com/Bhagavatam-Animutyalu-790640617663057" target="_blank" style="font-size: large;"></a> </li> </ul> </div> </nav> <div class="container-fluid"> <div id="chap1"> <h3 class="title">ప్రథమ స్కంధం</h3> <div class="row"> <div class="col-sm-3 chap1"></div> <div class="col-sm-9"> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>ప్రార్థన</h3> </div> <!-- 1- 1 శ్రీకైవల్యపదంబు... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead card-img-top"> 1- 1 శ్రీకైవల్యపదంబు...(శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/01.Sree_Kyvalya.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర<br> క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో<br> ద్రేకస్తంభకు కేళిలోలవిలసనద్దృగ్జాలసంభూతనా<br> నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్భాగవత అమృతాన్ని తెలుగుజాతికి అందించటానికి పూనుకొని ముందుగా నందాంగనా డింభకుడైన శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు. మనలను కూడా నిలుపుకోమంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="tatparyam"> మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద. ఆ ఇద్దరినీ అనుగ్రహించటానికి వారి ముద్దుబిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య. ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్యపదం 'శ్రీ' తో కూడినది. 'శ్రీ' అంటే లోకాలను, లోకులను - సర్వాన్నీ నడిపించే మహాశక్తి. దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం. దానికోసం శ్రీకృష్ణవాసుదేవుని నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాను.ఆ పసిబిడ్డ లోకాలను రక్షించటం అనే ఒకేఒక్క కార్యం కలవాడు. భక్తులను కాపాడటం అనే కళలో తొందరతనం కలవాడు. రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు. ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు. అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pratipadardham"> శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుటకునై = పొందుటకై; చింతించెదన్ = ప్రార్థిస్తాను; లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించటమనే; ఏక = ముఖ్యమైన; ఆరంభకు = సంకల్పం కలవానికి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = నేర్పునందు; సంరంభకున్ = వేగిరపాటు ఉన్నవానికి; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభకున్ = మ్రాన్పడేలా చేసేవానికి; కేళి = ఆటలలో; లోల = అందంగా; విలసత్ = ప్రకాశించే; దృక్జాల= చూపుల వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; కంజాత భవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగినవానికి; మహా = గొప్పవాడైన; నందాంగనా = నందుని భార్య (యశోద) యొక్క; డింభకున్ = కొడుకునకు; </div> </div> </div> <!-- 1- 2 వాలిన భక్తి... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 2 వాలిన భక్తి... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/02.Valina_Bhakthi_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా<br> శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్<br> బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో<br> న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తన భాగవత రచన సకల శుభపరంపరలతో సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నేను అతిశయించిన భక్తితో పరమశివునకు మ్రొక్కుతాను. ఆ శివుడు ఎవరికీ నిలువ రించటానికి సాధ్యం కాని తాండవనృత్యం ఆటగా గలవాడు. సర్వప్రాణులయందూ దయ తో అలరారేవాడు. శూలం కలవాడు. పర్వతరాజతనయ మోము అనే తామరపూవునకు కిరణాల మాలలుగల భాస్కరుడు అయినవాడు. చిన్నిచందమామను తలపై పూవుగా తాల్చినవాడు. బ్రహ్మ తలను గోటితో గిల్లి ఆ పుఱ్ఱెను విలాసంగా చేతిలో ధరించి తిరు గాడుతూ ఉండేవాడు. మన్మథుని గర్వం ఒక పెద్దపర్వతం వంటిది మన్మథుని గర్వం. దానికి అందరూ అణగి మణగి ఉండటం తప్ప మరొక దారిలేదు. అటువంటి గర్వపర్వతాన్ని అవలీలగా పెల్లగించి పారవేసినవాడు. నారదుడు మొదలైన జ్ఞానసంపన్నుల హృదయ పద్మాలలో మనోజ్ఞమైన నాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింప లేని; తాండవ = తాండవ మనే; కేళి = ఆట ఆడే వాడు; కిన్ = కి; దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరి జా = పర్వతుని పుత్రిక (పార్వతి) యొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు ఐన వాడు {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రెలు ధరించే వాడు; కిన్ = కి; మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = మునులలో; ముఖ్య = ముఖ్యుల; మనస్ = మనసు లనే; సరసీరుహ = పద్మాల యందు {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్మం); హాళి = ఆసక్తి గల వాడు; కిన్ = కి. </div> </div> </div> <!-- 1- 3 ఆతత సేవ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 3 ఆతత సేవ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/03.Aathatha_Seva_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి<br> జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని<br> ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత<br> త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నాలుగుమోముల దేవర బ్రహ్మయ్య. జ్ఞానవిజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగుమోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తన నోటి నుండి భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆ పరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధుర మంజుల వాక్కులతో బ్రహ్మను కొనియాడు తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆయన ధాత. సకలసృష్టినీ పట్టి నిలిపేవాడు. ఆ సృష్టిలో కదలాడేవీ, కదలాడనివీ అయిన రెండు విధాల భూతాలున్నాయి. వాటి తీరుతెన్నులన్నింటినీ మొత్తంగా తెలిసినవాడు. చదువులతల్లి హృదయానికి సౌఖ్యం కూర్చే జ్ఞానసంపద ఆయన సొమ్ము. వేదాల రాశులను ఇదీ అదీ అని నిర్ణయించి జనులకు తెలివితేటలను ప్రసాదించినవాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వారివారి విధులలో నడిపించే నాయకుడు. పాపాలు ఏమాత్రమూ తననంటకుండా పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నవాడు. తనయెడల వినయంతో ఉన్నవారందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. తమ తపశ్శక్తితో ఈ భూమినంతటినీ పట్టి నిలుపుతున్న తాపసులందరికీ శుభాలను ప్రదానం చేస్తూ ఉండేవాడు. అట్టి బ్రహ్మదేవునకు చాలాపెద్ద ఎత్తున పూజ చేస్తాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేస్తాను; సమస్త = సమస్త మైన; చర = చరములు (చలనము గలవి); అచర = అచరములు (చలనము లేనివి) యైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించు; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = సరస్వతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేద = వేదాలు; రాశి = అన్నిటిని; నిర్ణేత = క్రమీకరించిన వాడు; కున్ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి; నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి. </div> </div> </div> <!-- 1- 5 ఆదర మొప్ప... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 5 ఆదర మొప్ప... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/04.Aadaramoppa_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగ సం<br> పాదికి దోషభేదికి బ్రపసన్నవినోదికి విఘ్నవల్లికా<br> చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్<br> మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేల? కాబట్టి ఉత్తమ పురుషు డైన పోతనామాత్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏవిధమైన విఘ్నాలూ కలుగ కూడదని గజాననునికి మ్రొక్కులు చెల్లిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడుపనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకొన్నవారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములు అనెడి చిక్కుముడులుగల లతలను త్రెంపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్నిలోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు. కుడుములను ఆప్యాయంగా ఆరగించేవాడు. పొగరెక్కిన ఎలుక వాహనంగా కలిగినవాడు. సర్వప్రాణికోటియందూ ప్రసన్నత కలవాడూ అయిన గణపయ్యకు మ్రొక్కుతాను </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేస్తాను; సమస్త = సమస్త మైన; చర = చరములు (చలనము గలవి); అచర = అచరములు (చలనము లేనివి) యైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించు; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = సరస్వతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేద = వేదాలు; రాశి = అన్నిటిని; నిర్ణేత = క్రమీకరించిన వాడు; కున్ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి; నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి. </div> </div> </div> <!-- 1- 6 క్షోణితలంబు... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 6 క్షోణితలంబు... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/05.Kshonithalambu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత<br> శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షి తామర<br> శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్<br> వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> హృదయంలో భవ్యమైన భావన కదలాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ భావన పలుకుగా రూపం దిద్దుకొని నాలుకపై నాట్యమాడాలంటే ఆయమ్మ చల్లనిచూపు జాలువారాలి. అందునా పలుకబోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సరస్వతి సదమలకృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమె దయకోసం ప్రార్థిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నా విశాలమైన ఫాలభాగం నేలకు చక్కగా తాకించి తల్లికి మ్రొక్కుతాను. నోరారా ఆ సరస్వతీమాతను పలుకులతో కొనియాడతాను. ఆమె ఇసుకతిన్నెవంటి పిరుదుల భాగంతో విశ్వాన్నంతటినీ నింపుకున్నదా అన్నట్లున్నది. కదలాడుతున్న తుమ్మెదల బారులుగా కన్పిస్తున్న అందమైన కేశసౌభాగ్యంతో గగనాన్నంతటినీ ప్రకాశింప జేస్తున్నది. అందరినీ ఆనందపరచే అమరగుణాలతో అలరారే ఉత్తములను కాపాడుతూ ఉంటుంది. అన్ని లోకాలకూ చివరిదైన సత్యలోకంలో సృష్టికార్యంలో తలమున్కలుగా ఉన్న బ్రహ్మదేవుని చిత్తాన్ని వశం చేసుకొనే వాక్కులతో విరాజిల్లుతున్నది. జపమాల, చిలుక, తామరపూవూ, పుస్తకమూ నాలుగు చేతులలో చక్కగా పట్టుకొని నా యెదుట సాక్షాత్కరిస్తున్నది </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> క్షోణి = భూమి; తలంబునన్ = తలమున; నుదురు = నుదురు; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసకతిన్నె ల్లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టుగలామె; కిన్ = కు; రక్షి = కోట వలె; తామర = పద్మాల; శ్రేణి = సమూహము గ లామె; కిన్ = కి; తోయ = నీటిలో; జాత = పుట్టిన దానిలో; భవ = పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = ముఖ్యమైన; వాణి = వాక్కు గ లామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల, అక్షముల; దామ = మాల; శుక = చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి. </div> </div> </div> <!-- 1- 7 పుట్టం బుట్ట... (శార్దూలం).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 7 పుట్టం బుట్ట...(శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/06.Puttambutta_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> పుట్టంబుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్<br> మెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ<br> దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో! యమ్మ మేల్<br> పట్టున్మానకు మమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అహంకారం పతనానికి కారణం. వినయం సమున్నత శిఖరాలను ఎక్కిస్తుంది. భాగవతం తెలుగులో వ్రాయాలని సంకల్పించిన మహావ్యక్తి పోతన తనలోని అహంకారాన్ని సమూలంగా దులిపివేసుకుని, వినయాన్ని ప్రోది చేసుకుని చదువుల తల్లితో ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అమ్మా! బ్రహ్మదేవుని యిల్లాలా! సముద్రంలో జలం ఎంత ఉంటుందో నీలో దయ అంత ఉంటుంది. కనుక నా విన్నపం విఫలం కాదనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తు న్నాను. నేను పుట్టలో పుట్టినవాడను కాదు. అలా పుట్టిన వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. రెల్లుతోటలో పుట్టిన కుమారస్వామినీ కాను. ఆయన మహాసారస్వత నిర్మాత. ఓడలో పయనించి ద్వీపం చేరుకొన్న పరాశరుని దయచేత అక్కడ ఉదయించిన వ్యాసుడనూ కాను. కాళీమాతను పూజించిన కవికులగురువు కాళిదాసుడను కాను. అయినా పురాణ రచనకు పూనుకొన్నాను. ఇకమీద ఏవిధంగా నడచుకోవాలో ఆ మార్గాన్ని నీవు నాకు అనుగ్రహించు. నీవు అమ్మవు కదా! నాకు చేయూతనివ్వటం మానకు, తల్లీ. అమ్మా! నేను నిన్నే నమ్ముకొన్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> పుట్టన్ = పుట్టలో; పుట్ట లేదు = పుట్టి ఉండ లేదు (వాల్మీకిని కాదు); శరంబునన్ = రెల్లు పొదలో; మొలవ = పుట్టి ఉండ లేదు (వాల్మీకిని కాదు); అంభస్ = జల; యాన = ప్రయాణ; పాత్రంబునన్ = సాధనములో - పడవలో; నెట్టన్ = పుట్టుకను; కల్గను = పొందని వానిని కాదు (వ్యాసుని కాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించిన వాడను కాదు (కాళిదాసును కాదు); పురాణింపన్ = పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఇట్టే = అటువంటి వారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; ఓ = ఓ; అమ్మ = తల్లీ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీ దేవీ; దయ = దయనే; అంభస్ = నీటియొక్క; నిధీ = పెద్ద పోగా - సముద్రమా. </div> </div> </div> <!-- 1- 8 అమ్మలఁ గన్న యమ్మ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 8 అమ్మలఁ గన్న యమ్మ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/07.Ammalagannayamma_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె<br> ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడివుచ్చినయమ్మ, తన్ను లో<br> నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా<br> యమ్మ, కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> "దుర్గామ్ దేవీం శరణ మహం ప్రపద్యే" అనమంటున్నది వేదమాత. 'నేను దుర్గాదేవి శరణు పొందుతాను' అనుకుంటూ ఆ పని చేయాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గా దేవిని స్తుతిస్తూ, తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని తరించమంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> దుర్గాదేవి మాయమ్మ. మాయకు అమ్మ. అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి, కృపకు సముద్రం అయినది. అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల – ఆ హిమగిరి – కన్న అమ్మ. పర్వతరాజ తనయగా అవతరించి లోకాలకు కన్నతల్లి అయినది. భారతి, ఉమ, రమ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని కనుక చాలా పెద్దఅమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికిమాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయం లోపలి సన్నని వరిముల్లువంటి రంధ్రంలో నిలుపుకొని నమ్మి కొలిచే దివ్యత్వం కల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. . ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలుగల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> అమ్మలన్ = అమ్మలును (సప్తమాత్రుకలు); కన్న = క న్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = అమ్మ; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = తల్లులకి; మూలపు = మూలమైన; అమ్మ = మాత; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = మాత; సుర = దేవతల; అరుల = శత్రువుల (రాక్షసులు); అమ్మ = అమ్మ; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = మాత; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = తల్లి; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఈవుత = ఇచ్చు గాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వ మనే; సంపదల్ = సంపదలు. </div> </div> </div> <!-- 1- 9 హరికిం బట్టపుదేవి... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 9 హరికిం బట్టపుదేవి... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/08.Harikin_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> హరికిన్ బట్టపుదేవి, పున్నెములప్రోవర్థంబుపెన్నిక్క చం<br> దరుతోఁ బుట్టువు, భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి, తా<br> మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా<br> సురతన్ లేములు వాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికీ అమ్మలాగా సర్వమూ అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. . పోతనామాత్యులు ఇందిరా మాతను ఇలా ప్రార్థిస్తున్నారు . </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> శ్రీమహావిష్ణువునకు పట్టపురాణి, పుణ్యాలరాశి, సంపదలకు పెద్దనిధి. ప్రాణులందరి మూడు కరణాలకూ పరమానందం అందించే చందురుని అక్కగారు. చదువులతల్లి అయిన భారతి, జ్ఞానప్రసూన అయిన గిరిజ ఆమెకు ఇష్టసఖులు తమ వికాసంతో జనుల హృదయాలను వికసింపజేసే తామరపూవులలో నివసించే ముద్దరాలు. లోకాలన్నీ పూజించే యిల్లాలు. అద్భుతంగా కాంతులను విరజిమ్ముతూ జనుల లేములను పోగొట్టే తల్లి ఆమె మనకు అనంతమైన కల్యాణాలను ఇస్తుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి - తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరి = పర్వత; సుతల్ = పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁబోణి = పూవు వలె సున్నితరాలు - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లాలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = శాశ్వత మైన; కల్యాణముల్ = శుభములు. </div> </div> </div> <!-- 1- 9A శారద నీర దేందు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 9A శారద నీర దేందు... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/09.Sarada_Neeradendu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> శారదనీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా<br> హారతుషారఫేన రజతాచల కాశఫణీశ కుందమం<br> దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా<br> కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్ప తపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> "సర్వశుక్లా సరస్వతీ" సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నారు పోతనామాత్యులు. శరత్కాలమేఘం, చందమామ, కర్పూరం, నీటినురుగు, వెండికొండ, రెల్లుపూలుమొల్లలు, మందారాలు, అమృతసముద్రం, తెల్లని తామరలు, దేవతలనది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే ఓతల్లీ! భారతీ! నిన్ను హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకొని చూడగలగటం ఎన్నటికి సాధ్యమవుతుందో కదా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; = పాల సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర = దేవతల; వాహినీ = నదిలో - ఆకాశగంగలో; శుభ = శుభకరమైన; ఆకారతన్ = ఆకారంతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగు తుంది; భారతీ = సరస్వతీదేవీ. </div> </div> </div> <!-- 1- 9B అంబ నవాంబు జోజ్వల... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 9B అంబ నవాంబు జోజ్వల... (ఉత్పలమాల). . </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/10.Amba_Navambujo_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ! శారదచంద్రచంద్రికా<br> డంబరచారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా<br> చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ! భా<br> వాంబరవీథి విశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కవిత్రయంలో మూడవవాడు ఎఱ్ఱాప్రగడ. . అత్యద్భుతమైన వినయశీలంగల మహాకవి. అతడు అమ్మ భారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆపద్యం అందానికి అబ్బురపడి, ఆనందపడి, అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాలని కోరుకొని చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్ఛీలం ఎరిగిన సహృదయులు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అమ్మా! భారతీ! అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపుకాంతులతో వెలిగిపోతున్న, పద్మంవంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగులవంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదయిన ప్రభావాన్ని వేదసూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞానసంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీథిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లీ! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> అంబ = తల్లీ; నవ = లేత; అంబుజ = పద్మములతో సమంగా; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదానా; శారద = శరదృతువులోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = ఆడంబరంలాంటి; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = ప్రస్పుటమైన; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శృతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింప బడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = చూడు; భారతీ = సరస్వతీదేవీ. </div> </div> </div> <!-- 1- 9C కాటుక కంటి...(ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1- 9C కాటుక కంటి...(ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/11.Katuka_Kantineeru_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> కాటుక కంటినీరు చనుకట్ట పయింబడ నేల యేడ్చెదో<br> కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ<br> హాటకగర్భురాణి! నిను నా కటికిం కొనిపోయి అల్ల క<br> కర్ణాట కిరాట కీచకుల కమ్మ, త్రిశుద్ధిగ నమ్ము భారతీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పోతన మహాకవీంద్రులకు చదువులతల్లి సాక్షాత్కరించింది. ఆమె దర్శనం ఆయనకు ఆనందపారవశ్యం కలిగించలేదు. గుండెను తల్లడిల్లజేసింది. ఆ భారతితో ఈ భారతీపరిచారకుడు ఇలా అంటున్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అమ్మా! నా తల్లీ! భారతీ! నీవు కైటభుడనే కరకు గుండెగల రక్కసుని అణచి వేసిన శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన కోడలివి. కడుపంతా కనకమే అయిన నాలుగు మోముల దేవరకు రాణివి. కాటుకతో మలినమైన కన్నీరు పైటమీద జాలువారే తీరుగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మూడు కరణాలనూ పరిశుద్ధంగా చేసికొని మాట ఇస్తున్నాను. నీవే అయిన నా యీ వాగ్దేవిని తీసుకొనిపోయి పరమ నికృష్టులైన కర్ణాటులు, కిరాటులు, కీచకులు అనే పాడుబుద్ధులు గల పార్థివులకు, ఆకలి తీర్చుకోవటంకోసం అమ్ముకోనమ్మా! ఈ నామాట నమ్ము. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> భారతీ = వాక్కుకు రూపమైన తల్లీ!; కాటుక కంటినీరు = కాటుకతో మలినమైన కన్నీరు; చనుకట్టు పయిం = పైటమీద; పడన్ = జాలువారేట్లుగా; ఏల ఏడ్చెదో = ఏడుస్తున్నావెందుకమ్మా! కైటభ = కైటభుడు అనే; దైత్య = రాక్షసుని; మర్దనుని = సంహరించిన శ్రీమహావిష్ణువు; గాదిలి = ప్రియమైన; కోడల = కోడలా!; ఓ మదంబ = అమ్మా! నా తల్లీ!; ఓ = ఓ; హాటకగర్భు = కనకం గర్భంలో ధరించిన బ్రహ్మదేవుని; రాణి = రాణివమ్మా! నిను = పుస్తకరూపంలోని నిన్ను; ఆ కటికిన్ = శ్మశాన సదృశమైన రాజాస్థానాలకు; కొనిపోయి = తీసుకొని వెళ్ళి; అల్ల = ఆ; కర్ణాట కిరాట కీచకులకు = పరమ నికృష్టమైన కర్ణాటులు, కిరాటులు, కీచకులు అనే పాడు బుద్ధులుగల రాజులకు; అమ్మ = విక్ర యించను; త్రిశుద్ధిగ = మనస్సు, మాట, శరీరములను పరిశుద్ధంగా చేసుకొని ఇస్తున్న ఈ మాటను; నమ్ము = నమ్ము తల్లీ! </div> </div> </div> <!-- 1-11 ఇ మ్మనుజేశ్వరాధముల కిచ్చి... (ఉత్పలమాల).--> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-11 ఇ మ్మనుజేశ్వరాధముల కిచ్చి... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/12.Immanujeswaradhamula_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్<br> సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే<br> సమ్మెటపోటులం బడక సన్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ<br> బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాలకోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడుపనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> సాధారణంగా రాజ్యాలేలేవాళ్ళు నీచులై ఉంటారు. ‘చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష’ అనే భావనతో బ్రదకటమే ఆనీచత్వం. కానీ తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తిపొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెరపోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలనూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ మొదలైన వాహనాలనూ, ధనాన్నీ కోరడు. ఎందుకంటే అవన్నీ ప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పుతిప్పలు పెడతాయి. శరీరం పోయిన తరువాత కాలుడు ఈ పాపానికి శిక్షగా సహింపనలవికాని సమ్మెట పోటులతో సత్కరిస్తాడు. ఆ శిక్షను పొందకుండా శ్రీమహావిష్ణువునకు అంకితంగా సమస్త జగత్తుకూ మేలుకలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెరపోతరాజు ‘ఒక్కడు’ చెబుతున్నాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఈ = ఈ; మనుజ = మానువులు; ఈశ్వర = ఈశ్వరుడు - రాజు; అధముల = చెడ్డవారి; కున్ = కి; ఇచ్చి = ఇచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = వాహనాలు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్ని; పుచ్చుకొని = తీసుకొని; సొచొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; సి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = తోటి; శ్రీహరి = విష్ణువున; కిన్ = కు; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర; పోతరాజు = పోతరాజు; ఒకఁడు = అన బడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = ప్రియము కలుగు నట్లుగా. </div> </div> </div> <!-- 1-12 చేతులారంగ... (తేటగీతి). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-12 చేతులారంగ... (తేటగీతి). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/13.Chethularanga_Sivuni_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> చేతులారంగ శివుని పూజింపడేని<br> నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని<br> దయయు సత్యంబు లోనుగా దలపడేని<br> గలుగనేటికి దల్లులకడుపుచేటు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి. అలాకాకపోతే వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించు కోలేడు. అప్పుడు అతడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మానవుడు నిజమైనమానవుడు కావాలంటే కొన్ని విశిష్టలక్షణాలను పెంపొందించు కోవాలి. అలాకాకపోతే వాడు పుట్టుకకు ఒకప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. వాడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆవిశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తనపుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తతరంగా రూపుదిద్దుకొనే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.<br> <br> నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయి నామాలు చదువు కుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆశ్రమను తట్టుకోలేక అభిషేకా నికో, పూజకో మొరాయిస్తాయి. దీక్షకలవాడు ఆమొరాయింపునకు లొంగిపో కూడదు. చేతులను శిక్షించి అయినా పూజను తుదియుట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజిం చటం అంటే అది. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమగుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లికడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివుని = శివుడిని; పూజింపఁడు = పూజింపని వాడు; ఏని = ఐతే; నోరు = నోరు; నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి = విష్ణువు యొక్క; కీర్తి = కీర్తిని; ఉడువఁడు = కీర్తించడు; ఏని = ఐతే; దయయు = దయ మఱియు; సత్యంబు = సత్యములు; లోను గాన్ = కలుగు నట్లు; తలఁపఁ డేనిన్ = ఎంచకపోతే; కలుగన్ = పుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; తల్లుల = వారి తల్లుల యొక్క; కడుపు = గర్భం; చేటు = చెడపుటకా. </div> </div> </div> <!-- 1-16 మెఱుగు చెంగట...(సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-16 మెఱుగు చెంగట... (సీసము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/14.Meragu_Chengata_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> మెఱుగు చెంగట నున్న మేఘంబుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు<br> చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు<br> వల్లీయుతతమాల వసుమతీజము భంగిబలువిల్లు మూపున పరగువాడు<br> నీలనగాగ్ర సన్నిహిత భానునిభంగి ఘనకిరీటము దల గల్గువాడు<br> <br> <b>(ఆటవెలది).</b><br> <br> పుండరీకయుగము పోలు కన్నులవాడు<br> వెడద యురమువాడు విపులభద్ర<br> మూర్తివాడు రాజముఖ్యు డొక్కరుడు నా<br> కన్నుగవకు నెదర గానబడియె.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పోతనమహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమోడ్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతనమహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మెఱుపుతీగను అంటిపెట్టుకొని ఉన్న మేఘంలాగా జానకీకాంత చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్నినవ్వు పుట్టుకొని వస్తున్నది. అది చంద్రబింబంనుండి వెలువడే అమృతపు జల్లుగా ఉన్నది. పెద్ద విల్లు భుజంమీద అలరారుతూ ఉంటే లత చుట్టుకొన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తున్నాడు. నల్లనికొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదురుకొని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షఃస్థలం అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపునుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతున్నాడు. అట్టి రాజముఖ్యుడొకడునా కన్నులయెదుట కానవచ్చాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య), లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు = వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాఁడు = వాడు; వల్లీయుత = పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు = ప్రవర్తిల్లే; వాఁడు = వాడు; నీల = నీల; నగ = గిరి; అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగు = కల; వాఁడు = వాడు;<br> <br> పుండరీక = పద్మముల, తెల్లతామరల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వాఁడు = వాడు; వెడఁద = విశాలమైన; ఉరము = వక్షముగల; వాఁడు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; వాఁడు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుఁడు = ముఖ్యమైనవాడు; ఒక్కరుఁడు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్ = కళ్ళ; గవ = జంట; కున్ = కు; ఎదురన్ = ఎదురగ; కానఁబడియె = సాక్షత్కరించెను; </div> </div> </div> <!-- 1-18 పలికెడిది భాగవత మఁట... (కందము) --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-18 పలికెడిది భాగవత మఁట... (కందము) </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/15.Palikedidhi_Bhagavathamata_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> పలికెడిది భాగవత మట;<br> పలికించు విభుండు రామభద్రుండట; నే<br> పలికిన భవహర మగునట<br> పలికెద వేఱొండుగాధ పలుకగ నేలా.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీరామచంద్రుడు నాపేరు పేర్కొంటూ శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా! దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలయిపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నాడు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావననుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఏమిటేమిటి? నేను పలుకబోతున్నది భగవంతుని అమృతంవంటి చరిత్రమట! ఏదో నేను పలుకుతున్నాననుకొంటున్నాను, కానీ నన్ను పలికించేవాడు సాక్షాత్తూ పరమాత్మయే అయిన ఆ రామభద్రుడట! పలికితే కలిగే ఫలం సంసారం అనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అట! అటువంటి కార్యమూ, ఆ విధంగా చేయించే స్వామి! అంత అనితరసాధారణమైన ఫలమూ సమకూరుతూ ఉండగా మఱొక గాధను పలుకవలసిన పనియేమున్నది? కాబట్టి భాగవత గాధనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> పలికెడిది = పలుకు నది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించు = పలికించెడి; విభుండు = ప్రభువు; రామభద్రుండు = శ్రీరాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = చెప్తే; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగు నఁట = అవుతుం దట; పలికెద = (అందుకే) నే చెప్తాను; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు. </div> </div> </div> <!-- 1-19 భాగవతము తెలిసి పలుకుట ... (కందము) --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-19 భాగవతము తెలిసి పలుకుట ... (కందము) </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/16.Bhagavathamu_Thelisi_Palukuta_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు<br> శూలికైన తమ్మిచూలికైన<br> విబుధజనుల వలన విన్నంత కన్నంత<br> తెలియవచ్చినంత తేటపఱతు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కరుణావరుణాలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కానీ అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. దానిని లోకానికి తెలియజేస్తున్నాడు పోతన మహాకవి. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> భాగవతం తత్త్వం తెలియటమే చాలా కష్టమైనపని. తెలిసినదానిని తెలియజెప్పటం కోసం పడవలసినపాట్లు అన్నీయిన్నీ కావు. ఎవరికి? మానవమాత్రునకే కాదు, అటు సర్వజ్ఞమూర్తిగా పేరొందిన శూలికీ, ఇటు నాలుగుమోములతో నాలుగు వేదాలనూ ఉచ్చరించే బ్రహ్మదేవునికీ కూడా . వారిద్దరూ కూడా ఇది చాలా చిత్రమైన విషయంగా భావిస్తారు. మఱి నీవెలా వ్రాస్తావయ్యా అంటారేమో! చక్కని వివేకంతో కూడిన విద్వాంసులవలన విన్నాను. దానిని ఆకళింపునకు తెచ్చుకున్నాను. ఆ రెండు సంస్కారాల వలన నా బుద్ధికి తోచిన దానిని ధ్యానరూపంతో నిలుపుకొని అందరికీ అర్థమయ్యేటట్లు అక్షరాలలో నిక్షేపిస్తాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> భాగవతము = భాగవతమును; తెలిసి = తత్త్వం తెలుసుకొని, పలుకుట = చెప్పగలగటం; శూలికైన = త్రిశూలధారియైన శివునికీ; తమ్మిచూలికైన = మహావిష్ణువు గర్భంలో ఉదయించిన పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవునికీ; చిత్రంబు = కష్టమైనపని; విబుధజనుల వలన = పండితులవలన; విన్నంత = విన్నంతవరకూ; కన్నంత = అర్థం చేసుకొన్నంతవరకూ; తెలియవచ్చినంత = నాకు తెలిసినదానిని; తేటపఱతు = అందరికీ అర్థమయ్యేలా తెలియచెప్తాను </div> </div> </div> <!-- 1-21 ఒనరన్ నన్నయ తిక్క నాది... (మత్తేభం) --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-21 ఒనరన్ నన్నయ తిక్క నాది... (మత్తేభం) </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/17.Onaran_Nannaya_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఒనరన్ నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్<br> తెనుగున్ జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో<br> తెనుగున్ జేయరు మున్ను భాగవతమున్; దీనిన్ తెనింగించి నా<br> జననంబున్ సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పోతన తన అదృష్టాన్ని తానై కొనియాడుకొంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయతిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభావించుకుంటూ లోపలలోపల మహాకవుల మహోన్నత వైభవాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అసమాన ప్రతిభగల నన్నయ, తిక్కన మొదలైన మహాకవులు పురాణాల సముదాయాలను తెలుగులో రచించటానికి పూనుకున్నారు. కానీ నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యాలపంట ఎటువంటిదో కానీ భాగవతం వారు రచించలేదు. . అది నాకోసమే అన్నట్లుగా మిగిల్చారు. కనుక నేను భాగవతాన్ని తెలుగుకావ్యంగా రచించి నా పుట్టుక సఫలం అయ్యేట్లు చేసుకుంటాను. దీనితో నాకు పునర్జన్మే లేనటువంటి మహాభాగ్యం కలుగుతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణ లక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నా యొక్క; పురా = పూర్వజన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్ప తనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నా యొక్క; జననంబున్ = జన్మను; పునః = మళ్ళీ; జన్మంబున్ = పుట్టుకలు; లేకుండఁగన్ = లేకుండే లాగ. సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; </div> </div> </div> <!-- 1-22 లలిత స్కంధము... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-22 లలిత స్కంధము... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/18.Lalithaskandhamu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం<br> జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో<br> జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై<br> వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది పోతన మహాకవీంద్రునకు. కల్పవృక్షం కోరిన కోరికలనన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన గారి సంభావన. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఇదిగోనండీ భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోదె చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో స్కంధాలు లలితంగా ఉంటాయి. ఆ చెట్టుమూలం సారవంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం నల్లనయ్యయే మూలంగా ఒప్పారుతున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం శుకమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టునల్లుకొని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. భాగవతం మంజులత్వం తో ప్రకాశిస్తూ ఉంటుంది. కనువిందు చేసే రంగురంగుల పూవులతో అందరినీ ఆకర్షిస్తుందీ వృక్షం. ఈ భాగవత వృక్షం మంచి అక్కరాలతో గొప్ప హృదయసౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమైన కాంతులు విరజిమ్ముతూ ఉండే పాదు ఈ చెట్టును అలంకరిస్తున్నది.. అందమైనవీ, వెలుగులు చిమ్ముతున్నవీ అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. స్వచ్ఛమైనదీ, వెడల్పైనదీ అయిన పాదు ఈ వృక్షానికి ఉన్నది. స్వచ్ఛమైన హృదయం గల వ్యాసుల వారే భాగవతానికి జన్మభూమి. వృక్షం గొప్ప ఫలాలను లోకానికి అందిస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ చెట్టును ఆశ్రయించి మంచి పక్షులు బ్రతుకుతూ ఉంటాయి. ఈ భాగవతం సత్-ద్విజులకు, అంటే ఉత్తమ సంస్కారం కల పండితులకు, ఆశ్రయింపదగినదై విరాజిల్లుతున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> లలిత = చక్కని / అందమైన; స్కంధము = మానుతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూ లాధారముగ; శుక = చిలుకల / శుకయోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరిపబడి / అలరారి; సువర్ణ = మంచి రంగులుగల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులుతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగానున్న / వృత్తముల తోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళుతో / ఫలితా న్నిచ్ఛే లాగాను; విమల = విస్తారమైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; అలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; ఐ = అయ్యి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పతరువు; ఉర్విన్ = భూమి మీద / లోకం లో; సద్ద్విజ = చక్కటి పిట్టలుకు / సజ్జనులు మరియు ద్విజులుకు; శ్రేయము = మేలు కూర్చునది / శ్రేయస్కరము; ఐ = అయ్యి. </div> </div> </div> <!-- షష్ఠ్యంతములు --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>షష్ఠ్యంతములు</h3> </div> <!-- 1-29 హారికి నందగోకుల విహారికిఁ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-29 హారికి నందగోకుల విహారికిఁ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/19.Haariki_Nandagokula_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> హారికి నందగోకులవిహారికి చక్రసమీరదైత్య సం<br> హారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబినీమనో<br> హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా<br> హారికి బాలకగ్రహ మహాసురదుర్వనితాప్రహారికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> మన కావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తన కావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తున్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆ విశేషణాలన్నీ షష్ఠీవిభక్తితో అంతమౌతూ ఉంటాయి. కనుక వానిని షష్ఠ్యంతాలు అంటారు. పోతన కవీంద్రుడు ఆ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు. సుడిగాలిరూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరగదన్ని చంపినవాడు. భక్తుల దుఃఖాన్ని తొలగించే దయామూర్తి. గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు. చెడుగుణాల సంపదలను నాశనంచేసే మహాత్ముడు. గొల్లభామలు కుటీరాలలో దాచుకున్న పాలూ, నెయ్యీ మొదలైన వానిని కొల్లగొట్టిన వెన్నదొంగ. బాలకగ్రహ రూపంలో వచ్చిన పాడురక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చి చంపివేసిన అద్భుత బాలకుడు. అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> హారికి = మనోహరమైన రూపము గలవానికి; నంద = నందుని; గోకుల = గో కులములో; విహారికి = విహరించు వానికి; చక్ర = చక్రము వలె తిరుగు; సమీర = గాలి - సుడిగాలి రూపధారియైన; దైత్య = రాక్షసుని - తృణావర్తుని; సంహారికి = సంహరించిన వానికి; భక్త = భక్తులయొక్క; దుఃఖ = దుఃఖమును; పరిహారికి = తీసివేయువానికి; గోప = గోపాలకుల వంశములో పుట్టిన; నితంబినీ = స్త్రీల యొక్క {నితంబిని - గొప్ప పిరుదులు గలవారు}; మనోహారికి = మనసులను గెలిచినవానికి; దుష్ట = దుష్టుల; సంపద = సంపదను; పహారికి = అపహరించు వానికి; ఘోష = గొల్లల; కుటీ = ఇళ్ళలోని; పయః = పాలు; ఘృత = పెరుగు; ఆహారికి = తినేవానికి; బాలక = పిల్లలను; గ్రహ = పట్టుకొనే; మహాసుర = రాక్షసి యైన; దుర్వనితా = చెడ్డస్త్రీ - పూతనను; ప్రహారికిన్ = చంపినవానికి. </div> </div> </div> <!-- 1-30 శీలికి నీతిశాలికి... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-30 శీలికి నీతిశాలికి... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/20.Seeliki_Neethi_Saliki_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్తని<br> ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా<br> పాలికి వర్ణధర్మపరిపాలికి అర్జునభూజయుగ్మ సం<br> చాలికి మాలికిన్ విపులచక్రనిరుద్ధమరీచిమాలికిన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణుని మహోన్నతగుణాలను మరింతగా కొనియాడుతూ మురిసి పోతున్నాడు భక్తశిఖామణి పోతన. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అందరూ ఆయన మానినీ చిత్తచోరుడంటారు కానీ నిజానికి ఆతడు గొప్ప శీలసంపద కలవాడు. లోకాలన్నిటినీ చక్కగా నడిపించే నీతితో అలరారేవాడు. త్రిశూలాన్ని ధరించిన శ్రీమహాశివుని తన గుండె గుడిలో నిలుపుకొన్న మహాత్ముడు. బాణాసురుని వేయిచేతులనూ విలాసంగా ముక్కలుగా గొట్టిన మహాబలశాలి. చాలా ఉద్ధృతంగా విజృంభించిన రాలవానతో దెబ్బతిన్న గొల్లలనందరినీ భద్రంగా కాపాడిన కృపామూర్తి. వర్ణధర్మాలను కాపాడి లోకాన్ని ఒక త్రాటిమీదన నడిపించే దిట్ట. జంట మద్దిచెట్లను పసితనంలోనే కదిలించి కుదిలించి కూల్చిన ప్రోడ. నిరంతరం పూమాలలను ధరించి వానికి వన్నెతెచ్చిన అందగాడు. తన చక్రంతో సూర్యుని కిరణాల ప్రసారాన్ని అడ్డగించిన సర్వేశ్వరుడు. అతనికి అంకితంగా నా భాగవత మహారచనను ప్రారంభిస్తున్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> శీలికి = శీలము కలవానికి; నీతిశాలికి = నీతి స్వభావము గలవానికి; వశీకృత = వశపఱచుకోబడిన; శూలికి = శివుడు గలవానికి; బాణ = బాణాసురుని; హస్త = చేతులను; నిర్మూలికి = నిర్మూలించిన వానికి; ఘోర = భయంకరమైన; నీరద = మేఘముల నుండి; విముక్త = వర్షించిన; శిలా = రాళ్ళచే; హత = కొట్టబడిన; గోప = గోపాలుర; గోపికా = గోపికల; పాలికి = పరిపాలకునికి; వర్ణ = వర్ణములను {చతుర్వర్ణ ములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,}; ధర్మ = ధర్మములను {ధర్మ – వేద ధర్మము లను}; పరిపాలికి = పరిపాలించేవానికి; అర్జున = మద్ది; భూజ = చెట్ల; యుగ్మ = జంటను; సంచాలికి = కదిలించినవానికి; మాలికి = మాలలు ధరించినవానికి; విపుల = పెద్దదైన; చక్ర = చక్రముచే; నిరుద్ధ = అడ్డగింపబడ్డ; మరీచి = సూర్యకిరణములనే; మాలికిన్ = మాలికలకి కారణభూతికి. </div> </div> </div> <!-- 1-31 క్షంతకుఁ గాళి యోరగ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-31 క్షంతకుఁ గాళి యోరగ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/21.Kshanthaku_Kaliyoraga_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరినర్తన క్రియా<br> రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ<br> హంతకు నింద్రనందన నియంతకు, సర్వచరాచరావళీ<br> మంతకు, నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అనంత కల్యాణ గుణసంపన్నుడైన శ్రీకృష్ణస్వామి భగవల్లక్షణాలను మరింత ఆనందపు పొంగులతో అభివర్ణించి మురిసిపోతున్నాడు పోతన. మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నల్లని ఆసామి ఎట్టివానినైనా క్షమించే హృదయవైశాల్యం గలవాడు. కాళియ సర్పరాజు విశాలమైన పడగలమీద నర్తనం చేయటం అనే పనిలో ఆనందించేవాడు. పొగరెక్కి మిడిసిపడుతున్న జరాసంధుని రథములు, ఏనుగులు, గుఱ్ఱాలు, కాలుబంటులు అనే నాలుగువిధాలైన సేనలను రూపుమాపినవాడు. ఇంద్రుని కుమారుడైన అర్జునుని రథానికి సారథి అయినవాడు. సమస్తమైన ప్రాణికోటికీ, కదలకుండా నిలిచి ఉండే జడ పదార్థాల సముదాయానికీ భావింపదగినవాడు, ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకొని యోగులైన గొప్పభక్తుల వెంటనంటి మెలగేవాడు. అట్టి నీలవర్ణశోభితుడైన కన్నయ్యకు నా కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> క్షంతకు = క్షమించు వానికి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల = పెద్ద; ఫణ = పడగల; ఉపరివర్తన = మీద తిరుగుట క్రియారంతకు = క్రీడించేవానికి; ఉల్లసత్ = ఉల్లాసము చెందిన; మగధరాజ = మగధకు రాజైన జరా సంధుని; చతుర్విధ = చతురంగబలాలతో కూడిన {చతురంగబలములు - రథ, గజ, హయ, కాల్బలములు.}; ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంతకు = చంపిన వానికి; ఇంద్రనందన = ఇంద్రుని కుమారుడైన అర్జునుని; నియంతకు = నడిపించే వాడి కి; సర్వ = సకల; చరచరావళీ = కదలగల, కదలలేని సముదాయానికి; మంతకు = రక్ష కునికి; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల; సమంచిత = బాగుగా పూజించు; భక్త = భక్త; జన = జనులను; అనుగంతకు = అనుసరించి నడచువానికి. </div> </div> </div> <!--1-32 న్యాయికి... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-32 న్యాయికి... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/22.Nyayiki_Bhusurendra_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన<br> స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం<br> ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని<br> ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీవాసుదేవుని గుణకథనంతో తృప్తి తీరని పోతన, గొప్ప అలంకారాలతో అలరారుతున్న పద్యపుష్పంతో ఇంకా ఇలా కొనియాడుతున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> శ్రీకృష్ణస్వామి న్యాయప్రవృత్తి కలవాడు. తన గురువైన సాందీపనికి అతని మృతిచెందిన కుమారుని గురుదక్షిణగా సమర్పించిన మహాత్ముడు. రుక్మిణీదేవి హృదయాలయంలో సుస్థిరమైన గూడు కట్టుకొన్నవాడు. ఉత్తమశీలంకల జనులకు అనురాగాన్ని కూర్చేవాడు. చూడముచ్చట అయిన పట్టుపుట్టాన్ని కట్టేవాడు. బ్రహ్మాండములనే భాండములను నిర్మించేవాడు. గోపికల మందిరాలలో తిరుగాడేవాడు. శేషతల్పం మీద సుఖనిద్ర పొందేవాడు. అటువంటి శ్రీకృష్ణునికి అంకితముగా నేను శ్రీమదాంధ్రభాగవతాన్ని రచిస్తున్నాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> శ్రీకృష్ణస్వామి న్యాయప్రవృత్తి కలవాడు. తన గురువైన సాందీపనికి అతని మృతిచెందిన కుమారుని గురుదక్షిణగా సమర్పించిన మహాత్ముడు. రుక్మిణీదేవి హృదయాలయంలో సుస్థిరమైన గూడు కట్టుకొన్నవాడు. ఉత్తమశీలంకల జనులకు అనురాగాన్ని కూర్చేవాడు. చూడముచ్చట అయిన పట్టుపుట్టాన్ని కట్టేవాడు. బ్రహ్మాండములనే భాండములను నిర్మించేవాడు. గోపికల మందిరాలలో తిరుగాడేవాడు. శేషతల్పం మీద సుఖనిద్ర పొందేవాడు. అటువంటి శ్రీకృష్ణునికి అంకితముగా నేను శ్రీమదాంధ్రభాగవతాన్ని రచిస్తున్నాను. </div> </div> </div> <!-- ప్రథమ అధ్యాయం --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>ప్రథమ అధ్యాయం</h3> </div> <!--1-36 శ్రీమంత మై మునిశ్రేష్ఠ కృతం బైన... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-36 శ్రీమంత మై మునిశ్రేష్ఠ కృతం బైన... (సీసము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/23.Seemanthamai_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ<br> వినగోరువారల విమలచిత్తంబుల చెచ్చెర నీశుండు చిక్కుగాక<br> యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు<br> కపట నిర్ముక్తులై కాంక్షసేయక యిందు తగిలియుండుట మహాతత్వబుద్ధి<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> పరగ నాధ్యాత్మికాది తాపత్రయంబు<br> నడచి పరమార్థభూతమై యఖిలసుఖద<br> మై సమస్తంబు గాకయు నయ్యునుండు<br> వస్తు వెఱుగంగదగు భాగవతమునందు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతం అంటే ఏమిటి? దానినే ఎందుకు అధ్యయనం చేయాలి? అలాచేస్తే కలిగే ప్రయోజ నాలెట్టివి? - ఈ ప్రశ్నలకు పోతనగారు చక్కని సమాధానాలు చెబుతున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> భాగవతం జ్ఞానలక్ష్మితో ప్రకాశిస్తూ ఉంటుంది. మహర్షులలో శ్రేష్ఠుడు శ్రీవేదవ్యాసుడు దానిని రచించినవాడు. గొప్పభక్తితో దానిని వినాలనే కోరికగల నిర్మల చిత్తంగలవారిలో పరమేశ్వరుడు వడివడిగా చేరుకొని అక్కడ స్థిరనివాసం చేస్తాడు. ఇతర శాస్త్రాల వలన అటువంటి మహాఫలం సిద్ధించదు. సత్పురుషులు, మాత్సర్యంలేనివారు, కపట భావాలు లేనివారూ మఱి దేనిని కోరకుండా ఈ భాగవతాన్నే అంటిపెట్టుకొని ఉంటారు. అట్టివారికి ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపాలు మూడూ అణగి పోతాయి. అప్పుడు వారి హృదయాలలో పరమతత్త్వం ప్రసన్నంగా ఉంటుంది. అది అన్ని విధాలైన సుఖాలనూ కలిగిస్తుంది. ఆ వాసుదేవుడు అన్నీ తానే అయినవాడు, కానివాడు కూడా. అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే భాగవతాన్ని తెలుసుకోవాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> శ్రీమంతమై = శుభకరమై; మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడైన – వ్యాసుని చేత; కృతంబైన = రచింపబడినది అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తితోడన్ = మంచిభక్తితో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తం బులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలో నున్న ఈశ్వరు డు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = పద్ధతు లకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా, దొరకడు; భాగవతమునందు = భాగవతంలో; మంచివారలకున్ = మంచి వాళ్ళకు; నిర్మత్సరులు = మాత్సర్యం లేని వాళ్ళకు; కపట = మాయనుంచి; నిర్ముక్తులై = విడిపింపబడ్డ వారై; కాంక్ష = కోరుట; సేయక = చేయకుండ; ఇందు = ఈ భక్తియందు; తగిలి = లగ్నమై; ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామియందు; బుద్ధిన్ = కుతూహల మున;<br> <br> పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయం బున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అణఁచి = తొలగించి; పరమార్థ = మోక్షముయొక్క; భూతమై = రూపమై; అఖిల = సర్వ; సుఖదమై = సుఖప్రదమై; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండా; అయ్యున్ = అయినవాడు కూడా; ఉండు = ఉండేటటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; </div> </div> </div> <!--1-37 వేదకల్పవృక్ష... (ఆటవెలది). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-37 వేదకల్పవృక్ష... (ఆటవెలది). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/24.Vedakalpavruksha_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> వేదకల్పవృక్షవిగళితమై శుక<br> ముఖసుధాద్రవమున మొనసి యున్న<br> భాగవతపురాణఫలరసాస్వాదన<br> పదవిఁ గనుఁడు రసికభావవిదులు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> భాగవతరసాన్ని ఆస్వాదించటం ఎంతటి మహాఫలితాన్ని ఇస్తుందో పోతన్నగారు చక్కని అలంకారభాషలో మనకు బోధిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> రసికులైన తత్త్వమెరిగిన నరులారా! ఈ భాగవతం అనే పురాణపు ఫలంనుండి జాలు వారే రసాన్ని ఆస్వాదించే పదవిని పొందండి. ఈ పండు వేదాలనే కల్పవృక్షమునందే పండి క్రిందికి జారివచ్చింది. చిలుకవంటి శుకమహర్షి ముఖమందుండే అమృతద్రవాన్ని అంటించుకొని మరింతగా మాధుర్యాన్ని సంతరించుకొన్నది. నేలకు దిగివచ్చి మనకందరకూ అందుబాటులో కదలాడుతున్నది. రసికత ఉన్నవారైతే దీనిని కర్ణపుటాలతో జుఱ్ఱు కోండి. మీ జన్మ ధన్యమవుతుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> వేద = వేదము అను; కల్పవృక్ష = కల్పవృక్షము నుండి; విగళితము = జారినది; ఐ = అయ్యి; శుక = శుకబ్రహ్మ / చిలుక; ముఖ = ముఖమ అను / ముక్కు తగిలిన; సుధాద్రవమున = అమృతముతో / మంచి రసముతో; మొనసి = నిండినదై / రుచి కలదియై; ఉన్న = ఉన్నటువంటి; భాగవత = భగవత మని పేరు గల; పురాణ = పురాణము యొక్క / పురాణము అను; ఫల = ఫలితము యొక్క / పండు యొక్క; రస = భావమును / రసమును; ఆస్వాదన = ఆస్వాదించు; పదవిన్ = ఉన్నతమైన స్థితిని / మార్గాన్ని; కనుఁడు = కనుగొనుడు / చూడండి; రసిక = రసికత్వ / రుచి యొక్క; భావ = భావవివరాలు / ప్రత్యేకత; విదులు = బాగా తెలిసిన వారు. </div> </div> </div> <!-- సప్తమ అధ్యాయం --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>సప్తమ అధ్యాయం</h3> </div> <!--1-137 ధీరులు నిరపేక్షులు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-137 ధీరులు నిరపేక్షులు... (కందము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/25.Dheerulu_Nirapekshulu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ధీరులు నిరపేక్షులు నా<br> త్మారాములు నైన మునులు హరిభజనము ని<br> ష్కారణమ చేయుచుందురు<br> నారాయణుఁ డట్టి వాఁడు నవ్యచరిత్రా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రజ్ఞగల సూతుడు, భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు- అని చెప్పగా శౌనకుడు, “అయ్యా శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కరలేదే. అతడు దేనినీ పట్టించుకోడే. అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు” అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మహర్షీ! నీ నడవడి కొనియాడదగినదయ్యా! విను. నీప్రశ్నకు బదులు చెబుతాను. గొప్పబుద్ధితో విలాసంగా విహరించేవారూ, ఏ అపేక్షతో అంటుసొంటులు లేనివారూ, ఆత్మతత్త్వమునందే ఆనందంపొందే శీలం కలవారూ అయిన మునులు శ్రీమహావిష్ణువు భజనను ఏ కారణమూ లేకుండానే చేస్తూ ఉంటారయ్యా! ఆ నారాయణుడు అటువంటి వాడు! ఏ కోరికా లేనివారికి కూడా అతనిని పూజించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్ = దేనియందు ఆపేక్షలేని వారు; ఆత్మారాములున్ = ఆత్మయందు ఆనందించువారును; ఐన = అయినట్టి; మునులు = మునులు; హరి = హరియొక్క; భజనమున్ = సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేమియు లేకనే; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉంటారు; నారాయణుఁడు = నారాయణుడు; అట్టి = అటువంటి; వాఁడు = వాడు; నవ్య = నవ్య మైన; చరిత్రా = చరిత్ర కలవాడా </div> </div> </div> <!--1-139 నిగమములు వేయుఁ జదివిన... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-139 నిగమములు వేయుఁ జదివిన... (కందము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/26.Nigamamula_Veyi_Chadivina_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> నిగమములు వేయు చదివిన<br> సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్<br> సుగమంబు భాగవతమను<br> నిగమంబు పఠింప ముక్తినివసనము బుధా.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శౌనకమహర్షికి శ్రీమహావిష్ణువును గూర్చి తెలియజెప్పే భాగవతం ఇంకా ఎంత గొప్పదో సూతుడు వివరిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మహర్షీ! ఈ సృష్టిలో వాక్కుల స్వరూపాలెన్నో ఉన్నాయి. ఆ అన్నింటిలో చాలా ఉన్నత మైనతావులో ఉన్నవి వేదాలు. అవి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రంగా పట్టి ఇస్తాయి. కానీ ముక్తి అందచందాలను అందించటంలో అవి యోగ్యమైనవిగా కనపడటం లేదు. ఎందుకంటే అవి వేలకొలదిగా చదివినా సుఖంగా తెలియరావు. కానీ భాగవతం అనే వేదాన్ని శ్రద్ధతో చదివితే ముక్తి గుట్టుమట్టులన్నీ సులభంగా అందుకోవచ్చు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> నిగమములు = వేదములు; వేయున్ = వేల కొలది; చదివినన్ = పఠించిన కూడ; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యము కలవి; సుగమంబు = సులభముగ అర్థ మగున దైన; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివిన; ముక్తి = ముక్తి; నివసనము = నివాస మగును; బుధా = బుద్ధిమంతుడా. </div> </div> </div> <!-- అశ్వత్థామను అవమానించుట --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>అశ్వత్థామను అవమానించుట</h3> </div> <!--1-161 ఉద్రేకంబున రారు... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-161 ఉద్రేకంబున రారు... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/27.Udrekamuna_Raaru_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం<br> చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్<br> భద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢక్రియా హీనులన్<br> నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతు లెట్లాడెనో?<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అశ్వత్థామ కసాయివానికంటె ఘోరంగా నిద్రిస్తూ ఉన్న పాండవకుమారులను, మరి కొందరినీ నరికిప్రోవులు పెట్టాడు. ద్రౌపది ఆకడుపుకోతను తట్టుకోలేక కుమిలికుమిలి ఏడ్చింది. అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను వధించటానికి కృష్ణునితోపాటు వెళ్ళాడు. అతడు దొరికాడు. కానీ గురుపుత్రుడని చంపక, కట్టితెచ్చి ద్రౌపదిముందు నిలిపాడు. అప్పుడా తల్లి ఇలా అన్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అయ్యా! గురుపుత్రా! నాపసిబిడ్డలు నీమీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసివేయాలని రాలేదే! ఆయుధాలు పట్టుకొని రణరంగంలో వీరవిహారం చేయలేదే! పైగా కండబలమూ, గుండెబలమూ పురికొల్పగా నీకు పిసరంత కూడా అపకారం చేసినవారు కారు గదా! చీకటిలో ఆదమరచి నిద్రిస్తున్నవారిని, యుద్ధంలో దుడుకు పనులుచేయటం చేతకానివారిని, చంపటానికి, అయ్యయ్యో! నీకు చేతులెలా ఆడాయి? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్ర = శస్త్రములు; ధరులు = ధరించినవారు; ఐ = అయ్యి; యుద్ధ = రణ; అవనిన్ = భూమిలో; లేరు = లేరు; కించిత్ = కొంచెముకూడా; ద్రోహంబును = ద్రోహమును; నీకున్ = నీకు; చేయరు = చేయరు; బల = బలము వలని; ఉత్సేకంబు = ఉద్రేకము; తోన్ = తో; చీకటిన్ = చీకట్లో; భద్ర = శుభ; ఆకారులన్ = ఆకారము గల వారిని; పిన్న = చిన్న; పాఁపల = పిల్లలను; రణ = యుద్ధము; ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయట; హీనులన్ = రాని వారిని; నిద్ర = నిద్ర పోవు టందు; ఆసక్తులన్ = ఆసక్తితో నున్న వారిని; సంహరింపన్ = సంహరించుటకు; అకటా = అకటా; నీ = నీ యొక్క; చేతులు = చేతులు; ఎట్లు = ఎలా; ఆడెనో = వచ్చెనో. </div> </div> </div> <!-- పరీక్షితుని రక్షించుట --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>పరీక్షితుని రక్షించుట</h3> </div> <!--1-179 చెల్లెలికోడల... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-179 చెల్లెలికోడల... (కందము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/28.Chelleli_Kodala_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> చెల్లెలి కోడల నీమే<br> నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం<br> ఫుల్లారవిందలోచన!<br> భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పాండవులు సేసిన పరాభవానికి కుమిలిపోయిన అశ్వత్థామ వెనుకా ముందూ చూడకుండా పాండవ గర్భాలను మాడ్చివేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అభిమన్యుని యిల్లాలు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాల్చివేయబోతున్నది. అప్పుడు ఉత్తర మరొక దారి లేక శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> బాగా విప్పారిన పద్మాలవంటి కన్నులుగల కన్నయ్యా! నేను నీముద్దుల చెల్లెలి కోడలిని. నీకు ఎంతో ప్రియుడైన నీమేనల్లుడు పగవారికి చిక్కిప్రాణాలు కోల్పోయాడు. ఇదిగో అశ్వత్థామ వేసిన బాణం నా గర్భాన్ని కాల్చివేస్తున్నది. దానిని అణగగొట్టి కడుపులో ఉన్న నిసుగును బ్రతికించు మహాత్మా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> చెల్లెలి = మీ చెల్లెలికి; కోడల = కోడలుని; నీ = నీ యొక్క; మేనల్లుఁడు = సోదరి పుత్రుడు; శత్రువుల = వైరుల; చేతన్ = వలన; హతుఁడు = చంపడిన వాడు; అయ్యెను = అయ్యెను; సంఫుల్ల = పూర్తిగ వికసించిన; అరవింద = పద్మములవంటి; లోచన = కన్నులున్నవాడా; భల్ల = బాణముల యొక్క; అగ్నిన్ = అగ్నిని; అణంచి = అడి చేసి; శిశువున్ = శిశువును; బ్రతికింపఁగదే = బ్రతికింపుము. </div> </div> </div> <!--1-182 తనసేవ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-182 తనసేవ... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/29.Thana_Sevarathi_Chintha_Gaani_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> తనసేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స<br> జ్జనులం బాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనం<br> దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్ట బనిచెన్ దైత్యారి సర్వారి సా<br> దననిర్వక్రము రక్షితానఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఉత్తర ఆర్తనాదం శ్రీకృష్ణుని దయాంతరంగాన్ని కదిలించివేసింది. వెంటనే అతడు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్తర కడుపును కాపాడటానికి పూనుకొన్నాడు </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆ పాండురాజు కొడుకులకు ఎల్లవేళలా తనను సేవించుకోవటమనే భావనయే కానీ మరొక చింత రవంత కూడా లేదు. అట్టివారిని ఆదుకోవాలి అనే వాత్సల్యభావంతో రక్కసులను చీల్చిచెండాడేవాడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవలసినదిగా చక్రాన్ని ఆదేశించాడు. అది సుదర్శనమనే నామం గలది. పగవారినందరినీ రూపుమాపటంలో గురితప్పనిది. అమృతమే అన్నమైన దేవతల సమాజాన్నంతటినీ కంటికిరెప్పలా కాపాడేది. అట్టి ఆ చక్రం తల్లి కడుపులో ఉన్న చిన్నినిసుగును కాపాడకుండా ఎలా ఉంటుంది? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> తన = తనయొక్క; సేవ = భక్తితో; ఆరతి = తపించు; చింత = ఆలోచన; కాని = తప్ప; పర = ఇతర; చింతా = ఆలోచన; లేశమున్ = కొంచెముకూడ; లేని = లేని; సజ్జనులన్ = మంచివారిని; పాండుతనూజులన్ = పాండవులను; మనుచు = కాపాడవలననే; వాత్సల్యంబు = ఆపేక్ష; తోన్ = తో; ద్రోణనందను = అశ్వత్థామ యొక్క {ద్రోణుని కొడుకు - అశ్వత్థామ}; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; అడ్డుపెట్టన్ = అడ్డుకొనుటకు; పనిచెన్ = నియోగించెను / ప్రయోగించెను; దైత్యారి = కృష్ణుడు {దైత్యారి - దైత్యుల శత్రువు, కృష్ణుడు}; సర్వ = సమస్తమైన; అరి = శత్రువులను; సాధన = సాధించుటలో / నశింపచేయుటలో; నిర్వక్రము = తిరుగులేనిది; రక్షిత = రక్షింపబడిన; అఖిల = సమస్త; సుధా = దేవతల; అంధస్ = సమూహముగలదియైన; చక్రమున్ = చక్రమును. </div> </div> </div> <!-- కుంతిస్తుతి --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;"> <h3>కుంతిస్తుతి</h3> </div> <!--1-183 సకల ప్రాణి హృదంతరాళముల... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-183 సకల ప్రాణి హృదంతరాళముల... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/30.Sakala_Prani_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> సకలప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతి యై యుండు సూ<br> క్ష్మకళుం డచ్యుతు డయ్యెడన్ విరటజా గర్భంబు తా చక్రహ<br> స్తకుడై వైష్ణవమాయ గప్పి కురుసంతానార్థియై యడ్డమై<br> ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణతనయబ్రహ్మ్రస్త్రమున్ లీలతోన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణపరమాత్మ ఉత్తర కడుపుననున్న చిన్నిబిడ్డను కాపాడిన తీరును పోతనమహాకవి అత్యద్భుతంగా వేదాంత రహస్యాలు పాఠకుల హృదయాలలో వింత వెలుగులను ప్రసరింపజేసే విధంగా వర్ణిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆ పరమాత్మ ప్రాణంకల అందరి హృదయాలనే ఆలయాలలోపల దివ్య కాంతు లతో వెలుగొందే మహాదీపం. సూక్ష్మమైన కళతో అలరారేవాడు. ఎక్కడా ఏ విధమైన జారుపాటూ లేనివాడు. అట్టి జ్ఞానదీపమైన దేవుడు విరాటరాజ పుత్రిక అయిన ఉత్తరగర్భంలో ప్రవేశించాడు. చూడనలవికాని వెలుగులను చిందిస్తున్న చక్రాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆయన అందరిలో అన్నింటిలో లోపలా వెలుపలా సంచరించే విష్ణువు కదా! అట్టి వైష్ణవ మాయతో కప్పివైచి కౌరవవంశానికి అంకురమైన బిడ్డను కాపాడటానికై, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని విలాసంగా అణచివేశాడు </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> సకల = సమస్త మైన; ప్రాణి = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరాళములన్ = లోలోపల; భాస్వత్ = ప్రకాశించే; జ్యోతి = దీపము; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; సూక్ష్మ = సూక్ష్మ మైన; కళుండు = నేర్పున్న వాడు; అచ్యుతుఁడు = నాశనము లేని వాడు / హరి; ఆ = ఆ; ఎడన్ = సమయంలో; విరటజా = ఉత్తర యొక్క {విరటజ - విరటుని సంతానము / ఉత్తర}; గర్భంబున్ = గర్భమును; తాన్ = తాను; చక్ర = చక్రమును; హస్తకుఁడు = చేతి యందు ధరించిన వాడు; ఐ = అయ్యి; వైష్ణవ = విష్ణువు యొక్క; మాయన్ = మాయచే; కప్పి = కప్పి; కురు = కురు వంశ; సంతాన = సంతానమును; అర్థి = నిలబెట్ట గోరిన వాడు; ఐ = అయ్యి; అడ్డము = అడ్డముగా నిలబడిన వాడు; ఐ = అయ్యి; ప్రకట = అభివ్యక్తమైన; స్ఫూర్తిన్ = స్పూర్తితో; అణంచెన్ = అణచెను; ద్రోణతనయు = అశ్వత్థామ యొక్క; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; = అవలీల / లీలావిలాసముగా. </div> </div> </div> <!--1-191 కోపముతోడ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-191 కోపముతోడ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/32.Kopamuthoda_Neevu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో<br> గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా<br> రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం<br> బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కుంతీదేవి కన్నయ్య చిన్ననాటి లీలలను తలచుకొని తలచుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఇలా అంటున్నది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> కన్నయ్యా! ! నీవు అడిగిన వెంటనే అమ్మ నీవడిగినది ఇవ్వలేదని అలుకచెంది పెరుగుకుండను పగులకొట్టావు. ఆమె తెచ్చిపెట్టుకొన్న కోపంతో నిన్నొక త్రాటితో కట్టివేసి ఓరగా నిన్ను చూస్తూ ఉన్నది. అప్పుడు నీవు కళ్ళు చికిలించుకొని కాటుకతో నిండిన కన్నీళ్ళు ధారలై జాలువారుతున్న మోమును చేతులతో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు పుచ్చుతూ బాలుడవై నటించటం, కృపాకరా! నా మనస్సులో ఎంతో అబ్బురంగా భాసిస్తున్నది. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> కోపము = కినుక; తోడన్ = తో; నీవు = నీవు; దధి = పాల; కుంభము = కుండ; భిన్నము = ముక్కలు; చేయుచు = చేస్తూ; ఉన్నచోన్ = ఉన్నపుడు; గోపిక = గోపస్త్రీ / దేవకి; త్రాటన్ = తాడుతో; కట్టిన = కట్టగా; వికుంచిత = వక్రీకరింపబడిన / చెదరిన; సాంజన = కాటుకతో కూడిన; బాష్పతోయ = కన్నీటి; ధారా = ధారలతో; పరిపూర్ణ = నిండిన; వక్త్రమున్ = ముఖమును; కరంబులన్ = చేతులతో; ప్రాముచు = అలము కొనుచు; వెచ్చ = వేడిగా; నూర్చుచున్ = నిట్టూర్పులు నిగడించుచు; పాపఁడవు = శిశువు; ఐ = అయ్యి; నటించుట = నటించుట; కృప = దయను; పర = ప్రసరించువాడా; నా = నా యొక్క; మదిన్ = మనసులో; చోద్యము = ఆశ్చర్యమును; అయ్యెడిన్ = కలిగించుచున్నది. </div> </div> </div> <!--1-198 యాదవు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-198 యాదవు... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/33.Yadavulandu_Pandusuthulandu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి<br> చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ<br> పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న<br> త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కుంతీదేవి గొప్ప జ్ఞానజ్యోతి గుండెలో దాచుకొన్న మహావ్యక్తి. పరమాత్మ అనుగ్రహాన్ని అందుకొనే మహాభాగ్యం కలవారు స్వామిని ఏమి కోరాలో మనకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నది. ఆమె మానవసమాజానికి గొప్పగురువు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> సర్వకాలాలలో సర్వలోకాలనూ పాలించే ఓ ఈశ్వరా! నాకు నా పుట్టింటివారైన యాదవులందూ, మెట్టినింటివారైన పాండవులయందూ మోహం ఆవంత కూడా లేకుండా చేయి నాయనా! నీవు అన్ని లోకాలకూ పాలకుడవు. నా బుద్ధి సర్వకాల సర్వావస్థలలోనూ సముద్రంలోనికే చేరుకొనే గంగలాగా, నీ పాదపద్మాలను మాత్రమే మిక్కిలి ఎక్కువ ఆదరంతో కలిసిపోయే విధంగా దయచూడు, స్వామీ. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> యాదవులందున్ = యదు వంశమువారి మీదను; పాండుసుతులందున్ = పాండురాజు పుత్రుల మీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకున్న; మోహ = మోహమును; విచ్ఛేదమున్ = విమోచనము; సేయుము = చేయుము; అయ్య = అయ్యా; ఘనసింధువున్ = సముద్రము {ఘనసింధువు - అత్యధికమైన నీరుగలది / సముద్రము}; చేరెడి = చేరేటటువంటి; గంగ = గంగ; భంగిన్ = వలెను; నీ = నీయొక్క; పాద = పాదములను; సరోజ = పద్మముల; చింతనము = భక్తి; పైన్ = మీద; అనిశంబు = అనవరతము; మదీయ = నాయొక్క; బుద్ధిన్ = మనసులో; అతి = మిక్కిలి; ఆదర = ఆదరమైన; వృత్తి = ప్రవర్తన; తోన్ = తో; కదియునట్లుగన్ = కూడియుండునట్లుగా; చేయన్ = చేయవచ్చు; కద = కదా; అయ్య = అయ్యా; ఈశ్వరా = ఈశ్వరుడా / కృష్ణా. </div> </div> </div> <!--1-199 శ్రీకృష్ణా యదుభూషణా... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-199 శ్రీకృష్ణా యదుభూషణా... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/31.Srikrishna_Yadubhushana_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!<br> లోకద్రోహినరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా<br> నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!<br> నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణవాసుదేవుడు ఉత్తరగర్భంలో ఉన్న కురువంశాకురాన్ని పరిరక్షించి తన నివాసానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణతత్వం చక్కగా తెలిసికొన్న కుంతీదేవి ఆ గోపాలబాలకుని ఇలా స్తుతించింది. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> శ్రీకృష్ణా! నీవు యదువు, శూరుడు, వసుదేవుడు మొదలైన మహానుభావుల వంశానికి గొప్ప అలంకారం అయినవాడవు, నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాలగనియైన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడుచేసే రాజవంశాలను కాల్చి బూడిదచేసిన దయామయుడవు నీవు. పదునాలుగు లోకాలకూ ప్రభుడవు. దేవతల గుంపులకు, బ్రహ్మజ్ఞాన సంపన్నులకూ, గోవులకూ కలిగే ఆర్తిని హరించివేస్తావు. నీవు భక్తులైనవారికి పరమసుఖాన్ని చక్కగా ప్రసాదిస్తావు. నిత్యమైన దయకు నిధివైన ఓ స్వామీ! నాతండ్రీ!. సంసారంలో కట్టిపడవేసే బంధాలనే తీగలను త్రెంచివేయవయ్యా! నీకు మ్రొక్కుతాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> శ్రీకృష్ణా = కృష్ణమూర్తీ {కృష్ణ - నల్లనివాడు}; యదు భూషణా = శ్రీకృష్ణా {యదు భూషణా - యదు వంశమునకు భూషణము వంటి వాడు / కృష్ణుడు}; నర సఖా = శ్రీకృష్ణా {నరసఖ - అర్జునునకు సఖుడు / కృష్ణుడు}; శృంగార రత్నాకరా = శ్రీకృష్ణా {శృంగార రత్నాకర -శృగార రసమునకు సముద్రము వంటివాడు / కృష్ణుడు}; లోకద్రోహి నరేంద్ర వంశ దహనా = శ్రీకృష్ణా {లోకద్రోహి నరేంద్ర వంశ దహనా – దుష్ట రాజ వంశముల నాశనము చేయు వాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = శ్రీకృష్ణా {లోకేశ్వర - లోకములకు ఈశ్వరుడు / కృష్ణుడు}; దేవత = దేవతల; అనీక = సమూహమునకును; బ్రాహ్మణ = బ్రాహ్మణులకును; గోగణ = గోవుల మందకును; ఆర్తి = బాధలను; హరణా = హరించు వాడా / శ్రీకృష్ణా; నిర్వాణ సంధాయకా = శ్రీకృష్ణా {నిర్వాణ సంధాయిక - మోక్షమును కలింగించువాడు / కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = శ్రీకృష్ణా {నిత్యానుకంపానిధీ -నిత్యమైన దయకు నిలయమైనవాడు / కృష్ణుడు}. </div> </div> </div> <!-- భీష్మునికడకేగుట--> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;padding: 5px;"> <h3>భీష్మునికడకేగుట</h3> </div> <!--1-212 రాజట ధర్మజుండు... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-212 రాజట ధర్మజుండు... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/34.Rajata_Dharmajundu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> రాజఁట ధర్మజుండు, సురరాజ సుతుండట ధన్వి, శాత్రవో<br> ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం<br> యోజకుఁడైన చక్రి యఁట, యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ<br> య్యాజికిఁ దోడు వచ్చునఁట, యాపద గల్గుట యేమి చోద్యమో!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="Context"> అంపశయ్యపై వెలుగొందుతూ అవసానకాలాన్ని ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి దర్శించుకోవటానికి ధర్మరాజు తమ్ములతో బంధువులతో సర్వలోకబాంధవుడైన వాసుదేవునితో కలసి వెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు పడ్డ కష్టాలను, వారి భాగ్యసంపదను సంభావిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="pardham_content"> ధర్మదేవత కుమారుడు ధర్మరాజు రాజట. దేవేంద్రుని కుమారుడు అర్జునుడు గొప్ప విలుకాడట. పగవారి గుండెలలో గుబులు పుట్టించే గాండీవం ఆ అర్జునుడు ఉప యోగించే విల్లట. సర్వజనులకూ, సర్వవిధాలైన శుభాలను సమకూర్చే చక్రధారి కృష్ణుడు ఆ గాండీవికి సారథిగా ఉన్నాడట. పరమ భయంకరమైన గదను చేతబట్టిన భీమసేనుడు ఆ పోరులో తోడుగా ఉన్నాడట. ఇంత సాధన సంపత్తి ఉన్నా, నాయనలారా! మీకు ఆపద కల్గినదట! ఇది యెంత అబ్బురమైన విషయం! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> రాజు = రాజు; అఁట = అట; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సుర రాజ సుతుండు = అర్జునుడు {సుర రాజ సుతుడు – దేవతల రాజు యొక్క పుత్రుడు, అర్జునుడు}; అఁట = అట; ధన్వి = ధనస్సు ధరించు వాడు; శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకము = ఉద్వేగము; ఐన = అయి నట్టి; గాండివము = గాండివము; విల్లు = ధనస్సు; అఁట = అట; సారథి = నడిపించు వాడు; సర్వ = సమస్త; భద్ర = శుభములను; సంయోజకుఁడు = కలిగించు వాడు; ఐన = అయిన; చక్రి = చక్రధారి / కృష్ణుడు {చక్రి - చక్రము ధరించు వాడు, కృష్ణుడు}; అఁట = అట; ఉగ్ర = భయంకర మైన; గదా = గదను; ధరుఁడు = ధరించు వాడు; ఐన = అయి నట్టి; భీముఁడు = భీముడు; ఆ = ఆ; యాజి = యజ్ఞము చేసిన వాని / ధర్మరాజు; కిఁన్ = కి; తోడు = తోడుగా; వచ్చున్ = వస్తుంటాడు; అఁట = అట; ఆపద = విపత్తులు; కల్గుట = కలుగుట; ఏమి = ఎంత; చోద్యమో = విచిత్రమో కదా. </div> </div> </div> <!--1-217 ఆలాపంబులు మాని... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-217 ఆలాపంబులు మాని... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/35.Alaapambulu_Maani_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ<br> గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్య దృష్టిన్ విని<br> ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం<br> శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీ హరిన్ శ్రీహరిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> తాత భీష్ముడు తాను కోరినప్పుడు మరణం పొందేవరం తండ్రివలన పొందిన వాడు. తనకు మిక్కిలి ఆప్తులైన ఉత్తమ పురుషులు పాండవులు, పురుషోత్తముడైన వాసుదేవుడూ తన్ను సేవిస్తూ తన దగ్గర ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. చేయవలసిన పని ఏమీలేదు. దేహాన్ని వదలివేయాలని నిశ్చయించుకొన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అనవసరమైన మాటలను మానివేశాడు. మనస్సును బుద్ధికి అధీనంలో ఉండే విధంగా కూర్చుకొన్నాడు. చూపులన్నింటినీ శ్రీకృష్ణుని మోము మీదనే నిలిపి ఉంచాడు. ఆ మహాత్ముడు వాసుదేవుని దయతో నిండిన చూపులవలన యుద్ధమాడినపుడు ఒడలిలో గ్రుచ్చుకొన్న బాణపు ములుకులు పెడుతున్న బాధలన్నీ మూలముట్టుగా తొలగిపోయాయి. ఆనందం తనలో తాండవిస్తూ ఉన్నది. మిక్కిలి ఉత్తమమైన శీలం ప్రకాశిస్తూ ఉన్నది. అలా అన్నింటినీ చక్క చేసుకొని పాపాలనే ఏనుగుపంక్తులను రూపుమాపే శ్రీహరిని స్తుతించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఆలాపంబులు = మాటలు; మాని = మానేసి; చిత్తము = మనసును; మనీషా = ప్రజ్ఞతో; ఆయత్తమున్ = సిద్ధమైనదిగా; చేసి = చేసి; దృక్ = చూపుల; జాలంబున్ = సమూహమును / వలను; హరి = కృష్ణుని; మోము = ముఖము; పైన్ = మీద; పఱపి = నిలిపి ఉంచి; తత్ = అతని; కారుణ్య = దయతో కూడిన; దృష్టిన్ = దృష్టితో; వినిర్మూలీ = పూర్తిగా నిర్మూలనము; భూత = చేయ బడిన; శర = అమ్ముల వలన కలిగిన; వ్యధా = బాధల యొక్క; నిచయుఁడు = సమూహము గల వాడు; ఐ = అయ్యి; మోదించి = మిక్కిలి సంతోషము పొంది; భీష్ముండు = భీష్ముడు; సంశీలంబు = మంచి నడత; ఒప్పన్ = ఒప్పు చుండగ; నుతించెన్ = స్తుతించెను; కల్మష = పాపములనే; గజ = ఏనుగుల; శ్రేణీ = సమూహమును; హరిన్ = హరించు వానిని / కృష్ణుని; శ్రీహరిన్ = శ్రీకృష్ణుని. </div> </div> </div> <!-- భీష్మస్తుతి--> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;padding: 5px;"> <h3>భీష్మస్తుతి</h3> </div> <!--1-219 త్రిజగన్మోహన నీలకాంతిఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-219 త్రిజగన్మోహన నీలకాంతిఁ... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/36.Thrijaganmohana_Neelakanthi_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ<br> రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక<br> వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా<br> విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అంపశయ్యమీద హాయిగా మేను వాల్చి శ్రీకృష్ణ పరమాత్మను హృదయ దేవాలయంలో భద్రంగా నిలుపుకొని ఆనందసామ్రాజ్యంలో విహరిస్తున్నాడు శంతనుని కుమారుడు భీష్ముడు. అప్రయత్నంగా తనకు ఆత్మీయులైన పాండవులతో కలసి తాను ఉన్న చోటుకే వచ్చి నిలుచున్నాడు వాసుదేవుడు. ఆ పరమాత్ముని నోరారా కొనియాడుతున్నాడు భీష్ముడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మూడులోకాలు మురిసిపోయే నీలవర్ణంలో అలరారే దేహం పైపైకి కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. ఉదయకాలంలో సూర్యభగవానుని వంటి ఉత్తరీయం ఆ నల్లని దేహం మీద రంజిల్లుతున్నది. నిగనిగలాడే నల్లని ముంగురుల మొత్తాలు మోము అనే పద్మంమీద క్రమ్ముకొని దోబూచులాడుతున్నాయి. ఎంతసేపు చూచినా ఆ మొగం సొబగు ఇకచాలు అనిపించటం లేదు కదా. ఆ విధమైన స్వరూపంతో మా ముద్దులమనుమడు అర్జునుని కడకు చేరుకొంటున్న వన్నెచిన్నెలస్వామి కన్నయ్య నా హృదయంలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> త్రిజగత్ = మూడులోకములను; మోహన = మోహింపచేయగల; నీలకాంతి = నీలమైనకాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగా; ప్రాభాత = ఉదయకాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు - సూర్యుని; ప్రభమైన = కాంతికలదైన; చేలము = వస్త్రము; పయిన్ = వంటి పైన; రంజిల్లన్ = ఎర్రగా ప్రకాశి స్తుండగ; నీలాలక = నల్లని ముంగురులయొక్క; వ్రజసంయుక్త = సమూహముతో కూడి న; ముఖారవిందము = ముఖము అనే పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబై = సేవింప దగినదై; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరియుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక;. </div> </div> </div> <!--1-220 హయరింఖాముఖ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-220 హయరింఖాముఖ... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/37.Hayarinkhamukhadhuli_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> హయరింఖాముఖ ధూళి ధూసరపరిన్యస్తాలకోపేతమై<br> రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో<br> జయమున్ పార్ధున కిచ్చువేడ్క నని నా శస్త్రాహతింజాల నొ<br> చ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పరమ భాగవతోత్తముడు గంగమ్మ ముద్దులబిడ్డడు, జ్ఞానసంపన్నుడు ఇంకా శ్రీకృష్ణపరమాత్మను గురించి యిలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఆ కన్నయ్య మహానుభావుడు ఊహల కందని గొప్పతనం కలవాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తూ పరమాత్మ అని తెలిసి కూడా నేను యుద్ధధర్మాన్ని పాటించి ఆయన దేహాన్ని కుళ్ళబొడిచాను. అయినా ఆయన నన్ను చంపటమో, యుద్ధభూమినుండి రథికుడైన అర్జునుని తొలగించుకొని పోవటమో చేయక ఏది ఏమైనా అతనికి జయమునే కలిగించాలని గొప్ప ఉత్సాహంతో పోరు సాగించిన మహానుభావుడు. గుఱ్ఱాల డెక్కల కొనల తాకిడికి లేచిన దుమ్ముతో నిండిన ముంగురులు మొగంమీద చిందులు త్రొక్కుతున్నాయి. వడివడిగా గుఱ్ఱాలను తోలటం వలన మోము అంతా చెమట బిందువులతో ఒప్పులకుప్పగా ప్రకాశిస్తున్నది. పరమమనోహరమైన ఆ మొగంతో అలరారే ఆ స్వామిని అలుపూ సొలుపూ లేకుండా భావిస్తూనే ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> హయ = గుర్రముల; రింఖా = గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; ధూసర = బూడిద వర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = అయి; రయ = వేగము వలన; జాత = పుట్టి నట్టి; శ్రమ = అలసట వలన పట్టిన; తోయ = నీటి / చెమట; బిందు = బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయ్యి; రాజిల్లు = ఎర్ర నైన; నెఱ = నిండు; మోము = ముఖము; తోన్ = తో; జయమున్ = గెలుపును; పార్థున = అర్జును; కున్ = కు; ఇచ్చు = ఇవ్వవలే ననే; వేడ్కన్ = కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నాయొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బలవలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్ = మహిమాన్వితుని; మది = మనసు; లోన్ = లో; చింతింతున్ = స్మరింతును; అశ్రాంతమున్ = విడువకుండా. </div> </div> </div> <!--1-221 నరుమాటల్ విని... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-221 నరుమాటల్ విని... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/38.Narumatal_Vini_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో<br> పరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచున్<br> పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు నీ<br> పరమేశుండు మెలంగుచుండెడు మనఃపద్మాసనాసీనుడై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఎప్పుడో కురుక్షేత్ర మహాసంగ్రామంలో తనముందు కదలాడిన చైతన్యమూర్తి శ్రీకృష్ణుడే అంపశయ్య మీద హాయిగా పవ్వళించిన భీష్ముని హృదయమందిరంలో మెరసి పోతున్నాడు. ఆ అనుభూతిని మాటలతో అందరికీ అమృతప్రసాదంలాగా అందిస్తున్నాడు భక్త శిఖామణి భీష్ముడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> కౌరవులూ, పాండవులూ కురుక్షేత్రంలో పోరాటానికి తలపడి నిలిచి ఉన్నారు. హఠాత్తుగా పాండవపక్షంలోని పరమవీరుడు పార్థుడు ‘అచ్యుతా! నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టు. నేనెవరితో పోరాడాలో ఒకసారి చూస్తాను’ - అన్నాడు. కన్నయ్యకు ఆ మాటలు విన్నంతనే నవ్వు వచ్చింది. పగవారు పట్టిపట్టి పరికిస్తూ ఉండగా రెండు సేనల మధ్యలో ఉన్న నేలమీద రథాన్ని నిలబెట్టాడు పార్ధసారధి. శత్రువులైన రాజులనందరినీ చూపిస్తున్నాడు. ఆ చూపులతోనే పరరాజుల ఆయువులన్నింటినీ విలాసమైన ఒక ఆటగా లాగివేసుకుంటున్నాడు. అట్టి పరమాత్మ నా మనస్సు అనే పద్మంలో సుఖంగా నెలకొని మెలగుతూ ఉండాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> నరు = అర్జునుని; మాటల్ = (విహ్వల) పలుకులను; విని = విన్నవాడై; నవ్వుతో = చిరునవ్వుతో; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యమక్షోణి = మధ్య ప్రదే శములో; పరులు = శత్రువులు; ఈక్షింపన్ = చూస్తుండగా; రథంబున్ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువులైన; భూపాల = రాజులయొక్క; ఆవళిన్ = సమూహ మును; చూపుచున్ = చూపెడుతూ; పర = శత్రువులైన; భూప = రాజులయొక్క; ఆయు వులు = ప్రాణములు; ఎల్లన్ = అన్నిటిని; చూపులన = చూపులతో; శుంభత్ = మెరు స్తున్న; కేళి = విలాసముతో; వంచించున్ = లాగికొనుచు; ఈ = ఈ; పరమేశుండు = పరమమైన హరి; హృత్ = నాహృదయమనే; పద్మాసనాసీనుడై = పద్మమునే ఆసనముగా స్వీకరించినవాడై; వెలుంగుచు = ప్రకాశిస్తూ; ఉండెడును = ఉండు గాక; </div> </div> </div> <!--1-222 తనవారిఁ జంపఁ జాలక... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-222 తనవారి చంపజాలక... (కందము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/39.Thanavaari_Champajalaka_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> తనవారి చంపజాలక<br> వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్<br> ఘన యోగవిద్యఁ బాపిన<br> మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పరమభాగవతశిఖామణి భీష్ముడు శ్రీకృష్ణవాసుదేవుని జ్ఞానకిరణాల ప్రసారాన్ని గురించి యిలా తన హృదయంలో ముచ్చటించుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అతని పేరు విజయుడు. అది ఆషామాషీగా రాలేదు. అనేక యుద్ధాలలో సాధించిన గెలుపులకు సంకేతంగా వచ్చింది. అటువంటి మహావీరుడు అర్జునుడు తప్పనిసరిగా గెలువవలసిన కురుక్షేత్ర మహాసంగ్రామం దగ్గరకు వచ్చేసరికి నీరుకారిపోయాడు. చంపవలసిన వారందరూ తనవారే. ఎలా చంపటం?! ఇదీ అతని శంక. ఈ శంక కూడా ఆషామాషీగా పోయేది కాదని సర్వజ్ఞుడైన వాసుదేవునికి తెలుసు. అందుకని ఘనమైన యోగ విద్యను ఉపదేశింపవలసి వచ్చింది. అదే యోగశాస్త్రమైన భగవద్గీత. అది వాసుదేవుని జ్ఞానాస్త్రం. దానితో అర్జునుని శంక నామరూపాలు లేకుండా పోయింది. గీతోపదేశం చేసిన జ్ఞానమూర్తి కనుకనే ఆయన మునులందరికీ వంద్యుడైనాడు. ఆ మహాత్ముని పాదాలమీది భక్తి నాకు అనుక్షణమూ గుండెగుడిలో ఘంటల మోతలాగా మ్రోగుతూ ఉండాలి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> తనవారిన్ = తన వారిని; చంపన్ = చంపుట; చాలక = చేయలేక; వెనుకకున్ = వెనక్కి; పోన్ = వెళ్లుటను; ఇచ్చగించు = కోరుతున్న; విజయుని = అర్జునుని; శంకన్ = సందేహమును; ఘన = గొప్ప; యోగ = యోగమును గూర్చిన; విద్య = విద్యవలన; బాపిన = పోగొట్టిన; ముని = మునులచే; వంద్యుని = స్తుతింపబడువాని - కృష్ణుని; పాద = పాదములమీది; భక్తి = భక్తి; నాకున్ = నాకు; మొనయున్ = ఉద్భవించును గాక. </div> </div> </div> <!--1-221 కుప్పించి యెగసినఁ... (సీసము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-221 కుప్పించి యెగసినఁ... (సీసము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/42.Kuppinchi_Yegasina_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ<br> ఉఱికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల<br> చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార<br> నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మఱల దిగువ<br> <br> <b>(తేటగీతి)</b><br> <br> కరికి లంఘించు సింహంబు కరణి మెరసి<br> నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు<br> విడువు మర్జున! అనుచు మద్విశిఖ వృష్టి<br> తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> పోరు అతిక్రూరంగా జరుగుతున్నది. పరశురామునంతటి వానిని కదలించి కుదిలించి వైచిన భీష్ముడు ప్రళయకాలంలో రుద్రునిలాగా పాండవసేనను చీల్చి చెండాడుతున్నాడు. పరమశివుని బాణవిద్యలో మెప్పించిన అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. తన ప్రతిజ్ఞను కూడా ప్రక్కనపెట్టి భక్త రక్షణకళలో పేరుపొందిన కృష్ణుడు భీష్ముణ్ణి చంపి అర్జునుని కాపాడటానికి సంసిద్ధుడైనాడు. అప్పటి శ్రీకృష్ణుని సంరంభాన్ని ఇప్పటిదాకా హృదయంలో పదిలంగా నిలుపుకొన్న భీష్ముడు దానిని కమనీయ వాక్కుల ద్వారా సంభావిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> శ్రీకృష్ణుడు రథంలో సారధిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపులో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో క్రిందికి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు కంపించిపోయింది. తల నరకటానికి చక్రాన్ని చేతిలో అమర్చుకొని తనపైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకొన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. ‘స్వామీ! నిన్నేనమ్ముకొన్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు. నా పరువు కాపాడు’ అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగుమీదికి దూకే సింహంలాగా మెరసిపోతూ ‘ఉండు, అర్జునా! నన్ను వదలిపెట్టు. ఈనాడు భీష్ముణ్ణి చంపుతాను. నిన్ను కాపాడుతాను’ అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి, నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> కుప్పించి = దుమికి; యెగసిన = పైకిలేచిన; కుండలంబుల = కుండలముల యొక్క; కాంతి = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుమికిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు లోన = పొట్టలోపల ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడివలన; జగతి = భూమి; కదల = కదలగా; చక్రంబు = చక్రమును; చేపట్టి = చేతిలో ధరించి; చనుదెంచు = వచ్చుచున్న; రయమున = వేగము వలన; పైనున్న = ఒంటిపై ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = వస్త్రము; జాఱ = జారగా; నమ్మితి = నిన్నే నమ్ముకొన్నాను; నాలావు = నా బలవిక్రమాలను; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకు = చేయవద్దు; మన్నింపుము = మన్నించు; అని = అని; క్రీడి = అర్జునుడు; మరల = వెనుకకు; దిగువ = లాగు చుండగా;<br> <br> కరికి = ఏనుగుపైకి; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్ముని = భీష్ముని; చంపుదు = సంహ రించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచు = అంటూ; మత్ = నా యొక్క; విశిఖ = బాణాల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చెడి; దేవుండు = భగవంతుడు; నాకు = నాకు; దిక్కు = శరణమగు గాక. </div> </div> </div> <!--1-224 తనకున్ భృత్యుఁడు... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-224 తనకున్ భృత్యుఁడు... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/40.Thankun_Bhruthyudu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న<br> ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్<br> మునికోలన్వడిఁ జూపి ఘోటకములన్మోదించి తాడించుచున్<br> జనులన్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> స్వామి భక్తులను సంరక్షించే కళలో గొప్ప ఉత్సాహం కలవాడు. కనుక ఆ ప్రయోజనం కోసం తన స్థాయికి తగని ఏ పనికైనా, సిద్ధపడతాడు. అందుకే అర్జునుని రథంలో కూర్చుని గుఱ్ఱాలను తోలడానికి పూనుకున్నాడు. అంటే మహాభక్తితో భక్తుల సేవలందుకొనే స్వామి సేవకుడయ్యాడు. దానిని భీష్ముడు ఇలా భావిస్తున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఈ అర్జునుడు నాకు, తల్లికి కొడుకులాగా కంటికి రెప్పలాగా, కాపాడవలసిన వాడు. వీనిని కాపాడటం మహాధర్మం అని అతని రథాన్ని నడపటానికి పూనుకొన్నాడు కృష్ణుడు. సారథులను ఎందరినో చూచాను. కానీ ఈయన పగ్గాలు పట్టుకొన్న తీరుతెన్నులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక చేతిలో పగ్గాలూ, మరొక చేతిలో చెర్నాకోల. దానితో పొగరు గుఱ్ఱాలను ప్రమోదంతో చిన్ని చిన్ని దెబ్బలు తగిలిస్తూ – అబ్బే తగిలిస్తున్నట్లు కనిపిస్తూ- యుద్ధరంగంలోని జనులను మోహపెడుతూ ఉండే పరమోత్సాహంగల స్వామిని తనివితీరా కొనియాడుతాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> తనకున్ = తనకు; భృత్యుఁడు = సేవకుడు; వీనిన్ = ఇతనిని; కాఁచుట = కాపాడుట; మహాధర్మంబు = ముఖ్యమైన ధర్మము; ఒమ్మంచు = పొమ్ము అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గము లను; చేన్ = చేతితో; చోద్యంబుగాన్ = ఆశ్చర్యకరముగ; పట్టుచున్ = పట్టుకొని; ముని కోలన్ = ములుగర్రను; వడిన్ = త్రిప్పువేగమును; చూపి = ప్రదర్శిస్తు; ఘోటకములన్ = గుర్రములను; మోదించి = హుషారు చేస్తూ; తాడించుచున్ = శబ్దం వచ్చేలా కొడుతూ; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయు చున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహము గల వానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను. </div> </div> </div> <!--1-227 ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-227 ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/41.Oka_Suryundu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పో<br> లిక నే దేవుడు సర్వకాలము మాహాలీలన్ నిజోత్పన్న జ<br> న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ<br> పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ఆయన మన కళ్ళముందు అందరిలాగా తిరుగుతూ మామూలు మనిషే అనిపి స్తాడు. కానీ జ్ఞానసంపన్నుడు భీష్ముని చూపునకు ఆయన పరమాత్మయే. ఆ పరమరహస్యాన్ని ఎంత పరమసుందరంగా తెలియజేస్తున్నాడో ఆచార్య భీష్ములు గమనిద్దాం. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ప్రతి దినం మనం ఆకాశంలో ఈ అంచున ఉదయించి ఆ అంచున అస్తమించే అంబరమణి సూర్యభగవానుని చూస్తూనే ఉంటాం. నిజానికి ఆయన ఒక్కడే. కానీ చూచే ప్రతివ్యక్తీ నా సూర్యుడు, నా వాడే సూర్యుడు అనుకొనేట్లుగా కనపడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కృష్ణభగవానుని రూపంతో కానవస్తున్న ఈ దేవుడు అనంతమైన లీలతో తననుండి పుట్టిన ప్రాణుల గుంపుల హృదయాలనే పద్మాలలో నానావిధాలైన గొప్పగొప్ప రూపాలతో కానవస్తూ ఉంటాడు. అట్టి పరమాత్ముణ్ణి, మనస్సులో, మాటలో, చేష్టలో సహజంగా ఏర్పడే మాలిన్యాన్ని పిసరంతకూడా మిగులకుండా తొలగించుకొని ప్రార్థిస్తూ ఉంటాను. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = ఎల్ల; జీవులు = ప్రాణులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = వేరొకడు వేకొకడు; ఐ = అయ్యి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; ఏ = ఏ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్త మైన; కాలము = కాలము నందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తన నుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున పుట్టునది, పద్మము}; నానావిధ = అనేక రకములుగా; ఆనూన = నిండి ఉన్న; రూపకుఁడు = రూపములు కల వాడు; ఐ = అయ్యి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు}; నేన్ = నేను; ప్రార్ఠింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; ఐ = అయ్యి. </div> </div> </div> <!-- దశమ అధ్యాయం --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;padding: 5px;"> <h3>దశమ అధ్యాయం</h3> </div> <!--1-247 నీ పాదాబ్జము... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-247 నీ పాదాబ్జము... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/43.Nee_Paadabjamu_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం<br> తాపధ్వంసిని యౌఁ గదా! సకలభద్రశ్రేణులం బ్రీతితో<br> నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని<br> ర్వ్యాపారంబు గదయ్య! చాలరు గదా! వర్ణింప బ్రహ్మాదులున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కురుకులపితామహుడు భీష్ముడు మానుషదేహాన్ని వదలివైచి తన స్థానానికి వెళ్ళి పోయాడు. ధర్మరాజు అతనికి శాస్త్రం చెప్పిన విధంగ పరలోకక్రియలు భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. తరువాత ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. జగన్నాయకుడు శ్రీ కృష్ణుడు తిరిగి తన నివాసం అయిన ద్వారకకు చేరుకొన్నాడు. అక్కడి ప్రజలు ఆనందంతో అతనిని ఇలా పూజిస్తున్నారు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> కృష్ణా! వాసుదేవా! ఈ పదునాలుగు లోకాలనూ సృష్టించే బ్రహ్మదేవునకు నీ అడుగుదామర పూజింపదగినది కదా! నిన్ను సేవిస్తే సంసార బంధమైన తాపమంతా రూపుమాసిపోతుంది. నీవే తప్ప మరొక దిక్కులేదు అని నిన్ను చేరుకొన్నవారికి సమస్త కల్యాణ పరంపరలను ప్రీతితో నీవు కూరుస్తావు. నీవు కాలానికి కూడా ప్రభుండవు. నీవు సంకల్పిస్తే కాలం కదలకుండా మెదలకుండా నిలిచిపోతుంది. నీ గుణగణాలను వర్ణించటానికి నాలుగు నోళ్ళున్న బ్రహ్మదేవుడు, వేయి నోళ్ళున్న ఆదిశేషుడు మొదలైనవారు కూడా శక్తిలేనివారే అవుతారు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> నీ = నీయొక్క; పాద = పాదము అనే; అబ్జము = పద్మము; బ్రహ్మ = బ్రహ్మచేత; పూజ్యము = పూజింపదగినది; కదా = కదా; నీ = నీమీది; సేవ = భక్తి; సంసార = సంసారమందలి; సంతాప = బాధలను; ధ్వంసిని = నాశనముచేయగలది; ఔన్ = అవును; కదా = కదా; సకల = సమస్త; భద్ర = శుభముల; శ్రేణులన్ = పంక్తులను; ప్రీతి = ప్రేమ; తోన్ = తో; ఆపాదింతు = సంక్రమింప చేయుదువు; కదా = కదా; ప్రపన్నులు = భక్తుల; కున్ = కు; కాల = కాలమునకు; అధీశ = అధిపతీ; కాలంబు = కాలము; నిర్వ్యాపారంబు = ప్రవర్తనలు లేనిది; కదా = కదా; అయ్య = అయ్యా; చాలరు = సరిపోరు; నినున్ = నిన్ను; వర్ణింపన్ = వర్ణించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మొదలగువారును. </div> </div> </div> <!--1-256 జలజాతాక్షుడు సూడ... (ఉత్పలమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-256 జలజాతాక్షుడు సూడ... (ఉత్పలమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/44.Jalajathakshudu_Chudanoppe_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> జలజాతాక్షుడు చూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతో, చామరం<br> బులతో, పుష్పపిశంగచేలములతో, భూషామణిస్ఫీతుడై<br> నలినీబాంధవుతో, శశిద్వయముతో, నక్షత్ర సంఘంబుతో<br> బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణచంద్రుడు ద్వారకలో రాజమార్గంలో విలాసంగా సంచరిస్తూ కానవస్తున్నాడు. ఆదివ్యసుందర మూర్తిని పురకాంతలు చూస్తూ పులకలెత్తిన దేహాలతో పొంగిపోతున్నారు. అప్పుడప్పుడే విరిసిన పూవులను కృష్ణునిపై వర్షిస్తున్నారు. అప్పటి కన్నయ్య ఉన్న తీరు ఎంత మనోజ్ఞంగా ఉన్నదో! </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెలమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదలుతున్నాడు. పైన తెల్లని గొడుగు. అటు ఇటూ వింజామరలు. పూవులుకుట్టిన పచ్చనికాంతితో కనులపండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు. నిలువెల్లా పెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు మొదలైనవి కల నగలు. ఆహా! ఎంత మనోహరరూపం. ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం. ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు రెండు చందమామలలా ఉన్నాయి. నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపుతీగలను స్ఫురింపజేస్తున్నాయి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> జలజాతాక్షుడు = పద్మములవంటికన్నులు కలిగిన కృష్ణుడు; చూడన్ = చూచు టకు; ధవళచ్ఛత్రంబుతో = తెల్లనిగొడుగుతో; చామరంబు లతో = చామరములతో; పుష్ప = పుష్పములతో; పిశంగ = వంగపండురంగు; చేలముల తో = వస్త్రములతో; భూషామణిస్ఫీతుడై = భూషణములలోని మణులు అధికముగా కల వాడై; నలినీభాంధవు = పద్మముల బంధువైన సూర్యునితో; శశిద్వయముతో = చంద్రునితో; నక్షత్రసంఘంబు తో = తారకలసమూహముతో; బలభిచ్చాపముతో = ఇంద్రధను స్సుతో; తటిల్లతికతో = మెరుపులతో; భాసిల్లు = ప్రకాశించు; మేఘాకృతిన్ = మేఘము యొక్క ఆకృతితో; ఒప్పె = చక్కగా ఉన్నాడు. </div> </div> </div> <!--శ్రీకృష్ణ నిర్యాణం --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;padding: 5px;"> <h3>శ్రీకృష్ణ నిర్యాణం</h3> </div> <!--1-348 అన్నా ఫల్గున... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-348 అన్నా ఫల్గున... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/45.Anna_Phalguna_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా<br> పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ<br> మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం<br> దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణస్వామి అవతారప్రయోజనం ముగించుకొని తన వైకుంఠానికి వెళ్ళిపోయా డు. అర్జునుడు బరువెక్కిన హృదయంతో ద్వారకకు వెళ్ళి చేయవలసిన పనులన్నీ చేసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. కళాకాంతులులేని ఆతని మోమును చూచి కంగారుపడి ద్వారక లోని వార్తలడుగుతూ ధర్మరాజు ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు, ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> అన్నా = నాయనా; ఫల్గున = అర్జునా; భక్త = భక్తుల యందు; వత్సలుండు = ఆపేక్ష కల వాడు; బ్రహ్మణ్యుండు = వేద ధర్మమును నిలుపు వాడు; గోవిందుఁడు = గోవులకు ఒడయుడు / కృష్ణుడు; ఆపన్ననీక = ఆపద చెందిన వారికి; శరణ్యుఁడు = శరణు వేడదగ్గ వాడు / కృష్ణుడు; ఈశుఁడు = అధిపతి / కృష్ణుడు; జగత్ = జగత్తులకు; భద్ర = భద్రమును; అనుసంధాయి = కలుగ జేయు వాడు - కృష్ణుడు; శ్రీమాన్ = శ్రీమంత మైన; నవ్య = లేత; అంబు = నీటిలో; జ = పుట్టిన (పద్మము) యొక్క; పత్ర = పత్రము వంటి; నేత్రుడు = కన్నులు ఉన్నవాడు - కృష్ణుడు; సుధర్మా = సుధర్మామండపము యొక్క; మధ్య = మద్యన ఉన్న; పీఠంబునన్ = ఆసనమునందు; ఉన్నాఁడా = ఉన్నాడా; బలభద్రున్ = బలభద్రునితో; కూడి = కలిసి ఉండి; సుఖి = సుఖముగ ఉన్నవాడు; ఐ = అయ్యి; ఉత్సాహి = ఉత్సాహముతో ఉన్న వాడు; ఐ = అయ్యి; ద్వారకన్ = ద్వారకలో. </div> </div> </div> <!--1-350 మున్నుగ్రాటవిలో... (శార్దూలం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-350 మున్నుగ్రాటవిలో... (శార్దూలం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/46.Munnugratavilo_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో<br> సన్నాహంబున కాలకేయుల వడిం జక్కాడుచో ప్రాభవ<br> స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచో<br> కన్నీరెన్నడు తేవు తండ్రి! చెపుమా! కల్యాణమే? చక్రికిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> ద్వారకలో శ్రీకృష్ణవాసుదేవుడు తనువు చాలించి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యానందమూర్తి. కానీ భక్తులు ఆయన అవతారం చాలించటం తట్టుకోలేరుకదా! అందునా అర్జునునివంటి నిత్యసన్నిహితుల గుండెలు కుతకుతలాడిపోతాయి కదా! అటువంటి అర్జునుని చూస్తున్న అన్న ధర్మరాజునకు గుండె బరువెక్కి పోయింది. . తమ్మునితో ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> నాయనా! అర్జునా! నీకు లోగడ మహాభయంకరమైన కష్టాలు ఎన్నో వచ్చాయి. అతిభయంకరమైన అడవిలో పందికోసం మూడుకన్నుల దేవుడు పరమేశ్వరునితో పోరాడావు. కాలకేయులనే క్రూరరాక్షసులను ఒక్కడవై తుక్కుదూగరగా కొట్టావు. గుండె దిటవు చెడగొట్టుకొని గంధర్వులకు దొరకిపోయి కుమిలిపోతున్న కురుకుల సార్వభౌముడు దుర్యోధనుని కాపాడటానికి గంధర్వులను తరిమికొట్టావు. ఇంకా ఇటువంటి మహాసాహస కార్యాలు చేసిన ఏ సమయంలోనూ నీవు కన్నులలో నీరుపెట్టలేదు. చెప్పు, త్వరగా చెప్పు. బాబూ! చక్రంతో దుష్టులను తునిమితూటాడే మహాత్ముడు శ్రీకృష్ణుడు క్షేమమేనా? </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> మున్ను = ఇంతకు ముందు; ఉగ్రాటవిలో = భయంకరమైన అడవిలో; వరాహ మునకై = పందికై; ముక్కంటితో = మూడుకన్నులు కల శివునితో; పోరుచో = యుద్ధము చేయునప్పుడు కాని; సన్నాహంబునన్ = పోరుకు దిగినప్పుడు కానీ; కాలకేయులన్ = కాలకేయులను; అనిన్ = యుద్ధములో; జక్కాడుచోన్ = చెండాడుచున్నప్పుడు కాని; ప్రాభవస్కన్నుండై = వైభవమును కోల్పోయినవాడై; చను = వెళ్లు; కౌరవేంద్రు = దుర్యో ధనుని, పనికై = పనికై; గంధర్వులన్ = గంధర్వులను; తోలుచో = పారత్రోలునప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొనిరావు; తండ్రి = నాయనా; చెపుమా = చెప్పుము; చక్రికిన్ = కృష్ణునికి; కల్యాణమే = శుభమేనా. </div> </div> </div> <!--1-358 మన సారథి, మన సచివుడు... (కందము). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-358 మన సారథి, మన సచివుడు... (కందము). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/47.Mana_Saradhi_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> మన సారథి, మన సచివుడు<br> మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్<br> మన విభుడు, గురువు, దేవర<br> మనలను దిగనాడి చనియె మనుజాధీశా!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అన్న మాటలు వింటున్న అర్జునునకు ఉల్లం మరింత ఎక్కువగా తల్లడిల్లి పోతున్నది. మాట పెగలటంలేదు. ఎలాగో తెముల్చుకొని కన్నీళ్ళు తుడుచుకొని నిట్టూర్పులు నిగుడిస్తూ ఇలా అన్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మహారాజా! మనందరినీ రణరంగంలోనూ , జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్నిసమయాలలోనూ సరియైన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన యింటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి చుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడనే వదలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> మనుజాధీశా = రాజా! మన = మన; సారథి = మార్గదర్శకుడు / రథసారథి; మన = మన; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; మన = మన; వియ్యము = వియ్యంకుడు; మన = మన; సఖుండు = స్నేహితుడు; మన = మన; బాంధవుఁడున్ = బంధువు; మన = మన; విభుడు = వైభవమునకు కారకుడు; గురుడు = పెద్ద దిక్కు; దేవర = దైవస్వరూపుడు; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; చనియెన్ = పోయాడు; </div> </div> </div> <!--1-360 ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-360 ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/48.Ibhajidveerya_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్<br> సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపగా<br> అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంతాశిరో<br> జ భరశ్రీలు హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కృష్ణుడు తనకూ తనవారికీ చేసిన ఉపకారాలనూ, కంటికి రెప్పలా కాపాడిన సన్నివేశాలనూ తలచుకొని తలచుకొని, తక్కిన సోదరుల ముందర అన్నకు చెప్పుకొని కకావికలై పోతున్నాడు గాండీవి అయిన అర్జునుడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ఏనుగులను చీల్చిచెండాడే గొప్పశక్తిగల సింహంవంటి పరాక్రమంగల ధర్మరాజా! నీ ధర్మపత్ని ద్రౌపది రాజసూయమూ, అశ్వమేధమూ మొదలైన మహాయజ్ఞాలు చేసినప్పుడు నీతోపాటు అవభృథస్నానం చేసిన గొప్పపవిత్రమూర్తి. అట్టి ఆమె కొప్పును పట్టుకొని నీచులైన నీపగ వారు ఈడ్చుకొని వచ్చారు. దానితో పగపట్టిన నాగుపామువలె చంద్రునివంటి మోముగల ఆ యిల్లాలు కొప్పును ముడువక దుఃఖంతో ఎంతోకాలం అలాగే ఉన్నది. అట్టి ఆ ఉత్తమవనితకు అభయం ఇచ్చి ఆ పురుషోత్తముడు ఆ పరమనీచులను పరిమార్చి వారి ఇల్లాండ్రను విధవలనుగా చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. ప్రతిన ననుసరించి నీ పగవారి పడతుల తలవెంట్రుకల సౌభాగ్యం అంతరించి పోయేవిధంగా వారిని విధవలను చేశాడు కదా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఇభజిద్వీర్య = సింహమువంటి పరాక్రమము కలవాడా; మఖాభిషిక్తమగు = యజ్ఞమునందు అవభృథస్నానము చేసినది అయినట్టి; నీ యిల్లాలి = నీ భార్య; ధమ్మిల్ల మున్ = కొప్పును; సభలో = సభలో; శాత్రవులు = శత్రువులు; ఈడ్చినన్ = ఈడ్చి లాగగా; ముడువక = ముడి వేసుకొనక; ఆ చంద్రాస్య = ఆ సుందరి; దుఃఖింపఁగా = బాధపడుతుండగా; అభయంబు = శరణు; ఇచ్చి = ఇచ్చి; ప్రతిజ్ఞ = ప్రతిన; సేసి = చేసి; భవదీయారాతి = నీ శత్రువుల; కాంతా = స్త్రీల యొక్క; శిరోజ = తలవెంట్రుకల; భర = నిండుతనము అనే; శ్రీలన్ = సంపదలను; విధవలై = భర్త పోయినవాళ్ళై; సౌభాగ్యముల్ = సౌభాగ్యములు వీడఁగన్ = తొలగిపోగా; హరింపఁడే = పోగొట్టలేదా. </div> </div> </div> <!--1-361 వైరుల్ గట్టిన పుట్టముల్…. --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-361 వైరుల్ గట్టిన పుట్టముల్…. </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/49.Vyrulgattina_Puttamul_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నావల్లభుల్<br> రారీవేళ ఉపేక్షసేయ దగవే? రావే? నివారింపవే?<br> లేరే? త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్<br> కారుణ్యంబున భూరివస్త్రకలితంగా చేయడే; ద్రౌపదిన్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కృష్ణుడు తనవారియెడల చూపిన కారుణ్యాన్ని మళ్ళీమళ్ళీ సంభావిస్తూ అర్జునుడు అన్నతో ఇలా అంటున్నాడు ద్రౌపది నిండుసభలో పొందిన పరాభవాన్నీ, దానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రతిక్రియనూ ఈ పద్యంలో స్మరిస్తున్నాడు ఆ మహాత్ముడు . </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> పగవారు పరమనీచులు. నీతిమాలినవారు. గొప్పకులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయినపాంచాలిని నిండుసభలో బట్టలను ఊడదీయటానికి ప్రయత్నించారు. అన్నా! కృష్ణా! నా భర్తలు ఈ నీచమైన పనిని నిలువరించటానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా! రావయ్యా! ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా! నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా! అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి ఆమెకు పెద్దయెత్తున వస్త్రాలనిచ్చి కాపాడాడు కదయ్యా! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> వైరుల్ = శత్రువులు; కట్టిన = నేను కట్టుకొన్న; పుట్టముల్ = వస్త్రములను; విడువఁగా = విప్పుతుండగా; వారింపన్ = ఆపుటకు; నా వల్లభుల్ = నా భర్తలు; రారు = వచ్చుట లేదు; ఈ వేళన్ = ఈ సమయమున; ఉపేక్షన్ = ఆలస్యమును; చేయన్ = చేయుటకు; తగవే = తగదు; రావే = రమ్ము; నివారింపవే = అడ్డగింపుము; ఏ త్రాతలు = రక్షించేవారు ఎవరూ; లేరు = లేరు; కృష్ణా = శ్రీకృష్ణా; అంచున్ = అంటూ; సభలో = సభలో; లీనాంగియై = ఒదిగిన శరీరముకలదై; కుయ్యిడన్ = మొరపెట్టుకొనగా; కారుణ్యంబున = దయతో; ద్రౌపదిన్ = ద్రౌపదిని; భూరివస్త్రకలితంగా = అత్యధికములు అయిన <b>{భూరి - మిక్కిలి పెద్ధ సంఖ్య, 1 తరువాత 32 సున్నాలు};</b> వస్త్రములు కలుగునట్లుగ; చేయఁడే = చేయలేదా. </div> </div> </div> <!--1-364 గురుభీష్మాదుల... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-364 గురుభీష్మాదుల... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/50.Guru_Bheeshmadula_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> గురుభీష్మాదుల గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో<br> గురుశక్తిన్ రథయన్తయై, నొగలపై కూర్చుండి, యా మేటి నా<br> శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయురుద్యోగత<br> త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నాకిచ్చుచున్.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> అర్జునుడు శ్రీకృష్ణదేవుని కరుణను ఇంకా ఇలా తలచుకుంటూ అన్నకు విన్నవించుకుంటున్నాడు. తాను పార్థుడు. ఆయన పార్థసారథి. జగన్నాటక ప్రవర్తకుడు తనకు సారథి కావటం ఎంతటి మహాభాగ్యం! </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> మనకు ఎదిరిపక్షంలో ఉన్నవారు దేవతలకు కూడా అడలు పుట్టింపగల ద్రోణుడు, భీష్ముడు మొదలైనవారు. వారు గొప్పగొప్ప వ్యూహాలు పన్నుకొని పోరికి శూరులై నిలిచి ఉన్నారు. ఈ స్వామి నా రథానికి సారథి. చాలా గొప్పశక్తిని నింపుకొని బండి నొగలపై కూర్చుండినాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి పగవారిమీద బాణాలు గుప్పిస్తూ ఉన్నాను. కానీ అవి ఆ పోటుమగలను చేరకముందే వారి బలాన్నీ ఉత్సాహాన్నీ ఆయువునూ, పూనికనూ, శ్రద్ధనూ చూపులతోనే రూపుమాపివేశాడు. ఆపనితో నాకు పిక్కటిల్లిన ఉత్సాహాన్ని పెంపొందించాడు. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> గురు = ద్రోణుడు; భీష్మాదులన్ = భీష్ముడు మొదలగువారితో; కూడి = కలిసి; పన్నిన = రచించిన; కురు = కౌరవవంశపు; క్షోణీశ = రాజుల; చక్రంబులో = సైనికుల దండులో; గురు = గొప్ప; శక్తిన్ = శక్తితో; రథయంతయై = సారథిగా; నొగలపై = రథమునకు ముందు భాగములో; కూర్చుండి = కూర్చొని; ఆ = ఆ; మేటి = సమర్థుడు; నా = నాయొక్క; శరముల్ = బాణములు; వాఱకముందే = వాడకముందే; వారల = వారియొక్క; బల = బలము; ఉత్సాహ = ఉత్సాహము; ఆయుః = ఆయువు; ఉద్యోగ = ప్రయత్నములు; తత్పరతల్ = లక్ష్యములను; చూడ్కులన్ = చూపులతోనే; సంహరించెన్ = నాశనము చేసి; అమిత = మిక్కిలి; ఉత్సాహంబున్ = ఉత్సాహమును; నాకు = నాకు; ఇచ్చుచున్ = పెంపొందించాడు. </div> </div> </div> <!--1-371 అటమటమయ్యె... (చంపకమాల). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-371 అటమటమయ్యె... (చంపకమాల). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/51.Atamatamayye_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> అటమటమయ్యె నాభజనమంతయు భూవర! నేడు చూడుమా!<br> యిటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్<br> పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే<br> కటకట! పూర్వజన్మమున కర్మము లెట్టివి చేసినాడనో!<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> శ్రీకృష్ణుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు మహాధీరుడైన పాండవ మధ్యముడు. ఇంద్రాదులను గూడా ధనుర్విద్యలో మెప్పించిన కిరీటి హృదయంలోని ఆరాటం అతనిని నిలువనీయటంలేదు. తన దుఃఖావేశాన్ని అన్నకు ఇలా తెలుపుకుంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> ప్రభూ! చేసిన శ్రీకృష్ణభజనమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా పనికిమాలినదయిపోయింది. చూడు. నన్నింతగా ప్రేమాదరాలతో లాలించిన జగన్నాథుడు, శ్రీకృష్ణుడు లేని తరువాత కూడా నాప్రాణాలు ఈ కట్టెవంటి కాయంమీద మమకారంతో ఆయన వెంటపోకుండా నిలిచి ఉన్నాయి. పూర్వజన్మలో ఎట్టిపాడుపనులు చేసినానో కదా నేను! </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> భూవర = రాజా; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తమంతా; నేఁడు = ఇప్పుడు; అటమటము = వృథా; అయ్యెన్ = అయ్యెను; సూడు మా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు; జగదీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకుండా పోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన; దేహ = శరీరము మీది; లోభమునన్ = మమకారముతో; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండా; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; నే = నేను; కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = కర్మములు; ఎట్టివి = ఎటువంటివి; చేసినాఁడనో = చేసితినో కదా. </div> </div> </div> <!--పరీక్షిత్తు ప్రాణోపవేశము --> <div class="card mb-3" style="text-align: center;background-color: #ede9d0;padding: 5px;"> <h3>పరీక్షిత్తు ప్రాణోపవేశము</h3> </div> <!--1-501 ఉరగాధీశ విషానలంబునకు... (మత్తేభం). --> <div class="card mb-3"> <div class="card-header bg-warning"> <div class="row"> <div class="col-sm-6"> <div class="padyamhead"> 1-501 ఉరగాధీశ విషానలంబునకు... (మత్తేభం). </div> </div> <div class="col-sm-3"> <div class="padyamsubhead"> iBAA పద్య గానం </div> </div> <div class="col-sm-3"> <audio controls="" preload="none"> <source src="songs/01/52.Uragadheesa_2.mp3" type="audio/mpeg"> Your browser does not support the audio element. </audio> </div> </div> </div> <div class="card-body"> <div class="padyamsubhead"> iBAP పద్యము </div> <div class="padyam"> ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ<br> శ్వరసంకల్పము నేడు మానదు; భవిష్యజ్జన్మంబులన్<br> హరిచింతారతియున్ హరిప్రణుతిభాషా కర్ణనాసక్తియున్<br> హరిపాదాంబుజసేవయున్ గలుగ మీరర్థిన్ ప్రసాదింపరే.<br> </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT సందర్భం</p> <div class="Context"> కర్మవశంచేత ధర్మాత్ముడైన పరీక్షిన్మహారాజు శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పామును పడవైచి యింటికి పోయాడు. ఆ మహర్షికొడుకు దానిని చూచి కుళ్ళికుళ్ళి ఏడ్చాడు. కోపం ఆపుకోలేక మా తండ్రిని ఈవిధంగా అవమానించిన పాపాత్ముడు ఏడు రోజులలో తక్షకుని విషపుమంటలో మాడిపోవుగాక అని శపించాడు. అది తెలుసుకుని పరీక్షిత్తు పశ్చాత్తాపంతో తన్ను చూడవచ్చిన మహర్షులతో ఇలా అంటున్నాడు. </div> </div> <div class="card-header"> <p class="padyamsubhead">iBAT తాత్పర్యము</p> <div class="pardham_content"> అయ్యలారా! ఆత్మస్వరూపులారా! నా మనవిని ఆలకించండి. పాములరాజైన తక్షకుని విషం అనే అగ్నికి నా దేహాన్ని సమర్పించుకుంటాను. అందులో ఏమాత్రమూ శంకించను. ఈశ్వరుని సంకల్పం నేడు తప్పకుండా నెరవేరుతుంది. ఇంక ముందుముందు నాకు కలుగబోయే జన్మలు ఏమయినా ఉంటే వానిలో నేను కోరుకొనేది ఒక్కటే. నా మనస్సు హరిని భావించటంలోనే ఆనందం పొందుతూ ఉండాలి. నా వాక్కు శ్రీహరిని కొనియాడటంలోనూ, నా చెవులు శ్రీహరి కీర్తనను ఆలకించటంలోనూ ఆసక్తి కలవై ఉండాలి. నా దేహం శ్రీహరి పాదపద్మాలను నిరంతరం సేవించుకుంటూ ఉండాలి. ఈ మహాభాగ్యాన్ని నాకు మీరు ప్రసాదించండి. </div> </div> <div class="card-footer"> <div class="padyamsubhead"> iBAPP ప్రతిపదార్ధము </div> <div class="pardham_content"> ఉరగాధీశ = పాముల ప్రభువు తక్షకుని; విషానలంబునకు = విషము అనే అగ్నికి; మేను = నా శరీరమును; ఒప్పింతున్ = అప్పచెప్పుదును; శంకింపన్ = వెను దీయను; ఈశ్వర = ఈశ్వరునిచేత; సంకల్పము = సంకల్పించబడినది; నేఁడు = ఈవేళ; మానదు = తప్పదు; భవిష్య = భవిష్యత్తులో రాబోవు; జన్మజన్మంబులన్ = ఎల్ల జన్మల లోను; హరి = హరిని – భగవంతుని; చింతారతియున్ = స్మరించు ఆసక్తియు; హరి = భగవంతుని; ప్రణుతి = స్తోత్రము చేయు; భాష = సంభాషణములను; ఆకర్ణన = వినుట యందు; ఆసక్తియున్ = ప్రీతియును; హరి = భగవంతుని; పాద = పాదములు అను; అంబుజ సేవయున్ = పద్మములందు భక్తియు; కలుగన్ = కలుగునట్లు; మీరు = మీరు; అర్థిన్ = ఆదరముతో; ప్రసాదింపరే = ప్రసాదించండి </div> </div> </div> <div> <div style="Text-align:right;Width:20%;float:right"> <div class="button-effect"> <a class="effect effect-3" href="iBam2.html" title="ద్వితీయ స్కంధం" style="background-color: #f4511e;">ద్వితీయ స్కంధం</a> </div> </div> </div> </div> </div> </div> </div> </body> </html>